Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 24

    3. అక్షరం చిన్నది వ్రాసి తలకట్టు పెద్దదిగా ఇచ్చేవారు చాలా శక్తివంతులై వుంటారు. ఒకవేళ వీరు శారీరకంగా బలహీనులైనా మానసికంగా మాత్రం మంచి శక్తి కలిగి వుంటారు.

    4. ముందు ఒక సున్నాతో మొదలు పెట్టి అక్షరం పూర్తి చేసిన తర్వాత రెండో అర సున్నాగీసే వాళ్లు, సాధారణంగా తమపని పట్ల కొంచెం కంగారుతో కూడాన మనస్తత్వం కలిగిన వారై వుంటారు. వీరిలో చేసిన తప్పు సరిదిద్దుకోవాలన్న  తపన ఎక్కువగా వుంటుంది. జీవితాన్ని చాలా నిర్దిష్టమైన పరిధిలో అనుభవిస్తుంటారు.

    5. ముందు అసలు సున్నాయే లేకుండా అక్షరాన్ని పూర్తిచేసి, అవతలి వాళ్లకి అది 'త' అని చెప్పాలనుకొనే వాళ్లు సాధారణంగా లీడర్ షిప్  గుణాలుకలిగి వుంటారు. వీరిలోఈర్ష్ట్యపాలు ఎక్కువ. అవతలవాళ్లు పైకి వస్తుంటే వారిని ఎలా అధిగమించాలీ అని చూస్తుంటారు.

    6. అక్షరం పూర్తి చేసి తలకట్టు చిన్నగా ఇచ్చేవారు మానసికమైన క్రమశిక్షణ తక్కువగా కలిగి వుంటారు. వీరిని నమ్ముకుని ప్రయాణం చేయటం ఎప్పుడూ లాభదాయకం.

    1. 'క' అనే అక్షరపు కొమ్ముని, ఒక గీత, అర్దచంద్రాకారం, చిన్నసున్నాతో పూర్తి చేసేవాళ్లు హృదయం చెప్పినదానికన్నా మెదడు చెప్పేదాన్ని నమ్మేవాళ్లై వుంటారు. వీరు రొమాన్స్ లో అవతలి  పార్టనర్ ని బాగా సంతృప్తి పరిచేవాళ్లై వుంటారు.

    2. 'క' అనే అక్షరాన్ని వ్రాసి దానిపైన ఒక 'ల' ఒత్తులాంటి గీతతో మొత్తం అక్షరాన్ని 'కొ' గా చదివేవాళ్లకి తెలియపరచాలి అనుకొనేవాళ్లు తమమీద తమకి ఎక్కువ నమ్మకం కలిగిన వారై వుంటారు. అయితే వీళ్ళని నమ్ముకుంటే సగంలో ఎడారిలో మనల్ని వదిలేసే ప్రమాదం కూడా వుంది.

    3. అక్షరం మామూలుగా వ్రాసి దానికిచ్చే గుణింతాన్ని వెనక్కి వ్రాసేవారు తమమీద తమకి ఎక్కువగా నమ్మకం లేని వాళ్లై వుంటారు. ఎవరో ఒకరు ఎప్పుడూ తమని ప్రేమించాలి అనే కోర్కెని కలిగివుంటారు.  స్నేహ పాత్రులై వుంటారు. ప్రపంచం అంతా మంచిదని,అందరూ మంచివాళ్లని నమ్మే మనస్తత్వం కలిగి వుంటారు.

    4. అక్షరానికి, గుణింతానికి మధ్య తేడా వదిలేవాళ్లు మంచి సంభాషణా చతురులై వుంటారు. తమ గురించి తాము ఎక్కువ ఆలోచించేవారై వుంటారు.

    5. అక్షరాన్ని కోణాలతో వ్రాసేవాళ్ళు సాధారణంగా ఒక నిర్దిష్టమైన పరిధిలో ఆలోచించేవాళ్లు, తాము పట్టన కుందేటికి మూడేకాళ్లు. ఇంకా ఎక్కువ వాదిస్తే అసలుకాళ్ళే లేవు అనే ధృఢమైన మనస్తత్వం కలిగివుంటారు.

    6. అక్షరం పెద్దది వ్రాసి పైన గుణింతం చిన్నదిగా వ్రాసి పూర్తిచేసేవాళ్లు, తెలివైన వాళ్లు, తమపనిని ఏదో విధంగా తొందరగా పూర్తి చెయ్యాలనుకొనేవాళ్లై వుంటారు.

    1.గుణింతానికి అసలు విలువ ఇవ్వని వాళ్లు తమ గురించి ప్రపంచం ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోని  వారై వుంటారు.

    2.అక్షరం చిన్నది వ్రాసి, గుణింతాన్ని అవసరమైనదానికన్నా పెద్దగా వ్రాసేవారు తమలోపాలు ఎన్ని వున్నా వాటిని బైటపడనివ్వకుండా ప్రపంచానికి ఒకగొప్ప వ్యక్తిలాగానో, విశిష్టమైన  వ్యక్తిలాగానో కనిపించాలనే తపన కలిగి వుంటారు.

    3. చిన్న గీతతో అక్షరం పూర్తిచేసి, గుణింతంలో మొత్తం అక్షరాన్ని పూర్తిచేద్దామనుకొనేవాళ్లు ఇంట్రావర్డ్ లై వుంటారు. వీళ్లని అర్దం చేసుకోవడం చాలా కష్టం.

    4. అక్షరానికి ముందువైపు గుణింతం వ్రాసి, ఆ గుణింతానికి ఒక సంపూర్ణత్వాన్నిచ్చే వారు సాధారణంగా తాము చేస్తున్న పనికంటే దాని ఫలితాన్ని బాగా ఆశించే వారై వుంటారు.

    5. నిర్దేశింపబడిన అక్షరంలాగ కాకుండా దాన్ని అనవసరంగా మెలికలుతిప్పే వారు కొత్తవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి వుంటారు.

    6. మొత్తం అక్షరాన్ని కోణాలతో పూర్తి చేసేవారు ఎక్కువ కఠిన మనస్కులై వుంటారు.

    1.అక్షరాన్ని గుండ్రంగా వ్రాసి ఎంత ప్రాముఖ్యతవుందో అంతే ప్రాముఖ్యతని గుణింతానికి కూడా ఇచ్చి పూర్తి చేసేవాళ్లు స్నేహ పాత్రులు, దయార్ద్ర హృదయులూ అయివుంటారు.

    2. అక్షరాన్ని రెండుగీతలతోపూర్తి చేసేవాళ్లు సాధారణంగా ఎంత పెద్ద పనినైనా సులభంగా పూర్తిచేసే నేర్పు కలిగివుంటారు. వీరు ఫలితంకన్నా పనిపూర్తి చెయ్యటంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు.

    3. అక్షరాన్ని, గుణింతాన్ని సమానంగా బ్యాలెన్స్ చేసేవారు జీవితంలో నిరర్దకమైన ఆలోచనలపట్ల ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తారు. పనికన్నా  ఆలోచనలపట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు.

    4. ప్రారంభించవలసినదానికన్నా ముందుగా ప్రారంభించి ఒక మెలిక తిప్పి పూర్తిచేసే వారు ఎక్కువగా గతం మీద ఆధారపడేవారై వుంటారు. ఆలోచనల చురుకుదనంకన్నా  ఆలోచనల వల్ల కలిగే  ఫలితాలను ఎక్కువ ఆలోచించేవాళ్లై వుంటారు.

    5.అక్షరం మొదలు పెట్టేటప్పుడు మామూలుగా ప్రారంభించి చివరలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళై వుంటారు.

    6. గుణింతాన్ని తొందరగా పూర్తి చేసేవాళ్లు అవతల వాళ్లమీద ఎక్కువ ఆధారపడేవారై వుంటారు. వీరు జీవితంలో పైకి రావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఎంత సాధించినా, ఇంకా సాధించవలసింది ఎంతోవుంది అనే అభిప్రాయంలో వుంటారు.

 Previous Page Next Page