Home » Yandamuri veerendranath » ధ్యేయం


                             అధ్యాయం-4

    ఈ ప్రపంచంలో వర్షాన్నీ, ఎండనీ, చివరికి భూకంపాన్నీ కొలిచే సాధనాలున్నాయి కానీ, మనిషి కష్టాన్ని కొలవటానికి మాత్రం ఏ మీటరూ లేదు.

    ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ తనకొచ్చినంత పెద్ద కష్టం ఇంకెవరికీ రాదని అనుకుంటూ వుంటాడు. తను కాబట్టి ఈ మాత్రమన్నా బతికున్నానని, ఇదే కష్టం ఇంకెవరికైనా వస్తే ఈపాటికి చచ్చిపోయుండేవారు అనుకుంటూ డిప్రెషన్ కి లోనవుతాడు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటూ వుంటారు. కష్టాన్ని ఎనలైజ్ చేసి దాన్లోంచి బయటపడటానికి మార్గాన్ని అన్వేషిస్తారు. కష్టం గురించి నిరంతరం ఆలోచించటం కన్నా దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించటం ఎంతో మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యంకాదు.

    నిఖిత మొదటివర్గానికి చెందిన వ్యక్తయితే- ధాత్రి రెండో వర్గానికి చెందిన  అమ్మాయి.

    నిజానికి ధాత్రి పెద్ద కష్టాలంటూ ఏమీలేవు. టెన్సిస్ ఆడమనీ, నాట్యం నేర్చుకోమనీ ఆమె తల్లి నిరంతరం వేధిస్తున్నమాట నిజమే. అయినా ఫుట్ పాత్ మీద పడుకునేవాళ్ళు, వుండటానికి చిన్న ఇల్లు లేనివాళ్ళు, కట్టుకోటానికి మంచి బట్టల్లేనివాళ్ళు, ఆకలితో నకనక లాడేవాళ్ళు, భర్తలచేత హింసింపబడే వాళ్ళు, అర్థరాత్రి ఇంట్లోంచి బయటికి గెంటివేయబడిన ఆడపడుచులూ- వీళ్ళ సమస్యలతో పోల్చుకుంటే ధాత్రి సమస్య చాలా చిన్నది. కానీ దాన్నే ఆమె చాలా పెద్దగా ఊహించుకుంటూ బాధపడుతూ వుంటుంది.

    ధాత్రికి ఆత్మీయులైన స్నేహితులంటూ ఎవరూలేరు. ప్రేమ రాహిత్యంలాగే స్నేహరాహిత్యం కూడా ఒక శాపం. ఒంటరితనాన్ని ఇష్టపడే మనస్తత్వం కాదు ఆమెది. చిన్నప్పటినుంచీ టెన్నిస్ కోచింగ్ సెంటర్లలోనూ, డాన్స్  స్కూళ్ళల్లోనూ ఆమెకి క్లాసు పిల్లలే కాక చాలామంది అమ్మాయిలు స్నేహితులుగా ఏర్పడ్డారు. కానీ అందరూ క్రమక్రమంగా దూరమయ్యారు. కారణం ఆమె కాదు. ఆమె తండ్రి! ఆమె ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తే వాళ్ళు వెళ్ళేవరకు ఆమె ముళ్ళమీద కూర్చున్నట్టే కూర్చునేది. ఇంటికెవరైనా ఆడపిల్ల రాగానే, ఆమె తండ్రి ఏ పరిస్థితిలో వున్నా అలాగే  బయటికొచ్చేసి, వాళ్ళకెదురుగా కూర్చుని కబుర్లు చెప్పటం మొదలుపెట్టేవాడు. వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. భార్యని పిలిచి కాఫీ, టిఫిన్లు ఇమ్మని చెప్పేవాడు. కానీ అతని చూపులు మాత్రం  వాళ్ళ బట్టల్లోంచి లోపలికి దూసుకుపోయి ఆ చిన్నపిల్లల శరీరాల్ని నఖశిఖపర్యంతరం పర్యవేక్షిస్తూ వుండేవి. చూపులతోనే వాళ్ళని అణువణువు తాకుతూ వుండేవాడు.

    "ఏమిటి, మీ డాడీ అలా చూస్తాడు? ఎందుకో వళ్ళు కంపరమెత్తినట్లుంటుంది" అని ఒకరిద్దరు స్నేహితులు ధాత్రి స్నేహితురాళ్ళందరూ  ఆమెకి దూరమయ్యారు. ఇంటి బయట ఆమెతో వాళ్ళు మాట్లాడటానికి ఉత్సాహం చూపించినా కూడా ఈ కాంప్లెక్స్ వాళ్ళ ఆమే తనంతటతాను వాళ్ళని దూరం చేసుకుంది.

    ఈ పరిస్థితిలో అనుకోకుండా ప్రీతమ్ ఆమెకి దగ్గరయ్యాడు.

    ఆ రోజు కాలనీ నుంచి వెళుతూ వుంటే స్కూటర్ యాక్సిడెంటై ప్రీతమ్ కలిసిన తర్వాత, అతడన్న మాటలు ఆమెకి బాగా గుర్తున్నాయి "ఈ యాక్సిడెంటు మనిద్దర్నీ యాక్సిడెంటల్ గా కలిపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో" అని.

    ఆ మరుసటిరోజు ప్రీతమ్ తన డాన్సింగ్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఆమే ఒక్కక్షణం ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందించింది. అతడంత గుర్తు పెట్టుకొని తన స్కూల్ కి మళ్ళీ వస్తాడు అని ఆమె అనుకోలేదు. ధాత్రి నిజానికి అంత అందమైన అమ్మాయి కాదు. ఆ కాంప్లెక్స్ కూడా కొంత ఆమెలో వుంది.

    ప్రస్తుత సమాజంలో పెళ్ళికిముందే బాయ్ ఫ్రండ్స్ వున్న అమ్మాయిల స్టాటి స్టిక్స్ తీసుకుంటే ఎక్కువమంది అమ్మాయిలు సగటు కన్నా తక్కువ అందమున్న వాళ్ళే అయ్యుంటారు. తమలో వున్న కాంప్లెక్స్ ను అధిగమించటానికే అమ్మాయిలు ఆపోజిట్ సెక్స్ నుంచి అనైతికమైన పరిచయాల్ని ఆశిస్తారు అని ఫ్రాయిడ్ ఏనాడో చెప్పాడు.

    ఆ విధంగా ప్రీతమ్ తనిచ్చిన అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ రావడం ధాత్రికి సంతోషమిచ్చినా, అలా రావటంలో ప్రీతమ్ అవసరం కూడా  కొంత వుంది.

    ఆ రోజు పొద్దున్నే అతడు  ఊరినుంచి వచ్చాడు. స్టేషన్ దగ్గిరే ప్రీతమ్ కి అతని  స్నేహితుడు కలిశాడు. ప్రీతమ్ చెల్లెలు కాలేజీముందు టెంట్ వెయ్యటం, మినిష్టర్  కొడుకుతో ప్రేమవ్యవహారం తేల్చుకోవటం కోసం నిరాహారదీక్ష చెయ్యటం, ఆమె ఆరోగ్యం పాడుకావటం మొదలైన విషయాలన్నీ ఆ స్నేహితుడు అతనికి చెప్పాడు. ప్రీతమ్ ఆవేశంతో వణికిపోయాడు.

    అయితే ఆ ఆవేశం చెల్లి చేసిన పని గురించి కాదు.

    తన చెల్లెలు యిన్ని కష్టాల్లో ఇరుక్కున్నందుకు. ఆ ఆవేశంతోనే ఇంటికొచ్చాడు. ప్రీతమ్ ఇంట్లోకి అడుగు పెడుతూనే తల్లీతండ్రి అతడిమీద కోపంతో ఎగిరారు. "ఏరా నాల్రోజుల్లో వస్తానన్న వాడివి, పదిరోజులకా రావటం? ఒక ఫోన్ అన్నా చెయ్యకూడదా?" అన్నాడు కృష్ణమూర్తి.

    "ఇక్కడే ఇంత గొడవ జరిగింది. సమయానికి నువ్వు లేకుండా పోయ్యావ్" అంది రుక్మిణి.

    ప్రీతమ్ ధీమాగా అన్నాడు. "ఇప్పటికైనా మించిపోయిందేంలేదమ్మా. ఈ రోజే నా ఫ్రెండ్స్ తో వెళ్ళి వాడి తోలు వలిచేస్తాను".

    ఇలాంటి మనస్తత్వం దాదాపు చాలామందిలో కనపడుతూనే వుంటుంది. ఏదైనా ఒక ప్రమాదం రాగానే  రకరకాలుగా దాని పరిష్కారం "ఊహించేసుకొని" విజయం సాధించినట్లు సంతృప్తి పడటం! "పోలీస్ స్టేషన్లో ఫలానా పని చేయిస్తాను నా స్నేహితులతో వెళ్ళి విజయం సాధించుకొస్తాను- అవతలివాడి గర్వం పూర్తిగా అణిచేస్తాను- ప్రత్యర్థిణి మరి లేవకుండా కొడతా"..... ఇలా తాము చేయలేని  పనులన్నింటినీ చేసినట్లు ఊహించేసుకొని, ఒక ప్రమాదం రాగానే అవతలివాళ్ళ ముందు గొప్పలు చెప్పుకునేవాళ్ళు చాలామంది. ప్రీతమ్ వయసులో యువకులకి యిలాంటి భావాలు ఎక్కువగా వుంటాయి.

    ఆ రాత్రి తల్లి వరసగా జరిగినదంతా చెబుతూవుంటే, ప్రీతమ్ ఆ విధంగానే వూహించుకున్నాడు. పదిమంది కూర్రోళ్ళణి తీసుకెళ్ళి ఆ సందీప్ పని  పట్టాలనుకున్నాడు. కాలర్ పట్టుకొని లాక్కొచ్చి, తనచెల్లెలి కాళ్ళమీద పడేసి వాళ్ళద్దరి పెళ్ళి చేసినట్లు కూడా కల వచ్చింది. అయితే ఆ మరుసటిరోజు పొద్దునకి ఆ ఆవేశం తగ్గిపోయింది. పొద్దున్నే స్నేహితులతో కలిసి బయటికెళ్ళటానికి డబ్బుల్లేవు. నిన్నటి సమస్యకన్నా ఈ రోజు సమస్య ఇంకా పెద్దదిగా కనబడింది. తల్లిని. డబ్బడిగితే "సర్లే. ఆ రోజు గొడవ జరిగినప్పటినుంచీ మీ నాన్నగారు నా చేతికి పైసా డబ్బు ఇవ్వటంలేదు. చెక్కుబుక్, పాస్ బుక్ కూడా  తీసేసుకున్నారు. డబ్బుచేతిలో వుంటే నేను పాడైంది కాక, మిమ్మల్ని కూడా పాడుచేస్తున్నానంట" అంది.

    ప్రీతమ్ కి ఏం చెయ్యాలో తోచలేదు. పొద్దుననించీ అలాగే కుడితిలోపడ్డ ఎలకలా తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ధాత్రి గుర్తుకొచ్చింది.

    శ్రీలక్ష్మి, విష్ణువర్ధన్ ల ఏకైక కుమారై. పన్నెండేళ్ళ క్రితం కాలనీ నుంచి వెళ్ళిపోయి తర్వాత కలిసిన ధాత్రి....

    ఆ విధంగా అతను, ధాత్రి డాన్స్ స్కూల్ నుంచి బయటకొచ్చే సరికి అక్కడ నిలబడి ఆమెకోసం ఎదురు చూస్తున్నాడు.

    ప్రీతమ్ ణి చూడగానే ధాత్రి ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది. తనిచ్చిన అడ్రస్ గుర్తుపెట్టుకుని అతనలా వస్తాడని ఆమె వూహించలేదు. అయితే ఆ రోజు ధాత్రి మూడ్ సరిగ్గాలేదు. ప్రొద్దున్నే ఆమె తల్లికీ, తండ్రికీ మధ్యా పెద్ద గొడవ జరిగింది.

    పల్లెలో వున్న ఇల్లూ, పొలం అమ్మేసేసి, వచ్చిన ఆరేడు లక్షలు బ్యాంకులో వేసి కూతురు కోసం పెళ్ళి సంబంధాలు చూద్దామంటాడు విష్ణువర్థన్. అతడి దగ్గర  డబ్బుంటే ఎలా తగలేస్తాడో శ్రీలక్ష్మికి తెలియనిది కాదు.

    "మనవాళ్ళంతా విశాఖపట్నంవైపే వున్నారు. అక్కడికెళ్ళి ఒక ఫైవ్ స్టార్ హొటల్లో దిగి, ఒక కారు అద్దెకి తీసుకొని సంబంధాలు వెతకటం మొదలుపెడితే ఒక నెలలో మంచి సంబంధం దొరుకుతుంది" అంటాడతను.

    అతడు స్టార్ హొటల్లో దిగటం, ఆ ఖర్చు అదంతా దేనికోసమో వూహించలేనంత అమాయకురాలు కాదు శ్రీలక్ష్మి. ఇద్దరికీ మధ్య ఆ విషయమై పెద్ద గొడవ జరిగింది. అతడు  విసురుగా ఇంట్లోంచి వెళ్ళిపోగానే శ్రీలక్ష్మి కూతురువైపు తిరిగి "ఇదంతా నీ అసమర్థతవల్లే జరుగుతోంది! మంచి డాన్సర్ వైతే ప్రపంచ యాత్రలన్నీ చేయించేదాన్ని. రాష్ట్రస్థాయిలో మంచి టెన్సిస్ ప్లేయర్ వి అయ్యుంటే పిలిచి మంచి ఉద్యోగం యిచ్చి వుండేవారు. అటు చదువులోనూ పైకి రాలేదు. ఇటు డాన్సర్ వి కాలేదు. ఆయనేమో నీ పెళ్ళయ్యేవరకూ కూడా ఆగకుండా వున్న ఆస్థంతా తగలేస్తున్నాడు. ఇదంతా నా ఖర్మ" అని తల బాదుకుంటూ ఏడవసాగింది.

    టీనేజ్ సంతానం ముందు తల్లిదండ్రులు ఈ విధంగా పోట్లాడుకోవటం ఏడుపుతో బరస్ట్ అవటం వాళ్ళమీద  మానసికంగా  ఎంత దెబ్బతీస్తుందో చాలామంది తల్లిదండ్రులు వూహించలేరు.

    ధాత్రి ఇంకా ఆ మూడ్ లోనే వుంది. అందువల్ల ప్రీతమ్ కనబడినా కూడా ఆమె మొహం సంతోషంతో విప్పారలేదు. అయితే ఆ విషయాన్ని ప్రీతమ్ వెంటనే గ్రహించాడు. కొంతసేపు ఇద్దరూ మౌనంగా నడిచాక "ఎందుకలా డల్ గా వున్నావు ధాత్రీ?" అని అడిగాడు.

    "ఏమీలేదు".

    "ఏం చెయ్యాలి నేనిప్పుడు?" అకస్మాత్తుగా అడిగాడు.

    ఆమె అర్థంకానట్టు చూసి "ఏం చేయటం ఏమిటి?" అని అడిగింది.

    "నేను ఏం చేస్తే నువ్వు నీ బాధని మర్చిపోయి నవ్వగలవ్? నాకు నాట్యం రాదు. భరతనాట్యం అస్సలు రాదు. అయినా చేసి చూపిస్తానుండు" అంటూ  సినిమాలో హీరోయిన్ నడుస్తూ వుంటే హీరో రెండడుగులు ముందుకేసి ఆమె ముందు ఎలా డాన్స్ చేస్తాడో అలా చేయటం మొదలుపెట్టాడు.

    ధాత్రి చిన్నగా నవ్వి "ప్లీజ్ ప్రీతమ్! అందరూ చూస్తున్నారు. నాతో కలిసి  నడువ్" అంది. అప్పటికే వాళ్ళిద్దరూ చాలా పరిచయమున్నట్టు మాట్లాడుకోసాగారు.

    ఆమెతో కలిసి నడుస్తూ ప్రీతమ్ అన్నాడు. "నీ బాధేమిటో నాకు తెలియదు అదేమిటో చెప్పమని కూడా నేనడగను. కానీ ఎప్పుడైనా నీ మనసు బాధపడితే  అక్కడికి తొంగి చూడు. ఆ మనసులోనే ఒక స్నేహితుడుంటాడు".

    "థాంక్స్" అంది ధాత్రి మనస్ఫూర్తిగా.

    ప్రీతమ్ త్వరగా అడ్వాన్స్ అవదల్చుకోలేదు. అంతకుముందు అలా అడ్వాన్స్ అయినప్పుడు నిఖిత నేర్పిన పాఠాన్ని అతడు  మర్చిపోలేదు. తొందరపాటుతో వ్యవహరిస్తే ఆడపిల్లలు వెంటనే కట్ చేసుకునే అవకాశం వుందని అతడికీ అనుభవం నేర్పింది.

    "మనం ఇప్పుడు అర్జంటుగా ఒక చోటుకి వెళ్ళాలి" అన్నాడు సీరియస్ గా.

    "ఎక్కడికి?" అనడిగింది అమాయకంగా.

    "నువ్వు ఉదయం నుంచీ ఏమీ తినలేదన్న విషయం నిజమేకదా?"

    నిజమే. ఆ విషయం  కూడా  ఆమెకి గుర్తులేదు. ఉదయం నుంచి ఇంట్లో యుద్ధం జరుగుతోంది. తల్లి వంట కూడా చేయలేదు.

    "అయితే వెళ్దాం పద" అంది.

    "చూడు ధాత్రీ, ఏ విషయమైనా ఫ్రాంక్ గా మాట్లాడటం నాకు అలవాటు. నిన్నిప్పుడు హొటల్ కి తీసికెళ్ళాలని వుంది. కానీ నా దగ్గిర డబ్బుల్లేవు" అన్నాడు.

    ధాత్రి విప్పారిన నేత్రాలతో అతడివైపు చూసింది. "ఎంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు" అనుకుంది. అమ్మాయితో పరిచయమైన మొదటి సారే ప్రతి అబ్బాయీ తనెంత ఫ్రాంక్ గా మాట్లాడతాడో తెలపాలకుంటాడని, ఆ ఫ్రాంక్ నెస్ ద్వారానే  ఆమెని  గెలవాలనుకుంటాడని తెలియనంత అమాయకురాలు ఆమె.

    ఇద్దరూ హొటల్ లో కూర్చున్నారు. ఎదురుగా పెట్టిన పదార్థాల వంక చూస్తుంటేనే గాని, తనకి నిజంగా ఎంత ఆకలిగా వుందో ధాత్రికి అర్థంకాలేదు. ప్రీతమ్ ఎక్కువ తినలేదు. ఆమెతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపాడు. సంభాషణ, టిఫినూ పూర్తయ్యేసరికి ధాత్రి దాదాపు తన బాధని మర్చిపోయింది.

    "బిల్ పే చెయ్యి" అంటూ రెండు వంద రూపాయల నోట్లని అతనికి అందించింది. అతడు మారుమాట్లాడకుండా వాటిని అందుకున్నాడు.

    రెస్టారెంట్ నుంచి బయటికొచ్చేసరికి బాగా చీకటిపడింది. "నేనిక ఇంటి కెళ్తాను" అంది ధాత్రి.

    "అలాగే. వెళ్దువుగాని.... రెండు నిమిషాలాగు" అని చెప్పి పక్కనే వున్న కిళ్ళీ షాప్ లోకి వెళ్ళి వచ్చాడు. చనువుగా ఆమె పర్సు అందుకొని, చేతిలో వున్నది అందులో పడేశాడు.

    "ఏమిటిది?"

    "పాన్"

    ధాత్రి కంగారుగా "నా కలవాటు లేదు" అంది.

    "అలవాటు లేకపోయినా ఇది వేసుకో. ఇప్పుడు కాదు, రాత్రి పడుకునే ముందు తిను. మంచి నిద్రపడుతుంది" అతని కంఠం ఆర్ద్రంగా, సానుభూతిగా, జాలిగా మారింది "ఆ నిద్ర నీకు చాలా అవసరం ధాత్రీ. అప్పుడుగానీ నీలో ఆ దిగులు తగ్గదు. ఒక నిజమైన స్నేహితుడిగా చెబుతున్నాను. నువ్వెప్పుడూ హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ వుంటే నాకు చాలా బావుంటుంది" అని అక్కడినుంచి కదిలి వెళ్ళిపోయాడు. ధాత్రి పర్స్ పట్టుకొని అలాగే నిలబడి వుంది. అప్పటికే ఆమె పూర్తిగా కరిగిపోయింది. ప్రస్తుతం ప్రీతమ్ ఆమెకి చాలా ఆప్తుడిలా కనిపిస్తున్నాడు.

   
                         *    *    *

    ఇంటికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పేమీ కనపడలేదు. విష్ణువర్థన్ అప్పటికే బాటిల్ ఓపెన్ చేసి ఆ లోకంలో మునిగిపోయాడు. శ్రీలక్ష్మి ముసుగుతన్ని పడుకుని వుంది. ధాత్రి తన గదిలోకి వెళ్ళి డ్రస్ మార్చుకొని, మంచంమీద వాలిపోయింది.

    చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఇంట్లో తను అడుగు పెట్టినప్పుడు కనీసం  తనని మందలించేవాళ్ళు కూడా లేకపోవటం మనసుకి సంతృప్తినివ్వకపోగా  మరింత అసంతృప్తికి గురిచేసింది. అప్పుడే ఆమెకి ప్రీతమ్ ఇచ్చిన ప్యాకెట్  గుర్తొచ్చింది. పర్స్ తీసి అందులోంచి ఆ ప్యాకెట్ బయటికి తీసింది. హొటళ్ళల్లో పెట్టే పేపర్ నేప్ కిన్ అది. విప్పితే లోపల కిళ్ళీతో పాటు బిల్ పే చేయగా మిగిలిన చిల్లరుంది. నేప్ కిన్ మీద హడావుడిగా ఉత్తరం వ్రాసినట్టుగా కూడా వుంది.

    "ధాత్రి,

    స్నేహమంటే చెప్పకుండానే ఎదుటి వారి బాధని అర్థం చేసుకోవడం, పరోక్షంగా ఓదార్పు నివ్వటం అని నేను నమ్మతాను. నేను నీకు మంచి స్నేహితుడిని అని నీకు తోడుగా వుండటానికి నేనున్నానని గుర్తుతెచ్చుకొ. నా స్నేహితుడు రాజా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నువ్వు ఫోన్ చేసి  ఎప్పుడు కలవమంటావో చెబితే చాలు, రెక్కలు కట్టుకొని నీ ముందు వాలుతాను, ధాత్రీ నా పరిచయం నీ కిష్టంలేకపోయినా, నా కంపెనీలో నీకు ఆనందం కలగకపోయినా నాకు ఫోన్ చెయ్యకు. నా అంతట నేను నిన్ను కలవటానికి ప్రయత్నించనని వాగ్దానం చేస్తున్నాను.

                                                                   ప్రీతమ్"

    ఆ పక్కనే ఫోన్ నెంబరుంది. తను వాష్ బేసిన్ దగ్గరి కెళ్ళినపుడు బహుశా ఈ ఉత్తరం వ్రాసి వుంటాడు. ధాత్రి ఆ ఉత్తరాన్ని అలాగే పట్టుకొని చాలాసేపు  నిలబడింది. ఆమె మనసులో బాధ పూర్తిగా తగ్గిపోయిట్లనిపించింది. కిళ్ళీ తీసి  నోట్లో వేసుకుంది. నములుతూ వుంటే ముందు చేదుగా అనిపించినా అర్థంకాని తియ్యటిమత్తు ఆమెని క్రమక్రమంగా ఆవరించింది. గాల్లో మెల్లగా తేలిపోతున్నట్లు నీటిమీద పడుకొని లూగుతున్నట్లు తెలియని గిలిగింత!

    ఆ హాయిని అనుభవిస్తూనే ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారేవరకు అసలు మెలుకువే రాలేదు.

    ఆ మర్నాడు పొద్దున్నే ఆమె ఫోన్ చేసి  ఆ మధ్యాహ్నమే ప్రీతమ్ ని కలుసుకుంది. సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ ప్రపంచంలోని విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ధాత్రి తన ఇంటి పరిస్థితినీ, తన బాధనీ  పూర్తిగా  విప్పి చెప్పింది. చీకటి పడుతుండగా ఇద్దరూ సెలవు తీసుకొని విడిపోయారు. వెళ్ళేముందు అడిగి మరీ కిళ్ళీ కొనిపించుకొని వెళ్ళింది.

    ఆ రాత్రి ఆమెకో కల వచ్చింది. ఏదో సినిమాలోలాగ ఆమె నిప్పుల మధ్య నాట్యం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి హంటర్ తీసుకొని కొడుతూ "డాన్స్.....డాన్స్...." అని అరుస్తోంది. తండ్రి దూరంగా కుర్చీలో కూర్చొని, టేబుల్ మీద బాటిల్ పెట్టుకొని డ్రింక్  చేస్తున్నాడు. ఆమె అతికష్టంమీద  లేచి  నిలబడి మళ్ళీ నాట్యం చేయటం ప్రారంభించి సత్తువలేక తూలిపోతోంది. తల్లి చేతిలో కొరడా మళ్ళీ గాలిలోకి లేచింది. ఆ సమయంలో మేఘాల్లోంచి ఎగురుకుంటూ ప్రీతమ్ వచ్చాడు. తల్లి చేతిలో కొరడా  లాగి దూరంగా విసిరేసి, తనని తీసుకొని రథం ఎక్కించుకొని మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. ఆమె అలా గాలిలో తేలుతోంది. మేఘాల్లో నక్షత్రాల్లాగ 'కిళ్ళీలు' ఆకాశమంతా నిండి వున్నాయి.

   
                                                                  2

    "అవినాష్..... అవినాష్....." తలపుమీద దబదబా బాదుతున్న చప్పుడికి ఆలోచనల నుంచి బయటపడి తలుపు తీశాడు అవినాష్. ఎదురుగా తండ్రి నించొని వున్నాడు. శంకరం మొహం సంతోషంతో వెలిగిపోతోంది.

    "వెంటనే బయలుదేరు"

    అవినాష్  ఆశ్చర్యంగా "ఎక్కడికి డాడీ?" అని అడిగాడు.

    "బాంబేనుంచి ట్రంకాల్ వచ్చింది. నువ్వు రేపు ఉదయమే ఉద్యోగంలో చేరాలట. బట్టలు సర్దుకో. ప్లయిట్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాను" అన్నాడు శంకరం హడావుడిగా.

    అవినాష్ అర్థంకానట్లు మొహం చిట్లించి "అదేమిటి, జాయినింగ్ టైం ఇంకో వారంరోజుల వరకు వుందిగా" అన్నాడు.      

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra