"కుష్టురోగి శరీరంలోని ఒక్కొక్క భాగమే కుళ్ళి రాలిపోతున్నా బతకాలని తాపత్రయ పడ్తాడు! ఎందుకు? ప్రాణికి బ్రతుకు మీద ఉండే తీపి గురించి నీకు నేను చెప్పనక్కర్లేదు. సుధ శ్రీమంతుల బిడ్డ. ఏ కష్టం లేదు. అలాంటి సుధ ప్రాణం తీసుకోవడానికి ఊరికే ప్రయత్నించిందని నన్ను నమ్మమంటావా?" తీవ్రంగా అడిగింది రేణుక.


    గౌతమ్ రేణుక ముఖంలోకి వెర్రివాడిలా ఓ క్షణం చూశాడు.


    "చెప్పు సమాధానం! ఒకవైపు సుధను మోసం చేశావ్. మరో వైపు నీ బండారం బయట పడ్డాక కూడా ఇంకా నన్ను నమ్మించాలనే చూస్తున్నావ్!"


    "రేణూ!"


    "నా పేరు రేణుక!"


    "సారీ! చూడండి రేణుకా దేవిగారూ! మీరు విన్నది, ఊహించేది అంతా అబద్ధమే. కళ్ళుండీ ఎదురుగా కన్పించే వస్తువును చూడకుండా కళ్ళు మూసుకొని మరోదాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నారు"


    "చనిపోయే ముందు ఎంత దుర్మార్గుడు కూడా అబద్ధం చెప్పడు"


    "అవును! నేను అలాగే అనుకుంటూ ఉండేవాణ్ణి"


    "సుధ నాకు అన్ని విషయాలూ రాసింది"


    "సుధ ఉత్తరం రాసిందా?"


    "ఆ అవును! నాకు అంతా తెలుసు. నన్ను మాటలతో మభ్యపెట్టటానికి ప్రయత్నించావు"


    "నేను బహువచనంలో సంబోధిస్తున్నాను"


    "సారీ!" అన్నది రేణుక.


    "ఫర్వాలేదులే. మీ మాటలు మీరే మర్చిపోయారు. అందుకే గుర్తుచేశాను"


    రేణుక మాట్లాడలేదు.


    "నేను ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను నమ్మితే నమ్ము సుధ బతికే ఉందిగా? వెళ్ళి మాట్లాడక పోయావ్!"


    "ఏ ముఖం పెట్టుకొని....."


    "మధ్యలో నువ్వేం చేశావ్?"


    "ఆమె ప్రేమిస్తున్నవాణ్ణీ...."


    "ఆగు! నువ్వు విన్నది అబద్ధం! ఆమె రాసింది అబద్ధం! నువ్వు ఊహించుకుంటున్నది.


    అబద్ధం! సుధకు నామీద ప్రేమ ఉంది అనడం అబద్ధం! నేను ఆమెను ప్రేమించానని చెప్పడం అన్నింటికంటే పెద్ద అబద్ధం! ఆమెను నేను మోసం చేశానని చెప్పడాన్ని ఏమనాలో నాకు బోధపడటం లేదు."


    "అబద్ధం...అబద్ధం...అబద్ధం...అన్నీ అబద్ధాలే! అయితే సుధ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది"


    "ఈర్ష్య! నేనంటే కాదు...నువ్వంటే ఈర్ష్య? ఈర్ష్య ప్రేమకంటే బలమైంది. ఆమెకు ఏంకావాలో ఆమెకే తెలియదు. ఇలాంటివారు ప్రపంచం అంతా తమచుట్టూనే తిరుగుతుందని భ్రమలో బ్రతుకుతారు. ఆ ప్రపంచం తమ చుట్టూ తిరగడం లేదు... మరొకరి చుట్టూ కూడా కొంత ప్రపంచం తిరుగుతుందనే  నిజాన్ని వారు భరించలేరు. ఎలాగయినా ఆ ప్రపంచాన్ని కూడా తమ చుట్టూనే తిప్పుకోవాలని ప్రయత్నిస్తారు. ప్రయత్నం ఫలించకపోతే వారిలోని ఈర్ష్య ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం ప్రతీకారాన్ని కోరుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు" ఆపి ఓ క్షణం రేణుక ముఖంలోకి చూశాడు.


    రేణుక అతనినే చూస్తోంది నిర్వికారంగా చూస్తున్నది.


    "నేను చెబుతున్నది వింటున్నారా రేణుకా దేవిగారూ!"


    "చెప్పండి"


    "నేను ఎప్పుడూ సుధారాణితో మాట్లాడలేదు. ఆమెకు నా మీద ప్రత్యేకమైన అభిమానం కూడా ఏమీలేదు. నేను బీదవాణ్ణి. నా గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండి ఉండదు. నువ్వంటే నాకు ఇష్టం అని ఎలాగో ఆమెకు అర్థం అయింది. చాలా తెలివైనది. చదువు మీద ధ్యాస ఆమెకు ఏనాడూ లేదు. సరదా కోసం చదువుతోంది. ఇలాంటి విషయాల మీద ఆమె తెలివితేటల్ని కేంద్రీకరిస్తుందను కుంటాను. ఆ తర్వాత మన మధ్య చనువు ఏర్పడింది. మనం బయట కూడా తిరుగుతున్నాం. అప్పుడు ఆమె నన్ను పరిశీలించి చూడసాగింది. తనకు తెలియకుండానే ఆకర్షణను పెంచుకుంది. అది కేవలం నీ మీద ఈర్ష్య వల్ల కలిగే ఆకర్షణే! ఒకటి రెండుసార్లు నాతో ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నించింది. నేను ముభావంగా సమాధానం చెప్పి ఉండిపోయాను"


    "అబద్ధం! నేను నమ్మను"


    "అది మీకర్మ! దానికి నేను బాధ్యుణ్ణికాను. నేను చెప్పేది ముందు పూర్తిగా వినండి"


    కటువుగా ఉన్నది గౌతమ్ కంఠం.


    "ఆమె అహం దెబ్బతిన్నది. శ్రీమంతుల ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగింది. తన చుట్టూ తిరగవలసిన ప్రపంచం తాలూకు ముక్క ఒకటి మరొకరి చుట్టూ తిరుగుతోంది. అది ఆమె సహించలేక పోయింది. ఈర్ష్య ద్వేషంగా మారింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. కసి... కసి... భరింపలేని కసి ఆమెలో బయలుదేరింది. ఏదో చెయ్యాలి? ఎవర్నో కాటు వెయ్యాలి. అప్పుడు కాని ఆ విషానికి అవుట్ లెట్ ఉండదు. ఆ విషాగ్నిలో నుంచి తను బయటపడదు. అందుకే నిద్రమాత్రలు తిన్నది. చావాలని తిన్నదని నేను అనుకోను."


    "గౌతమ్!"


    "గారూ!"


    "సారీ!"


    "వినండి! కసి తీర్చుకోవాలి. ఎవరిమీద? నా మీద! కాదు నీమీద! నీకు నేను దూరం అయితే గాని నువ్వు బాధపడవు. ఆమెకు కసి నామీద కంటే నీమీదే ఎక్కువ"


    "ఎలా తెలుసు?"


    "అదే సైకాలజీ! శరీరాల్ని కొయ్యడం మాత్రమే కాదు మనం మనసుల్ని కూడా కోసి మానవ మనోభావాలను అర్థం చేసుకోవాలి. మనుషుల్ని కొయ్యడం అంటే కత్తితో కొయ్యడం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను"


    "ఆ మాత్రం అర్థం చేసుకొనే బుర్ర నాకూ ఉంది?"


    "నిజంగా?" తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్.


    రేణుక వళ్ళు మండిపోయింది. గౌతమ్ తనను అవమానిస్తున్నాడు అతనికి ఆ హక్కు ఎవరిచ్చారు?


    "నన్ను అవమానించే హక్కు మీకెవరిచ్చారు?"


    "కొన్ని హక్కులు వాటంతటవే సంక్రమిస్తుంటాయి"


    రేణుక మాట్లాడలేదు.


    "వినండి. ఆమె చావాలని ఆ మాత్రలు వేసుకోలేదు. డాక్టర్ చదువుతున్న ఆమెకు ఆ కొద్ది మాత్రలకు ఎవరూ చనిపోరని తెలుసు. పైగా ఆ వేసుకున్న మాత్రలు "కాం పో జ్". పైగా అన్నం తినకముందు వేసుకుంది. అన్నానికి పిలవడానికి వచ్చినవాళ్ళు చూస్తారని తెలుసు. అలాగే జరిగింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. నేను తన ఆత్మహత్యకు కారణం అయినట్టు ఉత్తరం రాసిపెట్టింది. కేవలం అల్లరి చెయ్యడానికే! నీకు ఉత్తరం రాసింది. మెడికల్ రిపోర్టులో అది అబద్ధం అనే తేలింది. నామీద కేసును ఆమె తండ్రి రద్దు చేసుకున్నాడు. నన్ను క్షమాపణ కూడా అడిగాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra