Previous Page Next Page 
ఋషి పేజి 26


    అంతా మామూలుగానే వుంది. ల్తెట్లు వెలుగుతున్నాయి. సుస్వాగతం బోర్డు గాలికి వూగుతోంది.

    లోపలికి వెళ్ళబోతుంటే ద్వారం దగ్గర ఇస్మాయిల్ కనిపించి "నమస్కారం బాబూ" అన్నాడు.

    ప్రకాశం__ ఎందుకో తెలిదు- గిల్టీ కాన్షన్ ఫీలయ్యాడు. తలెత్తి అతనివ్తెపు చూశాడు_ అనుభవంతో పండిపోయిన ఆ యబ్తే ఏళ్ళ వృద్దుని ముఖంలో  ఏదో  చెప్పాలనే బావాన్ని తొక్కి పెట్టటం కనిపించింది.

    ప్రకాశం  ఆ విషయమే ఆలోచిస్తూ  కోపలికి వెళ్ళాడు.

    "హల్లో గురూగారూ- రండి రండి, మీ గురించె చూస్తున్నాను. ఆలస్యమయిందేమిటి?" అన్న పలకరింపుతో ఆలోచనలనుండి తేరుకొని చూశాడు.

    అతనే!

    ప్రకాశం నవ్వి "నేను ఈరోజు కూడా వస్తానని ఎలా అనుకొన్నారు!" అన్నాడు.

    "అదేమిటి గురూగారూ- ఒకసారి వచ్చాక  మళ్ళి రాకుండా ఉండటమే." అని వెనక్కి తిరిగి, "దానికేంగాని రండి  ఆలస్యమ్తెపోతూంది" అంటూ  బోర్డు దగ్గరకు నడిచేడు.

    ప్రకాశాన్ని ఎవరో చెళ్ళున కొట్టినట్లయింది.

    గోపాలస్వామి వెనక్కి తిరిగి ప్రకాశం ఇంకా అలాగే  నిలబడటం చూసి, "రండి_ ఇప్పటికే చాలా  పోయింది నాది" అంటూ  బలవంతం పెట్టాడు.

    ఆలోచనలను కట్టిపెట్టి అతడుకూడా అతనితో నడిచాడు.

    "అరవ్తే రూపాయలదాకా పోయింది  సార్, యింక లాభం  లేదను కొని వచ్చేస్తుంటే అదృష్టవశాత్తూ మీరు  కనిపించారు."

    ప్రకాశం నవ్వి "నన్ను నమ్ముకొని ఆ అరవయ్యి సంపాదిద్దామనుకొంటే , మీదే  ఇంకో అరవయ్యి పోతాయి" అన్నాడు.

    "మీ హేండ్ నాకు  తెలుసు  గురూగారూ. మీ కెందుకు మీరు రంగు చెప్పండి, నేను చూసుకొంటాను" అన్నాడు.

    ఇద్దరూ బోర్డు దగ్గరకు వచ్చారు.

    "కాయండి సార్....ఇంకేవర్తేనా ఉన్నారా?" అరుస్తున్నాడు.

    ప్రకాశం జేబులోంచి రూపాయి తిసి "పసుపు" అన్నాడు అతను కూడా నలబ్తే రూపాయలు తిసి పసుపుమీద కాశాడు.

    "నలబ్తే రూపాయలా?" ఆశ్చర్యంగా అడిగేడు.

    "మీ హేండ్  గురించీ మీకు సరిగ్గా తెలిదు.  చూస్తూ వుండండి- మనం గెలవబోతున్నాం" అన్నాడు అతను ధీమాగా.

    "అయినా అంత డబ్బు-" అని ప్రకాశం  ఏదో  అనబోతూ వుండగానే బాణాన్ని ఎవరో  విసిరేరు. అతడు నమ్మకంలేక కళ్ళు చిట్లించి చూశాడు. బాణం పసుపుగడి మధ్యలో గుచ్చుకొని వుంది. "నేను చెప్పులేదా?" అన్నట్టు చూశాడు అతను.

    రెండో  బాణం  కూడా విసిరేడు. అది చేతిలో ప్రకాశం  చెయ్యి  బిగుసుకోంది. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి.

    మూడో బాణం కూడా విసిరేడు. అది పసుపుకే గుచ్చుకోంది.

    అతను ప్రకాశాన్ని కౌగిలించుకున్నంత పని చేశాడు. చెయ్యి పట్టుకొని నలిపేస్తూ "రికవర్ అయిపోయ్యేం. ధాంక్స్ గురూగారూ- మెనీమెనీ ధాంక్స్" అన్నాడు సంతోషం పట్టలేక.  అతడు నవ్వి వూరుకొన్నాడు. అతనికి గర్వంగానే  వుంది.

    ఆట తాలూకు వాడు అతనికి నూట అరవ్తే రూపాయలు, ప్రకాశానికి నాలుగు రూపాయలూ ఇచ్చాడు.

    మళ్ళి ఆట ప్రారంభం అవబోతూ వుంది.

    "ఈసారి దేనిమీద ఆడదాం?" అడిగేడు.

    "తెలుపు" ప్రకాశం చెప్పాడు.

    ఆట తాలూకు వాడు వచ్చాడు.

    అతను జేబులోంచి వందరూపాయలు టోకెన్లు తిసి "తెలుపు" అన్నాడు.

    ప్రకాశం కూడా రెండు రూపాయలిచ్చి "ఇది తెలుపే" అంటూంటే అతను ఆపుచేసి "రేండ్లూ మూళ్ళూ ఎంతకాలం ఆడతారు- ఇదిగో యీ యబ్తే ఆయన పేరుమీద కాయి" అన్నాడు.

    అతడు ఏదో చెప్పబోయేంతలోనే ఆటవాడు వెళ్ళిపోయేడు. ప్రకాశం కంగారుగా అతనివ్తెపు తిరిగి  ఏదో చెప్పబోతుంటే, అతనే  "మీదే ఆఫీసు గురువుగారు?" అని అడిగాడు. ప్రకాశం చెప్పాడు.

    అతను నవ్వి___" అయితే రేపు జీతాలు వస్తాయిగా" అన్నాడు. తనిచ్చింది  అప్ప అనేలా ధ్వనిస్తూ.

    ప్రకాశానికి ముళ్ళమీద నిలబడ్డాట్టు వుంది.

    బాణం తర్వాత బాణం  విసరబడింది.

    రండు ఎరుపుకి, ఒకటి నలుపు....

    ప్రకాశం ముఖం రక్తం  లేనట్టు ఇంకిపోయింది. అరచేతిలో చెమట్లు పట్టాయి. చూస్తూ వుండగానే యాభయి పోయాయి. ఎలా.... అతనివ్తెపు చూశాడు, గోపాలస్వామి ముఖంలో బాధ అంతగా లేదు.

    "స్పోర్టివ్ గ తీసుకోవాలి గురువుగారు" అంటున్నాడు__

    ఆటవాడు వచ్చాడు.

    కాయాలి, తపాడు రికవర్ అవటం కోసం.

    హినస్వరంతో "నీలం" అన్నాడు.

    ఇద్దరి పేరుమీద చెరో పది కాసేడు. బాణాలు విసరడం ప్రారంభము అయింది. మొదటది రెండోది పసుపుకి మూడోది నిలానికి,

    ప్రకాశం ముఖంలో కొద్దిగా కళ వచ్చింది. తనమీద నమ్మకం మళ్ళి ఏర్పడింది.

    అటవాడు ఇరవ్తే ప్రకాశానికి యిచ్చాడు.

 Previous Page Next Page