Home » Mainanpati bhaskar » రౌడీరాజ్యం


    అలా చంపుతున్న వాళ్ళకు కులమత విచక్షణ లేదు.

    చిన్నా పెద్దా తేడా లేదు.

    ముసలీ ముతకా అన్న జాలి లేదు.

    పట్నం అంతా పీనుగుల పెంటగా మారాలి.

    మత కలహాల పేరిట మారణహోమం చెలరేగాలి.

    అగ్రిమెంట్ ప్రకారం పెద్దల దగ్గర నుంచి మరిడేశ్వరరావు గ్యాంగుకి ముట్టవలసినవి ముట్టాలి. అంతే!

    ఒకవైపు ఇలా పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం హత్యలు జరిగిపోతూ వుండగా, పనిలో పనిగా పాతకక్షలు తీర్చేసుకోవడం మొదలెట్టారు కొంతమంది. చాలాకాలంగా కోర్టులో నలుగుతున్న ఒక కేసులో తమ ప్రత్యర్ధిని ఆ కోర్టుభవనం మెట్లమీదే పొడిచి చంపేశారు ఒకళ్ళు. అది మతానికి సంబంధించిన తగాదా కాదు. కానీ క్షణాల్లోనే అది మతకలహంగా రంగు పులమబడింది.

    ఒక స్త్రీ విషయంలో, అక్రమ సంబంధం గురించి తగాదా పడుతున్న వాళ్ళలో, ఒకళ్ళు రెండోవాళ్ళని నలభైసార్లు కత్తితో పొడిచి చంపేశారు.

    దాన్నీ మతకలహం కిందే మార్చిపారేశారు. మతకలహాల్లో జరిగే మర్డర్ల మీద కేసులు పెట్టడం అరుదు. పాత కక్షలు తీర్చుకోవడానికి ఇదే మంచి అదును.

    దారుణమైన హత్యలతో ఊరు ఇలా వల్లకాటిలా మారిపోతుండగా, అఖిల్, సుధా, నవాబ్ సాబ్, బేగం సాహెబ్ లు ఎక్కిన రైలు ప్రమాదంలోకి ప్రయాణం చేస్తున్నట్లు హైదరాబాద్ వేపు ఉరికి వచ్చేస్తోంది. 

    రైల్లో నవాబుగారు ఎయిర్ పిల్లో మీద సౌఖ్యంగా ఆనుకు కూర్చుని తాంబూలం ఎప్పుడూ రెడీగా వుండే చిన్న వెండి పాన్ దాన్ బయటకు తీశారు.

    వెంటనే ఆయన్ని వారించింది బేగంసాహెబ్. "మీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. ఇవాల్టికి ఇప్పుడే ఇది పదో పాన్! వద్దు. ఇంక వేసుకోకండి" అంది గట్టిగా.

    నవాబ్ సాబ్ ఆమె మాటలని అంతగా లక్ష్యపెట్టకుండా నవ్వి తాంబూలం నోట్లో పెట్టుకోబోయాడు.

    "నువ్వన్నా చెప్పమ్మా!" అన్నట్లు డాక్టర్ సుధ వేపు చూసింది బేగంగారు.

    చిరునవ్వుతో, కానీ స్థిరంగానే చెప్పింది సుధ.

    "పాన్ వేసుకోవడం మంచిది కాదు. పాన్ వల్ల ఓనల్ కేన్సర్ వచ్చే అవకాశం వుంది. మానెయ్యండి."

    ఆమె మొహంలో చిరునవ్వుని, అప్పుడే మొదటిసారిగా చూశాడు అఖిల్.

    అతనికి వెంటనే మనసులో మెదిలిన ఆలోచన!

    "ఈవిడగారికి నవ్వడం కూడా చేతనవునే!" అని. ఆ తర్వాత అఖిల్, తనేం చేస్తున్నాడో తనకి తెలియకుండానే సుధ మొహం వేపే చూస్తూ వుండిపోయాడు.

    అత్యంత సమ్మోహనకరంగా వుంది ఆమె చిరునవ్వు.

    ఆ చిరునవ్వు అందరి కోసం కాదు. డాక్టర్ సుధారాణి తన పేషెంట్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా దాచి వుంచిన అపురూపమైన చిరునవ్వు అది!

    నవాబుగారు ప్రస్తుతం ఆమె సంరక్షణలో వున్న హార్టు పేషెంటు!

    సుధని చూస్తూనే వున్నాడు అఖిల్. పక్కన కూర్చుని చూస్తుంటే ప్రొఫైల్ లో కనబడుతోంది ఆమె మొహం.

    లేత గోధుమ రంగులో వున్న శాటిన్ పౌడర్ పఫ్ లాగా మృదువుగా వుంది సుధ చెంప. చిరునవ్వు నవ్వుతుంటే చెంపమీద చిన్న గుంట పడుతోంది. చాలా తెల్లగా వున్న పలువరుస ఒకచోట మాత్రం రెండు పళ్ళకి మధ్య అతి తెల్లటి ఆమె చిరునవ్వు ఆ ఎడం దగ్గర అందమైన సుడిగుండంలో సుళ్ళు తిరుగుతున్నట్లు భ్రమ కలిగిస్తోంది. చాలా పొగరుగా, అందంగా వున్న ముక్కు, పట్టుదారాల్లా నిగనిగలాడుతున్న జుట్టు. రైలు వేగానికి ఆమె జడలోనుంచి కొన్ని వెంట్రుకలు విడివడి, ఆమె మొహం మీద పడుతున్నాయి. మధ్యమధ్య ఎడంచేత్తో ఆ వెంట్రుకలని వెనక్కి తోస్తోంది సుధ.

    అఖిల్ తనని తదేకంగా చూస్తున్నాడని ఎలా అర్ధమయిందోగానీ అర్ధమైంది సుధకి. ఆడపిల్లలకి జడలో కూడా కళ్ళుంటాయి. అతను తన వేపే చూస్తున్నాడని అర్ధమవగానే ఆమె మొహంలో చిరునవ్వు మాయమైపోయింది. పెదాలు సరళరేఖలా బిగుసుకుపోయాయి.

    తక్షణం కంపార్టుమెంటులో కరెంటుపోయినట్లు అనిపించింది అఖిల్ కి.

    ఇంతలో నవాబుగారు సుధతో ఏదో చెప్పడం మొదలెట్టాడు.

    వింటున్న సుధ పెదిమలు తిరిగి చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. అప్పుడు మళ్ళీ కనబడింది అఖిల్ కి. అతి ఆకర్షణీయమైన, అరుదైన ఆమె చిరునవ్వు. ఇందాకటికంటే మరింత ప్రసన్నంగా నవ్వుతుంది సుధ.

    హఠాత్తుగా అర్ధమైంది అఖిల్ కి. ఆమె చిరునవ్వులో అసలు ఆకర్షణ ఏమిటో.

    సుధ నవ్వుతుంటే ఆమె పెదిమలే కాదు, కళ్ళు, ముక్కు, నుదురు, నొసలు....అన్నీ నవ్వుతున్నట్లే కనబడతాయి. చాలామంది నవ్వుతుంటే రబ్బరు సాగదీసినట్లు పెదిమలు ఊరికే సాగుతాయి. నవ్వు పెదిమలు దాటదు.

    సుధ నవ్వుతుంటే అదోరకమైన ఆర్ద్రత ఆమె మొహంలో కనబడుతూ వుంటుంది.

    ఆశ్చర్యం కలిగింది అతనికి.

    ఈ రౌడీ యువరాణి.... ఈ గ్యాంగ్ లీడరు కూతురు సుధ....ఇంత దయతో కూడిన చిరునవ్వు ఎలా నవ్వగలుగుతోంది?

    అఖిల్ తననే చూస్తున్నాడని గ్రహించాక, సుధ వంట్లో రక్తం వడివడిగా ప్రవహించడం మొదలెట్టింది.

    తనని చూడగానే కళ్ళార్పడం మర్చిపోయినట్లు ప్రవర్తించే వాళ్ళని లెక్కలేనంత మందిని చూసింది తను. తను వాళ్ళెవరినీ లెక్కచెయ్యదు.

    ఈ అందచందాలూ, వాటి తాలూకు బేరీజులూ, మనసులు ఇచ్చి పుచ్చుకోవడాలూ, మనసు పారేసుకోవడాలూ....

    బాష్! ఇవన్నీ తలుచుకుంటేనే అలర్జీగా వుంటుంది తనకి! నిజం చెప్పాలంటే తన అందం మీద తనకే పెద్ద ఇంప్రెషనూ, ఇంట్రెస్టూ లేవు.

    తన వంట్లో ఇన్ని వంపుసొంపులు లేకుండా, సాదాసీదాగా వుండి వుంటేనే తనకి నచ్చి వుండేదేమో కూడా.

    పొడుగ్గా, పిరుదులు దాటి వచ్చే ఈ లావాటి జడని కత్తిరించేసి, జుట్టుని పొట్టిగా, బాబ్ చేయించుకోవాలని కూడా అనుకుంది ఎన్నోసార్లో తను.

    వంటి వంపులని మరింత ప్రస్పుటంగా ప్రదర్శించే చీరె, జాకెట్టూ తనకి ఇబ్బందిగా వుంటాయి. వాటిమీద తెల్లకోటు వేసుకుంటే ఈ కర్వ్స్ కనబడకుండా పోతాయి. అప్పుడు నిజంగా రిలీఫ్ గా వుంటుంది తనకి.

    అలాంటి ఆమె మనసు ఇవాళ ఆమె అదుపులో లేకుండా స్వతంత్రించి ప్రవర్తించడం మొదలెట్టింది.

    ఏదో సన్నటి కసి....అఖిల్ మీద! ఇతగాడు తనని రేప్ చేస్తానని శపథం పట్టాడుట కదూ అప్పట్లో!

    అది కుదరలేదు! కానీ ఆ కోరిక మాత్రం అతని మనసులో ఇంకా వుండే వుంటుంది.

    ఆ ఆధారం చాలు! అతన్ని పనిష్ చెయ్యడానికి. అతను అందని అందం కోసం అల్లాడిపోతుంటే తనకి తృప్తిగా ఉంటుంది.

    అతను అప్ సెట్ అయిపోవడానికి తన "అందం" ఎరగా పనికి వచ్చినా తప్పేమీలేదు.

    మామూలుగా అయితే తన పద్ధతి కాదు ఇది! కానీ ఇప్పుడు తనకి కావలసింది ఈ గూండా సఫర్ కావడం.

    అంతే! అలా అనుకుని, మరింత విశాలంగా నవ్వుతుంటే ఆమె చిరునవ్వు కాంతి మరీ ప్రకాశవంతంగా అయ్యింది.

    అంతలోనే ఆమెకి అనిపించింది. మరీ అసహజంగా వుందా తన నవ్వు? కొంచెం తగ్గించాలా? అప్పుడు మరో ఆలోచన కూడా వచ్చింది. అతను తన మొహాన్నే చూస్తున్నాడన్న గ్యారంటీ ఏమిటి! అతనొక ఛీప్ ఫెల్లో! అతని చూపులు అక్కడితో ఆగుతాయా?

    ఆ ఆలోచన రాగానే ఆమెకి తెలియకుండానే ఆమె మొహంలో నవ్వు తగ్గిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఊపిరి త్వరత్వరగా వస్తోంది. ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలతోబాటు, బరువుగా పైకీ, కిందికీ కదులుతోంది ఆమె వక్షం! ఇంక ఉండబట్టలేకపోయింది సుధ. ఆమెకి ఇలాంటివన్నీ అలవాటు లేవు.

    చటుక్కున పమిట సవరించుకుని, అప్రయత్నంగానే అఖిల్ విఅపు చూసింది.

    కానీ, అతను ఆమెవైపు చూడడంలేదు! కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు అఖిల్. ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయినట్లు ఉంది అతని మొహంలో భావం!

    ఒక్కసారిగా కలిగిన రిలీఫ్ తోబాటు, అవ్యక్తమైన అవమానంలాంటి ఫీలింగ్ కూడా కలిగింది సుధకి.

    ఎందుకిలాంటి ఆలోచనలు వచ్చాయి తనకి ఇవాళ? అతను తనవైపు కోరిగ్గా చూడాలనీ, చూస్తూ అల్లాడిపోవాలనీ.... అదే అతనికి పనిష్ మెంటు అనీ....ఎందుకింత ఛీప్ గా ఆలోచించింది తను! తన లెవెల్ కి తగిన ఆలోచనలేనా యివి!

    తన తప్పు త్వరలోనే గ్రహించింది తను! థాంక్ గాడ్! థాంక్ గాడ్!

    అప్పుడు ఇంకో విషయం కూడా అనిపించింది సుధకి. ఇప్పుడు.... ఇలా....కిటికీలోనుంచి బయటికి చూస్తున్న ఈ అఖిల్ మొహం చూస్తుంటే ఎవరో ఫిలాసఫర్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. వేదాంతాన్ని శోధిస్తున్న వాడిని చూస్తున్నట్లు అనిపిస్తోంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra