తనింట్లోకి వచ్చి తనను ఎవరని అడుగుతున్న వ్యక్తిని చూసి "నేను... నేను... ఆయన భార్యను" తడబడుతూ చెప్పింది.

 

    అతను ఒక్కడుగులో ఆమె ముందుకు వచ్చి "అరిస్తే చంపేస్తాను. కాసేపు వూరుకుంటే వెళ్ళిపోతాను" అన్నాడు కత్తి ఆమెను చూస్తూ ఉంది.

 

    అతనూ తనను చూసి భయపడ్డట్టు ఆమె కనిపెట్టింది. పెద్దగా అపాయకరమైన మనిషి కాదనిపించింది. దీంతో శ్రీలేఖకు వణుకు తగ్గింది.

 

    అతను ఆ గదిలోకి వచ్చాడు.

 

    ఎడమ చేతిలోని టార్చ్ ని ఆమెకేసి ఫోకస్ చేశాడు.

 

    ముఖంమీద వెలుగు పడడంతో కళ్ళను చిట్లించింది.

 

    "అతని భార్యవా?"

 

    అవునన్నట్టు తల వూపింది.

 

    "జోడీ కుదరలేదు" పెదవి విరిచాడతను.

 

    ఆమెకు ఆమాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. రాత్రి తను పడ్డ బాధంతా గుర్తుకొచ్చింది. ఇన్ని రోజుల తన సంసారం కూడా మనసులో మెదిలింది.

 

    "ముందు ఆ కత్తిని ముడిచేయ్."

 

    అతను సన్నగా నవ్వాడు. "ఏం పొడిచేస్తాననుకున్నావా? అదేం లేదు. కేవలం బెదిరించడానికే."

 

    ఆ మాటలను బట్టి అతను దోపిడీ దొంగ కాదనిపించింది. ఏవో చిల్లరమల్లర దొంగతనాలు చేసేవాడిలా కనిపించాడు.

 

    "అయినా ఆ కత్తిని లోపల పెట్టుకో."

 

    చాకు ముడిచి జేబులో పెట్టుకున్నాడు నవ్వుతూ.

 

    ఆ నవ్వు బావున్నట్టనిపించింది ఆమెకు. ఆ నవ్వులో జీవం వుంది. జీవితం పట్ల ఉన్న మమకారం అందులో దర్శనమిస్తోంది.

 

    రాఘవులు ఎప్పుడైనా నవ్వాడా అని గుర్తు చేసుకుంది. ఎప్పుడూ నవ్వినట్టు అనిపించడం లేదు. ఈ రెండేళ్ళలో తను మాత్రం ఏ రెండు మూడు సార్లో నవ్వింది. అదీ రాఘవులు లోభిగుణం చూసినప్పుడు.

 

    "ఇంతకీ డబ్బెక్కడ?"

 

    "డబ్బా? ఏం డబ్బు?"

 

    "మీ ఆయన దాచిపెట్టిన డబ్బు."

 

    ఆమె దానికి జవాబు చెప్పలేదు. 'మీ డబ్బు ఎక్కడికీ పోదులెండి. మీ డబ్బుకు నేను కాపలా' అని రాత్రి భర్తతో అన్న మాటలు గుర్తొచ్చాయి.

 

    టార్చిని అటూ ఇటూ తిప్పాడు. ఓ మూల లక్ష్మీ బొమ్మతో ఉన్న ఇనుప బీరువా కనిపించింది. అది గుచ్చకాయ రంగులో బురద పూసుకున్న చిన్న ఏనుగు పడుకున్నట్టు వుంది.

 

    టార్చిని ఆఫ్ చేశాడు.

 

    "బీరువా పెద్దదిగానే వుంది" అన్నాడు మెల్లగా.

 

    మసక చీకటికి కళ్ళు అలవాటు పడడం వల్ల ఒకరికొకరు స్పష్టంగానే కనిపిస్తున్నారు.

 

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

 

    ఏదో గుర్తుకొచ్చినట్టు "పిల్లల్లేరా?" అని ప్రశ్నించాడు.

 

    లేరన్నట్టు తల అడ్డంగా వూపింది.

 

    "వుండరని వూహించాను."

 

    పెళ్ళయినా తను ఒంటరిదాన్ననే విషయం అతనికి తెలిసిపోయింది. ఎలా తెలిసిందతనికి? రాఘవులను గురించి అంతకు ముందు విన్నాడా? లేక తన మనసు తెరిచిన పుస్తకంలా అతనికి కనిపిస్తోందా?

 

    దొంగతనానికి వచ్చినవాడు ఆపనేదో చూసుకోకుండా తన జీవిత చరిత్ర ఎందుకు? ఇతరుల స్వంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఇంగితజ్ఞాతం లేకుంటే ఎలా?

 

    ఆమె కోపంతో వుడికిపోయింది.

 

    తన కళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టు నిస్తేజంగా, జీవం లేకుండా వున్నాయా? తన మనసు ఏకాంతంగా కుళ్ళిపోతూ వుండడం అందరికీ తెలిసిపోతూ వుందా?

 

    ఆమె తనలో తాను ప్రశ్నలు, జవాబులు తయారుచేసుకుంటూ వుంది.

 

    "ఇంతకీ బీరువా తాళాలెక్కడ?"

 

    "ఆయన దగ్గరున్నాయి."

 

    "ఆయన దగ్గరంటే ఎక్కడ?"

 

    "మొలలో."

 

    "మొలత్రాడుకా?"

 

    అవునన్నట్టు తల వూపింది.

 

    అతను రాఘవుల దగ్గరకి వెళ్ళి, మెల్లగా వంగి తాళాల గుత్తిని విప్పుకున్నాడు.

 

    రాఘవులు గురక నిర్విరామంగా వినిపిస్తూనే వుంది.

 

    దొంగ తిరిగి శ్రీలేఖ గదిలోకి వచ్చాడు.

 

    "మధ్యలో నిద్రలేచే అలవాటు లేనట్టుంది మీ భర్తకు. నిద్ర రానప్పుడు, కబుర్లు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడో ఏ అపరాత్రో పడమటి ఆకాశం మీద వంగిన చంద్రవంకను చూడాలనుకున్నప్పుడు, తెల్లవారుఝామున చలిలో డాబా మీద కూర్చుని కాఫీ తాగాలనిపించినప్పుడు మీరేం చేస్తారు? మీ భార్తగారు మీకు కంపెనీ ఇచ్చేట్టు లేరు? మీరే వెళ్ళరా? ఆయన రానివ్వరా?" అతని మాటల్లోని మాధుర్యం ఆమెకు తగులుతూ వుంది.

 

    ఎన్ని రోజులైంది అలాంటి మాటలు విని. అతను అలా మాట్లాడడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, ఆనందాన్నిస్తున్నాయి.

 

    తనను దొంగ బహువచనంతో సంబోధించడం కూడా కనిపెట్టింది. అతనిలో చెడ్డ లక్షణాలకన్నా మంచి లక్షణాలే ఎక్కువగా వున్నట్టు తోచిందామెకు.

 

    "ఎందుకో మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది" అన్నాడు మళ్ళీ అతనే.


    
    ఆమె మౌనంగా తలదించుకుంది.

 

    అతను బీరువా దగ్గరకు వెళ్ళి, దానిని తాళాలతో తీయడం మొదలెట్టాడు. తలుపు తెరుచుకోవడం లేదు.

 

    "ఎందుకలా విగ్రహంలా చూస్తుంటారు? ఏ తాళం తీస్తే తలుపు తెరుచుకుంటుందో చెప్పకూడదా? ఇదంతా తూకంలో చేసిన మోసం వల్లే గడించింది కదా? పాపపు సొమ్ము విషంతో సమానం. ఇదింట్లో వుంటే శరీరాలు చచ్చిపోవు, మనసులు చచ్చిపోతాయి" అన్నాడు.

 

    అప్పుడూ ఆమె ఏమీ మాట్లాడలేదు.

 

    చివరికి బీరువా తలుపు తెరుచుకుంది టార్చ్ వేసి లోపలకు చూశాడు.

 

    కరెన్సీ కట్టలు ఒళ్ళు మరచి నిద్రపోతున్నాయి. బంగారు నగలు మూగవాళ్ళ గుంపులా మౌనంగా వున్నాయి.

 

    అంత డబ్బు, అన్ని నగలూ వుంటాయని అతను వూహించలేదు.

 

    "ఇంత డబ్బు వుందంటే ఇతర విషయాలకన్నా డబ్బు మీదే ఎక్కువ యావ వుండాలి మీ భర్తకు. ఇంత డబ్బును ఏం చేసుకుంటాడాయన? మీలాంటి అందమైన భార్యతో కాలాన్ని పంచుకోవడం తప్ప మరో పనివుండకూడదు ఏ మగాడికైనా? ఏమంటారు?"

 

    తన బాధనంతా అర్థం చేసుకుని, తన కోణంలోంచి అతను ఆలోచించడం ఆనందంగా వుంది ఆమెకు. పరాయి పురుషుడు కనుక, అందులోనూ దొంగ కనుక ఆమె ఆ మాటలకు పూర్తిగా స్పందించడం లేదు. లేకపోతే ఆ మాత్రం సానుభూతికి ఏడ్చేసి వుండేది ఈ పాటికి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra