Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 24


    డిగోల్ సైన్యాన్ని చూడ్డానికి వెళ్తాడు. కసాయి వృత్తిలో వున్నవాళ్లు కూడా మూర్ఖులే. ఇదివరలో ఒకసారి వాళ్ళని ఫూల్సుని చేసినందుకతడు క్షమిస్తాడు.
    బేడెన్- బేడెన్. జర్మన్ ప్రదేశం. సేనానులు మహాసేనానికి చిత్తం అంటారు.
    వారెంతోమంది లేరు. ఒక పిడికెడుమంది. అయితే ఏ మహా సేనానీ బలంతో మాత్రమే జయించలేడు. అలెగ్జాండరుకి అశికదళం వుంది. హానిబాల్ కి హస్తిదళం. నెపోలియన్ కి స్పీడూ, వ్యూహ నిర్మాణ సామర్థ్యం. ఇదో యుద్ధం అయినా కాదు, ఒక చిన్న దబాయింపు, తమ సేనలకు తామే భయపడిన నపుంసకులైన సార్జెంట్లమీద చిన్న ప్రయోగం.
    కమ్యూనిస్టులకి విచారం కన్నా సంతోషమే కలుగుతుంది - తమ పార్టీలో తిరుగుబాటు ఇంతటితో అంతమవుతుందని.
    డిగోల్ కొలంబే వెళ్తాడు. ట్యాంకులు సరిహద్దును దాటుతాయి. ఉద్యానంలో అతడూరేగుతాడు. ట్యాంకులు సరియైన స్థానాల్లో సర్దుకోవడానికి రాత్రంతా పడుతుంది.
    అతని భవనపు గోడల చుట్టూ ప్రచార సాధనాల సుదీర్ఘాంగుళులు వేలాడుతాయి.
    మార్పులేని చరిత్ర నిద్రపోతుంది. మనుష్యులే మారుతారు. కాని మనుష్యులు మూర్ఖులు.
    పారిస్ లో రెండులక్షల పైచిలుకు గొర్రెలు "ప్రజా ప్రభుత్వం కావాలంటూ" వీధుల్లో శాంతియుత ప్రదర్శన చేశాయి. ఆశలణిగిన ప్రజల మనిషి, మచివాడు, మెండే ఫ్రాన్సు తాత్కాలిక ప్రభుత్వం కావాలన్నాడు. సైనికులకి సిద్ధంగా ఉండమని కబురు వెళ్ళింది.
    నిర్బంధ సైనికులు - చాలామట్టుకు కర్షక కార్మిక వర్గాలకు చెందినా సిపాయిలతోనూ, విద్యార్థి ఆఫీసర్లతోనూ నిండిన సేన అదుపులో వుంది.
    రాత్రి హడావుడిగా వుంది. రక్షక సైనికులు అర్థ మిలిటరీ గ్రూపులను రాత్రికి రాత్రి పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. ట్రక్కులు పారిస్ మీద ముసురుకుంటాయి.
    బల ప్రదర్శనపు ఎత్తుగడలు. అవి ఎదురుతిరగవచ్చు.
    కమ్యూనిస్టులు, ఉపయోగపడే మూర్ఖులు, ఎంత సులభంగా సాయం చేశారో అంత సులభంగా దిగిపోగలరు. కాని మరో ఉపద్రవం - ఇదమిత్థమని చెప్పలేనిది దగ్గరపడేలాగుంది. డిగోల్ ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఉషఃకాలం ఆసన్నమయింది.

                              20

    భయంతో ఆస్తులు కాపాడుకుంటూ మృత్యువులో జీవించేవాళ్లు.....
    మేం మళ్ళీ వస్తాం
    (సెన్సియర్, పోలీసు ఆక్రమణ జరిగిన రాత్రి రాసిన హెచ్చరిక)
    రక్షణ సైనికులు బాగానే పనిచేశారు. గోలిస్టు పార్టీ సెక్రటరీ రొబెల్ పూజాద్ బాకా ఊదుతాడు. "ప్రష్యా రాజుకోసం కార్మికులు సమ్మె చేస్తున్నారు. అనగా కమ్యూనిస్టు పార్టీకోసం. ఫ్రెంచి ప్రజలకు ధైర్యమూ, ఆత్మవిశ్వాసమూ కావాలి. రిపబ్లిక్ ప్రభుత్వం విధ్వంసక చర్యలకు లొంగిపోదు. బలవంతంగా గద్దెను లాక్కుందామనే కలలు ఎంతోకాలం సాగవు...."
    సేనానులు తమ పతకాలను మెరుగుపెడతారు. ఇల్లాళ్లు తమ బాహుమూలాలకు సెంటు రాసుకుంటారు. పారా సైనికులు మూలపడ్డ యూనిఫారాలకు ప్రాణం పోస్తారు. షాపు యజమానులు పింఛను దారులతో మాట్లాడుతారు.
    డిగోల్ హెలికాప్టర్ కొలంబే నుంచి బయల్దేరింది.
    పారిస్ పొలిమేరల్లో కొన్ని స్థావరాలేర్పరచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
    రేడియోలు కొంపలంటుకున్నట్లు శ్రుతిమించుతున్నాయి.
    16వ వార్డు స్పోర్ట్స్ కార్లకు పెట్రోలు దొరికింది. డిగోల్ 1-30 కి మాట్లాడుతాడు. ఎలిసీ గార్డన్లు సింగారించుకుంటున్నాయి.
    4-30కి డిగోల్ బెదిరిస్తాడు. పవిత్ర యుద్ధం ప్రారంభిస్తాడు. భయంతో ఆస్తులు కాపాడమంటూ మృత్యువులో జీవించే వాళ్ళ ప్రదర్శనం ప్రారంభమయింది.
    నల్ల యూనిఫారాలు ధరించిన పోలీసులు కాపాడుతుండగా, వాన కోట్లు ధరించిన పోలీసులు దారి చూపుతుండగా- బూటు కాళ్లతో లెఫ్ట్ రైట్ లు కొడుతూ పెరేడ్ చేస్తారు.
    వాళ్ల భయం వేలాది ఫ్రెంచి జెండాలను పొదుగుతుంది.
    తమ్ము బతికుంచుకునే వ్యాపారం తమ్ము గుర్తించుకోవడం అనే రూపు ధరిస్తుంది.
    వెధవ పనులు చేసిన ముసలివాళ్లు, ఓటు కాగితాలు పట్టుకున్నవాళ్లతో చెట్టాపట్టాలు కట్టుకొని దిగుతారు. ఉభయుల్నీ అంతరంగిక భటులూ, సేవకులూ దగ్గరుండి నడిపిస్తారు.
    సురక్షితంగా పెరిగిన తోట లిప్పుడు ప్రాచీన భయాలతోనూ, ఇటీవల సందేహాలతోనూ విషపూరితాలయ్యాయి.
    దేవుడు ప్రసాదించిన ఆస్తి హక్కు బాష్పవాయువు ఉబ్బసంతో విషపూరిత మయింది.
    సొంత అధికారాలింకా ఉన్నాయని అరుస్తూ ఎలిసీ గార్డెన్లలోనికి మిలమిలలాడే శూన్య కవచం ప్రవేశిస్తుంది. భూతాలు, నీడలు. తంత్రాల కామందుల సంతానం వీళ్లు. ప్లాస్టిక్ రూపం దాల్చిన పసిడి లేగ బానిసలు. దూరం నుంచి అరుపులు వినిపిస్తోంటే బాల్కనీ నుంచి డిగోల్ శిరః కంపనం చేస్తాడు. గంటలు మెల్లగా గడుస్తాయి.
    భయంతో సమిష్టి సంభోగం. బూతు అరుపులరిచే స్పోర్ట్సు కార్లు దిగబడిపోయాయి. పోలీసు మంత్రసానులు ఆప్యాయంగా పెంచిన కుర్రతోలు బొమ్మలు.
    ఆఖరిసోనే లూమీయేర్. లోహపు బూరాలు. ఉప్పొంగిన కారు కళ్ళు.
    దారం దగ్గర కమ్యూనిస్టులు మ్యావుమంటూ వణుకుతూ. సోర్బాన్ ఇంకా నిలిచే వుంది.
    రాత్రీ, జ్వరమూ. యూనివర్శిటీలలో, ఫ్యాక్టరీలలో ఆశల్లేని ఆశలు. సి.జి.టి. రాయబారాలను మళ్ళీ ఆరంభిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గం గురించీ, వోట్ల గురించీ, ఎన్నికల గురించీ, ఓట్ల గురించీ, ఫ్రాన్సు గురించీ, వోట్ల గురించీ మాటాడుతుంది.
    సి.యఫ్.టి.డి.వేళ్ళు కరుచుకుంటూ ఎటూ తేలదు. మిట్టెరాండ్ మాటలు కక్కుతాడు.
    గాలిస్టులు పౌర దళాలను ఏర్పాటు చేస్తారు. మాస్కోకి ఉపశాంతి- డిగోల్ కోసంగా.
    వాషింగ్టన్ జయం కోరుతుంది డిగోల్ కి. పెకింగ్ ద్రోహుల్ని తూర్పూరబడుతుంది.
    ఫ్లిన్ వద్ద వర్కర్లు కార్మిక శక్తి గురించీ, ప్రతిఘటన గురించీ మాట్లాడుతారు.
    అది మే నెల 31 వ తేదీ, విట్సన్ వారాంతం.
    అధికారం మనల్ని పెట్రోల్ తో స్నానం చేయిస్తుంది. మొట్టమొదటి సమ్మె పికెట్ల మీద పోలీసులు దాడి చేస్తారు. యూనియన్లు త్వరత్వరగా అమ్ముడు పోతాయి.
    సాయంకాలానికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్. ఆఖరి ఆయుధం.
    హృదయాల్లో బూర్జువాలయిన వాళ్లకి పచ్చని పంటపొలాలవైపు మహా నిష్క్రమణ.
    ప్రజలకోసం వులర్త్ షాపులు తెరుచుకుంటాయి.

 Previous Page Next Page