Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-1


    ప్రియాంక మోము అవమానంతో కందిపోయింది.

    "డానివలన నీకొరిగిన ప్రయోజనం..." సర్ క్కాస్టిగ్గా అంది.

    దానిమూలంగా గజం మూడొందలు ఖరీదు చేసే స్థలాన్ని గజం ఆరొందలకు కొన్నాడు నీ బాబు.

    ఇరవై గజాలకి 12 వేలు చెల్లించాడు. నేను పెంచిన ధర ఆరువేలను మాస్టారు నాకు పెట్టుబడిగా అప్పిచ్చారు..."

    ప్రియాంక ఓ క్షణం ఉలిక్కిపడింది. అయినా ఆ ఉలికిపాటు బయటపడకుండా బింకాన్ని ప్రదర్శిస్తూ "ఆరువేలు... ముష్టి ఆరువేలతో నువ్వేం చేయగలవు? ఏం సాధించగలవు? ఇలాంటి రెస్టారెంట్లో బేరర్ గా పనిచేయడానికి ఆ ఆరువేలతో భాషా, కల్చర్ నేర్చుకో..." ఈసడింపుగా అంటూ అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా విసవిసా వెళ్ళిపోయింది.

    ఆమె ఉక్రోషానికి నవ్వుకుంటూ తనూ క్రిందకు దిగాడు.

    ఇది కదా లైఫంటే... పొగరు, ఒగరు వున్న ఆడదానిమీద గెలవడమే థ్రిల్లింగ్ గా, తమాషాగా వుంటుంది. అతనికి తెలుసు- ప్రియాంక తనను అవమానించినట్లుగా ఫీలయి ముందుకెళ్ళినా తను కొట్టిన ఆరువేల దెబ్బ ఆమెను ఆలోచింపచేస్తుందని.

    అప్పుడనిపించిందతనికి- ఈ పిల్లే నీ అన్నకూతురు అని అమ్మకి చెబితే ఎలా రియాక్ట్ అవుతుందని! అంతలోనే అనుకున్నాడు, ఆ చెప్పడం ఇప్పుడప్పుడే కాకూడదని.

    ప్రియాంకకు త్రినాధ్ ని నలుగురుముందు అవమానించానన్న కొద్దిపాటి ఆనందం కలిగినా, ఆ వెనుకే అతను తనను ఫూల్ ని చేసి తన తండ్రివద్ద నుంచి గుంజిన సొమ్ముతోనే వ్యాపారం ప్రారంభించబోతున్నాడన్న పచ్చి నిజం మ్రింగుడు పడడంలేదు.

    రేష్ గా కారుడోర్ తీసింది. ఆ మరుక్షణం కారు అమితవేగాన్నందుకుంది. సరీగ్గా ప్రియాంక కారు బయలుదేరడం, బోస్ జీప్ దాన్ని అనుసరించడం త్రినాధ్ దృష్టిలో పడింది.

    తాను వచ్చినప్పుడు బోస్ అక్కడే వున్నాడు. మధ్యలో రామచంద్ర, గుప్తాల్ని కారు ఎక్కించడానికి వచ్చినప్పుడు అక్కడే నిలబడి బార్ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ప్రియాంక కారును ఫాలో కావడంతో అనుమానం కలిగింది. 

    అంతే... మరొక్క క్షణం ఆలస్యం చేయలేదు. రెండు కిలోమీటర్లు రాకెట్ లా దూసుకెళ్ళిన ప్రియాంక మెర్సిడస్ హఠాత్తుగా ఓచోట సడన్ బ్రేక్ తో ఆగిపోక తప్పలేదు.

    ఎదురుగా రోడ్డు కడ్డంగా ఓ జీప్ ఆపి వుంది. ప్రియాంక చిరాగ్గా హారన్ మ్రోగించింది. అయినా ఫలితం కన్పించలేదు. మరోసారి హారన్ మ్రోగించేలోపు వెనగ్గా వచ్చి ఆగింది బోస డ్రైవ్ చేస్తున్న జీప్.

    ప్రియాంక కారుకి వెనకా ముందున్న జీప్స్ లోంచి ఐదారుగురు యువకులు దిగి ఒక్కొక్కరు కారు వేపు రావడం ప్రారంభించారు.

    జరగబోతున్నదేమిటో అప్పటికే ఊహించగలిగితే ప్రియాంక బిత్తరపోయి చూస్తుంటే, మిగతా అమ్మాయిలు భయంతో బిగుసుకుపోయారు. ఒక అర్భకురాలు మరింత వణికిపోయి కెవ్వున కేకవేసి పడిపోయింది.

    వెనుక జీప్ లోంచి దిగిన బోస్ కసిగా పళ్ళు నూరుతూ వచ్చి కార్ డోర్ మీద చేయివేసి విసురుగా లాగాడు. కారు దిగాలా వద్దా అనే సంధిగ్ధంలో వున్న ప్రియాంక డోర్ లాక్ ఓపెన్ చేసుకుని వుంది సరీగ్గా ఆ సమయానికే.

    ఒక్క ఉదుటున డోర్ తెరుచుకుంది.

    అప్పుడు చూసింది ప్రియాంక బోస్ ని. ఆ అర్దరాత్రి అలా నడిరోడ్డుమీద కాపు కాస్తున్న బృందానికి బోస్ లీడర్ అని అప్పటిక్కాని ఆమెకు అర్ధం కాలేదు.

    ఓ క్షణం భయంతో ఆమె వెన్ను జలదరించినా అంతలోనే తమాయించుకొని పొగరుగా, అసహ్యంగా చూసింది బోస్ ని.

    నరాలు చిట్లిపోయే కోపంతో ఊగిపోతున్న బోస్ ప్రియాంక జబ్బ పట్టుకొని విసురుగా కారులోంచి బయటకు లాగాడు.

    మనిషి తూలిపోతున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. ఎదుటి మనిషిని బూడిదచేసేలా అవమానంతో మండిపోతున్నాడు.

    "ఏమిటిలా రోడ్డుమీద...?" ప్రియాంక తెగింపుగా అంది.

    "పట్టపగలు కాలేజీ గ్రౌండ్ లో నన్ను అవమానించినప్పుడు..." బోస్ మాటలు కర్కశంగా వున్నాయి.

    అప్పటికే బోస్ వెనుక వచ్చిన గ్యాంగ్ బలవంతంగా ప్రియాంక ఫ్రెండ్స్ ని కారునుంచి బయటకు లాగారు.

    వారికి భయంతో ప్రాణాలు ఉగ్గబట్టుకుపోయాయి.

    ప్రియాంక మాత్రం మొండి ధైర్యంతో వుంది.

    అర్ధరాత్రి కావడానికి మరో పదినిముషాలే వుంది. ఆ వీధంతా నిర్మానుష్యంగా వుంది. కారు స్పీడుగా నడపొచ్చనే ప్రియాంక తుంటరి ఆలోచనే ఈ దుస్థితికి దారితీసిందని మిగతా యువతులు వాపోతున్నారు. ఆ వీధి మొత్తంమీద రెండు మూడు వీధి దీపాలే వున్నాయి. అవి ఆ నిశ్శబ్దపు చీకటిని తరమడంలో విశ్వప్రయత్నం చేస్తున్నట్లున్నాయి.

    "నా జోలికి వచ్చినా, నన్నేదన్నా చేయాలని ప్రయత్నించినా మా డాడీ నిన్ను బ్రతకనివ్వరు. మర్యాదగా అడ్డు తప్పుకో" ప్రియాంక పొగరుగా అంది.

    "నువ్వు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనే తీరతాను. నన్ను మోసం చేసింది చాలక అంతమందిలో నా పరువు తీసేస్తావా రాక్షసి? నిన్ను ఊరికే వదలిపెట్టను" బోస్ కొద్దికొద్దిగా ప్రియాంక చేరువకు వస్తున్నాడు.

    "నీకు పరువు ఒకటా? ఆఫ్ట్రాల్ డిగ్రీ... అదీ పాస్ కాలేకపోయావ్. నీకు చదవడం, సంపాదించడం తెలియదు. ఇదిగో ఇలా రౌడీల్ని వెంటేసుకుని వెధవ పనులు చేయమంటే చేస్తావ్- ఛీ- ఛీ- నీ ముఖం నాకు చూపించకు అడ్డు తప్పుకో" బోస్ మీద తనకున్న అసహ్యాన్నంతా మాటల ద్వారా వెళ్ళగక్కింది ప్రియాంక.

    "చేస్తాను. నేను వెధవనే- అందుకే వెధవ పనులు చేస్తాను. ఇక్కడే ఈ నడిరోడ్డు మీదే నిన్ను రేప్ చేస్తాను. ఎవడొచ్చి నిన్ను కాపాడతాడో చూస్తాను.... రాక్షసి... ఎంతమందిని అవమానించావే నువ్వు! ఆ అందరూ చవటలు గనుక నిన్ను వదిలేశారు. కాని నేనలా వదలను. రేప్ చేస్తుండగా ఫోటోలు తీయిస్తాను. ఆ తర్వాత ఇదిగో ఈ యాసిడ్ బాటిల్ నీ అందమైన పొగరుబోతు ముఖం మీద ఓపెన్ చేస్తాను. నన్నేదన్నా చేయాలని మీ నాన్న చూస్తే ఫోటోలు బయటకొస్తాయి. ఇంకా తర్వాత నువ్వు మరెవర్ని అవమానించకుండా వుండడానికి నీ ముఖాన్ని ఈ యాసిడ్ తో కడుగుతాను. ఫినిష్... దాంతో నీ పని ఫినిష్... నా పగ ఫినిష్" అంటూ పెద్దగా నవ్వుతూ జేబులోంచి ఓ చిన్న బాటిల్ బయటకుతీసి ప్రియాంకకు చూపించాడు బోస్.

    అప్పుడు తొలిసారిగా ప్రియాంకలో భయం ప్రవేశించింది.

    అంతలో ఒకడు కెమెరాను సర్దుకుంటూ బోస్ దగ్గరకు వచ్చాడు.

    "ఏంటి గురూ ఆలస్యం...? నేనూ, నా కెమేరా రెడీ. ఓ నిజమైన రేప్ ని నిజంగా ఫోటోస్ తీయాలని ఈ కెమేరా మీద ప్రతిజ్ఞ చేసి కొన్ని సంవత్సరాలైంది. అది ఈనాడు నీ ద్వారా, ఈ అందమైన పిల్ల ద్వారా నెరవేరబోతోంది... కమాన్ హరియప్" అంటూ కెమేరా ఫోకసింగ్ చేసుకునేందుకు అతను చటుక్కున జేబులోంచి టార్చ్ తీసి ఆ ఇద్దరి మధ్యా వేసి, ఆబ్ జెక్టు కోసం దాన్ని ప్రియాంక మోముమీదకు మరల్చాడు.

    అప్పుడామె మోములో కనిపించిన భయాన్ని, నిస్సహాయతను, బాధను స్పష్టంగా చూసిన బోస్ ఆనందంగా ఓ కేక వేశాడు ఆమె వేపుకు దూకుతూ. సరిగ్గా అప్పుడే కెమేరా క్లిక్ మంది. ప్రియాంక భయంతో రెండడుగులు వెనక్కు వేసి కారుకు అతుక్కుపోయింది.

    అంతలో ఓ అమ్మాయి పరిగెత్తుకొచ్చి బోస్ కాళ్ళమీద పడిపోయింది.

    "బోస్! మేం నీకేం అన్యాయం చేయలేదు. నిన్ను అవమానించింది ప్రియాంక. మమ్మల్ని వదలిపెట్టమని నీ ఫ్రెండ్స్ కి చెప్పు ప్లీజ్" ఆ అమ్మాయి వలవలా ఏడ్చింది.

    కొద్ది క్షణాలు నిశ్చలంగా వున్న బోస్ సీరియస్ గా తలెత్తి- "ఒరేయ్... వాళ్ళను వదిలేయండి" గర్జించాడు ఓసారి.

    చేతికందినట్టే అంది నోటికి అందబోతున్న అందమైన అమ్మాయిల్ని వదలాల్సి రావడం వారికి బాధగా వున్నా, బోస్ సంగతి తెలిసిన వాళ్లు కావడంతో వెనక్కి తగ్గారు.

    "ఒరేయ్... మీరు అటు కొంతమంది, ఇటు కొంతమంది రోడ్డుకు అడ్డంగా నిలబడి బ్లాక్ చేయండి. నేను దీని జీవితాన్ని బ్లాంక్ చేస్తాను..." అంటూ ఆజ్ఞ జారీచేశాడు బోస్.

    వాళ్ళు అటూ, ఇటూ పరిగెత్తుతుండగా మిగతా ఆడపిల్లలు భయంతో కారులోకి దూరి తలుపులేసుకున్నారు.

    పరిస్థితి విషమిస్తుందన్న భావం ప్రియాంకను బెదరగొట్టింది.

    ఏం చేయాలి? ఎలా ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం? చుట్టుపక్కల ఎక్కడా మానవ సంచారం లేదు. ఆ దగ్గర్లో షాప్స్ తప్ప ఇళ్ళు కూడా లేవు. అయినా సరే, ఏదో ప్రయత్నం చేయాలి. అది స్పురించగానే "హెల్ప్... హెల్ప్" అంటూ పెద్దగా అరిచింది వున్నట్టుండి.

    ప్రియాంక అరుపులకు ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు బోస్.

    "చూడు... ఇలా కేకలేసావంటే రేప్ నుంచి తప్పించుకోవచ్చుననుకుంటున్నావేమో. అది అసాధ్యం. నాకు చదువు రాకపోవచ్చు. కాని శత్రువు దెబ్బను కాచుకోవడం తెలుసు. శాంతి అంటే ఏమిటో తెలియక పోవచ్చు. కాని అశాంతి, అల్లకల్లోలం సృష్టించగలను. మరోసారి అరిచావో ఈ యాసిడ్ నిర్ధాక్షిణ్యంగా ఉపయోగించాల్సి వస్తుంది."

    ప్రియాంకలో అప్పటివరకూ వున్న ఆ కాస్త హోప్ చేజారిపోయింది.

    జరగబోతున్న దారుణాన్ని తలుచుకుంటుంటే ఆమెకు వళ్ళంతా చల్లబడి పోయింది. పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించక తప్పదు. ఆ నిశ్శబ్ధ నీరవంలో ఆ అర్ధరాత్రి, ఏ ఆడపిల్లకు జరగకూడని అవమానం- ఆత్మహత్యా సదృశ్యమైన అవమానం జరగబోతోంది. అప్పుడనుకుందామె "ఈలోపే చనిపోతే!"

    ఆత్మహత్య చేసుకొనేందుకు అవకాశం దొరికితే-

    బోస్ ఓసారి నలువేపులా చూసి ఫోటోగ్రాఫర్ కి కళ్ళతోనే సైగచేసి చటుక్కున ప్రియాంక భుజం మీద చేయి వేశాడు బలంగా.

    కెమేరా మరోసారి క్లిక్ మంది.

    సరీగ్గా ఇదే సమయంలో త్రినాధ్ మెయిన్ రోడ్ లో కొంతవరకు ముందుకెళ్లి అనుమానం వచ్చి ఆగిపోయాడు.

    ప్రియాంక ఇంటికి వెళ్ళేందుకు ఇదే సరైన దారి. ఆమె కారు కాని, ఆ వెనుకే బయలుదేరిన బోస్ జీప్ కాని కనిపించలేదు. తన జీప్ రోడ్ ఎక్కేలోపే అంత పెద్ద వీధి మలుపు తిరగడం ప్రియాంకకుగాని, బోస్ కి గాని సాధ్యంకాదు.

    ఆ ఆలోచన వచ్చిందే తడవు జీప్ ని సర్రున వెనక్కు తోశాడు.

    ప్రియాంక ఇంటికి వెళ్ళేందుకు వున్న మరో వీధి కోసం చూస్తూ బాణంలా వెనక్కు దూసుకుపోతున్నాడు.

    సరిగ్గా ఓ నిమిషానికి ఓచోట మెయిన్ స్ట్రీట్ నుంచి చీలిపోయిన రోడ్ కనిపించింది. అది ఎడం వేపుంది. అక్కడే మరో రోడ్ కుడివైపుకు చీలిపోయింది.

    సడన్ బ్రేక్ తో జీప్ ని ఆపి సంధిగ్ధంలో పడ్డాడు త్రినాధ్.

    వాళ్ళు ఏవైపు వెళ్ళి వుండవచ్చు...?

    మరోసారి రాంగ్ రూట్ లో వెళ్ళటం ఇష్టంలేదతనికి. అతని మెదడు పాదరసం కన్నా వేగంగా పనిచేస్తోంది.

    ప్రియాంకకు కారు వేగంగా నడపటం ఇష్టం. ఆ లాజిక్ ప్రకారమైతే ఎక్కువ రద్దీ లేని రోడ్ నే ఎన్నుకుంటుంది. ఈ ఆలోచన ఒక రూపుదిద్దుకుంటుండగానే జీప్ ఎడమవైపునకు తిరిగింది. 

    స్ట్రెయిట్ గా వున్న ఆ రోడ్ లో త్రినాధ్ జీప్ హెడ్ లైట్స్ కనిపించగానే రోడ్ కి అటువేపే కాపుకాస్తున్న బోస్ మనుష్యులు అతనికి సిగ్నల్ ఇచ్చేందుకు విజిల్ వేశారు.

    బోస్ అప్పటికే ఆమె చీరను ఒంటిమీంచి లాగిపడేశాడు.    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra