Home » D kameshwari » Kadedi Kadhaku Anarham


                                                 ఈడపిల్లే!

    కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ.
    గాడాంధకారం .....ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. "అమ్మా! ....అమ్మా!' అంటూ చేతులు చాచి పిలుస్తుంది.....'అయ్యో, రేణూ , ఏం జరిగిందమ్మా....ఎందుకలా అరుస్తున్నావు...." కన్నపేగు.....పేగు తెంచుకుని వస్తున్నకేక!
    సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం ఏం అర్ధం కాలేదు. అది కల అని అర్ధం చేసుకునే లోపలే "అమ్మా.....అమ్మా!" రేణు పిలుస్తుంది. తలుపు చప్పుడవుతుంది..... చుట్టూ ఇంత చీకటేమిటి ! కరెంటు పోయిందా! అమ్మా..... కలకాదు నిజంగానే తలుపు కొడ్తూ పిలుస్తుంది. చటుక్కున లేచి "ఎవరూ' అంది సావిత్రి తలుపు దగ్గర కెళ్ళి.
    "నేనమ్మా , తలుపు తీయి." ఆ గొంతు రేణుదే. సావిత్రి చటుక్కున తలుపు తీసింది. "రేణూ , ఏమిటి తల్లీ ఇంత రాత్రి ఇలా వచ్చేవేమిటి. ఏమయిందమ్మా? ఆవిడ భయంతో వణికిపోతూ అంది.
    "ఎంత సేపటి నించి పిలుస్తున్నానమ్మా.....ఈ చీకటేమిటి , లైట్లు లేవా, కాలింగ్ బెల్ నొక్కా , ఎవరూ పలకలేదు." పిల్ల నెత్తుకుని ఇంట్లో అడుగు పెట్టింది.
    ఇంట్లో మాటలకి, హడావుడికి మెలకువ వచ్చి చేతిలో బ్యాటరీ లైటుతో వచ్చాడు ప్రసాదరావు గాబరాగా. "ఏమిటి ఏం అయింది?" రేణుకని చూసి తెల్లపోతూ ------"రేణూ నీవా,ఇప్పుడు ఈ వేళప్పుడు...."
    "రైలు మూడు గంటలాస్యం అయింది నాన్నా, తొమ్మిదికి రావాల్సింది."
    అయన అప్రయత్నంగా బ్యాటరీ లైటుతో గోడమీద గడియారం చూశారు పన్నెండు.
    'అదిసరే ఇంత హటాత్తుగా , ఒంటరిగా....." అయన ప్రశ్నలు పూర్తికాక మునుపే లైట్లు వెలిగాయి. వాడిపోయిన మొహంతో, వాచిన కళ్ళతో, కుడి కంటి కింద కమిలిన నల్లమచ్చతో .....కూతురి అవాతారం చూడగానే కడుపులో దేవింది. కన్నవాళ్ళకి . రేణుక చెప్పక ముందే సంగతి అర్ధమైంది మళ్ళీ ఏదో గొడవయింది. ఉన్నపాటున అర్ధరాత్రి ఒంటరిగా ఇలా వచ్చిందంటే పెద్ద గొడవే అయి ఉంటుంది. సావిత్రి ఆందోళనగా ఏదో అడగబోతుంటే అయన కళ్ళతోనే వారించి, "పిల్లని తీసికెళ్ళి పడుకోబెట్టు.....ఏదన్నా తినడానికి ఉంటె పెట్టు దానికి . అర్ధరాత్రి అయింది.....వెళ్ళమ్మా రేణూ.....రేపు మాట్లాడుదాం." అన్నారు ప్రసాదరావు.
    
                                              *    *    *    *

    ఎప్పుడూ చలాకీగా, రాజాగా అప్పుడే విరిసినా పువ్వులా కలకలా కూతురు కళాకాంతులు పెళ్ళితోనే పోయాయి అన్నది ఎనిమిది నెలలకే అర్ధమయింది వాళ్ళకు. ఎత్తి ఎత్తి ఎంగిలాకు మీద అడుగేసినట్టు వెతికి వెతికి మంచి సంబంధం -------ఇంజనీర్లు, ఉన్నవాళ్ళు అని మురిసిపోయిన వాళ్ళ మురిపం పట్టుమని ఏడాది నిలవలేదు. పెళ్ళయ్యాక ఎనిమిది నెలలకి పుట్టింటికి వచ్చిననాడే అర్ధమయింది. మొహంలో కాంతి పోయి, నిస్తేజమైన కళ్ళతో, నవ్వే కరవయిన కూతురి అవతారం చూసి, బెంబేలు ఎత్తిపోయారు తల్లితండ్రులు. నెల తప్పింది. వేవిళ్ళు కాబోలనుకున్నారు. అడిగితే "ఏం లేదు. ఏం ఉంది" అని నిర్లిప్తంగా అంటున్న కూతురిని అనుమానంగా చూశారు . వేవిళ్ళయితే శరీరానికి అనారోగ్యమే కానీ, నెల తప్పిన అనందం. మొహంలో కళ కరువై నిస్తేజంగా ఉన్న కూతురు ఏదో భాదపడుతోంది అన్నది అర్ధమైంది.
    "ఏం తల్లీ అలా ఉన్నావు? రమేష్ కూడా వచ్చి ఉంటే బాగుండేది . పెళ్ళయ్యాక మొదటి పండగ కన్నా రాలేదు పిల్చినా. ఇప్పుడన్నా నీతో వచ్చి నాల్గురోజులుండి వెడితే బాగుండేది' అంది సావిత్రి కూతురేమన్నా బయట పెడ్తుందేమో నని.
    "ఏమిటో అయన, అయన పని తప్ప సరదాలు లేవమ్మా ఆయనకి."
    'అదేమిటే పెళ్ళయి పట్టుమని ఆరునెలలకే సరదాలు లేకపోవడం ఏమిటే?"
    హటాత్తుగా రేణుక మొహం ఎర్రబడి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. తల్లికి కనపడకూడదని మొహం తిప్పుకోబోయింది. సావిత్రి చూడనే చూసింది. "ఏమిటి, రేణూ ఏమయింది , చెప్పమ్మా అతనేమన్నా అన్నాడా/ ఇద్దరూ మాట మాట అనుకున్నారా - వచ్చిందగ్గర నించి చూస్తున్నాను.' ఆరాటంగా, ఆందోళనగా అడిగింది.
    'అమ్మా" బావురుమంది రేణుక. ఇంక కడుపులో దాచుకోలేని దుఃఖం వెల్లువలా బయటికి వచ్చింది. "అమ్మా ఇంక నేనక్కడికి వెళ్ళనమ్మా, ఆ కాపురం ఇంక నేను చెయ్యలేనమ్మా! నేనింక అక్కడికి వెళ్ళనే వెళ్ళను. ఐ హేట్ హిమ్ ---హీ ఈజ్ ఏ శాడిస్ట్ . ఓ సరదా, సరసం తెలియని మృగం" ఏడుపు ఆవేశంగా మారింది.
    "రేణూ!" సావిత్రి మొహం వివర్ణమయింది.
    "అవునమ్మా చదువు చూశారు. ఉద్యోగం చూశారు, హోదా చూశారు వంశం అన్నారు. అన్నీ చూశారు . వీటన్నింటినీ మించిన సహృదయత , సున్నితత్వం , లాలిత్వం అన్నవి కూడా మనిషిలో ఉండాలన్నది మనం ఎవరం చూడలేదమ్మా . రూపం చూసి మోసపోవడం అంటే ఏమిటో నాకర్ధమయింది' ఆవేశంగా అంది రేణుక.
    కూతురి వంక నిర్ఘాంతపోతూ చూడడం మినహా ఏం అనలేకపోయింది సావిత్రి.
    'అమ్మా సరసత, సౌమ్యత లేని మనిషితో కాపురం అంటే ఏమిటో అనుభవించిన వాళ్ళకే అర్ధం అవుతుందమ్మా లోకానికి నేను అదృష్టవంతురాలిలా కనిపించవచ్చు. కానీ, నాకేం లోటన్నది ఎవరికీ అర్ధం కాదమ్మా.' ఆమె గొంతు రుద్దమయింది.
    "రేణూ నీవు అన్నింటినీ మరీ ఏదో ఊహించుకుని బాధపడుతున్నావేమో . సంసారం అన్నాక, ఒక ఇంట్లో ఇద్దరు కొత్తవాళ్ళు కల్సి బతకాల్సి వచ్చినప్పుడు అభిప్రాయబేధాలు వస్తాయమ్మా సామరస్యంగా సర్దుకోవాలి. అందరు భార్యాభర్తలు మాటామాట అనుకుంటూనే ఉంటారు. మీ నాన్నా నేను దెబ్బలాడుకోమా - ' సావిత్రి కూతురికి సర్ది చెప్పాలనుకుంది.
    'అమ్మా నాకివన్నీ తెలియవంటావా. నేనేం చదువుకొని మొద్దునా. నాన్న, నీవు దెబ్బలాడుకుంటారు. కానీ, మీ మధ్య ప్రేమానురాగాలనే పునాది ఉందమ్మా. ఆ పునాది ఉన్నప్పుడు అప్పుడప్పుడు వీచే గాలులకి, తుఫానులకి ఆ ఇల్లు పడిపోదమ్మా - పున్నాదులు కదిలిపోవు. మీరు ముప్పై ఏళ్ళుగా సంసారం చేస్తున్నారు. ఏదో రోజు మాట మాట అనుకున్నా వెంటనే "సావిత్రీ' అంటూ నాన్ననీ వెనక పడతారు వెంటనే .....అలాంటి అండర్ స్టాండింగ్ మా మధ్య లేదమ్మా."
    "అతను సరదాగా ఉండడా, కోపిష్టా, అర్ధం చేసికోడా, ఏమిటసలు ప్రాబ్లం అతనితో, అసలు సంగతి ఏమిటో చెప్పమ్మా."
    రేణుక నిట్టూర్చింది. "ఏమిటి చెప్పడం?ఎన్నని చెప్పడం? చెప్పడానికి ఎంతో సిల్లీగా ఉంటాయి. కూరలో ఉప్పెక్కువైతే ఏదో కావాలని వేసినట్టు రుసరుసలాడే మొగుడ్ని - అదీ పెళ్ళయిన నెల్లాళ్ళకే కొత్త పెళ్ళాన్ని కసిరే మొగుడ్ని ఏ ఆడది ప్రేమించగలదు! టిఫిను పెట్టి మంచినీళ్ళు మర్చిపోతే మొగుడంటే లేక్కలేకపోవడం అంటూ ఎగిరే భర్తని, బొత్తాం కుట్టడం మర్చిపోతే మొగుడి మాటంటే నిర్లక్ష్యం అంటూ దుమధుమలాడే భర్తని ఓ కొత్త భార్య గౌరవించగలదా, అభిమానించగలదా? సినిమాకి వెడదాం అని కొత్త భార్య ముచ్చటగా అడిగితే , వెధవ సినిమాలు బోరు. నీవు వెళ్ళు కావలిస్తే పక్కింటావిడతో అనే మొగుడి మనస్తత్వాన్ని భార్య ఎలా అర్ధం చేసికోవాలి? మంచి వెన్నెల బాగుంది - డాబా మీద పడుకుందామా అంటే, నాకు వళ్ళు పట్టేస్తుంది అంటూ చిరాకుపడే భర్తని చూసి ఎన్నో ఆశలతో , కలలతో , కోరికలతో వచ్చిన అ నవ వధువు మనసు ముక్కలవదా? ఓ మంచి చీర కట్టుకుంటే భర్త పొగడాలని, మంచి టిఫినో, కూరో చేస్తే భర్త మెచ్చుకోవాలని కొత్త భార్య ఆశించడం అత్యాశా? సెలవు రోజన్నా భార్యతో ఏ గార్డెను కో వెళ్ళి హోటల్లో భోం చేసి రావాలన్న చిన్న కోరికలని కూడా తీర్చని మొగుడిని ఏ భార్య ప్రేమిస్తుంది? భార్య పుట్టిం రోజు కనీసం మొదటి సంవత్సరం అన్నా గుర్తు పెట్టుకొని భర్తని ఏమనుకోవాలి? సరదాగా జోక్ చేస్తే కుళ్ళి పోయి మొహం గంటు పెట్టుకునే సెన్సాఫ్ హ్యూమర్ లేని భర్త పట్ల అనురాగం కలగమంటే కలుగుతుందా! మాటలో సౌమ్యత, మనసులో అనురాగం , పలకరింపులో ఆప్యాయత కరవయిన ఆ కాపురంలో భార్య మనసు ఎలా స్పందిస్తుంది!
    ప్రతి ఆడపిల్ల పెళ్ళి గురించి భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. అందులో కాస్త  అందం , చదువు  అన్నీ ఉంటే తనంటే భర్త ఎంతో ప్రేమానురాగాలు కురిపిస్తాడని, మురిపిస్తాడని, అలరిస్తాడని , గుండెల్లో పోదువుకుంటాడని ఆశించడం అత్యాశ కాదు! సినిమాలలో మాదిరి డ్యూయెట్లు పాడుకోకపోయినా , ఏ సాయంకాలం చీకటి వేళో పెరట్లోనో, డాబా మీదో కూర్చుని సన్నగా ట్రాన్సిష్టర్ వింటూ, నీలాకాశం కింద పిల్లగాలుల మధ్య ఒడిలో తలపెట్టుకు పడుకుంటే, ఆ చేతులు తన కురులు మృదువుగా సవరిస్తుంటే పులకరించాలనుకోదా ఏ అమ్మాయి అయినా. అలా సెలవు రోజులు ఏ గార్డెను లోనో చేతులు కలుపుకుంటూ నడవాలన్న చిన్నకొరిక ఏ కొత్త భార్యకి ఉండదు? తను వంట చేస్తుండగా వచ్చీ రాని పనులు చేస్తూ తనని విసిగెత్తిస్తుంటే తను మురిపెంగా కసరడం లాంటి సరదాలు దాంపత్యంలో చోటు చేసుకోవాలని కోరుకోవడం దురాశా! ఉదయం నిద్ర లేవగానే ఒక్క అరక్షణం భార్యని దగ్గరికి లాక్కుని చిన్న ముద్దు పెడితే , "గుడ్ మార్నింగ్ డార్లింగ్ " అంటే ఆ ముద్దు టానిక్ లా పనిచేసి రోజంతా ఏ భార్య అయినా ఆ భర్తకి గొడ్డు చాకిరీ చెయ్యదా!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra