Home » Yerramsetti sai » Ammaye O Ammayee

 

    ఆమె ఆశ్చర్యపోయింది.
    "మైగాడ్! అంత అభిమానమా?"
    "మీ 'జీవిత అంచులలో - మంచుల హరివిల్లు ' అన్న నవల నూట పదకొండు సార్లు చదివాను ."
    ఆమె ఆలోచనలో పడింది. "ఆ పేరుతొ నా నవలేమీ లేదే?"
    "మీరు మర్చిపోయుంటారు మేడమ్! వేలు, వందలు నవలలు రాసే రచయిత్రి అలా నవలల పేర్లు , పాత్రల పేర్లూ మర్చిపోవటం చాలా సహజం! నధింగ్ అన్ యూజ్ వల్! మీకు ఇటీవల జరిగిన ఓ సంఘటన తెలుసా? ఓ రచయిత్రి ఇలాగే సగం నవల రాశాక హీరియిన్ పేరు మర్చిపోయి పార్వతి రాయడానికి బదులు గీర్వతి అనో, చార్వతి అనో గార్వతనో - ఏదో అలాంటి అర్ధం వచ్చేట్లుగా ఇంకో పేరు రాసేసింది. వంద పేజీలు  రాశాక ఆ విషయం గుర్తుకొచ్చి పేరు మార్చడానికి టైం లేక గీర్వతి పార్వతి చెల్లెలనీ అచ్చం అవే పోలికలతో ఉంటుందని - అంచేత తను గానీ , ఆ నవల హీరోయిన్ గానీ మిగతా పాత్రలు గానీ , పాఠకులు గానీ కనుక్కోలేక పోయారని ఓ నోట్ ఇచ్చింది. అంతే అల్ ఒకే! పాఠకుల హర్షధ్వానాలు -'
    "అవును! నాకూ జరిగిందలా ఓసారి...."
    "నెవర్ మైండ్ మేడమ్! మనకు ఉత్పత్తి ముఖ్యం. దట్ షుడ్ బి ది స్పిరిట్ ! పేరులో ఏమున్నది పెన్నిదని మా ఫ్రెండ్ గ్రేట్ రైటర్ శ్రీకర కమలాకర కోటేశ్వర్రావ్ అంటుండేవాడు.."
    "ఇంతకూ మీరు....." అడిగిందామె.
    "నా పేరు భవానీ శంకర్ మేడమ్! ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ - జర్నలిస్ట్ - భవానీ శంకర్ - చీఫ్ ఎడిటర్ - తెలుగు కిరణం -"
    అమెక్కోపం ముంచు కొచ్చింది మళ్ళీ -"
    'అంటే - అందులో నా సీరియల్ ఆపేయమని నాకు ఉత్తరం రాసింది మీరేనా!"
    "నో నో నో  -  మీ సీరియల్ దొరికితే చాలు కళ్ళ కద్దుకుని ప్రచురించే ఎడిటర్లలో నేను మొదటివాడిని మేడమ్! అంచేత అలాంటి అనుమానాలు పెట్టుకోకండి! అసలు ఆ సీరియల్ తరువాతి భాగంలో ఏం జరుగుతుందా అని సస్పెన్స్ తో చచ్చిపోతున్న లక్షలాది పాఠకుల్లో నేనూ ఉన్నాను .....అన్నట్లు చివరికేం జరుగుతుందో కొంచెం చెప్తారా మేడమ్! రాజేష్ - అవంతి ఒకటవుతారా? వారి మధ్య అర్దాలూ, అపార్ధాలూ , మంచులా విదిపోతాయా? అయితే శీరీష సంగతేమిటి? ఆమె హూరైజన్ లోకో, స్విట్జర్లాండ్ కో వెళ్ళిపోతుందా? ఆమె పెంచుకున్న 'జిమ్మీ' అనే మూడేళ్ళ కుక్కనేం చేస్తుంది?"
    "రాజేష్- అవంతీ ఎవరు? నా నవలలో పెర్లవి కావే-"
    "డోంట్ బాదర్ ఎబౌట్ నేమ్స్ మేడమ్! పేర్లలో ఏమున్నది పెన్నిధి అని  మా ఫ్రెండ్ - ది గ్రేట్ రైటర్ శ్రీకర కమలాకర....."
    "అయితే నా సీరియల్ కొన్ని అనివార్యకారణాల వల్ల - తెలుగు కిరణం లో ప్రచురించడం ఆపబడిందని - అంచేత మిగతా భాగం వెనకకు తిప్పి పంపడం జరుగుతోందని రాసింది ఎవరు?"
    "బహుశ యువ యజమాని చిరంజీవి గారు రాసి ఉంటారు మేడమ్! సందేహం లేదు. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ ఆయనే చేస్తుంటారు- నాలాంటి వాళ్ళను ఆ చుట్టూ పక్కల క్కూడా రానీరు."
    "అయితే ఆయనతోనే మాట్లాడతాను -" అక్కడి నుంచి లేవబోయిందామె.
    "తొందరపడకండి మేడమ్! అయన సంగతి తెలుస్తే మీరా మాట అనరు! అయన పెద్ద నవలా ద్వేషి! ఆరేళ్ళ క్రితం తెలుగుకిరణంలో ప్రచురించబడ్డ వార్త మీరు చదివి వుండరు బహుశా!"
    "ఏమిటది?" అనుమానంగా అడిగిందామె.
    "యువ యజమాని చిరంజీవి హేమావిజయలలిత అనే రచయిత్రిని హత్య చేయడానికి ప్రయత్నించిన విషయం -"
    చాముండేశ్వరిదేవి ఖంగారు పడింది . లేచి నిలబడిందల్లా - నెమ్మదిగా - కుర్చీలో కూర్చుంది మళ్ళీ -
    "హత్య చేయబోయారా?" నమ్మలేనట్లు అడిగింది.
    "నాలుగడుగుల ఇనుప చువ్వతో ...."
    "కా....కా....నీ , ఎందుకలా చంపటం?" తడారిపోతున్న గొంతుతో అంది.
    "ఈ నవలాద్వేషుల మనస్తత్వం మీద మనకు ఇంతవరకూ పుస్తకాలేమీ రాలేదు మేడమ్! వస్తే మనకి తప్పక మానసిక కారణం తెలిసి వుండేది! అయినా నా స్టడీ ప్రకారం -- అలాంటి వాళ్ళు -- రచయితలనూ, రచయిత్రులనూ చూసినప్పుడల్లా - తమకు తెలీకుండా - కోపంతో ప్రకోపించి - తామేం చేస్తున్నది- తమకే తెలీని స్థితి కొచ్చేస్తారు. అలాంటి సమయంలో ఏ వస్తువుంటే దానిని ఉపయోగించి -"
    చాముండేశ్వరిదేవికి చెమటలు పట్టేసినయ్.
    "కా....కా....భ....నా...కేం... భ....భ....లే.....లే...దు" అంది తడబడుతూ.
    "మీరు ఇంకా -యువ యజమాని చిరంజీవిగారిని చూడాలను కుంటే నాకేం అభ్యంతరం లేదు మేడమ్! అయన గదిలో ఇనుపచువ్వ ల్లాంటి వస్తువులు అతని కందుబాటులో లేకుండా చూచే పూచీ నాది!-"
    ఆమె ఓ క్షణం తర్వాత మాములు స్థితి కొచ్చింది.
    "అల్ రైట్! ఆయనకు కలుసుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. నా డబ్బు నా కిచ్చేయండి...."
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
    "ఏమిటన్నారు?"
    "నేను మీకిచ్చిన నా డబ్బు నాకిచ్చేయండి...."
    "మీరు నాకు డబ్బివ్వటమేమిటి?" అయోమయంగా అడిగాడు.
    "అదే - నా నవల ప్రచురించినందుకు గాను - నేను శివతాండవం గారికి ఇచ్చిన అయిదు వేలు-"
    భవానీశంకర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    "మీ నవల సీరియల్ గా మా పేపర్లో ప్రచురించడానికి మీరు మాకు - అంటే మేజర్ శివతాండవంకి అయిదు వేలిచ్చారా?"
    "అవునూ! ఏం? ఇవ్వకూడదా?"
    భవానీశంకర్ కి పరిస్థితి అర్ధం కావటానికి రెండు నిమిషాలు పట్టింది.
    "కానీ పత్రిక వాళ్ళే డబ్బిచ్చి నవలలు కొనుక్కుంటారని అదివరకు నేను తెలుగు వాచకంలో చదివాను మేడమ్-"
    "అది పూర్వపు సంగతి! ఇప్పుడు శివతాండవం లాంటి ఎడిటర్లు తెలుగు కిరణం లాంటి పత్రికలూ బోలేడున్నాయ్! మాక్కావలసిన పత్రికను మేమూ కొనుక్కుని మా సీరియల్స్ రాయవచ్చు -"
    "ఆఫ్ కోర్స్ - ఆఫ్ కోర్స్ - " అన్నాడు భవానీ శంకర్.
    "మరి నా డబ్బు నాకిస్తే -"
    "ఓకే మేడమ్! మేము వెంటనే ఈ విషయం శివతాండవం గారితో మాట్లాడి - మీ డబ్బు మీకు పంపే ఏర్పాట్లు చేస్తాం! ఆ బాధ్యంతా నా భుజస్కందాల మీద వదిలేయండి! బైదిబై - మీ తరువాత నవలలో కధేంటి మేడమ్?"
    చంటి చాముండేశ్వరి ఉత్సాహంగా, ఆనందంగా అతని వేపు చూసింది.
    "చెప్పమంటారా? ఏం జరుగుతుందంటే చందన పెళ్ళి దృశ్యంతో నవల ప్రారంభమవుతుందన్న మాట! పెళ్ళి కొడుకు శమంత్ తాళి కట్టబోతుండగా "ఆగండి!" అన్న కేక వినబడుతుంది -"
    "అబ్బే- ఇక్కడ కాదు మేడమ్- నేను మీ ఇంటి కొచ్చి కధంతా తీరిగ్గా వింటాను - ఎప్పుడు రమ్మంటారు?"
    "ఎప్పటి దాకా ఎందుకు? ఇవాళ అఫీసవగానే రండి! అప్పుడయితే మావారు కూడా ఇంటిదగ్గరే ఉంటారు - మధ్యమధ్యలో మనకి కాఫీలు, టిఫిన్లూ మంచినీళ్ళూ లాంటివి అందించేపని అయన చూచుకుంటారు-"
    "తప్పకుండా వస్తాను మేడమ్-"
    ఆమె వెళ్ళిపోయింది ఆనందంగా.
    భవానీశంకర్ కుర్చీలో వెనక్కు వాలి "ఓరి శివతాండవం' అని గుండెలు బాదుకున్నాడు.


                                     *****

    టైం సాయంత్రం అయిదవుతోంది.
    "ఏమిటి? ఇంటికి రారా ఇక?" భవానీశంకర్ గదిలోకి చిరంజీవితో సహా ప్రవేశిస్తూ అడిగింది స్వప్న.
    "ఈ రాత్రికి ఈ గదిలోనే కాపురం చేయక తప్పెట్లు లేదు చెల్లమ్మా! మీరు వెళ్ళండి! పేపర్లో రెగ్యులర్ గా వచ్చే శీర్షికలు ఆపేయడం వల్ల - బోలెడు ఖాళీ ఉండి పోయింది ! దానిని ఎలాగోలా పూరించాలి!"
    "మరి రాత్రికి భోజనం!" అడిగాడు చిరంజీవి.
    "డోంట్ వర్రీ! మానేజ్ చేసుకుంటాను ఈ పూటకి ! ఈ పక్కనే ఉన్న కాంటీన్ వాడొకడు మహత్తరమైన ప్లేటు భోజనం - గోంగూర పచ్చడితో సహా కారు చవగ్గా అందజేస్తున్నాడని పుకర్లున్నాయ్! రామభక్త హనుమాన్ దానిని పూర్తీ గౌరవంతో సప్లయ్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాడు."
    "సరే అయితే , మేం వెళ్తున్నాం."
    "ఓ.కే. బ్రదర్, అద్భుతమైన భవానీశంకర్ మార్కు జర్నలిజంతో 'తెలుగుకిరణం' మిమ్మల్ని రేపు ఉదయం నిద్రలేపు గాక!"
    స్వప్న చిరునవ్వుతో చేతిలో ఉన్న పొడగాటి కాటన్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని చిరంజీవితో పాటు బయటికి నడిచింది.
    ఇద్దరూ గేటు దగ్గర రాగానే రామభక్త హనుమాన్ సెల్యూట్ కొట్టి గేటు తెరిచాడు. నాలుగడుగు వేశారో లేదో సైకిల్ మీద ఓ వ్యక్తీ వచ్చి 'చిరంజీవి సాబ్ హై క్యా" అని హనుమాన్ ని అడగటం కనిపించింది.
    చిరంజీవి చటుక్కున వెనక్కు తిరిగాడు.
    "నేనే చిరంజీవిని! ఏం కావాలి ?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra