Home » Suryadevara rammohan rao » నిశీథి నియంత


    జైలు నుంచి జైలు అధికారులు తలుచుకుంటే ఖైదీలు తప్పించుకోవచ్చా?" రాత్రి పది గంటల సమయంలో వివేక్, రామదాసు ఫ్రీగా బయట మాట్లాడుకుంటున్నట్లే మాట్లాడుకుంటున్నారు.

    "హేపీగా, ఈజీగా తప్పించుకోవచ్చు. నీకింకా తెలిసినట్లులేదు. ఈ నాయుడికి అరవై డెబ్బై లక్షల ఆస్త్రీ వుంటుంది. ఈ జైల్లో ఉన్న సెంట్రీలకు, గార్డులకు మాత్రం తక్కువేం లేవు ఆస్తులు. డబ్బుంటే ఇండియన్ జైల్స్ లో దొరకని సౌలభ్యంలేదు. ఈ జైలుకు రాత్రుళ్ళు కొందరు ఘరానా నేరస్థుల కోసం వేశ్యల్ని రప్పిస్తారు. వాళ్ళు రాత్రంతా ఉండి తెల్లవారుఝామునే వెళ్ళిపోతారు.

    ఇంకా ఘరానా నేరస్థుల విషయంలో అయితే వాళ్ళ ఇలాకీలు తరచూ వచ్చి వార్ని సంతృప్తి పరిచి వెళుతుంటారు.

    కొంచెం పద్దతయిన నేరస్థుల విషయంలో అయితే వాళ్ళ భార్యలు బంధువులు రాత్రిళ్ళు ఇక్కడే విడిది చేస్తారు" నవ్వుతూ అన్నాడు రామదాసు.

    షాక్ తిన్నట్లయిపోయాడు వివేక్.

    ప్రపంచమంటే యిదా? ఒక్కొక్కటి అర్ధమవుతున్నకొద్దీ అతని రక్తం ఆవేశంతో ఉరకలు పెడుతోంది.

    "అక్కడిదాకా ఎందుకు? మనమీ టైమ్ లో ఇలా పెద్దగా సంభాషించుకోకూడదు. రాత్రి ఎనిమిది గంటలకే పడకలెక్కేసి గప్ చిప్ అయిపోవాలి. అయినా మనం మాట్లాడుకోవటంలేదూ? నైట్ సెంట్రీలు చిదంబరం, నిరంజనం ఇటువైపు రాక ఎంతసేపయింది? గంటయింది. తప్పించుకోవాలంటే ఈ గంట చాలదా? మనమంటున్న సెల్స్ లోకి తీక్షణంగా చూస్తూ అనుక్షణం పహరా కాయాలి కాస్తున్నారా? బీడీదమ్ములు లాగుతూ వార్డ్ చివర హస్కు కొడుతుంటారు.

    డబ్బిచ్చే ఖుషీ, సుఖసౌఖ్యాల ముందు, భోగభాగ్యాల ముందు....అదే మెటీరియల్ కంఫర్ట్స్ ముందు రూల్స్.... రెగ్యులేషన్స్ బలాదూర్ - చట్టం, న్యాయం అంతకంటే బలాదూర్.

    నేను, నా శత్రువు జస్వంతరావూ- అదే ప్రస్తుత కేబినెట్ మినిస్టర్ ఫర్ ఎగ్రికల్చర్ - ఒకప్పుడు ఇదే జైల్లో కొన్నాళ్ళున్నాం. ఇప్పుడు వాడు మినిస్టరయిపోలా? ఇప్పుడు నువ్వెళ్ళి ఈ జైలు పాత రికార్డ్ ని తిరగేసి చూడు- వాడి పేరుంటుందేమో....వుండదు.

    రాతియుగంలో కండబలం వున్నవాడే లీడరు. ఆ తరువాత రాజుల కాలంలో మందీ, మార్భలం వున్నవాడే రాజు. ఆ తరువాత డబ్బు, రౌడీల బలం వున్నవాడే నాయకుడు. ఆ తరువాత మందు, మగువల్ని సప్లైచేసి, హత్యలు చేసేవాడే గొప్పవాడు. వాడే రాజకీయ నాయకుడు.

    ఒక నీచం గురించి చెప్పనా....?

    ఈ దేశంలో చాలామంది నాయకులు ఎలా పైకొచ్చారో తెలుసా? అమ్మాయిల్ని తార్చి, బ్రోకర్ పనులు చేసి, అంతకంటే ఘోరం తమ పెళ్ళాల్ని డబ్బుకోసం ఇతరుల దగ్గర పడుకోబెట్టి-

    బ్రోకర్ పనులు చేసి చాలామంది మంత్రులయ్యారు. ఎంపీలయ్యారు. తమ పెళ్ళాల్ని పడుకోబెట్టి మరెంతోమంది కోటీశ్వరులయ్యారు.

    వాళ్ళ వ్యక్తిత్వాలకు వెనుకవున్న బొక్కల్ని చిరుగుల్ని ఎవరూ చూడరు. వాడి ముందున్న ఆస్థుల్ని చూసే గౌరవిస్తారు.

    నీతి, నియమాలు, చట్టం, న్యాయం, వ్యక్తిత్వం అన్నీ చట్టుబండలే మైలురాళ్ళు కావు.

    అంతదాకా ఎందుకు....? నీ ప్రియురాలు మనోజ్ఞ నిన్ను కలుసుకునేందుకు ఇప్పటికి ఆరుసార్లు ఈ జైలుకొచ్చింది.

    జైలు మొదటిగేటు దాటగానే సందర్శకుని మణికట్టుపై ఇంటర్వ్యూ ముద్ర వేయాలి. జైలునుంచి బయటకు వెళ్ళేప్పుడు రెండోముద్ర వేయాలి జైలు నిబంధనల ప్రకారం. ఇంటర్వ్యూ పుస్తకంలో ప్రతి సందర్శకుని పేరు, చిరునామా వివరంగా రికార్డు చేయాలి. సందర్శకుడు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా ఆ రిజిస్టర్ లో సంతకం చేయాలి.

    నీ ప్రియురాలి చేతి మణికట్టుపై ఎప్పుడన్నా ముద్ర వుండటం చూశావా?

    విజిటర్స్ రిజిస్టర్ తెప్పిస్తాను. మనోజ్ఞ సంతకం అందులో వుందేమో చూసి చెప్పగలవా? లేదు. అదీ చట్టమంటే- అదీ ఇండియా అంటే? అదీ ఇండియన్ జైల్సంటే....

    ప్రతిరోజూ ప్రతి బారకాసును జైలర్ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని జైలు నిబంధనలు నిర్దేశిస్తున్నప్పటికీ అది జరగటంలేదు.  

    ప్రతి ఆరునెలలకు జైలు సిబ్బందిపై, వారి ఆస్థులపై ఇంటెలిజెన్స్ తనిఖీలు నిర్వహించాలి. నిర్వహిస్తున్నారా? లేదు. వాళ్ళకుమాత్రం డబ్బు చేదా? ఇంటెలిజెన్స్ అధికారులు కూడా యధావిధిగా డబ్బు మేసేసి ఈ జైలు సిబ్బంది పరమ స్ట్రిక్ అని రాసేసి, మందుకొట్టి, మగువలతో ఎంజాయ్ చేసి డబ్బూ, దస్కంతో కామ్ గా వెళ్ళిపోతారు.

    అత్యాధునిక నిఘా పరికరాలు అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టీ.వీ. ల్లాంటివి. అధునాతన కాపలా సంవిధానాలను సమకూర్చుకోని ఈ జైళ్ళూ? ఒక జైళ్ళా....?

    ఈ జైలు బయట కొందరు దళారులుంటారు. వారికి ఈ జైలు సిబ్బందితో సత్ సంబంధాలుంటాయి. లోపాయికారి వ్యవహారాలుంటాయి. వాళ్ళకో యాభై ఇస్తే ఏ విజిటర్ నయినా ఆ దళారులు ఈ జైల్లోకి ప్రవేశపెడతారు.

    జైలులోకి ప్రవేశంకోసం ఆ దళారులకు డబ్బు చెల్లించి, వారిచ్చిన చీటీలు తీసుకొని వస్తే జైలు తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి.

    జైలు సిబ్బంది ఆ రాత్రికే ఆ చీటీల్ని లెక్కేసి మొత్తం ఎంతొచ్చి వుంటుందో! లెక్కలు తేల్చుకుని తమ కమీషన్ తాము తీసేసుకుంటారు.

    నెలకు పదిహేను వందలకు మించి రాని సెంట్రీల ఇళ్ళల్లో, గార్డుల ఇళ్ళలో వి.సి.ఆర్.లు - కలర్ టీవీ.లు- ఫ్రిజ్ లు- వాషింగ్ మెషిన్స్ - ఫర్నిచర్ ఖరీదయిన వార్డ్ రోబ్స్ వుంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళవాళ్ళు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటారు. డొనేషన్స్ తీసుకొనే పెద్దపెద్ద స్కూళ్ళలో, కాలేజీల్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు. మోపెడ్స్ వుంటాయి. స్కూటర్స్ వుంటాయి. కొండొకచో కారులున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

    పండిపోయాను బాబూ! నీటిలో పడిపోయి తలకు బొప్పి కట్టించుకున్నాను.

    చెప్పుకుంటే చాలా వున్నాయి కానీ, మనకనవసరం మనిద్దరి పగ, ప్రతీకారాలు తీరితే మనకంతే చాలు. దాని గురించి ఆలోచిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. కమ్ టు దీ పాయింట్...." అన్నాడు రామదాసు. చెప్పటం కొద్దిసేపు ఆపుతూ.

    అవన్నీ దిగ్భ్రాంతితో విన్న వివేక్, ఎప్పటికోగానీ మనిషి కాలేకపోయాడు.

    "మీరు నాకు ట్రైనింగ్ ఇస్తారు. బాగానే వుంది. ఆ టైమ్ లో సడన్ గా వీరనారాయణగారొస్తే...." షాక్ నుంచి తేరుకుని అడిగాడు వివేక్.

    "అందుకేగా యాభైవేలు. లేదంటే పదివేలే. ఇద్దరు గార్డులకు తలా రెండువేలిస్తాడు నాయుడు. ఆ ఇద్దరిలో ఒక గార్డు వీరనారాయణగారి క్వార్టర్స్ నుంచి జైలుకొచ్చే మార్గంలో కాపుకాస్తాడు.

    మరొక గార్డు సెక్యూరిటీ గేట్ దగ్గరుంటాడు. ఆయన బయలుదేరగానే మొదటి గార్డు పిల్లి కూత పెడతాడు. అది రెండో గార్డుకి వినిపిస్తుంది. వాడు కుక్కలా పెద్దగా అరుస్తాడు. అది మొదటి బ్యారక్ లోని సెంట్రీలకు వినిపిస్తుంది. వాళ్ళు పెట్టే కోడ్ తో కూడిన కేక ఈ బ్యారక్ లోని చిదంబరానికి వినిపిస్తుంది. అప్పుడు పదిహేనవ బ్యారక్ దగ్గర మనల్ని కాపాడటంకోసం వుండే నిరంజనానికి వినిపిస్తుంది.

    సాధారణంగా జైలు సూపరింటెండెంట్ జైల్లో ఎంటర్ కాగానే బ్యారక్స్ కేసి రాడు. ఒకవేళ వచ్చే ప్రయత్నం చేసినా నాయుడు ఆయన్ని మాటల్లో పెట్టి కొంతసేపు ఆపగలుగుతాడు.

    ఈలోపు మనల్ని నిరంజనం పండ్లతోటలోంచి పరిగెత్తించుకుంటూ తీసుకొచ్చి మన సెల్స్ లో పడేసి తాళాలు వేసి, పట్టిన చెమటను తుడుచుకొని పారాహుషారని అరుస్తాడు.

    మనం చటుక్కున పడుండిపోయి నిద్ర నటిస్తాం. దేర్ ఎండ్స్ ది మేటర్ ....ఇదీ రియల్ లైఫ్ డ్రామా అంటే.... టైమ్ కావస్తోంది- మెంటల్ గా ప్రిపేరయిపో- నేనిచ్చే ట్రైనింగ్ కి ఒకింత కఠినంగానే వుంటుంది. భయపడి సెల్ కేసి పరిగెత్తుకురాకు- మొండికేసి పట్టుదలతో నేర్చుకో...." అన్నాడు రామదాసు, నాయుడుకోసం ఎదురుచూస్తూ.

    భయోద్వేగంతో కూడుకున్న ఒక శీతల పవనం తనను అకస్మాత్తుగా చుట్టిముట్టినట్లుగా ఫీలయ్యాడు వివేక్.

    ఇదంతా తను చేయగలడా....? తనవల్ల అవుతుందా? బజారులో పోలీసులెదురైతేనే, తప్పుచేయకపోయినా, చేసినట్లుగా తల వంచుకుని వెళ్ళే తనవల్ల ఈ పని అవుతుందా....?

    ఎందువల్లో విపరీతమైన నెర్వస్ నెస్ ఫీలయ్యాడు. "మీరేమీ అనుకోనంటే. ఆలోచించుకోడానికి నాకు మరో రోజు కావాలి" అన్నాడు వివేక్ నెమ్మదిగా సిగ్గుపడుతున్నట్లుగా.

    రామదాసు ఆశ్చర్యపోలేదు- కోపగించుకోలేదు.

    అలాగే కానియ్ అన్నట్లు తలూపాడు.

    వివేక్ మనస్పూర్తిగా, పట్టుదలతో రంగంలోకి దిగకపోతే తనిచ్చే ట్రైనింగ్ కే భయపడి వెనక్కిపోయే ప్రమాదం వుంది. అందుచేత ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని మిన్నకుండిపోయాడు రామదాసు.

    మొత్తానికి ఆ రోజు ప్రోగ్రాం అనుకోకుండా కేన్సిల్ అయిపోయింది.


                         *    *    *    *


    మరుసటి రోజు ఉదయమే చిన్న స్లిప్ మీద ఏదో కోడ్ వర్డ్ రాసి, చిదంబరానికిచ్చి, కిట్టూకి అందజేయమన్నాడు రామదాసు. చిదంబరం తెగ సంతోషపడిపోయాడు. ఖైదీలు జైలు నిబంధనల కనుగుణంగా నడుమకుంటేనే సెంట్రీలకు, గార్డ్ లకు బాధ. ఆ నిబంధనల్ని తప్పిస్తేనే తమకు లాభమని వాళ్ళకు బాగా తెలుసు.


                         *    *    *    *


    ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జైలు లోపల వున్న పూల తోట దగ్గర ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది.

    అదే వివేక్ ని రాక్షసుడిగా మార్చింది.    

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra