Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 24

    ఈ పర్యాయం  పెకాడుతున్న వారిలో మరొకరు చిల్లర పైసలు తీసి అతడి దోసిట్లో వుంచాడు. ఈ పర్యాయమూ అతడు ఆ చిల్లరిని నేల జారవిడిచాడు. దానితో అతడికి చిల్లర పైసలు చాలవేమోనని, తమ ఆటకు అంతరాయంగా వున్నదని ఒకడు పదిరూపాయల కాగితాల్ని తీసి అతడి దోసిట్లో వుంచాడు. మరోఅక్కమారు అతడు రూపాయి నోట్లను నేలవిడిచాడు. నేలపై చిందరవందరగా పడివున్న మాంసంముక్కల్ని, చిల్లర పైసల్ని, రూపాయి కాగితాల్ని చూసిన అతడు చిరాకుపడ్డాడు.

    "పండీట్ జే,ఇంతకీ నీకేం కావాలి__ మమ్మల్నిల మధ్యలో సతయిస్తావెందుకు" అని నిలదదీశాడు.

    "ముందు కవాలేమోరా..." పేక దగ్గర కూర్చున్నావారిలో ఒకడున్నాడు.

    "ఏం పండిజ్ జీ, చుక్కకవలా, చక్కని చుక్క కావాలా?" ఎద్దేవా చేస్తూ అడిగాడతాడు.

    "నాకు అర్ధంగాక రెట్టించాడతడు.

    "అవును. విద్యను ప్రసాదించమని ప్రాధేయపడటానికివచ్చాను."

    "క్యా మజాకర్ రే పండిజ్ జీ_ మమ్మల్ని ఎద్దేవా చేస్తున్నారా?"

    కాదు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకో చిన్నసాయం కావలి అదీ మీ వల్లే."

    "పండిజ్ జీ, పదిమంది కట్టుకలు కావుయమతే కోస్తాం. రక్తపాతం సృష్టించమంటే తగలబేడ్తాం. కాని చడుబు చెప్పమంటే ఎలా? మాలో ఏ ఒక్కరికీ పొట్టకోసినా అక్షరం ముక్కరాడు.

    "మమ్మల్ని చదువు చెప్పమని_ చదువు నేర్చుకోమని నేను అడగడంలేదు. కాని, నాకుసాయం చేయమని అడుగుతున్నాను, రైల్వే ప్లాట్ పారంస్ మీద, పుట్ పాత్ లమీద, కాఫీ హొటళ్ళ దగ్గర, బీచ్ లో తిరిగే అనాదుల్ని తీసుకొస్తున్నాను. పప్పు బెల్లాలు, తిండి పెట్టి చదువు చెప్పాలనుకుంటున్నాను_ అందుకు మీ సాయం కావాలి."

     ఆ పండిజ్ జీ  మాటలు 'తంబి' ప్రేగుల్ని కదిలించాయో, కంటతడి పెట్టించాయో తెలియదు గాని ముక్కల్ని "డ్రాఫ్" అంటూ జారవిడిచిలేచాడు. పండిజ్ జీ ని సమీపించాడు.

    "పండిట్ జీ మీ ప్రయత్నం మీరు చేయండి_ ఏ సహాయం కావాలన్నా నేనున్నాను."

    "అనాధులకు విద్యా దనాన్ని ప్రసాదించే ఓ దాతా!  నీకు నా శతసహస్ర వందనాలు... అందుకు అవసరమైన పలక బలపాలు, పుస్తాకాలు మిఠాయిలు తెచాను. గణపతి ఆలయం దగ్గర అరుగుమీద చదువు చెప్పబోతున్నాను. కానీ అందుకు అనుమతి నిరాకరించి... రౌడీలు, గూమ్దాలుగా__ అదీ బ్రతికుంటే_ మీరే మర్చి విద్య వంతులుగా, భాధ్యతగల పౌరులుగా, సంస్కార వంతులుగా తీర్చదిద్దడానికి వారిని బ్రతిమాలి, నచ్చచెప్పి, తీసుకొచ్చాను, నేను జోలెపట్టి వారు అడుక్కు తినకుండా చేస్తున్నాను. కాని నా ప్రయత్నాన్ని నిరోధిస్తున్నారు.  చదువునేర్చుకునే  ఒకొక్క పిల్లవాడికి నేలకు వందరూపాయలు రౌడీ మామూలు ఇవ్వాలట! ఇదేక్కడన్నా వుందా? మీరంతా గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి__ ఏ తల్లి కన్నదోతెలియని అ బిడ్డలా భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పండి. రేపటి ఘర్షణలకి_ సంఘర్షణలకి సమిధులయ్యేది మీరుకాదా! చెప్పండి బాబూ చెప్పండి. ఆ పసివారికి విద్యాదానం చేయండి. ఈ రౌడీ మామూలు లేకుండా చేయండి" అని రెండు చేతులూ జోడించాడు.

    "పండిట్ జీ! మీ ప్రయత్నం చాలా మంచిదే... మేమూ అభినందిస్తున్నామ్కని ఆ వినాయుకుడి గుడి మా డివిజన్ లోకి మేము రాకూడదు. అదిగాక మేము చేయడగినసాయం ఇతరత్రా ఏదయినా వుంటే చెప్పండి" అన్నాడొకడు.

    "బాబూ! నా కోసం నేను ఏడీ అడగడంలేదు. జేబుదొంగలుగా, రౌడీలుగా, గూండాలుగా, హంతకులు గా. స్మగ్లర్స్ గా రేపటి రోజున దిన దిన గండం నూరేళ్ళాయుషుగా బ్రతకవలసిన అనాదుల జీవితాలను బాగు చేద్దామన్నా ఆలోచనతో చేతులు చాచాను. ఇహ మీరు కూడా అల అంటే ఇంక నేనేం చేయగలను బాబూ... వారికి వారిని కన్నవారే అన్యాయం చేశారనుకుంటే ఈ పాండు కూడా అన్యాయం చేస్తున్నాడు. మీరయిన సాయం చేస్తారుమోనని ఆశపడ్డాను. పోన్లే బాబూ బిడ్డల్ని పస్తులుంచయినా ఆ రౌడీ  మామూలు చేల్లిస్తాను__" అంటూ నిస్సహాయంగా. నిస్సత్తువగా వెనుదిరినవాడల్లా, "పండిట్ జీ ..." అన్న పిలుపుతో ఆగిపోయాడు.

     ఆ పిలిచినా వ్యక్తీ తంబి.

    "మీ ప్రయత్నం మీరు చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను. రేపు ఉదయం ఏడుగంటలకల్లా నేను గుడి దగ్గర వుంటాను.స్కూలు ప్రారంభించండి" అన్నాడు తంబి.

    ఆశ్చర్యపోవడం మిత్రుబృందానిదయితే "మహా సంతోషం. ఆ భరోసా ఇస్తే చాలు. భగవంతుడు నున్ను చల్లగా చూస్తాడు" అంటూ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు.

    "తంబీ! ఏమిట్రా_ఏమిటి నువ్వనేది? వాడి ఏరియాలోకి మనం క్లెట్ట గూడదన్నా సంగతి నీకు తెలియనిదా?" అంటూ నిలదీశారు.

    "మహనధులకి, దేవలాయలకి, సత్కార్యాలకి హద్దులు_ అంక్షలు లేవు. మా అమ్మతో కలసి నేనొకనాడు బీచ్ కి వెళ్ళాను. మా అమ్మా ఏమైపోయిందో నాకు తెలియదు. కాని నేను ఆ ఉప్పునీళ్ళు తాగుతూ, ఎందు చేపలు కాల్చుకుతింటూ బ్రతికాను. అనవసరంగా నామీద పది కొట్టేవారు. వరి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి 'స్ర్తీట్' ఫైటర్' గా మారాను. ఆ పండీట్ జీలా ఎవరయినా ఒకరు నన్ను ఆ రోజున ఆదరించివుంటే__ భగతుండా! ఎన్నిరోజులు నేను మృత్యువుతో పోరాడానో, నన్ను నేను కాపాడుకోవడానికి ఏమ్తమంది ప్రాణాలు తీశానో నాకే తెలియదు....మనిషిని ,మనిషి క్ల్చుకునే అనాగరికత ప్రపంచంలో బ్రతుకుతున్నాం. కనీసం రేపటి త్రామయినా మనలా తయారవ్వ కుంటే అదే పదివేలు. అందుకే 'సరే' అన్నాను" అన్నాడు తంబి.

 Previous Page Next Page