Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 1


                                         ఆకాంక్ష
    
    సింహాచల శ్రీనృసింహ సర్వాంగీణ
        చారుచందనసార సౌరభములు
    శేషగిరీశ్వర శ్రీవేంకటేశ్వర
        శుభ్ర మందస్మిత విభ్రమములు
    వరకాంచికాపురీ వరదరాజస్వామి
        అక్షీణ దాక్షిణ్య వీక్షణములు
    శ్రీరంగా మంగళ శ్రీరంగనాయక
        వైజయంతీ కాంతివైభవములు
    
    శాంతపావన శ్రీమదనంతశయన
    పద్మనాభ ప్రభు ప్రభా ప్రాభవములు
    శ్రీజగన్నాథ దివ్య నీరాజనములు
    నవనవశ్రీలు చిందు నా కవితయందు!
    
                                      త్యాగయ్య
    
    తాత గిరిరాజు కవిరాజు; తండ్రిగారు
    రాలు కరగించు గొప్ప పౌరాణికుండు;
    కవితయుణు గానమును రెండు కలిసిమెలసి
    కాపురమొనర్చె త్యాగయ్య గళమునందు.
    
    అందములొల్కు చిన్నకృతు లల్లును, గాన మొనర్చు గీతగో
    విందము నిండుగుండెలు ద్రవింప, వెలార్చును అన్నమయ్య మా    
    రంద సుధాఝరుల్, రస తరంగములన్ విరజిమ్ము, వీనులన్
    విందొనగూర్చు రేకు లరవిచ్చు పురందరదాసు కీర్తనల్ !
    
    నాయనగారు ధౌతవసనంబులు దాలిచి దేవతార్చనల్
    సేయుచునుండ, తాను తులసీదళముల్ వికచప్రసూనముల్
    దోయిలి నిండ దెచ్చి, వినతుండయి తండ్రికొసంగు, వాలుకం
    దోయిఁ బ్రమోదబాష్పములు తొన్కఁగ భక్తి రసప్రపూర్ణుఁడై !
    
    ధ్యానము రామభద్రుని పదమ్ములపై నిడి, లక్ష్యలక్షణ
    జ్ఞానము సంతరించె! స్వరసప్తకమున్ గ్రహియించె; రాగముం
    దానము పాడె; పల్లవి విధాన మెఱింగె; రస ప్రధానమౌ
    గానమునం జగాన మఱి గానము త్యాగయకున్ సమానమున్ !!
    
    కంజాతభవురాణి ముంజేతి రాచిల్క
        కల్కికంఠమ్ములో నొల్కు సూక్తి
    ముద్దులగోపాలు మోహనమురళిలో
        అందాలు చిందు రాగానురక్తి
    ద్రుహిణమానసపుత్రు మహతీ విపంచిలో
        స్పందించు భక్తిరసప్రసక్తి
    బాలభాస్కరదేవు బంగారు కిరణాల
        తనరారు నవ్యచైతన్యశక్తి
    
    ఏకమై, లోకమున నవాలోకమైన
    ఆంధ్ర సంగీతలహరిలో నైక్యమంది
    కృతులుగా మారి నవనవాకృతులు దాల్చి
    త్యాగరాజుల గొంతులో మ్రోగసాగె.
    భోగిరాజుల మిసిమి పాన్పున బరుండి
    ఉదధికెరటాల నటు నిటు నూగు ప్రభువు
    త్యాగరాజుల తంబురాతీగలందు
    రాగముల మీఁద నుయ్యాల లూగసాగె.
    
    జయదేవుకడ క్రోధమయి రాధ చరణాలు
        ముద్దుల మౌళిపై మోసిమోసి
    అన్నమార్య సమక్షమం దేడుకొండల
        నొంటిగా కాపురముండి యుండి
    క్షేత్రయ్య రసమయ్యక్షేత్రాన పలు నాయి
        కల బిగికౌగిళ్ళ నలిగి నలిగి
    తీర్ధులవారు గద్దింప వ్యత్యస్త పా
        దారవిందములతో నాడి యాడి
    
    విసిగిపోయి సుంత విశ్రాంతికోసమై
    సీతతోడ అనుగు భ్రాతతోడ
    విశ్వమయుఁడు ప్రభువు వేంచేసియున్నాఁడు
    రాముఁ డగుచు త్యాగరాజు నింట !
    
    నుతు లొనర్చుచు దేవతాతతులు మ్రొక్కు
    శ్రుతులతో నొత్తిగిలు పరంజ్యోతి నేడు
    శ్రుతుల విడనాడి తంబురా శ్రుతులు మరగి
    కృతులు వినుచుండె త్యాగయ్యగృహమునందు !
    
    బాలభాస్కరదేవు బంగారు కిరణాలు
        కమలాకరాలలో కదలు లీల
    శారద పూర్ణిమ చంద్ర చాంద్రీద్యుతుల్
        నెలరా కపోలాల నిమురు లీల
    మధుర మోహన మంద మలయ మారుతములు
        వల్లీ పదాగ్రాల వ్రాలు లీల
    జలధరస్వామి శీతల వర్షధారలు
        సస్యకాంతల ముద్దుసలుపు లీల
    
    తియ్యతియ్యని శ్రుతులు త్యాగయ్య కృతులు
    శ్రోతృహృదయాల నానంద సుధలు చిందె;
    ప్రాజ్యమైన సంగీత సామ్రాజ్యమునకు
    రాగమయ రాజరాజు! మా త్యాగరాజు !!
    
                             ఆదిభట్ల నారాయణదాసు
    
    ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుఁ! డెవం డీ శారదామూర్తి! యీ
    నవశృంగార రసావతారుఁడెవరన్నా! శ్రీమదజ్ఞాడయే
    యవునా! ఆ దరహాస! మా నడకతీ! రా ఠీవి! యా దర్ప! మా
    కవితాదీప్తి! యనన్యసాధ్యములురా! కై మోడ్పు లందింపరా!
    
    పండించె నీ కాలి గండపెండెరము రం
        గారు ముంగారు బంగారు పంట
    నర్తించె నీ కీర్తి నవనవస్ఫూర్తి యా
        సేతు శీతాచల క్ష్మాతలాన
    జోహారులందె నీ సాహిత్యనందిని
        కదిలించి సహృదయహృదయములను
    గంభీరమయ్యె నీ "శంభో" నినాదంబు
        దిగ్దిగంతాలఁ బ్రతిధ్వనించి
    
    కాంతు లీనెను రాజ సభాంతరాల
    నీ జయశ్రీ దృగంత నీరాజనాలు;
    యక్షగానకళా మహాధ్యక్షపదవి
    అక్షరంబయ్యె నీపట్ల "నాదిభట్ల!"
    
    చిఱుతాళముల జత చే ధరించినఁ జాలు
        లయతాళములు శుభోదయము పలుకు
    కాలిగజ్జె లొకింత ఘల్లు మన్నం జాలు
        భరతమ్ము నీ ముందు శిరసు వంచు
    వీణ తంత్రుల మునివ్రేళ్ళు సోకినఁ జాలు
        సంగీతవాహిని పొంగిపొరలు
    గంటంబుఁ బూని క్రీగంటఁ గాంచినఁ జాలు
        కవిత నీ యెదుట సాక్షాత్కరించు
    నేఁటి కథకులందు నీ పేరు చెప్పక
    గజ్జె గట్టువాఁడు కానరాఁడు;
    తెలుగువెలుఁగు దేశదేశాల నింపిన
    హరికథా పితామహా! నమోస్తు !!
    
    కల్యాణి రుక్మిణీ కన్య మెల్లఁగ నల్ల
        నయ్య భుజమ్ముపై చెయ్యి వైచె
    జనని జానకి మహాశపథమ్ముతో సుప
        థమ్ము చూపెను సతీధర్మమునకు
    వరగాత్రి సావిత్ర వైవస్వతుని నిల్పి
        మగని ప్రాణాలకై తగవులాడె
    చిన్ని మార్కండేయ శివభక్తి పదమెత్తి
        మృత్యుదేవత గుండె మీఁదఁ దన్నె
    "మ్రొక్కుబడిఁ" జిక్కువడి వేదఋక్కు లెల్ల
    నచ్చపుం దెల్గు కలకండ లచ్చువోసె;
    నీదు ప్రతిభకు లోనుకానిది మఱేది?
    స్వర సురత్రాణ! అష్టభాషా ప్రవీణ!
    
    చల్లపల్లి నృపాలు సంతోష మెంతయో
        గండ పెండర మిచ్చి గౌరవించె
    ఆనందగజపతి మేనెంత పొంగెనో
        రమణీయరత్నహారము లొసంగె
    మైసూర్ మహారాజు మదిముద మ్మది యెంతొ
        కనకాంబరమ్ములు కట్టఁబెట్టె
    సరస విద్వన్మహాసమితి మే లెట్టిదో
        ఘంటా సువర్ణ కంకణము లిచ్చె
    లలిత సంగీత సాహిత్య కలిత యగుచు
    భరతభారతి హారతి పట్టె నీకు;
    హరికథావ్యాసునకును - స్నేహార్ధ్ర మధుర
    హాసునకును - నారాయణ దాసునకును -

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra