Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 27

                                 

    చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత నిర్లక్ష్యంగా చెప్పినా అది అవతలి వారి మనసుల్లోకి చొచ్చుకుపోతోందని నమ్మకంగా తెలుసుకోగలగుతారు.

     వీరికి వీరంటే ఏమిటో బాగా తెలుసుకాబట్టి ఇతరులు వీరిగురించి ఏమనుకుంటున్నారోనని ఎప్పుడూ చింతపడరు.అలాగే అవమానాలను దులపరించుకొని ముందుకు సాగిపోయినా, వీళ్లని అవమానించిన వాళ్లకి దెబ్బతీయటం కోసం ఎంత కాలమైనా వేచి వుంటారు. మనసులో భావాలు మొహం మీద కనబడనీయకుండా ప్రవర్తించటం వీరికి వెన్నతో పెట్టిన  విద్య అలాగే కోపంతో  చిందులేయటం, అరచి గోల చేయటం వీరి స్వభావానికి విరుద్దం.

     జరిగిన అన్యాయాలకు, అవమానాలకు మాటి మాటికీ వెనక్కి తిరిగి చూసుకొని ఏడుస్తూ కూర్చోకుండా తమ తమ రంగాల్లో ముందుకు సాగిపోవటం వీరి వ్యక్తిత్వానికి పరాకాష్ట. వీరిని పాజిటివ్  వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. బాధలు, కష్టాలు అంటే ఏమిటో తెలుసు కనుక కష్టాల్లో వున్న వారిని ఎద్దేవా చెయ్యరు.

    వీరి సహాయాన్ని కోరిన వారిని, వీరిని నమ్ముకున్న వారిని మోసం చేయటానికి ఇష్టపడరు. తమకంటే బలహీనులని దెబ్బతీయటం అనేది వీరికి పరువు తక్కువ పనిగా అనిపిస్తుంది.

     వీరు లౌక్యంగా పనులు జరిపించుకోవటంలో దిట్టలు. అపాయాన్ని ఇష్టపడే మనస్తత్వం కలిగి వుంటారు. సాధారణంగా గూఢాచారి శాఖలో పనిచేసేవారు రాజకీయాల్లో పని చేసేవారు. బాబాలు మొదలైన వారి చేతివ్రాత ఈ విధంగా వుండటం మనం గమనిస్తాం.

     కుడివైపు మార్జిన్:

    కుడివైపు ఖాళీ స్థలాన్ని వదిలేవారిని మూడు రగాలుగా విభజింపవచ్చు.

    1. ఎక్కువ స్థళం వదిలి తరువాతి వాక్యం ప్రారంభించేవారు.

    2. కాగితం చివరి వరకూ వ్రాసిగాని క్రింది వాక్యానికి రానివారు.

    3. స్థలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆ వాక్యాన్ని ఆపుచేసి తరువాతి లైనుకి వచ్చేవారు.

    1. కుడివైపు ఎక్కువ మార్జిన్ వదిలేవారు:

      

    వీరు అమితమైన సౌఖ్యాన్ని అభిలషించేవారై వుంటారు. భోజనము, మధువు, మాదకద్రవ్యాలు, అందమైన స్త్రీలు, ప్రేమ, ప్రకృతి అన్నింటిపట్ల వీరు ఆకర్షింపబడతారు.

    జీవితంలో ఏదైనా సాధించటం కంటే జీవితాన్ని అనుభవించటం ముఖ్యమని వీరు భావిస్తారు. తమకు కావాల్సిన దాన్ని ఏదో విధంగా సాధించి దాన్ని అనుభవిస్తూ బ్రతుకుతారు.

    వీరు ప్రేయసి/ ప్రియులకు తమపట్ల ఏదో ఒక భ్రమ కలిగిస్తారు.

    వీరు సాధారణంగా ఎక్కువ ఖర్చు చేసేవారై వుంటారు.

    వీరు మంచి వాళ్లకి తిమ్మిని బమ్మిని చేయగల  వారిగా కనిపిస్తారు కానీ నిజానికి అలాంటి మనస్తత్వాన్ని కలిగి వుండరు.

    తమ ఆశయాలకు, ఇష్టా ఇష్టాలకు బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్లు కూడా విఘాతాన్ని కలిగించడం వీరు ఒప్పుకోరు.

     పిల్లల్ని వీరు పెంచిన కట్టుదిట్టాలతో మరెవరూ పెంచలేరు.

     వీరిలో అంతర్గతంగా కాస్త అహంకారం వుంటుంది. దాన్ని ప్రదర్శించనంతకాలం  వీరిని ప్రేమిస్తే గొప్ప సంతృప్తి లభిస్తుంది.

    2. తక్కువ మార్జిన్ ఇచ్చేవారు:

            

    వాక్యాన్ని కాగితం  చివరివరకూ వ్రాసి, అక్కడ సున్నాతో ప్రారంభించవలసి వచ్చినా  దాన్ని తరువాతి  వాక్యం ప్రారంభం  వరకూ  తీసకువచ్చేవారు సాధారణంగా భవిష్యత్తుపట్ల ఎక్కువ నమ్మకం లేనివారు, తమని తాము ఇతరులకి స్పష్టంగా చెప్పగలిగేవాళ్ళు అనమానస్థులు అయ్యుంటారు.

    వీరు చంచలంగా, ఎప్పుడూ ఏం చేస్తారో చెప్పలేనివిధంగా ప్రవర్తిస్తుంటారు.

     వీరు ఒక అబ్బాయి/ అమ్మాయిని ప్రేమిస్తే అతని స్వరం వల్లో,నడతవల్లో, వ్యక్తిత్వంవల్లో , డబ్బువల్లో ఇష్టపడి కొద్దిరోజులకి అదే అబ్బాయిని/  అమ్మాయిని వారు వేసుకున్న చెప్పుల దగ్గరనుంచి వాడే జేబురుమాల వరకు  విమర్శించడం ప్రారంభిస్తారు.

    వీరు చేస్తున్న  ఉద్యోగం పట్ల శ్రద్ద ఎక్కువ చూపించకపోవచ్చు దానికి కారణం వీరి చేతకానితనం కాదు. యాంత్రీకతను వీరు అసహ్యించుకుంటారు.చిన్న చిన్న ధ్రిల్స్ అంటే వీరికి చాలా ఇష్టం.

 Previous Page Next Page