పెద్దదవుతున్న గొడవకి వణికిపోయారు ఆడపిల్లలందరూ. అది చూసి ఇంకా మితిమీరి పోయాడు రంజన్.
ఆడపిల్లలకి పబ్లిగ్గా అంత పరాభవం జరుగుతున్నా వాళ్ళకి సపోర్టుగా ఎవరూ మాట్లాడడానికి సాహసించక పోవడం చూసి శతృఘ్న రక్తం సలసల మరిగింది. రంజన్ చూస్తూ ఉండగానే, గేటుమీదికి ఎక్కి, ఆ బ్రాసరీల తోరణాన్ని పీకి పారేశాడు.
"ఇవాళ నీకు మూడింది" అన్నాడు రంజన్. ముక్తసరిగా అని త్వరత్వరగా హాస్టల్ లోకి వెళ్ళాడు. పదినిమిషాల తర్వాత తన ఫ్రెండ్స్ తో తిరిగి వచ్చాడు. వాళ్ళ చేతుల్లో హాకీ బ్యాట్లు ఉన్నాయి. ఆ బ్యాట్లకి బ్లేడ్లు బిగించి ఉంటాయని గ్రహించాడు శతృఘ్న.
క్షణాల్లో రణరంగంలా మారిపోయింది ఆ ప్రదేశం. రంజన్ బ్యాటు ఎత్తి తనని కొట్టబోతే, దాన్ని లాఘవంగా ఎడమ చేత్తో పట్టేసుకున్నాడు శతృఘ్న, ఆత్మరక్షణ కోసం. పిడికిలి బిగించి, బాక్సింగ్ లో తనకి ఉన్న అనుభవంతో రంజన్ ముక్కుమీద గుద్దాడు.
నిజానికి అది చాలా పెద్ద దెబ్బకాదు. కానీ ముక్కు సున్నితమైన అవయవం, ఏ మాత్రం దెబ్బ తగిలినా రక్తం బొట బొటా కారిపోతుంది. అలా కారిన రక్తానికి రంజన్ షర్టు మీద అరచేతి మేర ఎర్రటి డాగు పడింది.
కొట్లాట జరుగుతోందని తెలియగానే పోలీసులని పిలిపించాడు ప్రిన్సిపాల్. పోలీసులు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. తర్వాత ఎంక్వయిరీ మొదలయింది.
తప్పు రంజన్ దే అయినా,అతని షర్టుమీద ఎర్రగా కనబడుతున్న రక్తపు సాక్ష్యం శతృఘ్న దోషి అని తెలిపింది. కాలేజీలో నుంచీ డిబార్ చేశారు అతన్ని.
 జరిగిన గొడవంతా మోహన భర్తకి తెలిసింది. "అనవసరంగా అల్లరి పాలయ్యావ్!" అని అతనూ ఆమె మీద కోపగించుకున్నాడుట.
ఆ అమ్మాయి రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది.
ఆ సంఘటనతో శతృఘ్న చదువు ఆగిపోయింది. అతని కెరీర్ మట్టికొట్టుకు పోయింది. ఆశలూ, ఆశయాలు ఎండుటాకుల్లా నేలని రాలిపోయాయి.
గుండె మండి పోవడం మొదలెట్టింది అతనికి. కసి కరుడు కట్టుకుపోయింది. వికృతమైన ఈ లోకం అంటే విరక్తి పుట్టింది.
రెబల్ లా తయారయ్యాడతను.
ఒక్కసారిగా తల విదిలించి, ఆలోచనల్లోంచి బయట పడ్డాడు శతృఘ్న, కాళ్ళ దగ్గర పడి ఉన్న డాక్టర్ రంజన్ ని కసిగా చూశాడు.
కాక్ పిట్ లో నుంచి బయటికి వచ్చింది స్మిత. ఎయిర్ హోస్టెస్ అనుపమా గంగూలీ దగ్గరకు వెళ్ళింది.
"ఏం స్వీటీ?" అంది అనుపమ, స్మిత తల మీద చెయ్యివేస్తూ.
"అక్కా! నాకు ఆకలేస్తోంది! తినడానికి ఏమన్నా పెట్టవా? అనటానికి బెంగాలీలో ఏమంటారు?" అంది అమాయకంగా మొహంపెట్టి.
"అమాకీ ఖిడీ లెగేచీ! కిచూ ఖేత్ దావ్! అనాలి" అంది అనుపమ. వెంటనే "నీకు నిజంగానే ఆకలేస్తోందా స్వీటీ?" అంది.
స్మిత నవ్వింది. "మరి ఎందుకడిగా ననుకున్నావ్?"
ఆ పాపకు కనబడకుండా, కన్నీటిచుక్కాని గోటితో తుడుచుకుంటూ స్మితని దగ్గరగా హత్తుకుని 'గేలీ' దగ్గరకు తీసుకెళ్ళింది అనుపమ. వేఫర్లు కొన్ని ఇచ్చి, "తిను స్వీటీ!" అంది ఆర్ద్రంగా.
ఒక వేపర్ ని నోట్లో పెట్టుకుని కొరకబోయింది స్మిత.
అప్పుడు జరిగింది అది.
ప్రళయ తాండవం చేస్తున్న పెనుగాలుల మధ్య చిక్కుకుని అల్లకల్లోలంగా వెళ్ళిపోతున్న ఆ విమానం ఒక్కసారిగా పక్కకి జరిగిపోయింది. వెల్లకిలా పడిపోయింది స్మిత. వేఫర్లు ముక్కలయి పొడిపొడిగా రాలిపోయాయి. ఆమె పక్కనే పడింది అనుపమ. పాలూ, డికార్షనూ ఉన్న ఫ్లాస్కులు దొర్లిపోయి, వేడివేడి ద్రవాలు వాళ్ళమీద పడ్డాయి.
పాసెంజెర్స్ లో సీట్ బెల్టులు కట్టుకుని ఉన్నవాళ్ళు సీట్లలోనే కూర్చుని ఉన్నారు.
సీట్ బెల్టులు కట్టుకోని వాళ్ళు మాత్రం అడ్డదిడ్డంగా కిందపడిపోయారు ఒకళ్ళ మీద ఒకళ్ళుగా.
తన మీద పడిపోయిన డాక్టర్ రంజన్ శరీరాన్ని రోతగా పక్కకి నెట్టాడు శతృఘ్న.
కొద్దిక్షణాలు అలా జరిగిపోయి ఎగిరిన విమానం మళ్ళీ తనంతట తనే సరైన పొజిషన్ లోకి వచ్చింది.
అందరూ ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాస తీసుకున్నారు. అయితే వాళ్ళ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. స్పీకర్స్ లో నుంచి రాజేందర్ గొంతు వినబడింది.
"ఫ్రెండ్స్!" అన్నాడతను బరువుగా "చివరి క్షణాల్లో మీ నుంచి నిజం దాచడం నాకు ఇష్టంలేదు. విమానం కంట్రోలు తప్పిపోయింది. ఎయిర్ పోర్టుతో రేడియో కనెక్షన్ కూడా లేదు మనకి. కొద్ది క్షణాల్లో నేలమీద కూలిపోబోతోంది విమానం.
ఎవరైనా దైవ ప్రార్థన చేసుకోదలుచుకుంటే ఇదే చివరి అవకాశం.
మే గాడ్ బ్లెస్ యూ!"
వెంటనే హాహాకారాలు చేశారు అందరూ. పెద్దగా రోదనలు వినబడ్డాయి! మధ్యమధ్యలో కొన్ని గొంతులు చేస్తున్న ప్రార్థనలు!
క్షణక్షణానికీ వేగం పుంజుకుంటూ, రాలిపోతున్న ఉల్కలా నేలను సమీపిస్తోంది విమానం.
ప్రతి సెకెండుకీ దగ్గరయిపోతోంది భూమి. రాజేందర్ మాటలు చెవిన పడగానే ఒక్కసారి స్పృహ వచ్చింది సుజాతకి. అంతా అయిపోతోందన్నమాట! ఢిల్లీలో పెళ్ళిచూపులూ, పెళ్ళీ, అమెరికా కాపురం... ఆ ఆశలన్నింటికీ ఇంక గుడ్ బై అన్నమాట! తన జీవితం ఇంత త్వరగా ఇలా హఠాత్తుగా ముగిసిపోతుందని కలలో కూడా అనుకోలేదు తను! తనకి జన్మనిచ్చిన అమ్మనూ, నాన్ననూ చివరిసారిగా తలుచుకుంది సుజాత. ఆమె కళ్ళు తడితడిగా అయిపోయాయి. ఒకసారి శతృఘ్న వైపు చూసింది. అతను గిల్టీగా మొహం పక్కకి తిప్పుకున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra