Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 26

                                 

    ఒక ఆదర్శం కోసం గట్టిగా నిలబడి పోరాడకపోయినా కూడా వీరి ఆలోచనలన్నీ ఆదర్శవంతంగానే వుంటాయి. వీరిని మానవతావాదులు

అని స్నేహితులు వెక్కిరించ అవకాశం కూడా లేకపోలేదు.

                 2 .    తక్కువ మార్జిన్ :-

         

    ఎడమవైపు తక్కువ మార్జిన్ ఇఛ్చేవారు సాధారణంగా ఇతరులమీద ఆధారపడే మనస్తత్వం కలిగిన వారై వుంటారు. మనుషుల్ని వీరు

అంత  త్వరగా నమ్మరు. వీర్ని నమ్ముకున్న  వారికి మాత్రం కొండంత అండగా నిలబడతారు.

    పైకి ఎంతో సరదాగా, అమాయకంగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా చాలా గంభీరమైన భావాలు కలిగిన వారై వుంటారు.  వీరు చాలా

పొదుపరి మనస్తత్వం కలిగి వుంటారు.

    వీరి అభిరుచులు త్వరత్వరగా మారుతూ వుంటాయి. మనుషుల్తో అనవసరంగా గొడవ పడటం ఇష్టం లేకపోయినా వీరు తీసుకునే

నిర్ణయాల వల్ల కొంతమంది కష్టపడవచ్చు.

    ఎడమవైపు తక్కువ మార్జిన్ ఇఛ్చేవారితో కలిసి జీవితం ఎప్పుడూ సుఖప్రదంగా వుంటుంది.ముఖాన చందనపు బొట్టు పెట్టుకొని, 

సాంప్రదాయకమైన దుస్తులు ధరించి, కంప్యూటర్ ముందు కూర్చుని అధ్బుతమైన ప్రోగ్రాంలు తయారు చేసే మనస్తత్వం వీరిది.

    రకరకాల సంప్రదాయాల్ని అతి సులభంగా కలిపేసి, వాటిని తమకి అనుగుణంగా మార్చుకొని జీవితాల్ని సుఖప్రదం చేసుకొనే నైపుణ్యం

వీరిలో వుంటుంది.

    3. మొదట్లో ఎక్కువ, తరువాత తక్కువ:

    వ్రాయటం ప్రారంభించేముందు ఒక నిర్ణీతమైన మార్జిన్ ను ఎడమవైపు వదిలి తరువాత వ్రాసుకు పోయేకొద్ది ఎడమవైపుకు జరుక్కుంటూ వచ్చే (అంటే తక్కువ మార్జిన్ వదిలే) చేతి వ్రాత వున్నవారు భవిష్యత్తుమీద ఎక్కువ నమ్మకం లేని వారై వుంటారు. జీవితాన్ని ఒక అధ్బుతమైన కళగా మార్చుకునే శక్తి వీరికుంటుంది.

              



     ప్రేమ వివాహ చేసుకొని, భార్యని చిన్నగదికి తీసుకొచ్చి "తల్లీ తండ్రిని వదిలేసి వచ్చావు. ఇవిగో గుప్పెడు బఠానీలు వీటినే వజ్రాలనుకో"

అంటారు ఈ టైపు మనుష్యులు. అయితే షష్టి పూర్తి రోజు భార్యకి గుప్పెడు వజ్రాలిచ్చి "ఇవి ఇప్పుడు నాకు గుప్పెడుబఠానీలతో సమానం"

అనగలుగుతారు.

    జీవితంలో ఈ విధంగా ఎంతగొప్ప శిఖరాన్నైనా వీరు చేరుకోగలరు.

    ఈర్ష్య పడే వారిని, అనుమానించే వారిని సాధారణంగా వీరు దగ్గరికి రానీయరు.

     జీవితాన్ని ఈజీగా తీసుకుని అయినదానికి, కానిదానికి బాధపడకుండా ఎటువంటి పరిస్థితులలోనైనా వీరు మొక్కవోని ధైర్యసాహసాల్ని

చూపుతారు.

    వీరు ఎంతప్రేమను చూపించగలరో అవసరమైతే అంత ఎడబాటును కూడా చాలా మామూలుగా సహించగలరు.

    ఇరవై నాలుగుగంటలూ తాము ప్రేమించినవారు తమతో కలిసి తిరగడాన్ని వీళ్లు ఇష్టపడరు. దానికి బదులుగా ఏదైనా ఒక సార్ధకమైన

పనిని చేయటానికి వీరు ఇష్టపడతారు.

    4. పైన తక్కువ, చివర ఎక్కువ:

              

    ఎడమవైపు మార్జినుమొదట్లో  ఒకలా ప్రారంభించి తరువాత వ్రాసుకు పోయేకొద్దీ దాని విశాలం చేసేవారు తమ మీద తమకి  అవసరమైన

దానికన్నా ఎక్కువ నమ్మకాన్ని కలిగివారై వుంటారు. వీరికి అహంకారం పాలు కొద్దిగా ఎక్కువ.

    వీరి గురించి వీరు ఎక్కువ చెప్పుకోరు. కాని వీరు చేసే పనుల ఫలితాలే ప్రపంచానికి వీరంటే తెలియజేస్తాయి.

 Previous Page Next Page