Home » Chalam » Musings 2


    అసలు రాముడు తెలివితక్కువ వాడు. చిన్నప్పుడు చందమామ కోసం యెడవడం బట్టి తెలుసుకోవచ్చు. అతను idiot  యిడియెట్ అని. యామన్నా సందేహం వుంటే అద్దంలో చందమామను చూచి సంతుష్టి పడ్డాడన్నా సంగతి చదవగానే congenital idiot అని నిశ్చయ'మవుతుంది.
    అందుమూలానే ప్రతివాడికి చులకన -- తండ్రికి , సవతితల్లికి, రావణుడికి, మారీచుడికి, విభీషణుడికి, సుగ్రీవుడికి , వశిష్టుడికి, చాకలాడికి , వాచకాలు రాశే వాళ్ళకి కూడా. రాముడి తెలివి చూపించడానికి చంద్రుడు - అద్దం పాఠం వ్రాస్తారు- పిల్లలకు ఆదర్శంగా .
    రాముణ్నీ , కాసబియాం కానీ, ధర్మరాజునీ, ఆదర్శంగా చూసే ఈ టీచర్లూ, వాచక కారులూ, బడులూ యివి తలుచుకుంటే యెంత 'వొద్దు నీకెందుకు వాటి జోలి?' అని వివేకం చెప్పుకున్నా నా కలం పరిగెత్తుతుంది- స్వాధీనం తప్పి. ఈ రాముణ్ణి కృష్ణుణ్ణి వొదిలి బడుల విషయాలతో నా దినచర్య ఘోరాలతో యీ పేజీలు  నింపెయాలని చూస్తుంది. ఎవరికి వుపకారం , నాకు అపకారం తప్ప యీ రోదన! మలేరియా , వివాహం , క్షయ, దారిద్రం, కుష్టు కల్పించిన శక్తులే మానవజాతికి యీ విద్యావిధానాన్ని వివాహ సంస్కారాన్నీ కటాక్షించినాయి.
    "విద్యావిహీనః పశుః" అన్నమాట ముమ్మాటికీ నిజం. పశువులకున్న శాంతీ, నిర్మలత్వమూ, జీవితంలో adjustment నీ , మనుషుల్లో చంపేసింది విద్య. పశువుకన్న హీనం చేసింది మనుషుల్ని. ఆరోగ్యం, ఆత్మవికాసం , సంతోషం, జీవితం మీద ప్రేమ అన్నీ నశించాయి. సమస్తలో కాల్ని ప్రియుడిగా చూసి పట్టలేని తన ఆనందాన్ని నిర్భగ్యులకు పంచాలని చూడవలసిన పత్రివ్రతలూ , వివాహ మంత్రాన్ని ఆశ్రయించుకొని జలసీ, చీదరా, తగాదాలు , కోపం, కాపీనం వీటితో ఎట్లా కుళ్ళు తున్నారో, అట్లానే యీ లోకాన్ని అర్ధం చేసుకొని, జీవితాన్ని సమన్వయం చేసుకొని జ్ఞానతృష్ణని సంతుష్టి పరుచుకోడానికి సహాయపడవలసిన విద్య, విద్యావంతుల్ని  యే సామరస్యమూ లేక సంఘంతో, భార్యలతో, సృష్టితో, తమ వాంఛలతో మెలిగే విధం తెలియక నశించే వారిని గా చేసుంది.
    The spectores of famine, of plague of war etc, are mild and gracious symbols compared with that menaeing figure. Universal Education, with which we are threatened, which has already cunushed the genious of the last five and twenty years of the nineteenth century, and produce. I a limitless abortion in that of future time. Education, I tremble before thy dreaded (sacred too) name . The cruelties of Nero of Caligula what were they? - a few crunched limbs in the amphitheatre; But there ; O Education, are the yearning of souls sicks of life. maddening discontent, all the fear some and fathomless sufferings of the mind.
                                                                 GEORGE MOORE.
    అంటున్నాడు జార్జి మూరు. అతని వెంట బళ్ళల్లో తాము పడ్డ కష్టాలనీ, యీ విద్య చేసే అపకారాల్నీ గోలపెట్టి వినిపించారు లోకానికి, world thinkers , టాగురూ, కెర్నర్డుషా, బెట్రేండు రస్సెల్, ఏదేల్ మాసేన్, మొదలైన వాళ్ళు.
    "పిల్లలు బాధలు పడుతున్నారా బళ్ళల్లో! యీ విద్య వల్ల నష్టాలు కనబడనే!' అనే వాళ్ళు లక్ష. కాని సుఖరోగాలు సర్వసాధారణం కావడం వల్ల ప్రజలు నిర్లక్ష్యంగా తిరగడం వల్ల, వాటి బాధ, వాటి అపకారం తక్కువయిండా? అందరూ విద్యను తిట్టే వారే. ఎవరూ మానుకోరు, మార్చరు. పైకి తిట్లే కాని లోపల అందరికీ నమ్మకమే -- విద్యలో. నా హృదయంలో దిన దినమూ మండే యీ తపనను ఎట్లా తెలియచెయ్యను? ఈ బళ్ళు , ఆ చీకటి , మురికీ దుమ్ము, ఆ టీచర్లు, బెత్తాలు, ఆ పాఠాలు , వాచకాలు, ఆ సన్నని బల్లలు , ఆ వాసనలు -- ఆ శుష్క పాపక్రమాలూ, - ఎన్నటికి విముక్తి! రోగాన్ని, బాధల్ని, బీదరికాన్ని, evils ఈవిల్స్ అని తిడతాము. విద్య, పాతివ్రత్యము మొదలైన ఘోరాలు పవిత్రపు పట్టుశాలువలు కప్పుకొని నిర్భయంగా సంచరిస్తున్నాయి మన మధ్య.
    పిల్లల్ని బడికి పంపడం - పిల్లల క్షేమానికి కాదు అనేవాడికి పిచ్చి పట్టిందనుకుంటారు. మొగపిల్లలకి చదువు, ఆడపిల్లలకి పెళ్ళి - యీ రెండూ పెద్దవారి callousness, atupidity, helplessness.స్వచ్చంగా కనబరుస్తున్నాయి. పిల్లల స్వభావంలో విశ్వాసం లేక, వాళ్ళ పొగరు అణచడానికి , castigate చేసేందుకు,  యీ గిత్తల్నీ, పెయ్యల్నీ, పొగరణిచి, గుమాస్తాలనీ, వంటవాళ్ళనీ గా చేసేందుకు ఏర్పరిచిన, వికృత రాక్షస సంస్తలు. బతికి వున్న పిల్లల్ని, నరికి, వొండి , డబ్బాలలో పెట్టి, మూసి, సీళ్లు వేసి , B.A. లు అనీ, ధర్మఫత్నులనీ , చీట్లు అంటించి, కొంచెంగా ప్రాణం పోసి, ఎగుమతీ చేసే యంత్ర వర్తకులు. మళ్ళీ తమ ఇంటికి రాకుండా, తమ డబ్బు ఖర్చు చెయ్యకుండా తమకి అపకీర్తి రాకుండా, బడికీ అత్తవారింటికి పంపేసి శాంతిపడే సౌకర్యాలు.
    పుట్టింది మొదలు ఆపిల్ల ఎట్లా వొదులుతుందా అనే ధ్యానం.
    పిల్లలు -- వుత్త నెత్తురు . ఎదిగే యెముకలు. ఆత్రుతతో, విశ్వాసంతో నిండిన చూపులు, ముద్దు మాటలూ , అర్ధం లేని అల్లరీ, నిష్కపటమైన మనసులూ -- చవక , అతిచవక -- పిల్ల చస్తే పిల్లను కొనడం సులభం. పురుగుల మల్లె లోకమంతా పిల్లలు -- ఎన్ని కోట్లు - ఏమైతేనేం - బాధ యేమిటో , ఎందుకు కలుగుతోందో తెలిసికోలేని పాపలు బలపం పట్టుకొని, తల వొంచుకొని ఐదు గంటలు - ఒక వంకర గీత మీద అట్లా రుద్దుతూ , ఒక్క అక్షరాలేమితి సమస్తమూనూ - టీచర్ల ప్రశ్నలూ, యీ దరిద్రగొట్టు యినస్పెక్టర్ల తనిఖీలు -- అంత నవ్వు రాకపోతే యీ కోపమే దాహించకపొతే - యేడుద్డును.
    ఒక్క హృదయమన్నా కదిలిందా? కదలదు. కదిలిందో.........
    "ఏమి స్టయిలండీ?" అంటారు.
    style. ఏమి style! నా మొహం style! మిమ్మల్ని కదిలించింది నా మాటలు కావు, నా మాటలలోని వాస్తవత. పసిపిల్లల పిచ్చి చూపులు నా హృదయంలో పుట్టించిన బాధ -- లక్షల కోరదీ దిక్కుమాలిన పిల్లలు, దరిద్రపు బళ్లలో దినదినము , గంట గంటా పడుతున్న దిక్కుమాలిన నోరులేని వేదన!
    ఎదిరించాడా, చదువు వోద్దన్నాడా, గురువు, తండ్రి, సంఘం.
    "వెధవ! చదువు రాని వెధవ! బండ! ! ! ఎందుకూ పనికిరాని మొద్దు!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra