Home » Yerramsetti sai » Sudigundapuram Railway Halt


    "సైలెన్స్!" గదమాయించిందామె.
    అతను సైలెంటయిపోయాడు.
    కల్పనారాయ్ సుష్మ వైపు చూసింది మళ్ళీ.
    "సుష్మా"
    "ఏమిటమ్మా?"
    "అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా?"
    "అవునమ్మా"
    "వీడు క్లాస్ లో బిలో యావరేజ్ గా వుండేవాడన్న సంగతి నీకు తెలుసా?"
    "ఆ విషయాలు ఈ దశలో అంత ముఖ్యమైనవి కావని అనిపిస్తోందమ్మా?"
    "సరే అయితే నువ్వా గదిలోకెళ్ళి కూర్చో."
    సుష్మ బుద్ధిమంతురాలిలా ప్రక్క గదిలోకెళ్ళిపోయింది.
    ప్రకాష్ కెందుకో భయం వేసింది. ఇంతకాలం తర్వాత ప్రిన్సిపాల్ కి ఎదురుగా నిలబడటం.
    "ప్రకాష్"
    "ఎస్ మేడమ్"
    "ఆల్ రైట్ మూడు ప్రశ్నలడుగుతున్నాను. క్లుప్తంగా సమాధానాలు చెప్పు. ఎయిట్ క్లాస్ లో చెప్పినట్లు చాంతాడు సమాధానాలు చెప్పకు."
    "అలాగే మేడమ్"
    "సుష్మను చేసుకుంటే ఒక్క పైసా కట్నం రాదన్న సంగతి నీకు తెలుసా?"
    "తెలుసు మేడమ్! నాకసలు కట్నం అంటే పడదు. ఎలర్జీ"
    "నువ్వు సర్వ స్వతంత్రుడివేనా?"
    "మామయ్య వున్నాడనుకోండి. నిజానికి ఆయనకు నామీద కంట్రోల్ వున్నా నేను మాత్రం నా మీద ఆయనకు ఎలాంటి అధికారం లేదని అనుకుంటున్నాను. అంటే ఆయనకు నామీద ఎలాంటి అధికారం లేదనటం వలన వచ్చే చిక్కులు వున్నప్పటికీ సరికొత్త చిక్కులు రావని నేను..."
    "ప్రకాష్!" కోపంగా అరిచింది కల్పనారాయ్.
    "ఎస్ మేడమ్"
    "అతి వాగుడు నేను లైక్ చేయనని నీకు సెవెంత్ క్లాస్ లోనే చెప్పాను."
    "అవును మేడమ్. సెప్టెంబర్ ట్వంటీ సెకెండున"
    "కనుక రెండే రెండు ముక్కలలో సమాధానం చెప్పు."
    "ఓ.కె.మేడమ్! నేను సర్వ స్వతంత్రుడినే!"
    "మూడో ప్రశ్న - నీకు ఉద్యోగం వుందా. లేకపోతే బ్యాంక్ బాలెన్స్ ఎంత వుంది?"
    "ఉద్యోగం ఏమీ లేదు మేడమ్. బ్యాంక్ బాలెన్స్ జీరో."
    "అయితే వెంటనే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా బ్యాంక్ బాలెన్స్ ఏర్పాటు చేసుకుని అప్పుడు కనిపించు. సరేనా?"
    "కానీ మేడమ్..."
    "ప్రకాష్!" కోపంగా అందామె.
    "ఎస్ మేడమ్" గాబరాగా అన్నాడు.
    "ఇక నువ్వు వెళ్ళవచ్చు."
    అతను బయటకు వచ్చి కారులో స్టీరింగ్ ముందు కూర్చుని భోరున ఏడ్చేశాడు.


                             *    *    *    *


    కావలెను-ఒక ప్రముఖ సంస్థకు జనరల్ మేనేజర్ గా పనిచేయుటకు పరమ దివాలా కోర్ అభ్యర్థి కావలెను. అతను ఆ సంస్థను ఆరు నెలల్లోగా ఆనవాళ్ళు లేకుండా మట్టి కరిపించగల పరమ నష్ట జాతకుడయి వుండాలి.
    అనుభవం:ఇంతకుముందు అనేక సంస్థలకు పనిచేసి వాటిని దివాళా తీయించి వుండాలి. వారు పనిచేసిన సంస్థల ప్రొప్రయిటర్లు ప్రస్తుతం వీధుల్లో అడుక్కుంటున్న ఫోటోలు తప్పనిసరిగా జతపరచాలి.
    వయసు:ఈ పదవికి వయసుతో నిమిత్తం లేదు. కేవలం అద్భుతమైన సంస్థలను భూస్థాపితం చేసిన అనుభవం వుంటే చాలు.
    జీతం:ముందుగానే ఆరు నెలల జీతం ఎకౌంట్ కి జమ చేయబడుతుంది. కానీ కొంతవరకూ ఫలితాలు చూపించందే అది డ్రా చేయడానికి వీలు వుండదు.
    నోట్:భారత రైల్వేలలో జనరల్ మేనేజర్ గా చేసినవారికి గానీ, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, స్టేట్ అండర్ టేకింగ్స్ లో గానీ జనరల్ మేనేజర్స్ గా పనిచేసినవారికిగానీ ప్రాధాన్యత ఇవ్వబడును. అంతమాత్రాన దివాళా తీయించడంలో కేవలం వారే నేర్పరులని మా వుద్దేశ్యం కాదు. అంతటి కాలిబర్ వున్న వారెవరయినా సరే అప్లయ్ చేయవచ్చును.
    గడువు:ఇవాల్టినుంచి వారం రోజులు.
    చిరునామా: బాక్స్ నెంబర్ 351, హాస్యప్రియ హైద్రాబాద్. అని వుందా ప్రకటన న్యూస్ పేపర్ లో.
    "ఇది గోల్డెన్ ఛాన్స్" అంది మృదుల ఆనందంగా.
    "అవును! ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు మనిద్దరమే వున్నాం" అన్నాడు విజయ ఉత్సాహంగా ఆమె భుజం మీద చేయి వేస్తూ.
    మృదుల అతని చేయి తీసిపారేసింది "నేననేది ఈ ప్రకటన సంగతి! ఇది ఖచ్చితంగా డాడీయే వేసి వుంటారు. ఎందుకంటే కంపెనీ వర్కర్లతో సమ్మె చేయించలేకపోయాడని మా జనరల్ మేనేజర్ ని మొన్నే డిస్ మిస్ చేశారు."
    "ఓ అలాగా"
    "నువ్వు వెంటనే ఈ పోస్ట్ కి అప్లయ్ చేసెయ్. నీ మీద నమ్మకం లేక డాడీ ఈ ప్రకటన వేసి వుంటారు."
    "కానీ నిజంగానే నేను ఆ ఉద్యోగం చేయగలనా అని. వర్కర్ లతో స్ట్రయిక్ చేయించటం, లాభాలొచ్చే కంపెనీలను దివాళా తీయించటమూ, బ్లాక్ మనీ బయట పడకుండా మాయం చేసేయటం సామాన్యమైన విషయాలు కావివి."
    "అయినా సరే - నా కోసం నువ్వు పనులన్నీ చేయక తప్పదు."
    "పోనీ మీ డాడీకి తెలీకుండా మనిద్దరం ఎక్కడికయినా పారిపోతే?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra