Home » Polkampalli santhadevi » అష్టదళం 2

    నగరంలో పేరుమోసిన హోటల్ అది.

    హోటల్ ముందులా లాకప్ కుర్చీలలో  కూర్చుని కావాల్సిన వాటికోసం ఆర్డరిచ్చింది వినూ.

    కుండీలలో రకరకాల క్రోటన్ మొక్కలు, రంగురంగుల పూలు విరిసినట్లుగా వాటి ఆకులు, కాళ్లకింద ఆకుపచ్చ తివాచీ పరచినట్లుగా పచ్చిక, కొంచెం దూరంలో స్విమ్మింగ్ ఫూల్. అందులో ఈత కొడుతున్న యువతీ యువకులు.
 
     ఆ ప్రదేశమంతా పట్టుపగల్లా మారుస్తున్న మెర్కురీ దీపాలు.

     "నాకు ఈత నేర్పించాలని  మా మమ్మీ డాడీ చాలా ప్రయత్నించారు. నా చిన్నతనంలో  నాకెందుకో నీళ్లని చూస్తే భయం వేసేది. నేర్చుకోలేదు,  ఇప్పుడనిపిస్తోంది నేర్చుకుంటే బాగుండేదని. నీళ్లల్లో చేపపిల్లల్లా  ఈదులాడే వాళ్లని చూస్తే చాలా ముచ్చటేస్తుంది.  నేను నేర్చుకుంటే ఎంత బావుండేదని  బాధపడుతూ వుంటాను. ఈత ఒంటి లావణ్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. ప్రత్యేకంగా వ్యాయామం చేయాలంటే, ఒక్కోరోజు అస్సలు ఓపిక వుండదు. వ్యాయామం చేయడం మొదలుపెడితే రెగ్యులర్ గా చేస్తేనే మంచిదంటారు"

    "మీరు వ్యాయామం చేస్తారా?"

    "ఏదో చిన్న చిన్న ఎక్సర్ సైజులు. టీవీలో ఫిట్ నెస్  ప్రోగ్రామ్ లు చూసి చేస్తుంటాను. ఊరికే తిని కూర్చుంటే ఒళ్ళు కొవ్వెక్కి పోతుందని భయం. పెళ్లయ్యాక కొంచెం అటు ఇటు అయినా ఫర్వాలేదనుకోండి" అని చిన్నగా నవ్వింది.

     "పెళ్లయ్యాక డ్రమ్ములా ఊరిపోయినా ఫర్వాలేదన్నమాట. ఎంత దారుణమండీ.  మొగుడయినా మగాడే కదండీ! ఏ మగాడైనా తన భార్య పూదీగలా వుండాలని కోరుకుంటాడు."

     "ఈ మాట గుర్తు పెట్టుకుంటానులెండి."

    "మీరు మీ అందచందాలపట్ల చాలా శ్రద్ద వహిస్తారనుకుంటాను" క్రీగంట చూస్తూ అన్నాడు శ్రీచక్ర.
 
    "మేకప్ ఎక్కువగా కనిపిస్తుందా ఏమిటి?" తనని తాను భయంగా చూసుకుంది.

     "ఎక్కువేం లేదులెండి."

    "కాబోయే భార్యను నువ్వు అనొచ్చుకదా!"

    "అయ్యాక అనాల్సింది ఇప్పుడే అంటే బాగుండదు" అదోలా భుజాలు ఎగరేశాడు.

     "ఈత నేర్చుకోలేదన్న బాధ దేనికి? అలా రబ్బరు ట్యూబులు తగిలించుకుని ఏ వయసు వాళ్లయినా ఈదవచ్చు."

    "ఇలా బహిరంగంగా స్విమ్మింగ్ సూట్ వేసుకుని ఈత కొట్టాలంటే సిగ్గేస్తుంది బాబూ!"

    "మీరు కోరుకోవాలేగానీ, మీ బాబు మీ ఇంట్లోనే స్విమ్మింగ్ ఫూల్ ని కట్టిస్తాడు కదా!"

    "నేను కోరాలేగానీ, మా డాడీ  కొండమీది కోతినైనా తెచ్చిస్తాడు. ఈతకొలను ఒక లెక్కకాదు."

    "మీ బాబు కొండమీది కోతిని తెచ్చిస్తాడేమోగానీ, అది మనస్సుంటేనే మీ వశమౌతుంది. లేకపోతే రక్కుతుంది."

    "మాట వరసకి కోతి అంటే, కోతి అనికాదు."

    "కొండమీది కోతినైనా తెచ్చిచ్చే మీ నాన్న అవలీలగా నన్నందుకుని మీకిస్తున్నాడు."

    "నా చిన్నప్పటి నుండి నేను కోరింది ఏదయినాసరే తప్పక తెచ్చిచ్చే అలవాటుంది మా డాడీకి. అంత అపురూపంగా  చూసుకునే తండ్రి వుండటం నా అదృష్టం."

    "కానీ నా విషయంలో అది దురదృష్టం కూడా. నువ్వు కోరిక వాడికి నీమీద మనస్సుందో లేదో చూడకుండా ఒక బొమ్మను తెచ్చిచ్చినట్లుగా నన్ను మీకు వరుడిగా కానుక చేయడం వున్నదే అది చాలా తప్పు.  మనసు లేనివాడితో, తన కూతురి కాపురం ఎంత నరకంగా వుంటుందో ఆయన వూహించగలిగితే బాగుండేది."

    గాయపడ్డట్టుగా చూసింది వినూ. "మనసు లేదంటే...."

    "అది మరొకరిదైందని అర్దం. నేను సింగపూర్ వెళ్లకముందే  ఒకమ్మాయిని ప్రేమించాను. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నాను. నేను సింగపూర్ నుండి వచ్చేసరికి ఏరోడ్రోంలో మీరు వరమాల పట్టుకుని నిలబడ్డారు.

     ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో చూడండి. మానాన్నగారు మీకు వున్న ఐశ్వర్యంమ చూసో, మీ నాన్నగారితో వున్న స్నేహాన్ని బట్టో మీ సంబంధం ఖాయం చేసిపెట్టారు. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి."

    "మీ అమ్మగారు చెప్పింది నిజమేనన్నమాట."

    "ఆమెకు  నా ప్రేమకథ తెలియదు. మీరు కోడలు కావటం ఇష్టంలేక అలా చెప్పింది."

    "మీ మనసులో మరొకరున్నాసరే మీజీవితంలో చోటిస్తే చాలుననుకునే పిచ్చి ప్రేమ నాది. మీరు నాకు కావాలి. మీరు నావారు కావాలి."

    "ప్రేమించినదాన్ని పొందలేకపోతే నా మను మూగబోతుంది. పాటలేని మూగవీణని బ్రతుకంతా  భరించగలనా?"

    "ఎప్పటికైనా పలకదా అన్న ఆశతో భరిస్తాను."

    "కానీ అది ఎన్నటికీ పలకదు. తన జీవితాన్ని నాశనం చేశావన్న కసి, ద్వేషం చెలరేగితే....."

    "అదిమాత్రం భరించలేను."

    "నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. మనిషిని చంపి అయినాసరే శవాలతో ఆడుకునే ఉన్మాదం మంచిది కాదంటాను. మీది నిజమైన ప్రేమ అయితే,  మీరు ప్రేమించినవాడి సుఖాన్ని కోరుకుంటారు. మీది నిజమయిన ప్రేమ అయితే అతడిసుఖశాంతులను నాశనం చేయాలని చూడరు."

    "అయితే నా ప్రేమకు విలువేమీలేదా?" కన్నీటితో తడిసిన రెప్పలను బరువుగా ఎత్తుతూ అడిగింది.

     "ప్రేమకు విలువ ప్రేమించినవాడి సుఖాన్ని కోరుకున్నప్పుడు వస్తుంది."

    "నా జీవితం శూన్యం చేసుకుని, మీ సుఖాన్ని కోరుకోమంటారు ఎంత స్వార్దం? ఇదెక్కడి న్యాయమండీ?"

    "దయచేసి పెద్ద మనసు చేసుకుని నా దారిన నన్ను వెళ్లిపోనీమంటున్నాను. దీనికి స్వార్దమని పేరు పెడితే మీ ఇష్టం."

    "ఆల్ రైట్! మీదారికి అడ్డు తొలుగుతాను. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకుని, సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఆనంద భాష్పాలు రాలుస్తాను. 'నీ సుఖమే నే కోరుకున్నా' అని పాడుకూంటూ...."

    "వ్యంగ్యం వద్దు! సూటిగా ఆలోచించండి. మీరంటే ఇష్టంలేదని చెప్పినా, అతడినే పెళ్లాడాలనుకునే మీ మంకు  పట్టునేమనాలో తెలియడం లేదు. ఆడపిల్లకి ఆత్మాభిమానమే భూషణమంటారు. చిన్నప్పటి నుండి అన్నీ ఇచ్చిన మీ తల్లిదండ్రులు  అసలైనది ఆత్మాభిమానమే ఇవ్వలేదు. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది"

    "ఆత్మాభిమానం లేదు, సిగ్గులేదు. మీరంటే పిచ్చి ఇష్టం మాత్రం వుంది సరేనా?"

    "అయితే నన్ను విడిచిపెట్టరన్నమాట!"

    "విడిచిపెడతాను కానీఒక్క షరతుమీద."

    "ఏమిటది?"

    "నన్ను మీరుప్రేమించకపోయినా ఫర్వాలేదు. ద్వేషించకండి. మీరు నాకు భర్త కాకపోయినా ఫర్వాలేదు. అప్పుడప్పుడు ఒక స్నేహితుడిగా కనిపిస్తూ వుండండి. మీ పాణిగ్రహనికి నోచుకోకపోయినా, కనీసం మీస్నేహ హస్తానికయినా నోచుకుంటానుకదా!"

    "దానికేం భాగయం?" శ్రీచక్ర చేయి చాచి ఆమె చెయ్యినందుకుని నొక్కాడు.

     "కనీసం ఈ విధంగానైనా మీచెయ్యందుకున్నాను. ఈ తృప్తిచాలు నాకు. ఆత్మాభిమానం అంటూమీరు నన్ను రెచ్చగొట్టకపోతే నాలో  ఈ మార్పు వచ్చేదికాదు."

    "మీ డాడీ ప్రతీకార చర్యలకు పూనుకుంటాడేమో?"

    "మా డాడీ విషయం నేనుచూసుకుంటాను. మీరు నిశ్చింతగా వుండండి."


                      *    *    *    *

   
    ఒకనాడు శ్రీచక్రని పిచ్చివాడికింద జమకట్టేసి అతడితో మాట్లాడాలన్నా, అతడి ఉత్తరాలు చదవాలన్నా విముఖత చూసే కౌస్తుభ ఈ రోజు అతడి రాకకోసం ఎదురుతెన్నులు చూస్తోంది.  రోజులుగంటలుగా,  గంటలునిముషాలుగా, నిముషాలు సెకనులుగా లెక్కవేస్తూ, ఒక సెకను గడిస్తే 'అమ్మయ్య ఒక సెకను గడిచింది' అనిపిస్తోంది అంటూ లెటర్స్ వ్రాసిన  శ్రీచక్ర  గడువుముగిసినా ఇంకారాలేదు.  బిజినెస్ రీత్యా ఇంకాసింగపూర్ లోనే వున్నాడేమో.

    అతడొస్తే ఏదో సాకుతో అతడిని జయసూర్య ఇంటికి తీసుకెళ్లాలి ఏటిఒడ్డున ఆ శిథిల సౌధాన్నీ, వృద్ద భూపాల్ గారినీ చూపి, అతడి రియాక్షన్ ఏమిటే గమనించాలి.

    ఆ సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది.

     కౌస్తుభ ఊహలు అలాసాగుతుండగానే ఒకరోజు.....
 
    "ఎవరొచ్చారో చూడు మణీ!"

    చదువుతున్న  పుస్తకంలోంచి చివ్వున తలెత్తింది కౌస్తుభ.

    ఎదరుగా శ్రీచక్ర!

    కౌస్తుభ ముఖం పువ్వులా విచ్చుకుంది.

     "గంటలు, నిముషాలు, సెకన్లు లెక్కబెట్టుకునేవారేనా గడువు దాటినా పత్తాలేరు" చనువుగానే దెప్పుతూ అందికౌస్తుభ.

    "రావాలని వున్నా,  ఇక్కడ ఎర్రగడ్డ హాస్పటల్ కి అంబులెన్స్ రెడీ చేసి పెట్టారేమోనని భయం."

    "మీరు మాట్లాడుతూ వుండండి, మణీ! నేను బయటికివెళ్లి ఇప్పుడే వస్తాను" యోగానందం షర్ట్ వేసుకుని బయటకెళ్లాడు.

    అతడు తమకి ఏకాంతం కల్పించడం కోసమే బయటికి   వెళ్ళాడనిపించింది కౌస్తుభకు.

    "మీరు వ్రాసిన కథ చాలా బాగుంది. చాలా సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా! జయసూర్య పాత్ర అలా ట్రాజెడీగా ముగించారేం? చాలా బాధన్పించింది."   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra