ఇంకా నలభయి కవర్ అవ్వాలి. ఈసారి నలుపుమీద ఇరేవ్తే కాసేడు.
పోయింది.
తరువాత పసుపుమీద పదికాసేడు.
ఒక బాణం గుచ్చుకొని ఇరవ్తే వచ్చింది.
ఆ ఇరవయ్యి తెలుపుమీద కాసేడు.
పోయింది.
సరిగ్గా అరగంట తరువాత జేబులు తడువుకుంటే ఇద్దరి దగ్గిరా ఏమిలేదు.
ప్రకాశం అతనికి నూట ఇరవ్తే యివ్వవలసినట్టు లెక్కతేలింది.
అది ప్రకాశం జీతంలో నాలుగోవంతు ఆ వంతు పెట్టి అతను ఇంటికి బియ్యము వేచ్చాలూ కొనాలి___
___ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేసినట్టూ అనిపించింది. నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు గుంపులోంచి బయటకొచ్చాడు.
తుఫానువచ్చి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతత.
వెనక్కి తిరగి చూసేడు.
అందరూ రంగుబల్ల చుట్టూ చేరారు__ అందరి కళ్ళలోనూ ఆశ___ఈజిమని__ సులభంగా డబ్బుపోతే యింకో దారి వెతుక్కుంటారు__తను టేబిల్ మీద కాగితం కదపటానికి అయిదు రూపాయలు కావాలంటాడు గుమస్తా. ఈనాంకోసం చెయ్యి చాచుతాడు ప్యూను. ఈజిమని____ పనికి విలువ తగ్గిపోతుంది.
ప్రకాశం బయటకోచ్చేడు.
విధిలో జనసంచారం ఎక్కువ్తేంది.
బ్రాకెట్టు క్లోజింగ్ వచ్చే టైమయిందన్న మాట.
కోట్ల దగ్గర గుంపులుగాచేరి ఆతృతగా చూస్తున్నారు.
ఈ దేశపు సగటు మనుష్యులు.
రత్నగర్భంలో పుట్టిన అస్దిపంజరాలు.
14
తెల తెలవారుతూ వుండగా సీతకి మెలకువ వచ్చింది. లేవగానే ఎదురుగా పాకెట్ కనబడింది. ఆత్రుతతో నిప్పి చూసింది. తెల్ల చీరే. ఒకక్షణం ఆమెకెవి అర్ధంకాలేదు. ఆ పాకెట్ పట్టుకొని ప్రకాశం గదిలోకి వచ్చింది. ప్రకాశం గాడనిద్రలో ఉన్నాడు. అతన్ని లేపబోయింది. అంతలో గుర్తుకొచ్చింది. క్రితంరాత్రి అతను చాలా ఆలస్యంగా వచ్చేడని, యేవర్ని లేపలేదనినూ. వెంటనే ఆమెకి అర్ధమయి పోయింది. ఆ చీరే అతనే తెచ్చాడని ఒక్కసారిగా ఆమె హృదయం పోయింది. ఆ చీరే అతనే తెచ్చాడని. ఒక్కసారిగా ఆమె హృదయం నిండా ఆనందం పోంగింది. గబగబా అడుగులేసుకొంటూ బయటకొచ్చేసింది.
అంతలో మనిమనిషి వచ్చింది. ఆవిడకి గిన్నెలువేసి బాత్ రూం లోకి వెళ్ళింది. రెండు నిమిషాల్లో తలార స్నానం చేసింది. కుచ్చిళ్ళు పోసి పొందిగ్గా చీర కట్టుకొని తల తుడుచుకొనివదులుగా జడ వేసుకొంది. సన్నగా కూనిరాగం తీస్తూ కళ్ళనిండారుగా కాటుక పెట్టుకోంది. ఆ ప్తెన ఏం చెయ్యాలో తోచలేదు. నెమ్మదిగా ప్రకాశం గదిలోకి వచ్చింది. అతను ఇంకా నిద్రపోతూనే వున్నాడు. ఒక క్షణం అలానే చూస్తూ వుండిపోయింది. నిద్రలో కూడా విశాలత్వాన్ని తేలిపేకళ్ళూ చేసిరిపోయి ముందుకుపడినముంగురులూ, క్రితంరాత్రి తాంబూలం వేసుకోవడం వల్ల ఎర్రబారిన పెదవులూ___
ముందుకింకో అడుగువేసి అతన్ని స్పృజించబోయి చప్పన ఆగిపోయింది. అంతలో పెరట్లోంచి పనిమనిషి పిలుపు వినిపించింది ఉలిక్కిపడి సితా గదిలోంచి బయటకొచ్చేసింది.
'ప్రేమ' ఒక పెద్ద ఆత్మవంచన. ట్రాష్ దీనికి బెస్ లంచం స్వార్ధం. ఇన్నాళ్ళుగా ఆ అమ్మాయి హృదయంలో గూడుకట్టుకు పోయిన ప్రేమంతా ఇలా బయటికి రావడానికి ఒక చీరే____ ఒక్క చీరే ఉపయోగపడిందంటే__ ఎంత హాస్యాస్పదం! ప్రేమ ప్రేమని ప్రేమిస్తుందనేది పచ్చి అబద్దం! ప్రేమ బంగారాన్ని ప్రేమిస్తుంది. కొత్త చిరెల్ని-కొత్త సినిమాల్ని ప్రేమిస్తుంది. ఈ దౌర్భాగ్యపు ప్రపంచంలో ప్రేమ వెళ్ళడించడానికి ఇంతకన్న వేరే మార్గాలులేవు. అదే నిజం కాకపోయినా పక్షంలో ఎంతోమంది తమ భర్తలు తమ భార్యల్ని నిజంగానే మనస్పూర్తిగా ప్రేమించి వారిని సంతృప్తుల్ని గావించేవారు ఇలా మభ్య పెట్టి ఎస్కేప్ అయ్యేవారు కాదు.
___పనిమనిషికి బట్టలసబ్బు ఇచ్చి ఇంట్లోకి వస్తూ వరండాలోకి చూసింది. మంచంమీద పరంధామయ్య లేడు. అంత పొద్దున్నే ఆయన లేవడని సీతకు తెలుసు. పెరట్లోకి వచ్చియా చూసింది- మనిమనిషి ఒక్కతే బట్టలు ఉతుకుతోంది. సిత గాభరాగా అంతా వెతికింది. ఎక్కడా ఆయన కనబడలేదు. వడి వడిగా ప్రకాశం గదిలోకి వెళ్ళంది. అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు__"బావా-బావా" అంటూ పిల్చింది. అతనికి మెలకువ రాలేదు."బావా" అంటూ చేత్తో గట్టిగా తట్టింది. ప్రకాశానికి హఠాత్తుగా మెలకువ వచ్చ్సింది.
మూసివున్న కిటికీ తలుపు సందుల్లోంచి ఒక వెలుగురేఖ ఆ గదినీ ప్రకాశవంతం చేస్తూంది. ఆ వెలుగు సిత తెల్లని చేరేమీద విశ్లేషణం చెంది, మరింత ప్రకాశవంతమవుతుంది. తలంటుకోవటం వలన ముంగురులు నుదుటిమీద అస్తవ్యస్తంగా పోరాడుతున్నాయి. వాటిమధ్య దోసగింజంత బొట్టు అందంగా అమరింది. ప్రకాశం కళ్ళు విప్పేసరికి ఆమె మళ్ళి యింకోసారి లేవటానికి ముందుకు వంగింది. ఆమెనంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. మోచేతిమీద చటుక్కున లేచాడు.