ప్రజలు ఆశ్చర్యంగా చూచారు.

 

    "ఈ నిమ్మకాయల నీ నెత్తురంత వున్నది కట్టిపెట్టిన. ఇదిగో పిండుత చూడు. నీ రక్తం దిగిపోతది. తెల్లారేదాకా ఎందుకు?" అని నిమ్మకాయ పిండాడు. అందులోని రక్తం బొట్లు రాలసాగాయి. తాసిల్దారు నీరసించసాగాడు. అతని వంట్లో రక్తం కారిపోతున్నట్లనిపించింది. "ఆగు" అరచాడు. అది ఆర్తనాదం. "పిండకు" అని లేచి వచ్చాడు. అంత భారీ మనిషి రఘు చేయిపట్టుకొన్నాడు బ్రతిమాలుతున్నట్లు.

 

    "అచ్ఛా-జర హుషారుగుండు" అని నిమ్మకాయ జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు రఘు.

 

    తనుస్తూ బల్లమీద పడిపోయిన తాసిల్దారు వడ్డెర్లను తెల్లవారి రమ్మన్నాడు. కోమట్లను పంపించేశాడు. హుక్కా గబ గబా పీల్చసాగాడు.

 

    అగ్గిలా పాకింది ఆ వార్త.

 

    తెల్లవారి వడ్డెర్లు కూళ్ళు గెలుచుకున్నారు.


                                     5


    అడవుల అందాలూ ఆకాశపు టంచులూ ఎవరు చూచాడు! వర్ణించాడు! రుతువుతోపాటు రూపం మార్చుకుంటుంది. పొద్దుతోపాటు పోలిక తీర్చుకుంటుంది. పచ్చని ఆకులతో నిండివున్నా, పండుటాకులు రాలి ఉన్నా అందమే అడవికి. పులి గాండ్రుమన్నా, నెమళ్ళు కేకలు పెట్టినా, గువ్వలు డప్పులు కొట్టినా సోయగమే. అడవి రూపవతి. అందాలరాశి. ఏ రూపంలో ఉన్నా అందమే. ఎప్పుడూ కిల కిల లాడుతుంటుంది.

 

    అడవి అందాలరాశి మాత్రమే కాదు. ఔషధాల తుప్ప. అక్కడ అమృతం ఉంటుంది. సంజీవని ఉంటుంది. అవి మనిషిని బ్రతికిస్తాయి. గాయాలను మాన్పుతాయి. అక్కడ విషమూ ఉంటుంది. హాలాహలం ఉంటుంది. చావూ ఉంటుంది. ఔషధులన్నీ కోయ దొరలకు తెలుసనలేం. కాని చాలా తెలుసు వారికి. వారిలో ప్రతి వాడూ వైద్యుడే. అందరికీ ఏదో ఒక మూలిక తెలుసు. ఎవడూ దాన్ని దాచడు. బోలెడు సలహాలు, బోలెడు మందులు.

 

    అన్ని మందులున్నా, అందరు వైద్యులున్నా సమ్మయ్య భార్యకు జ్వరం తగ్గలేదు. రావడం జ్వరం చలితో వచ్చింది. చలి వచ్చినప్పుడల్లా ఎండలో కూర్చున్నది. అందరు చెప్పిన ఆకులు తిన్నది. చలి తగ్గింది. కాని జ్వరం వదల్లేదు. బలం పీల్చేసింది. ఎముకల గూడులా తయారైంది. ఇప్పుడు జ్వరం బయటికి రావడంలేదు. కాని లోలోన కృంగదీస్తూంది. రక్తం పీల్చేస్తూంది.

 

    కోయగూడెం వాళ్ళు క్రింది గూడానికి వెళ్ళాలనుకున్నారు. ప్రతిపాదన వచ్చింది సింగన్న నుంచి. సింగి సింగన్న కళ్ళల్లో కాపురం పెట్టింది. ఎదలో ఇల్లు కట్టుకుంది. అతనికి ఏదో బాధ కలిగిస్తూంది. ఆరాటం కలిగిస్తూంది. అందుకే ఈ ప్రయాణం. మాట ప్రయాణం వేటకు.

 

    కోయగూడెం కదిలింది. కిలకిల లాడుతూ కదిలింది. పక్షుల గుంపులా ఎగిరింది. సాగింది. పరిహాసాలు, పాటలు, చక్కలిగింతలు గంతులు, నవ్వులు, ఈసడింపులు, కథలు, వయసు పయనిస్తూంది. ఆనందం ప్రవహిస్తూంది. వయ్యారం ఉరుకుతూంది.

 

    అడవిలో కాలిబాట, పల్లెపదంలా వంకరటింకర్లుగా సాగుతూంది. మనిషి జీవితంలాంటి మిట్ట పల్లాలు, దుబ్బలు, లతలు, రాళ్ళు, పక్షుల గుంపులు, కలకలా రావాలు, లేళ్ళ గుంపుల గంతులు, కుందేళ్ళ ఉరుకులు ఈ పక్కన అడవి, ఆ పక్కనా అడవి, ముందు అడవి, వెనుక అడవి, సాగిపోతున్నాది కోయగూడెం. గూడానికంటే ముందే సింగన్న గూడెం క్రింది గుండెలో వాలింది.

 

    సాయంకాలానికి కోయగూడెం క్రిందిగూడానికి చేరింది. క్రింది గూడెం గుండెలు విచ్చి స్వాగతం పలికింది. వెన్నెల విరిసింది. విందులు సాగాయి. ఇప్ప సారాయి, కాల్చిన మాంసం, ఆటలు, పాటలు, కేరింతలు, సింగికి సైగ చేశాడు సింగన్న. ఆమె గుండె విచ్చుకుంది. నెమళ్ళు పురి విప్పి నాట్యం చేశాయి. ఆమె సింగన్నను అనుసరించింది.

 

    సింగి, సింగన్న - రతీమన్మథులు గూడెం దాటారు. దూరంగా వెళ్ళారు. ఒక బండమీద కూర్చున్నారు. మాటలు ముచ్చట్లు. ఏముందో వాటిలో మాధుర్యం! ఏముందో వాటిలో ఆకర్షణ? ఎంతసేపో, ఏమిటో ఆ మాటలు. సింగన్న సింగి ఒళ్ళో పడుకున్నాడు. ఆమె అతనిని చూస్తూ ఉండిపోయింది. సింగన్న చుక్కల్ని చూస్తున్నాడు. అవి వారితో పాటు మేలికతో ఉన్నాయి. అవీ వీరినే చూస్తున్నాయి. సింగి సింగన్న తొడమీద తల పెట్టింది. అతడు ఆమె వెంట్రుకలు సవరించాడు. అందులో ఏదో అనుభూతి వుంది. ఆనందం ఉంది.

 

    క్షణంలో తెల్లవారింది. జంటగా గూడెం చేరారు. గూడెం వేటకు సిద్ధం అవుతూ వుంది. గుంపులు విడిపోయాయి. ఆయుధ పాణులై బయలుదేరారు కోయలు. యాత్ర సాగింది అడవికి. దట్టపు అడవికి. యువతులు బాణాలు విసురుతున్నారు పాటల రూపంలో. పూలబాణాలు. యువకులేం తక్కువా! వారూ విసురుతున్నారు. అవీ పూలే. కాని వాడిగా ఉన్నాయి.

 

    వేట సాగింది. అడవి అదిరింది. కలకలం లేచింది. ఉత్సాహం పొంగింది. ఆవేశం హెచ్చింది. ఉరుకులు సాగాయి. తుపాకులు ప్రేలాయి. బల్లాలు కదిలాయి. బాణాలు రాలాయి. జంతువులు కూలాయి. జనం కూడారు. వర్తులం తీర్చారు. విందు లారగించారు. కిలకిలలు, పకపకలు, పరిహాసాలు. గుండెలు గంతులు వేస్తున్నాయి. మనసుల్లో జలపాతాలు రాలుతున్నాయి.

 

    ఇక విశ్రాంతి. చెట్టుక్రింద ఒకడు, చేమక్రింద ఒకడు, పొదచాటున ఒకడు, ఎదచాటున ఒకతె పడుకున్నారు. అందం నిద్రపోయింది. ఆనందం ఒళ్ళు మరచింది. సింగి, సింగడు వారి మనసుల్లో యేదో ఆవేదన ఉంది. ఏదో ఆరాటం ఉంది. ఏదో సంభ్రమం వుంది. ఏదో సంబరం ఉంది. ఈ రోజు, ఈ రాత్రి అదే వారిది. ఆ తర్వాత జంట విడిపోతుంది. ఒకటి కోయ గూడెంలో ఒకటి కండ గూడంలో వారికి నిద్ర రాలేదు. కునుకు పట్టలేదు. అదిగో ఆ మద్దిచెట్టుకింద, రాతిమీద, సెలయేటి పక్కన కూర్చున్నారు.

 

    వారి హృదయాలు అంతులేని సాగరాలు.

 

    వారి ముచ్చట్లు అంతులేని ఆకాశాలు.

 

    దగ్గరికి వచ్చి ఒడిలోనికి ఒదిగి అడిగింది సింగి. "ఎప్పుడు తెచ్చుకుంటవు?" అంతే. ఆమె కనుచూపు వాలింది. సిగ్గుతో కుంగింది.

 

    సింగన్నలో సాగరాలు పొంగాయి. పొదివి దగ్గరికి తీసుకున్నాడు. "అమ్మ నవ్విస్తున్నది. బాగైతే తెచ్చుకుంట" అన్నాడు. పూలరాసులు కురిపించాడు.

 

    అవి గులకరాళ్ళు అయినాయి సింగికి. బెదురు కళ్ళతో సింగన్నను చూసింది. "ఎప్పుడైతది?"

 

    "అయితదిసె." కళ్ళు మూశాడు సింగన్న. అతని చేతిలో ఏదో విద్యుత్తుంది. అది కళ్ళలోనుంచి గుండెలోకి పోయి గిలిగింతలు పెట్టింది. ఆమె కిలకిలా నవ్వింది. అతడూ నవ్వాడు.

 

    రెండు నవ్వులు కలిశాయి.

 

    రెండు నదులు కలిశాయి.

 

    కోయలు లేచారు. కోలాహలం రేగింది. మళ్ళీ వేట సాగించదలచలేదు. ఆటలాడదలచారు. ఏమి ఆట? ఆటల నిర్ణయం లేదక్కడ అన్నీ ఆటలే. అసలు వారి జీవితమే ఆట, వేట. ఎదురుగా ఒక కుంట కనిపించింది. నీరు కొద్దిగా వుంది. చేపలు నిండుగా ఉన్నాయి. చేపలు పట్టాలి. తినటానికి కాదు ఆటకు. గుంపులు గుంటలో దూకాయి. గుంటనంతా తొక్కాయి. కలచివేశాయి. నీరంతా బురద అయింది. చేపలు నిలవలేకపోయాయి. అవి పైకి వస్తుంటే కర్రలతో బాదడం, పట్టుకోవడం, ఇద్దరూ ఒకే చేపను పట్టారు. గుంజులాట, పోట్లాట, నీరు చిమ్ముకోవటాలు, తగాదా తెగింది చెప్పాను ఒకడు లాక్కున్నాడు. విసరి బయటికి కొట్టాడు. అదొక వింత, అదొక వినోదం అంతే!

 

    సింగీ, సింగన్న కలిసి పట్టారు చేపలు.

 

    ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఒకే చేపను ఇద్దరు పట్టుకున్నారు. లాక్కున్నారు. సమాధానపడ్డారు. నీరు చిమ్ముకున్నారు. ముఖం నిండా బురద, వంటినిండా బురద, ఇద్దరూ అలాగే అయినారు. ఒకరిని చూచి ఒకరు నవ్వుకున్నారు. బురదలో కాళ్ళు రాచుకుంటూ బయటపడ్డారు.

 

    సూర్యుడు అస్తమిస్తున్నాడు. కోయలు గూడానికి తరలారు. గూడెంలో రాత్రి సంబరాలు. మళ్ళీ ఆటలు, మళ్ళీ పాటలు. గూడెమే పాడింది. గూడెమే ఆడింది.

 

    సింగీ సింగన్న చుక్కలకింద బండమీద ఏవో గాథలు ఏవో అగాథాలు తోడుకున్నారు. గుండెలలోకి ఎత్తుకున్నారు. పాపం అమాయకురాలు. అడవి బిడ్డలు ప్రేమపదం తెలియనివారు. ప్రేమించుకున్నారు.

 

    వెన్నెల కరిగింది. జారింది. దాగింది. చీకట్లు కమ్ముకున్నాయి. బయటి చీకటి ప్రేమికుల గుండెల్లో చేరింది. గుండెలు గుబగుబ లాడేయి. రాతిమీది నుంచి లేచారు, సాగారు. గూడెం చేరారు. నెమళ్ళు మండుతున్నాయి. మాంసం కాలుతూంది. సారాయి ప్రవహిస్తూంది. ఆటలు, పాటలు, కేకలు, కేరింతలు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra