Home » Kommanapalli ganapathi rao » బ్లాక్ మాంబా


    సాయంకాలం ఆరున్నర దాటింది.

    మసకచీకట్లో భాగ్యనగరపు ఆకాశం మరికొన్ని క్షణాలలో మొదలయ్యే తుఫానుకి ముందుదిశలా మేఘావృతమై వుంది.

    అప్పటికి పావుగంట క్రితమే బాంబేనుంచి వచ్చిన విమానం ఎయిర్ పోర్టులో ఆగింది.

    పది నిముషాలలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న జయేంద్ర శృతి మూడడుగుల పొడవున్న పార్శిల్ ని జాగ్రత్తగా కారు డిక్కీలో వుంచారు. లోపల కదలికలేమీ వినిపించడంలేదు. బహుశా ట్రాంక్విలైజర్ తో బ్లాక్ మాంబా స్పృహకోల్పోయి వుంటుంది.

    అలాంటి అతి ప్రమాదకరమైన పార్శిలు పంపేటప్పుడు విధిగా ఆచరించబడే నియమం అది.

    మళ్ళీ ఆమెకు సంఘమిత్ర గుర్తుకొచ్చాడు.

    ఎన్నేళ్ళ తపస్సిది...బ్లాక్ మాంబా దిగుమతికోసం హాఫ్ కిన్ ఇన్ స్టిట్యూట్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ఎన్ ఫ్లూయెన్స్ చేసాడని రెండేళ్ళక్రితంనుంచీ చేసిన ప్రయత్నం ఇన్నాళ్ళకి ఫలించింది. కాని రిసీవ్ చేసుకోవడానికి ఆయన లేరు...

    ఉంటే ఓ అతిముఖ్యమైన చివరి ప్రయోగాన్ని నిర్వహించే కార్యక్రమంలో నిమగ్నమై చాలా స్వల్పకాలంలో ఈ నేల వూహించనంత ఓ గొప్ప మేలు చేయగలిగేవారు...

    ఏమియ్యారు...వెళ్ళి నాలుగురోజులైంది. కనీసం ఫోన్ కూడా చేయలేదేం... 

    అసలు తనకున్న పరిజ్ఞానంతో తక్కిన ప్రయోగం పూర్తిచేయగలనన్న నమ్మకంలేదు. కాని గట్టిగా కృషిచేయాలనిపిస్తుంది. ఇక దివ్యతేజ ఎపార్ట్ మెంట్స్ ని చేరడానికి పట్టేది కేవలం అయిదునిమిషాలు మాత్రమే.

    సరిగ్గా అదే సమయంలో__

    దట్టంగా ఆవరించిన చీకటిలో బేగం పేటలోని ఓ పార్కులో ప్రవేశించాడు కస్టమ్స్ ఆఫీసర్ డేవిడ్.

    డేవిడ్ కూడా వుండేది దివ్యతేజ ఎపార్ట్ మెంట్సులోనే...ఇప్పుడతడి చేతిలో సుమారు మూడడుగుల పొడవున్న ఓ పార్శిల్ వుంది.

    మామూలుగా అయితే ఎయిర్ పోర్టులో తను డ్యూటీలో వున్నప్పుడు మాత్రమే రిసీవ్ చేసుకునే ఆ పార్శిల్ సరాసరి ఆల్వాలే తీసుకువెళ్ళి ఓ వ్యక్తికి అందించేవాడు. దానికి బదులుగా ఓ పదివేలు రాబడిగా పొందేవాడు.

    ఇది ఇప్పటిదికాదు...ఒక బాధ్యతాయుతుమైన పదవిలో వున్న కస్టమ్స్ ఆఫీసర్ డేవిడ్ మూడేళ్ళుగా స్మగ్లర్లకు సహకరిస్తూ చేస్తున్న అక్రమవ్యాపారమది.

    హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల్ని విదేశాలనుంచి రప్పించుకునే ఆ గేంగ్ అనుసరిస్తున్న అతి సులభమైన పద్ధతి అది.

    కస్టమ్స్ లో ఇతరులు జోక్యం చేసుకోకుండా ప్రతిసారీ ఆ పార్శిల్ పై "SNAKE HANDLE WITH CARE"అన్న అక్షరాలు దర్శనమిస్తుంటాయి. ఒకటి అరా కస్టమ్స్ లో నిజాయితీపరులున్న (స్మగ్లింగ్ గేంగ్ లో సంబంధంలేనివారు) ఆ అక్షరాలు చూడగానే పార్శిల్ కి దూరంగా వుంటారు.

    ఈ రోజు ఒప్పందం ప్రకారం పార్శిల్ అందుకున్న డేవిడ్ దాన్ని అసలు వ్యక్తికి అందించకూడదనుకున్నాడు.

    జీవితంలో ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇలాంటి మార్గంలో అడుగుపెట్టకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించి అందులోవున్న 'డ్రగ్' మొత్తం తన సొంతం చేసుకుని తనకు తెలిసిన మరోవ్యక్తికి కోటిరూపాయల మెటీరియలూ కనీసం పదిలక్షలకి అమ్మేయాలనుకున్నాడు.

    ఉత్సాహం ఉద్వేగం తొందరచేస్తుంటే పేకేజి చివరి స్క్రూని తీయబోతూ చుట్టూ చూశాడు.

    సమీపంలో జనసంచారంలేదు. ఆనందంగా వుంది. రేపటి నుంచి తను లక్షాధికారి. ఇదే ఆలోచనలతో పై మూత లాగేశాడు.

    ఓ క్షణం నిశ్శబ్దం...

    వెనువెంటనే ఓ మెరుపు చీకటి మొత్తం చీల్చినంత వేగంగా మృత్యువు నగ్నంగా పైనబడినట్టు చప్పుడికిముందే డేవిడ్ చెంప మాంసపు ముద్దలా వూడిపోయింది.

    బ్లాక్ మాంబా బుస అప్పుడు వినిపించింది.

    సుమారు పధ్నాలుగు అడుగుల పొడవున్న బ్లాక్ మాంబా నల్లటి చారలు చీకటిలో తళుక్కుమన్నాయి.

    వేగంలో రోషంలో ప్రపంచంలోని అన్ని సర్పాల్లో విషపూరితమైన డెడ్లీ స్నేక్ రెప్పపాటులో అదృశ్యమైంది.

    లిప్తల్లో విషం రక్తంలోకి ప్రాకిన డేవిడ్ ఒక్కరాత్రిలో ఉన్నవాడు కావాలనే తొందరపాటు 'మాంబా'కి మొదటి బోణీలా అప్పటికే ప్రాణాలు వదిలాడు.

    జంటనగరాలని కాళరాత్రిలోకి నెట్టేయబడుతున్న బ్లాక్ మాంబా మెరుపువేగంతో దూసుకుపోతోంది.


                     *    *    *    *


    "భరత్..." ఓ పొదమాటున ప్రియుడి పరిష్వంగంలో అంతసేపూ ప్రపంచాన్ని మరిచిన సమీర ఉలికిపాటుగా దూరం జరిగింది.

    ఇప్పుడామెకి సమీపంలోని పొదలో రెండు మిణుగురులు కనిపిస్తున్నాయి. "అక్కడేమిటి..." అడిగింది అనుమానంగా.

    భరత్ అటు చూశాడు.

    జీవన వాస్తవికతల హాలాహలం అక్కడ దాగుందని తెలీని భరత్ ఇంకా మాటాడకముందే పొద కదిలిన చప్పుడు.

    "భరత్" ఆమె తొట్రుపడుతూంది. 

    రాష్ట్రాన్ని కొనేయగల సమర్ధురాలైన సమీర మృత్యువుకి ఖరీదు కట్టగల గొప్ప ఇంటమాత్రం పుట్టలేదు...

    ఆ క్షణంలో ఆమెకు ముందు గుర్తుకొచ్చింది తండ్రి...

    అతడు ప్రముఖ పారిశ్రామికవేత్త శివానంద్.

    ఇక్కడ భరత్ సమీరలు చేసుకున్న అణువంత అదృష్టం ఏమన్నా వుంటే 'బ్లాక్ మాంబా' పొదలోనుంచి కదలబోతుండగా ఓ ముంగిస పొదలోకి చొచ్చుకు రావడం...

    సర్పాలపై తనకున్న సహజమైన ఉత్సాహాన్ని కసిగా ప్రదర్శించిన ముంగిస రెప్పపాటులో బ్లాక్ మాంబా కోరల్లో చిక్కుకుని క్షణంలో ప్రాణాలు వదిలింది...అప్పుడు ముందుగా బయటకు కదిలింది బ్లాక్ మాంబా తోక.

    ఓ ప్రమాదానికి హెచ్చరికలా అనిపించిన భరత్ సమీరలు వేగంగా పరుగెత్తారు...కనీసం వెనక్కి చూడాలన్న సాహసం కూడా చేయలేకపోయారు.

    పార్శిల్ చేసే ముందుగా మత్తుమందు ఇవ్వబడిన బ్లాక్ మాంబా ట్రాంక్విలైజర్ కంపోజిషన్ లో జరిగిన చిన్న పొరపాటు మూలంగా అనుకున్న గడువుకి రెండుగంటల ముందే స్పృహలోకి వచ్చింది.

    అదే డేవిడ్ ప్రాణాలు తీసింది కూడా.

    కొత్త వాతావరణం...అలవాటు కాని పరిసరాలు. ఉష్ణోగ్రత ప్రకృతిలో తేమ 'బ్లాక్ మాంబా' లో మరింత రోషాన్ని నింపుతుంటే వేగంగా ముందుకు ప్రాకుతోంది.

    ఆ పార్కులో ఓ మూల డేవిడ్ జరిగిందేమిటో తెలుసుకునే లోపలే ప్రాణాలు వదిలితే పార్కుని చుట్టివచ్చిన సమీర భరత్ గుండెలపై భయంతో వాలిపోయి కొన్ని క్షణాలుదాకా మాటాడలేకపోయింది.

    ఆమెను ఓదార్చుతూ కారుదాకా నడిపించాడు భరత్...సహజంగా ధైర్యవంతుడైన భరత్ కూడా వణికిపోతున్నాడిప్పుడు.

    "చచ్చిపోయేవాళ్ళం కదూ" రొప్పుతూ అంది నీళ్లు నిండిన కళ్ళతో అతడివేపే చూస్తూ...

    "ప్రేమలకి పెద్దవాళ్ళే అనుకుంటే పాములూ అడ్డు పడతాయని ఇప్పుడే తెలిసింది" వాతావరణాన్ని తేలికచేస్తూ నవ్వాడు భరత్.

    కొన్నినెలలుగా తను ప్రేమించే భరత్ ని రహస్యంగానే కలుసుకుంటున్న సమీరకి భరత్ సెన్సాఫ్ హ్యూమర్ తెలియనిదికాదు.

    అయినా నవ్వలేకపోయింది. "త్రాచుపాము అయ్యుంటుంది కదూ."

    "తోక కదలిక, రంగూ చూస్తుంటే త్రాచులాగే వుంది."

    నిన్న మొన్నటి సర్పాల స్వైరవిహారం పాముల మూలంగా జంటనగరాలు అలజడితో అట్టుడికిపోవడం గుర్తుకొచ్చిన ఆ ఇద్దరూ అక్కడ తాము చూసింది నాగుగానే భావించారు తప్ప ఇప్పుడో క్రూర సర్పం జంటనగరాలలో అడుగుపెట్టిందని గాని, తన విషపు నురగల డెక్కలతో ఎవరూ చెరపలేని మృత్యువుచే వ్రాలులా ఒక కరాళ నృత్యానికి కారణమౌతుందనిగాని వూహించలేకపోయారు.

    "పోయిరానా" ఒక అపశృతిలా ధ్వనించింది భరత్ కంఠం "రేపు కాలేజీలో కలుసుకుందాం."

    సమీరని ఫియెట్ దాకా నడిపించిన భరత్ చాలా అయిష్టంగా ఆమెకు దూరం జరగాలని ప్రయత్నిస్తూ విఫలమౌతున్న ఆ సమయంలో ఓ కారు హెడ్ లైట్స్ వారిపై పడి కాంతిరేఖలు ముందుకు సాగాయి.

    ఓ ఏభై అడుగులు దూరం వెళ్ళిన సిట్రాక్ కొంచెం 'స్లో' అవడం వారు గమనించలేదు.

    "బేబీ కదూ" సిట్రాన్ ని మళ్ళీ ముందుకు పోనిస్తూ అడిగాడు శివానంద్ పక్కన కూర్చున్న సెక్రెట్రీ చంద్రాన్ని చూస్తూ.

    ప్రభుత్వ యంత్రాంగంలో కాని, పట్టణంలోకాని అసాధారణమైన ప్రాచుర్యంగల శివానంద్ గొంతులోని జీరని సరిగానే అర్ధం చేసుకున్న చంద్రం చూసిన నిజాన్ని అబద్ధంలా చెప్పే సాహసం చేయలేకపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra