Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 1


    
    ఆరిపో వెన్నాళ్ళ కారాజు మునిరాజు
        గడ్డాల రాలు "ముక్తాకణాలు"
    అలసిపోఁడెన్నేళ్ళకైన పాడుచు నాట
        లాడు దుందుడుకు "శాంతమ్మకొడుకు"
    ఆగిపోదు శతాబ్దులైనను పొంగు లె
        త్తిన మిన్నువాక "గాధేయురాక"
    అంతమ్ముగాదు యుగాంతాలకును గౌత
        మాశ్రమమ్మందు "సహల్వవిందు"
    
    చంటిబిడ్డ రాముఁడు మునిపంట నొక్క
    కందిపోయిన కౌసల్య కందిగింజ
    రంగుమారదు కోటివర్షాలకైన
    తాత్త్వికస్ఫూర్తి ! సత్యచైతన్య మూర్తి!
    
            (దేవేంద్రుడు స్వగతము)
    
    తిమ్మన పారిజాతము క్షితిస్థలికిం గొనిపోవుటాది దే
    హమ్ము వడంకు 'సత్యకవులన్న' - తదాఖ్యుఁడ నేఁడు కల్పవృ
    క్షమ్మును గొంచుబోయి బిగగట్టెను రామునితో, మహాప్రబం
    ధమ్మది యయ్యె, నింద్రు తలఁదన్నఁగ నేఁడొక సత్కవీంద్రుఁడా!
    
            (నారద నారాయణులు)
    
    "ఆ యహిరాజు పాన్పున సుధాంబుధిపై శయనించువారు నా
    రాయణ! యొడ్డునం దిసుకరాల పరుండితిరేమి?" "సత్యనా
    రాయణుఁడన్ తెలుంగుల మహాకవి కిన్నెరసాని పాటలన్
    కాయము పొంగి వేయిపడగల్ కదలన్ మన శేషుఁ డేగెరా!"
    
            (ఉమా శంకరులు)
    
    "స్వామీ! ఎక్కడనుండి?" "సత్యకవి మాస్వామీ యనన్ బోయి నా    
    నే!" "మౌళిన్ శశి యేడి?" "దూతమయి పోయెన్ వాని కేనాడొ!" "లే
        దే మీ చేత త్రిశూల?" "మా! మఱచిపోతిన్ వాని నట్టింట!" "లే
        దేమీ గంగ శిరస్సుపై?" "కలసిపోయెన్ వాని వాగ్దోరణిన్."

                                   సాహితీ మాధవము
    
    యన్మహోపన్యాస తన్మయత్వమ్ములో
        పొంగిపోయినది త్రైలింగభూమి
    యద్వక్త్రవీథి దీవ్యద్వియద్గంగయై
        పర్వులెత్తినది సౌపర్వవాణి
    యత్కృతుల్ కల్యాణ సత్కృతుల్ గొనువేళ
        నృత్యమ్మొనర్చె సాహిత్యలక్ష్మి
    యద్యశోలత సంసదుద్యానములఁ బూచె
        కొల్లకొల్లఁగ మంచి మల్లెపూలు
    
    అతఁడు నవరసగంగాధరాద్యనేక
    సార సారస్వతాలోక చక్రవర్తి
    "అభివానంద భరత" భావార్ధ్ర "మధుర
    మాధవుఁ" డతండు! "రస జగన్నాథుఁ"డతఁడు!
    
    ఆ వైదుష్య మపార; మా ప్రతిభ దివ్యం; బా మహోదాత్త భా
    షా వైచిత్రి యమోఘ; మా రసధునీ సాహిత్య సామ్రాజ్య ల
    క్ష్మీవాల్లభ్య మనన్యలభ్య; మన వాసిం గాంచి విన్నాణపుం
    బ్రోవుల్ మాధవరామశర్మ గురుదేవుల్ పొల్తు రాంధ్రావనిన్ !!
    
    మాధవ మాధవీ సుమ సమంచితముల్, విలసత్కళా జగ
    న్నాథము, లక్షరామృత సనాథము, లున్నమితోత్తమాంగ గం
    గాధర జాటజూట మణికాంతులు, కావ్యకళా స్రవంతులై
    యాధునికాంధ్ర వాఙ్మయ దృగంతములన్ సరసీకరించుతన్.
    
    పాతివ్రత్యము సల్పు వ్యంజన మహాభక్తిన్ తదాస్యమ్మునన్;
    చేతుల్ మోడ్చి సమాశ్రయించును రసశ్రీ తద్వచో వైఖరిన్;
    తాతారాయడు శాస్త్రిపాదులటె శాబ్ద ప్రక్రియా సాహితీ
    గీతాచార్యులు - మాధవీయమణి వెల్గించున్ దిగంతమ్ములన్!!
    
    కార్తిక పూర్ణిమా వికచ కైరవహాస విలాస మాధురీ
    స్ఫూర్తి మదుజ్జ్వలార్ధ పరిపుష్ట కనత్ కమనీయ కౌముదీ
    నర్తన కింకిణీ క్వణన నందిత మంద మరున్మనోహరా
    వర్తనముల్! భృశ మ్మభినవమ్ములు! మాధవ వాగ్విహారముల్ !!
    
                                           ఏటుకూరి
    
    పంకజభవ రమణీ మణి
    కంకణ ఝంకృతులు; విశ్వకల్యాణ కళా
    కింకిణి కుపశ్రుతులు; మా
    వేంకటనరసయ్య నవ కవిబ్రహ్మ కృతుల్!
    
    "నాయకురాలటే" తెలుగునాఁటికి నీ పలనాఁటి భారతా
    మ్నాయము; స్నిగ్ధముగ్ధ చరణమ్ములలో స్ఫురణమ్ము లెన్నియో!
    గాయకురాలటే తెలుగుగడ్డకు నీ కవితా త్రివేణి! గం
    గా యమునా సరస్వతుల కౌగిలిలో గిలిగింత లెన్నియో!
    
    తీయని శయ్యపై కొలువుదీర్చిన నీ కవితాకుమారి కం
    దోయికి దోయిలించెను గదోయి రసజ్ఞత! మంచి మంచి జా
    తీయము లేర్చి కూర్చి సరిదిద్దితి వాంధ్రిని; విప్పె నూతనా
    ధ్యాయము నీదు వృత్తము లుదాత్తములై నవభారతమ్మునన్ !
    
    ముంచెత్తెన్ సుమనోమనోంబుజవనమ్మున్ ప్రత్యుషస్సాహితీ
    సంచారమ్ములతో త్వదీయ కవితా సావిత్రి; నీ మానినీ
    మాంచాలా మధురాధరస్ఫురణలో మార్మ్రోగె సోత్కంఠమౌ
    పాంచాలీ కలకంఠకంఠము; కవిబ్రహ్మా! కృతార్ధుండవే!
    
    కండగల భాషలో కలకండ కల్పి
    తెలుగుబిడ్డల నోటి కందించినావు!
    నాఁటికిని నేఁటికిని మఱేనాఁటికైన
    సాటిలేనిది నీదారి! యేటుకూరి!
    
                                           
    
    [బుద్ధ భగవానులు శిష్య సమేతంగా వైశాలీ నగరానికి ఆనాడే విజయంచేశారు. రాజనర్తకి ఆమ్రపాలి ఆనందంతో జగద్గురువుకు స్వాగత మిచ్చింది! ఆ ఆనంద పారవశ్యంలో ఆమె అంతరంగంలో తరంగాలై తలయెత్తి రక్తీ భక్తీ జంట జంటగా ప్రవహించాయి.]
    
    ఇంత తీయగా చిగిర్చింది ఎందుకో ఈ ఉదయం
    ఇంత హాయిగా నిట్టూర్చింది ఎందుకో నా హృదయం
    ఎంతో సంతోషంతో ఎగిరి దూకుతున్నవి కురంగాలు
    అంతరంగం ముంచెత్తుతున్నవి అవేవో భావ తరంగాలు.
    
    శాక్య రాజ్యస్వామి జాయ మాయాదేవి
    లోకోత్తరమ్మయిన లుంబినీవనములో
    కడుపుచల్లగ కన్న కల్యాణములపంట
    కాలూనునంట! వైశాలినర్తకియింట !!
    
    చిఱునవ్వులో పారిజాతాలు పూచినా కరుణారస సింధువు
    చరణాలలో కోటి స్వర్గాలు దాచిన శరణాగత బంధువు
    అరుదెంచుచున్నాడు నేడు ఆపన్న విపన్నివర్తకుడు
    దయచేయుచున్నాడు నేడు ధర్మచక్రప్రవర్తకుడు.
    
    కఠిన కర్కశ షరాఘాతమ్ముచే కూలి
    వ్రాలు రాయంచ కుయ్యాలించి లాలించి
    రక్షించు అక్షీణ దాక్షిణ్యముల పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!
    
    నా ప్రభువు! నా కరుణమూర్తి! నన్ను మన్నించారు
    నా ప్రార్ధన ఆలకించారు నా పిలుపు అంగీకరించారు
    ఎందరెందరో కోటీశ్వరులు తమ మందిరాల కాహ్వానించారు
    అందరినీ కాదని ప్రభువు ఈ ఆమ్రపాలినే అనుగ్రహించారు.
    
    రాజ్యమ్ము ప్రణయ సామ్రాజ్యమ్ము విడనాడి
    తళుకు చెక్కిళ్ళ ముద్దుల నందనుని వీడి
    కదలిపోయిన విశ్వకారుణ్యముల పంట
    కాలూనునంట వైశాలి నర్తకి యింట !!
    
    మధుర మధురంగా పులకిస్తున్నది నా మామిడి తోట!
    మధువు లొలికిస్తున్న దీనాడు మల్లెపువ్వుల బాట!
    కొమ్మ కొమ్మనా గుమ్మటాలై క్రొత్త చిగుళ్ళు లేస్తున్నవి!
    కమ్మకమ్మగా కోకిలమ్మలు కంఠమెత్తి రాగాలు తీస్తున్నవి!
    
    కదలి మహాభి నిష్క్రమణంబు సాగించి
    పల్లెపడుచు సుజాత పాయసము భుజించి
    బుద్ధత్వమును గన్న బోధివృక్షము పంట
    కాలూనునంట! వైశాలి నర్తకి యింట !!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra