Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    అతను తనకున్న బలమంతా వినియోగించి పిలిచినా ఆమెకు వినిపించి వుండదు. యీ పిలుపు ఆమెకు ఏం చేరుతుంది? ఆమె వెళ్ళిపోయింది.

    ప్రకాశరావు మౌనంగా ఇసుకలో పడుకొన్నాడు. క్రమక్రమంగా చీకటి పడసాగింది. అతను బాహ్య ప్రపంచాన్ని పరిశీలించటం లేదు. మత్తుగా కునికిపాట్లు పడుతూ అప్పుడప్పుడూ తనలోతాను ఏదో గొణుగుకోసాగాడు.

    క్రమక్రమంగా బీచి అంతా నిర్మానుష్యంమైంది. ప్రకాశరావు వెల్లకిలా పడుకొని ఆ నక్షత్రాలని చూస్తున్నాడు. అతనికిప్పుడు ఎంతో హాయిగా వున్నట్లుంది. ఇక్కడ యెంత బాగుంది? ఇక్కడ ఏ బాధలూ లేవు. ఏ చింతా లేదు. తను ఇలా యెందుకు పడుకున్నాడని కూడా ఎవరూ అడగరు. ఎంత బాగుంది?

    అలా యెంతసేపు? హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగినట్లు అయి అతని ఆలోచనలకు భంగం కలిగించింది. ఏమిటి? ఏం జరిగింది? ఇక్కడ ఇలా ఒంటరిగా యెందుకు పడుకున్నాను.

    చప్పున లేచి నిలబడి చుట్టూరా చూశాడు. భయం వేసింది. దగ్గరలో ఎవరూ లేరుకూడా గావును. తేరుకుని ఒకసారి దులుపుకొని నడవసాగాడు.

    ఆలోచించి సతమతమైపోయిన అతని బుర్ర అలసిపోయి ఆలోచించటం కూడా మానివేసింది. రోడ్డుమీదపడి ఒక ప్రక్కగా తాగినవాడిలా తూలుకుంటూ నడవసాగాడు. అప్పుడప్పుడూ మాత్రం హఠాత్తుగా ఆగిపోయి "ప్రకాశరావు అనేవాడు యిప్పుడు......ఈ రాత్రి సమయంలో ఇలా రోడ్డు వెంబడిపడి నడిచేమాట నిజమేనా?" భలే" అనుకోసాగాడు.

    ప్రకాశరావు ఇంటికి చేరేసరికి గంటసేపు పట్టింది. చడీచప్పుడూ లేకుండా  అంతా నిశ్శబ్దంగా వుంది.కిటికీలోంచి లోపలకు చూశాడు. ఎవరూ కనబడలేదు. నెమ్మదిగా తలుపులు తోశాడు. తీసేవున్నాయి, విడివడ్డాయి. చప్పుడు చేయకుండా లోపలకు నడిచి, తాళంతీసి యెలాగో గదిలో పడ్డాడు. ఎక్కువ ఆలస్యం చేయకుండానే చాప పరుచుకొని పడుకున్నాడు. భగవంతుడు శీఘ్రంగానే  అనుగ్రహించాడు. అతనికి వెంటనే నిద్రపట్టింది.

    మరునాడు అతనికి మెలుకువ వచ్చేసరికి యింకా చీకటితెరలు చెరిగి పోలేదు. కల్లలేని నిద్ర గాఢంగా పట్టటంచేత అతనికి యింతకు ముందు దాకా మెలుకువ వున్నట్లే అనిపించింది. బద్దకంగా లేచి ఒకసారి ఆవులించి గోడనున్న స్విచ్ నొక్కుతూ, తూలి త్రుళ్ళిపడ్డాడు.

    అతని హృదయంలో కూడా లైటు వెలిగింది.

    ఏం చేశాడు? ఏం చేశాడు.

    నిన్న జరిగిందంతా ఇప్పుడు వరుసగా గుర్తుకువస్తోంది. అతను అద్భుతమైన ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అలా ప్రవర్తించాడేం నిన్న? తను మనిషేనా?

    గోడకు అనుకొని చర్వితచర్వణం చేసుకొంటూంటే ప్రకాశరావుకి పిచ్చివాడినేమోనన్న భ్రమ కలిగింది. నిన్నటి తన ప్రవర్తనను యివాళ ప్రేక్షకుడిగా నిలబడి చూడగలుగుతున్నాడు. ఉన్మాదుని ప్రవర్తనకూ, తన ప్రవర్తనకూ ఏ మాత్రం తేడాలేదు. తిరిగి తలయెత్తి చూడలేని విధంగా తను సంచరించాడు. అదంతా  హాస్యాస్పదంగా, అసహ్యంగా గోచరించింది. ఎంత తెలివితక్కువ వాడైనా అట్లా చేస్తాడా? తను మనిషానేనా అన్న అనుమానం వోచ్చిందతనికి.

    ఏం జరిగిందో, ఇహముందు ఏం జరగబోతోందో అర్థం  కావటం లేదు. ఆ విషయం అలావుంచి యీ అతితెలివి మనిషికి యిప్పుడు ఇంకో సమస్య కూడా దాపురించింది. కొంచెం సేపట్లో చీకటి విడిపోతుంది. వెలుతురూ, దాంతోపాటు శకుంతల కనిపిస్తారు. తను శకుంతల ముఖం ఎట్లా చూస్తాడు? చూసినప్పుడు తమ భంగిమ యెట్లా వుంటుంది? తనను చూసి ఆమె యే విధంగా ప్రవర్తిస్తుంది?

    ఇలా పోయినకొద్దీ అతనికి ఈ స్థితిలో శకుంతల ముఖం చూడటం అసాధ్యమైన పనిగా కనిపించసాగింది. అలా కనిపించడం సహజమేనని కూడా అతను భావించాడు. ఆమెకు కనబడకుండా తప్పించుకు పారిపోవాలి.

    దృఢ నిశ్చయంతో లేచి నిలబడ్డాడు. హాల్లోకి వచ్చాడు. అక్కడి లైటు వేయడానికి కూడా సాహసించలేకపోయాడు. చీకట్లో అలాగే తడుముకుంటూ పెరట్లోకి వెళ్ళి గబగబా మూడునిముషాల్లో ముఖం కడుక్కువచ్చాడు. తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండానే ఆ రోజు కాలేజీకి కావలసిన పుస్తకాలు తీసుకొని, చీకటి కొంచెంగా అస్తమిస్తున్న సమయానికి వీధిలోనికి వచ్చిబడ్డాడు.

    ఒక ఫర్లాంగు దూరం నడిచి మెయిన్ రోడ్డుమీదకు వచ్చేసరికి ఆకలి వేస్తున్నట్లు తోచింది? రాత్రి కూడా భోజనం చేయలేదు. జేబులో డబ్బులుండటంచేత అక్కడున్న ఒక హొటలులో దూరాడు.

    క్షుద్భాధ తీర్చుకుని వెలుపలికి వచ్చాడు. పది గంటలదాకా ఇలాగే గడపాలి. అతనికి యిట్లా పనిలేకుండా తిరగటం ఇదివరకు అలవాటు లేదు హటాత్తుగా గాడికి పోదామని  తోచినప్పుడల్లా వెనువెంటనే శకుంతలకూడా జ్ఞప్తికి వచ్చి ఉలుక్కి పడసాగాడు.

    వీధుల్లో తిరిగినా, కాలేజీలో కూర్చున్నా అతను అలాగే ఖేదపడసాగాడు. మనసు ఎక్కడెక్కడో విహరిస్తోంది. అతి కష్టంమీద సాయంత్రం వరకూ నెట్టుకు వచ్చాడు. సాయంత్రం బస్సులో ఎక్కడానికి కూడా యిష్టపడక ఆరుమైళ్ళూ నడుద్దామని సిద్ధపడి మెల్లిగా అడుగులువేస్తూ పోతూంటే దార్లో ఓ విచిత్రం అతని బాబాయి కనిపించాడు.

    బాబాయిని చూసి ప్రకాశరావు ఆయన్ని పలకరించటానికి యిష్టంలేక తల త్రిప్పుకొని తప్పించుకొబోయాడు. కాని ఆయన ఏ మాత్రం తప్పుకుపోవటానికి ఇష్టపడక సరాసరి వచ్చి నిలవేశాడు.

    "ఏమిటి బాబాయి?" ప్రకాశరావు అనక తప్పిందికాదు.

    ఆయన చిన్నకళ్ళు చికిలించిచూస్తూ "అవునుగాని, నువ్వీవూరు వచ్చింది చదువుకొని బాగుపడటానికేనా?" అన్నాడు.

    ఈ ధోరణి చూచి ప్రకాశరావు తెల్లబోతుండేసరికి మళ్ళీ ఆయనే "లేకపోతే చెడు తిరుగుళ్ళు తిరగటానికిరా?" అని పొడిగించాడు.

    "బాబాయ్ నేనేమి చెడు తిరుగుళ్ళు తిరిగాను?" అని దీనంగా అన్నాడు.

    "నేను చూడలేదనుకోబోకు. చెడుతిరుగుళ్ళు అంటే అర్థం ఏమిటి? పేకాటలు ఆడితేనేనా? తాగి తందనాలాడితేనా? ఇవన్నీ లేవు కాబట్టి మహా బుద్ధిమంతుడిని అనుకొంటున్నావా?"

    "ఏమిటి బాబాయి!"

    "ఏ మాశ్చర్యం?" ఆయన పరిహాసంగా అని "నేనంతా కనిపెడుతూనే వున్నాను. నిన్న సాయంత్రం నువ్వు చేసిన పని ఏమిటి?" అని పొడిగించాడు.

    "ఏం చేశాను?" అని వెంటనే అనబోయి ప్రకాశరావు త్రుళ్ళిపడ్డాడు. ఏం చేశాను? తల వంచుకున్నాడు.

    "నేను ముందే చెబుతున్నాను. నాగరికత పేరుతో నువ్వు చేసిన వనిని సమర్ధించుకోవాలని ప్రయత్నించబోకు. నాగరికతకూ, నీకూ వున్న సంబంధం నాకు తెలుసు" అని కొంచెం సేద తీర్చుకొని "ఇదిగో అబ్బాయి ఇలాగ పట్నంలో చదువుల కోసం వచ్చి చెడిపోయిన వాళ్ళని సవాలక్షమందిని చూశాను. మా శ్రేయస్సును మీరెవరూ కోరకపోయినా మీ అందరి శ్రేయస్సుకోరే మనిషిని. నన్ను మీరు అర్థం చేసుకోవటంలో వుంది. పెద్దవాడవయి నువ్విలా చెడిపోతూంటే చూసి సహించలేను. డబ్బుకావాలంటే నా దగ్గరకు వస్తూవుండు. కాని ఇంకా ఇలాగే చేశావా మీ ఇంట్లో ఈ విషయాలన్నీ తెలియపర్చటమనేది తథ్యం" అని ఆయన ప్రకాశరావు జవాబుకోసం అయినా చూడకుండా విసవిసా నడిచి వెళ్ళిపోయాడు.

    ప్రకాశరావు స్తబ్దుడైపోయి ఒకక్షణంసేపు అలానే నిలబడిపోయాడు. "మా శ్రేయస్సు నువ్వు ఈ విషయంలో కోరుతున్నావా?" అని అతను ప్రశ్నిద్దామనుకొన్నాడు. కాని ఏదీ చెప్పకముందే తారాజువ్వలా ఆయన వెళ్ళిపోయాడాయె.

    ఒకసారి తలపంకించి ప్రకాశరావు తిరిగి నడవసాగాడు. మనసులో సంక్షోభం మరీ ఎక్కువైపోయి "కాస్త విశ్రాంతి లభిస్తే బాగుండును" అని అతనానుకోవటం ప్రారంభించాక గదికిపోయి తీరాలనిపించింది. ఉన్నట్లుండి అతనికి ఇంత ఉత్సాహం రేకెత్తించటంలో శకుంతలతో జరగబోయే సంవాదమో, ఇంకొకటో అతన్ని అభ్యంతర పర్చలేకపోయింది. గబగబా నడవసాగాడు.

    ఇంకో అరగంట గడిచేసరికి అతను ఇంట్లోవున్నాడు. గది తాళం లోపలకుపోయి, ఇంకా ఏం చేసేదీ సరిగ్గా నిశ్చయించుకోకముందే అతని వెనుక నుంచి "పంతులుగారూ" అని వినిపించింది. నిశ్చేష్టుడై వేగంగా కొట్టుకొంటున్న గుండెతో నెమ్మదిగా యంత్ర బద్ధంగా వెనక్కి తిరిగాడు.

    శోకమూర్తిలా, మూర్తీభావించిన విరాగినిలా వున్న శకుంతల అతనికి ఎదురుగా నిలబడి వుంది అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆమె చేతిలో కాఫీ కప్పు వుంది.

    "తీసుకోండి!"

    బొమ్మలా చేతులు ముందుకుజాపి అందుకున్నాడు.

    "త్రాగండి!"

    ఆమెవంక చూడలేక తలవంచుకొని మెల్లమెల్లగా త్రాగసాగాడు. ఆమె ఎదురుగుండా ఆ స్థితిలో వుంటే అతనిలో వరుసగా అలుముకుంటూన్న ఒక్కొక్క ఆలోచన క్షణంసేపు కన్నా ఎక్కువసేపు వుండకుండా హరించిపోసాగింది.

    అతను త్రాగటం పూర్తి అయాక చేత్తో కాఫీకప్పు అందుకొంటూ "మీరు ఏమిటి చేస్తున్నారో ఆలోచించే చేస్తున్నారా?" అని ముఖాముఖిగా అడిగింది.

    అతను ఎలాగో ధైర్యం చేసి ఓసారి ఆమె ముఖంలోకి చూసి మళ్ళీ తలదించుకున్నాడు.

    "నిన్న సాయంత్రం నేను ఇంటికి వంటరిగా వచ్చాను. అప్పట్నుంచీ మీరు కనపడకుండా తిరుగుతున్నారు. అయితే ఒక్కసారి కూడా మా నాన్నగారి ముందునా స్థితి ఎలా వుంటుందో ఒక్కసారయినా యోచించారా? ఆయనతో నేను ఏమి చెప్పుకోవలసి వస్తుందో ఒక్కసారైనా ఆలోచించి చూచారా?"

    ప్రకాశరావు ఈసారి ఉద్వేగం ఆపుకోలేక, భరించరాని బాధతో ఆమెకేసి చూస్తూ "క్షమించండి....క్షిమించండి" అన్నాడు.

    తర్వాత మెత్తబడిపోయి గాద్గదికంగా "నిజమే. మీరు నన్ను నిజముగా క్షమించాలి. తెలివితక్కువవాడిని. నిన్నటినుంచీ ఎన్నో తప్పులు చేశాను. మీకు ఎంతో బాధ కలిగించాను. మీ మనసుని కల్లోల పరిచాను" అన్నాడు.

    శకుంతల ఆశ్చర్యంగా అతనివంక చూస్తోంది.

    "చూడండి, నేను చాలా బలహీనుడ్ని ఎక్కువసంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఓపలేను, ఆ స్థితిలో నిజంగా పిచ్చివాడిలా ప్రవర్తిస్తాను. మా ఇంటి పరిస్థితులు అవీ నిన్న ఆలోచించుకోవటం, మన సంభాషణ నన్ను మరీ విషాదపు లోతుల్లోకి తీసుకుపోయాయి. దాంతో మరీ అసందర్భంగా ప్రవర్తించాను. ఇవాళ ఉదయంనుంచీ నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతూ మీకు మొహం చూపించటం ఇలానా అని తప్పించుకు తిరుగుతున్నాను. అంతే"

    విషాదపు ఛాయలతో ఎండిపోయిన అతని ముఖంలోకి నిశితంగా చూస్తూ శకుంతల "మీరు ఎంతసేపూ మీ బాధే తప్ప అవతలివాళ్ళ బాధలు పట్టించుకోరు. అందుచేతనే యివాళ యిలా చేశారు. ఈ విషయం ఒప్పుకోండి" అంది.

    కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాక ప్రకాశరావు మ్లానవదనంతో "నా సందేహం తీర్చండి. నిజంగా నిన్న నేను  మరీ హేయంగా ప్రవర్తించానా?"

    ఆమె జావాబు చెప్పలేక మౌనమే ధరించేసరికి "మీ మౌనమే జవాబు చెబుతోంది. నిజమే! అందుకనే బాబాయి అలా అన్నాడు" అని అతనే అన్నాడు.

    శకుంతల ఆశ్చర్యంతో "మీ బాబాయా, ఏమిటన్నారు?" అంది.

    ప్రకాశరావు ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా "ఏమీ లేదు, ఏమీ లేదు" అని ముక్తసరిగా తప్పించుకొని "మీరు యింకేమీ అనుకోకపోతే ఈ వేళంతా నేను ఒంటరిగా గడపాలనుకొన్నాను. కారణం మరేమీలేదు, పరిపూర్ణ విశ్రాంతి కోసం, దయవుంచి మీరు......" అని అర్థోక్తిలో ఆగిపోయాడు.

    శకుంతల తలవంచుకొని అక్కడినుంచి నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra