Home » Suryadevara rammohan rao » సాహసి


    "యువరాజా... ఆ గెస్ట్ హౌస్ కే మనం వెళ్ళాలి" చెప్పాడాయన. మెయిన్ రోడ్ నుంచి, కొండలవైపు ఒక మలుపు వుంది. ఆ మలుపు తిప్పాడు యువరాజు జీపుని.

    "ఇక్కడే ఉంటుందా నిధి" అమాయకంగా అడిగింది వైశాలి. ఫక్కుమని నవ్వింది ఇందుమతి.

    "ఎలాగూ... రెండు బేగ్ లు తెచ్చినట్టున్నావ్ గదా... వెళ్ళగానే ఆ నిధిస్తాను పట్టుకుని బెంగుళూరు వెళ్ళిపో" జోకేశాడు యువరాజు. ఆ మాటకు అందరూ నవ్వారు ఇందుమతితో సహా.

    అదే సమయంలో ఇందుమతికో సందేహం వచ్చింది. అనుమానంగా యువరాజు ముఖంలోకి చూసింది.

    నువ్వు- నువ్వు... అనుకునేంత- చనువెలా వచ్చింది వీళ్ళిద్దరి మధ్యా! గతరాత్రి వైశాలి- యువరాజు ఇంట్లో గడిపింది.

    ఈ చనువుకి అదే కారణమా?

    దీర్ఘంగా ఆలోచిస్తోందామె. అలా ఆలోచిస్తున్న ఇందుమతి ముఖాన్ని ఎవరూ స్పష్టంగా చూడడం లేదు.

    ఒక్క కపాలేశ్వర్ తప్ప!

    అంతలో జీపు ఫారెస్ట్ డిపార్టుమెంట్ గెస్ట్ హౌస్ ముందు ఆగింది.


                                          *    *    *    *


    గెస్ట్ హౌస్ ముందు, జీపు ఆగడంతో లోనించి ఒక వ్యక్తి కిటికీలోంచి తొంగి చూశాడు.

    ఆ వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ శంతన్ కుమార్.

    "సర్... వచ్చారు సర్!" అంతవరకూ బయట మెట్ల దగ్గర నుంచున్న ఫారెస్ట్ గార్డు కురవభీముడు లోనికెళ్ళాడు పరిగెత్తుకుంటూ.

    శంతన్ కుమార్ బయటికొచ్చి, మెట్లు దిగి యువరాజు పక్కన కూర్చున్న విశ్వరూపశర్మ వేపు తేరిపార చూసి-

    "నమస్తే... సర్! ఇరవై ఏళ్ళయింది... మిమ్మల్ని చూసి... కపాలేశ్వర్ గారు- నిన్న ఫోన్ చేసి చెప్పడంతో రియల్లీ ఐ వజ్ వండర్డ్- హౌ ఆర్యూ సర్" గౌరవంగా నమస్కరించి, అభిమానంగా పలకరించాడు.

    "నువ్వేనా ఫారెస్టు ఆఫీసర్ వి. సగం ప్రాబ్లం తీరిపోయిందయ్యా" అని జీపులోంచి బయటకు దిగి శంతన్ కుమార్ చెయ్యి పట్టుకుని-

    "నేను నిధి కోసం వెళ్ళే రోజుల్లో... నువ్వు ట్రెయినీ గార్డువి. ఆఫీసర్ వి అయ్యావన్న మాట. అయితే వెరీ వెరీ... హేపీ నౌ... చూడు కుమార్... హంటింగ్ ఎ స్పెషల్లీ... ట్రెజర్... హంటింగ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ గాంబ్లింగ్... జూదం... లాస్ట్ ఎటెమ్ట్ చేస్తున్నానయ్యా. ఈసారి ఫారెస్టులోకి నేను వెళ్లడం లేదు. ముందు పద. తరువాత చెప్తాను" అంటూ ఇందుమతిని దగ్గరగా పిలిచి పరిచయం చేశాడు విశ్వరూపశర్మ.

    "ఎవరనుకున్నావ్... దేవులపల్లికోట యువరాణి... కౌశికభూపతి రాజావారి కుమార్తె ఇందుమతీదేవి... తన నిధిని, తను చేజిక్కించుకోవడం కోసం వచ్చింది. ఈసారయినా దొరకుతుందంటావా" అని నవ్వాడు విశ్వరూపశర్మ.

    శంతన్ కుమార్ ఇందుమతిని విష్ చేశాడు. కళ్ళు తప్పుకోలేని ఆమె అందాన్ని చూసి గుటక రాక, కౌశికభూపతి కుమార్తె అని తెలిసి నోట మాట రాక ఎట్టకేలకు తేరుకుని-

    "గురువుగారూ- మీరు కొన్నాళ్ళింకా బతికుంటే- అశోకుడ్నీ, ఔరంగజేబునీ, శ్రీకృష్ణదేవరాయల్ని కూడా తీసుకొచ్చేస్తారేమో" నవ్వుతూ అన్నాడాయన.

    "ఎస్.ఎస్. అంతే. యూనో హో అయామ్... అండ్ వాటయామ్" అని గర్వంగా నవ్వుతూ ఇందుమతి పక్కన నిల్చున్న అందర్నీ పరిచయం చేశాడు.

    అరగంట తర్వాత-

    విశ్వరూపశర్మ, శంతన్ కుమార్, ఇందుమతి ఒక గదిలో కూర్చున్నారు. కపాలేశ్వర్, యువరాజు, వైశాలీ రిజర్వాయర్ ని చూడటానికి వెళ్ళారు. ముత్యాలనాయుడు గెస్ట్ హౌస్ ముందున్న మర్రిచెట్టు చపటా మీద కూర్చున్నాడు.

    లోన రూమ్ లో శంతన్ కుమార్-

    "ఇందుమతీదేవిగారూ- ఇవాళ మీరు మా గెస్టు. లంచ్ అండ్ డిన్నర్ ఇక్కడే, రేపట్నించీ మీకెలాగూ అడవి కూడు తప్పదు. మీకు తెలుసో- తెలీదో- శర్మగారూ- మా గాడ్ ఫాదర్- ఆయన హంటింగ్ కు వెళ్ళే రోజుల్లో నేను గార్డ్ నీ కాదు, ఏవీ కాదు. ఆయన ఆఫీస్ లో బాయ్ ని. బాయ్ ని గార్డ్ చేసి వెళ్ళిపోయారాయన. మళ్ళీ ఇన్నేళ్ళకి తర్వాత గాఢమైన గౌరవాన్ని మాటల్లో చెప్పి 'గురువుగారూ మీరొస్తున్నారని తెల్పి మీ కిష్టమని తెల్సి... 'ఇప్పకల్లు' తెప్పించాను. పావురాల ఫ్రై చేయించాడు" అన్నాడు కృతజ్ఞత నిండిన కంఠంతో శంతన్ కుమార్.

    ఆ మాటకు పొంగిపోయాడు విశ్వరూపశర్మ.

    "చూస్తావేం ముందు సర్వ్ చేయించు. ఇప్పకల్లు ఎన్నాళ్ళయిందో తాగి అమ్మా... ఇందుమతీ... నీకేం అభ్యంతరం లేదు కదా."

    అభ్యంతరం లేదన్నట్లుగా తలూపింది ఇందుమతి. దానికి ఆశ్చర్యపోయాడు శంతన్ కుమార్.

    "మీకభ్యంతరం లేదు అంటే" అర్ధంకాక అడిగాడు శంతన్ కుమార్.

    "ఓరి పిచ్చి ఫారెస్టాఫీసరు... అభ్యంతరం లేదంటే దానర్ధం... ఆమె త్రాగడానిక్కాదు మనం ఆమె ఎదురుగా తాగడానికి" చెప్పాడు ఆయన. ఆ మాటకు అడవి కౌజుపిట్ట అరచినట్లు నవ్వాడు శంతన్ కుమార్.

    విషయాన్ని నెమ్మదిగా చెప్పి-

    "చూడు శంతన్... ఈ మధ్య నాకు ప్రాక్టికల్ గా అడవిలో టచ్ పోయింది. ఈ ట్రెజర్ హంటింగ్ విషయంలో నీ ఎడ్వయిజ్ ఏమిటో చెప్పు" అడిగాడు విశ్వరూపశర్మ.

    లోటాలోని కల్లును తాగుతూ చెప్పడం ప్రారంభించాడు శంతన్ కుమార్.

    "అప్పటికీ, ఇప్పటికీ... అడవులలాగే ఉన్నాయి. గిరిజనులలాగే వున్నారు. వాళ్ళ ఆచారాలు మూర్ఖత్వాలు అలాగే వున్నాయి. వర్షాలు పంటలు లేకపోవడం వల్ల... ఇక్కడి వాళ్ళక్కడికి, అక్కడివాళ్ళు ఇక్కడికి ఎక్కడ ఏయే జాతుల వాళ్ళుంటున్నారో తెలియని పరిస్థితి."

    "ప్రస్తుతం మన తూర్పు కనుమల్లో ఎన్ని జాతుల గిరిజనులున్నారంటావ్" అడిగాడు విశ్వరూపశర్మ.

    "కొటియా, భగతి, గదబ, వాల్మీకి, కొండదొరలు, కోందు, సామంత, జాతాపు, పారజ, కోయ, గోండు, చెంచు, జువాంగులు, ఉర్లా, సవరలు ఎన్నని చెప్పమంటారు. కొన్ని తెగలు అంతరించిపోతాయి. కొత్త తెగలు పుట్టుకొస్తున్నాయి" చెప్పాడాయన.

    "అరుదయిన ఆటవిక జాతుల వాళ్ళెవరయినా వున్నారా?"

    "రెండు జాతులవాళ్ళు మాత్రమే ఉన్నార్ట. వాళ్ళు ఎవ్వరితోనూ కలవరట"

    "మనుషుల్ని తినే కానిబాల్స్?"

    "మన కనుమల్లో మాత్రం కానిబాల్స్ లేరు. డీప్ ఫారెస్ట్ లో ఉన్నారేమో మరి తెలీదు. ఎందుకంటే జీపులో మనం- పది మైళ్ళు వెళ్ళగలం. కాలి నడకన ఇంకో పదిహేను మైళ్ళు వెళ్ళగలం ఆ తర్వాత... పులుల కోన- ఓ ఐదుపులులు తిరుగుతున్నాయి. అందులో రెండు మేన్ ఈటర్స్ వున్నాయి. ఆ మధ్య- అతిసాహసంతో వెళ్ళిన మా గార్డులు ముగ్గురు కనిపించలేదు. అక్కడికి వెళ్ళాలంటే- హెలికాప్టర్ లో వెళ్ళాలి. ఆ ప్లేన్ గవర్నమెంట్ దగ్గరుంది. ఆర్నెళ్ళకు ఫారెస్ట్ మినిష్టర్ మారుతున్నాడు. ఎప్పటికి ఫండ్స్ వస్తాయో ఏమో."

    "దేవులపల్లి కోట నిధి గురించి నువ్విన్నావ్ కదా దాని గురించి చెప్పు. ఈ మధ్యకాలంలో ఎవరయినా ప్రయత్నించారా?" అడిగాడు విశ్వరూప శర్మ.

    "సిన్సియర్ గా మొదలెట్టింది మీరే. సిన్సియర్ గా వెనక్కొచ్చిందీ మీరే. ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరూ ట్రై చెయ్యలేదు. కానీ... సరిగ్గా ఇరవై ఏళ్ళక్రితం... నేను గార్డ్ గా పర్మినెంట్ అయిన టైమనుకుంటా ఒక అమెరికన్ మందీ మార్బలంతో వచ్చాడు. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు వున్నారు. హడావిడిగా అడవిలోకి వెళ్ళిపోయారు"

    "వారంరోజుల్లో భయపడిపోయి వచ్చేసారా" నవ్వుతూ అంది ఇందుమతి.

    "లేదమ్మా... ఇప్పటికీ రాలేదు అదే విచిత్రం... వాళ్ళు గూఢచారులా... లేకపోతే నిజంగా ట్రెజర్ హంటర్సా... ఇన్నాళ్ళు ఈ అడవిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బతికున్నారా? లేకపోతే చనిపోయారా కనబడలేదు. రాలేదు. అని మేం ఇప్పటికీ గవర్నమెంట్ కి రిపోర్టు పంపుతూనే వున్నాం"

    "అమెరికన్ ట్రెజర్ హంటర్స్" ఆశ్చర్యంగా అన్నాడు విశ్వరూపశర్మ.

    "ఎస్ సర్... ఇటీజ్ ట్రూ. మిస్టర్ జిమ్ హాకిన్స్, లిజ్ హాకిన్స్ ఈ నలుగురిలో పదేళ్ళ బేబీ కూడా ఉంది. ఏమైందో మరి."

    "మరి నాలుగో వ్యక్తి"

    "జిమ్ హాకిన్స్ ఫ్రెండయి వుంటాడు. అతని పేరు తెలీదు"

    "ఇంత దూరం వాళ్ళు వచ్చారంటే. ట్రెజర్ హంటింగ్ కోసమేనా."

    "మరి హంటింగ్ లో వాళ్ళను ఏ శక్తో బలి తీసేసుకుని ఉంటుందని నా పర్సన్ ఒపీనియన్" చెప్పాడు శంతన్ కుమార్.

    ఐదు నిమిషాలసేపు ఏం మాట్లాడలేదు విశ్వరూపశర్మ. ఆ తర్వాత చెప్పాడాయన.

    "ఇందుమతి ఆధ్వర్యంలో మనవాళ్ళు... రేపుదయం బయల్దేరతారు. నేనిక్కడే ఉంటాను. నా మంచి చెడ్డలు నువ్వే చూసుకోవాలి. అడవి లోపల తీసుకోవాల్సినవేవయినా ఉంటే చెప్పు" అన్నాడు విశ్వరూపశర్మ.

    "అడవుల్లో వెళ్లడమంటే కొండలెక్కడం దిగడం కాదు. చాలా ఓర్పు కావాలి. ముందు అడవిదారులు తెలియాలి. కొంతవరకైనా ట్రైబల్ వుండాలి. కొంత దూరం వరకూ అయితే మా గార్డు కరువ భీముడ్ని తోడు ఇస్తాను. ఆ తర్వాత అక్కడకు మీరు ఒక నమ్మకమైన ట్రైబల్ ని చూసుకోండి" చెప్పాడు శంతన్ కుమార్.

    "పావురం పిట్ట... మాంసం మజాగా వుందయ్యా... ఈసారి నెమలి పిట్టమాంసం ఏర్పాటు చేద్దూ" మూడు లోటాల కల్లు, ఖాళీ చేసేసి అన్నాడు విశ్వరూపశర్మ.

    భోజనం చేశాక, విశ్వరూపశర్మ వెంటనే నిద్రపోయాడు.

    శంతన్ కుమార్ తో మాట్లాడుతున్నది ఇందుమతి.

    డీప్ ఫారెస్ట్ లో కెళ్ళాక ఊహించని ఆపద లెదురౌతాయి. గిరిజనుల వల్ల కావచ్చు. మన వాళ్ళవల్ల కావచ్చు. అందునా ఇద్దరు ఆడపిల్లలు జాగ్రత్త, నీకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినపుడు మృగాన్నయినా, మనిషినైనా చంపడానికి మాత్రం వెనుకాడొడ్డు. ఇంకొక విషయం... అడవి రహస్యం... తెలుసుకోవడం చాలా కష్టమమ్మా. అడవిలో ఎక్కడ ఏం జరుగుతోందో అన్నదానికి, మృగాలు, పక్షులు పిట్టలే మనకు గుర్తు. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ నమ్మకు. ఇది మొదటి సూత్రం. పక్షుల శబ్దాలు, పక్షుల అరుపులు లేని ప్రదేశం నీకు కనబడిందంటే, దానర్ధం- అక్కడ ఏదో అడవి మృగం పొంచి ఉన్నదనే లెక్క- అలాగే... రాళ్ళులేని నేలను నమ్మకు. ఆ నేల ఊబి అయినా కావచ్చు. ట్రైబల్స్ స్మశాసనమైనా కావచ్చు. ఇది రెండో సూత్రం. ఏ మామూలు గిరిజన గ్రామానికైనా నిదర్శనం ఇళ్ళలోంచి వచ్చే పొగ- ఆ ఊళ్ళల్లో ఇళ్ళ నుండి పోగరాలేదనుకో అక్కడ మామూలు గిరిజన జాతులు ఉంటున్నట్లు లెక్క కాదు. అక్కడేదైనా ప్రత్యేకత ఉంటుంది గుర్తు పెట్టుకో. అమావాస్య రాత్రులు, పౌర్ణమి రాత్రుల్లో మాత్రం ఒంటరిగా తిరగకు. ఇంకొక ముఖ్యమయిన విషయం గిరిజనుల్లో, ఆడ మగ ఎక్కువ మంది తమ శృంగార కార్యకలాపాల్ని... ఏ జలపాతం దగ్గరో ఏ కొండ చరియల మూలనో, ఏ చెట్టు చాటునో... జరుపుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి దృశ్యం నీకెదురైనపుడు... వాళ్ళకు నువ్వు కన్పించకుండా జాగ్రత్తపడు... నువ్వు వాళ్ళని, ఆ స్థితిలో చూసావని వాళ్ళు గుర్తుపట్టారనుకో... అది ఆ గిరిజన యువతికి అవమానం కింద లెక్క నీ మీద పగబడుతుంది. ఆ పగ దారుణంగా ఉంటుంది. శంతన్ కుమార్ ఒక్కొక్క విషయం చెపుతుంటే శరీరం గగుర్పొడుస్తోంది ఇందుమతికి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra