Home » Yerramsetti sai » 8 down

    "ఎమ్.ఏ!"    
    ఆమె ఆశ్చర్యపోయింది.    
    "అదేమిటి? ఎమ్.ఏఅయినా మీకు ఉద్యోగం దొరకలేదా?"    
    "ఒకటి రెండు కాలేజీల్లో లెక్చరర్ గా ఇచ్చారు గానీ- వాళ్ళకు కావలసినకాండిడేట్స్ దొరగ్గానే తీసిపారేశారు. ప్రస్తుతం ట్యూషన్ చెప్పుకుంటున్నాను."    
    "ఎక్కడ చరివారు? వైజాగేనా?"    
    "అవునండీ! పుట్టిందీ, పెరిగిందీ అంతా వైజాగే! మీరు ఐ.ఆర్.టి.యస్. కి సెలక్టయి ఈ జాబ్ కొచ్చరనుకుంటాను?"    
    "అవును! నాకు ఐ.ఏ.ఎస్. అవాలని ఎంతో కోరికగా వుండేది. కానీ రెండుసార్లూ ఐ.ఆర్.టి.ఎస్,ఐ.ఆర్.ఎస్ వచ్చాయి. జాబ్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటే బావుంటుంది నాకు. అఫ్ కోర్స్! ఆపరేటింగ్ డిపార్ట్ మెంట్ కొంచెం ఛాలెంజింగానే వుంటుంది లెండి"        
    "ఇక్కడ మీతో ఫాదరూ, మదరూ ఎవరూ లేరనుకుంటాను?"    
    "అవును! వాళ్ళిద్దరూపూనాలో వుంటారు- మా ఫాదర్ రిటైరయి పూనాలోనే మళ్ళీ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మీరు స్పోర్ట్స్, గేమ్స్ ఏమీ ఆడేవారు కాదా! కనీసం అందులో ప్రొఫిషియెన్సీ ఉన్నా చాలా కంపెనీల్లో జాబ్స్ ఇస్తారు. మా రైల్వే లో కూడా స్పోర్ట్స్ మెన్ కీ, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేవారికీ ప్రత్యేకంగా కోటా వుంది. వారిని సర్వీస్ కమీషన్ పరీక్ష పాసవాల్సిన అవసరం లేకుండా అపాయింట్ చేసుకుంటారు."    
    "కాలేజీలో క్రికెట్ ఆడేవాడినండీ! కానీ క్రికెట్ సంగతి మీకు తెలీందేముంది? కొంచెం కాస్ట్ లీ గేమ్ అది! అందుకని మానేశాను".    
    "అఫ్ కోర్స్! చదువుకీ, గేమ్స్ కీ కుదరదు. రెండింట్లోఒకదాని మీదే కాన్ సెంట్రేట్ చేయగలుగుతాము. స్పోర్ట్సులో గ్యారంటీలేదు. గనుక చదువుని నమ్ముకోక తప్పదు."    
    ఇద్దరూ భోజనం ముగించే లోపల ఎప్పటినుంచో ఇద్దరికీ స్నేహం వున్న ఫీలింగ్ కలిగింది.    
    "ఓ.కే - నేను ఆఫీస్ కెళుతున్నాను. సాయంత్రం అయిదున్నరకు వచ్చేస్తాను. మళ్ళీ- బైదిబై! సాయంత్రం గెస్ట్ లు వస్తున్నారు బాంబేనుంచి మీరు వేరే రూమ్ లోకి మారాల్సి వుంటుంది. మా ఫ్యూన్ చేస్తాడు లెండి ఆ ఏర్పాట్లన్నీ!    
    "అలాగేనండీ!    
    ఆమె ఆఫీస్ కొచ్చేసింది. తను ఆ పోస్టులో కొచ్చి కేవలం పదిహేనురోజులవుతోంది. అంత వరకూ సీనియర్ డివిజినల్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్ పోస్టులో ఆడవాళ్ళెప్పుడూ లేరు. తనే మొట్టమొదటిసారిగా ఆ పోస్టులో కొచ్చింది. హెడ్డాఫీస్ లోనూ, రైల్వే బోర్డులోనూ అందరూ తనెంతవరకూ సక్సెస్ అవగలదా అని వాచ్ చేస్తున్నారు.    
    తను అంతకుముందుకొద్ది సంవత్సరాలు ఏ.ఓ.యస్ గానూ, డి.ఓ.యస్ గానూ పని చేయటంవల్ల సీనియర్ డి.ఓ.యస్.గా పనిచేయటంలో ఏమీ కొత్తదానం కనిపించటంలేదు. అంతా రొటీన్ గా జరిగిపోతుంటుంది.   
    తనకు తలనొప్పి కలిగించే విషయం ఒక్కటే. రాత్రి పన్నెండు గంటలవరకూ కంట్రోల్ ఆఫీస్తో టచ్ లో వుండి ఇంటర్ చేంజ్ కి ఉద్దేశించబడిన గూడ్స్ ట్రెయిన్స్ కరెక్టుగా సదరన్ రైల్వేకీ, సౌత్ ఈస్టరన్ రైల్వేకీ రాత్రిపన్నెండు గంటలలో పలహాండ్ ఓవర్ చేయబడుతున్నాయోలేదో కనిపెట్టివుండటం-    
    దానివల్ల రోజూరాత్రి పన్నెండువరకూ నిద్ర ఉండదు. ఉదయం మళ్ళీ ఆరుగంటలకే కంట్రోల్ ఆఫీస్ నుంచి పొజిషన్ తీసుకోవాల్సివస్తుంది. ఉద్యోగం అప్పుడప్పుడూ కొన్ని చిరాకులు కలిగించినా- తనకు ఎంతో ఆనందం కలిగిస్తూంటుంది.    
    ముఖ్యంగా మొత్తం విజయవాడ డివిజన్ కి తను ఆపరేటింగ్ సైడ్ న హెడ్! అందులోనూ విజయవాడ డివిజన్ చాలా కాంప్లికేటెడ్ డివిజన్. తరచుగా సైక్లోన్ లు రావటం, పొలిటికల్ గా ఏ సమస్య వచ్చినా అది విజయవాడ ప్రాంతానికే ముందు ముంచుకురవటం, సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజనే అత్యధికంగా లాభాలు ఆర్జించడం .... ఇలా ఎన్నో ఉన్నాయి.    
    విజయవాడ డివిజన్ లో పనిచేసిన సీనియర్ డి.ఓ.ఎస్ ఇంకెక్కడయినా సరే విజయవంతంగా పంసిహేయగలరని ఆఫీసర్లందరూ అనుకుంటూంటారు. అందుకే తనను ఆ డివిజన్ లో సీనియర్ డి.ఓ.యస్.గా పోస్ట్ చేస్తున్నప్పుడు చీప్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్ తనతో చెప్పాడు.    
    "మా రైల్వేలో ఆపరేటింగ్ లో వున్న లేడీ ఆఫీసర్లలో మీరొక్కరే సీనియర్ రాంక్ లో కొచ్చారు. కనుక మీరు పర్ ఫెక్ట్ ఆపరేటింగ్ ఆఫీసర్ అవాలని నా కోరిక!"    
    తను థాంక్స్ చెప్పి వచ్చేసింది.    
    కానీ లోలోపల తనకుతెలుసు. తను అవలీలగా ఆ ఉద్యోగానికి న్యాయం చేకూర్చగలదు. అంతే కాదు! చాలామంది మగ ఆఫీసర్ల కన్నా మంచి ఫలితాలు చూపగలదు.    
    అనుకున్నట్టే గత పదిహేనురోజులుగా స్మూత్ గా సాగిపోతోంది.    
    "మేడమ్!" చీఫ్ కంట్రోలర్ వచ్చి ఎదురుగ్గా నిలబడ్డాడు.    
    "యస్!" ప్రశ్నార్ధకంగా చూసిందామె.    
    "సదర్న్ రైల్వే ఇంటర్ చేంజ్ కి రెండు ట్రెయిన్లే తీసుకుంటామంటున్నారు. అందుకని 'కోల్ లోడ్స్'వున్న రెండు ట్రెయిన్లనుకలిపి డబుల్ హెడ్ చేసి ఒక ట్రెయిన్ గా పంపిద్దామంటారా?"    
    "వాళ్ళు లోడ్ అడుగుతారు కదా!"    
    "అడిగితే 'ఫిగర్స్ జగ్లరీ' చేద్దాం కొంచెం"    
    మృదుల నవ్వింది. ఈ విధంగా ఒక రైల్వేని మరొక రైల్వే మోసగించటం పరిపాటే. ఇంటర్ చేంజ్ పొజిషన్ సరిగ్గా మెయింటెయిన్ చేయడానికని రెండురైల్వేలు శత్రుదేశాలరైల్వేల్లాగా పోట్లాడుకోవటం ఎక్స్ ప్రెస్ రైళ్ళనుకూడా అనవసరంగా ఆపెయ్యటం- చాలా మామూలు విషయం.    
    "ఆల్ రైట్! డూ ఇట్!" అందామె.    
    అతను వెళ్ళగానే ఆమె ముందున్న రైల్వే ఫోన్ మోగసాగింది.    
    "సీనియర్ డి.వో.యస్- హియర్" అంది ఫోన్ అందుకుని.    
    "ట్రంక్ కాల్ ఫ్రమ్ పూనా మేడమ్" అంటూ కనెక్షన్ ఇచ్చేశాడు. మృదులకు అర్ధమయిపోయింది. తన తండ్రే ఫోన్ చేసి వుంటాడు.    
    "హలో మృదులా!" పిలిచాడతను.    
    "యస్ డాడీ!"    
    "హౌ ఆర్ యూ?"    
    "ఫైన్ డాడీ! మీరెలా వున్నారు?"    
    "ఫైన్! మీ అమ్మ పోరు పడలేక ఫోన్ చేస్తున్నాను. ఆ బాంక్ సంబంధం గురించి ఏం నిర్ణయం తీసుకున్నావ్?"    
    "సారీ డాడీ! నా కిష్టం లేదది!"   
    "ఎందుకని?"    
    "అతను బాంక్ లో మామూలు క్లర్క్ డాడీ! మిగతా అన్ని యాస్ పెక్ట్స్ బాగానే వున్నాయ్ గానీ ఒక మామూలు క్లర్క్ ని గెజిటెడ్ ఆఫీసర్ అయుండి నేనెలా చేసుకోగలను? ఇద్దరి మధ్యా మానసికంగా ఆ తేడా ఎప్పటికీ అలానే వుండిపోడానికి అవకాశం వుంది. చెరో అంతస్తులో ఉండి సంసారం చేస్తున్నట్లుంటుంది. నా పొజిషన్ కి తగ్గ సంబంధాలయితేనే చూడండిద డాడీ-".    
    "ఆల్ రైట్! నీ మొండిపట్టునీది! మనకు మంచిమనసుగల వ్యక్తిముఖ్యంగానీ గెజిటెడ్ హోదా కాదంటేవినవు నువ్! ఆ బాంబేసంబంధం ఏమయింది. అదే, ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ వినోద్ అని చెప్పాను కదా-"    
    "అతనే నాతో మాట్లాడాడు డాడీ! ఇవాళ సాయంత్రం వాళ్ళ మదర్ తో ఇక్కడికొస్తున్నానని చెప్పాడు"
    "ఓ! అలాగా! ఓ కే - అదయినా నీకు నచ్చుతుందేమోచూద్దాం! వాళ్ళువచ్చి వెళ్ళాకనాకోసారి ఫోన్ చేసి చెప్పు."   
    "అలాగే డాడీ! మమ్మీని ఏమీ వర్రీ అవద్దని చెప్పు!"    
    "ఓ కే!" ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.    
    మృదులకు నవ్వొచ్చింది. తండ్రితో ఎప్పుడు ఫోన్ లో మాట్లాడినా ఇదే గొడవ. సాయంత్రం ఏడుగంటలకు అద్దంముందు నిలబడిరడీ అవుతోండగా వినోద్ వాళ్ళ కారు వచ్చింది.    
    ఫ్యూన్ వారిని సాదరంగా లోపలకు ఆహ్వనించాడు.
    వినోద్ ని చూడగానే తనకు సంతృప్తి కలిగింది. తెల్లగా, పొడుగ్గా, చక్కని శరీర సౌష్టవంతో చాలా స్మార్ట్ గా వున్నాడతను. పరిచయాలు పూర్తయాయ్. అతని తల్లీ తండ్రీకూడా చాలా పాలిష్ గా మాట్లాడుతున్నారు. అందరూ కలసి డైనింగ్ హాల్లో టీ, స్నాక్స్ తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే వారందరితోనూ ఎంతో చనువు ఏర్పడిపోయింది తనకు. వారిమాటలు బట్టి తను కూడా వారికి నచ్చినట్లు అర్దమయిపోయింది. ఆ విషయం అర్ధం కాగానే మనసంతా తేలిక పడిపోయింది.    
    ఇంతకాలం నిరీక్షించినందుకు తను కోరుకున్న వరుడేదొరికాడు తనకు. అన్ని విధాలా తనతో సరితూగగలడతను. అతని కుటుంబం కూడా! అతని తమ్ముడూ, చెల్లెలూ- అంతా స్టేట్స్ లో వున్నారు.    
    సాయంత్రం అందరూ గార్డెన్ లో కూర్చున్నారు.    
    "మీ హాబీస్ ఏమిటి?" అడిగాడతను.    
    "టెన్నిస్ అంటే ప్రాణం నాకు! విజయవాడ వచ్చాక కుదరటంలేదు గానీ అదర్ వైజ్- రెగ్యులర్ గా ఆడుతూంటాను!"    
    "వెరీగుడ్! నేను బిలియర్డ్స్ ఆడుతూంటాను."    
    "మీకు మ్యూజిక్ అంటే లైకింగ్ వుందా-?" అడిగిందామె.   
    "భలేవారే! మ్యూజిక్ ఎవరు లైక్ చేయరు? ఐ లవ్ గజల్స్! చాలా పెద్ద ఆడియోకాసెట్ కలెక్షన్ వుంది నా దగ్గర"    
    "ఓ! అలాగా! నేను ఎక్కువగా ఫిలిం మ్యూజిక్ లైక్ చేస్తాను. అఫ్ కోర్స్, ఓల్డ్ హిట్స్"    
    "ఐ లైక్ సైట్ సీయింగ్! అవకాశం దొరుకుతే చాలు - టూర్ చేస్తుంటాను. మనదేశం ఎంతో ఫాజనేటింగ్ గా అనిపిస్తుంది!"    
    "అఫ్ కోర్స్ - నాకూ ఇష్టమే, కానీనాకు ఎక్కువ ఛాన్స్ దొరకలేదు. ఈ జాబ్ వల్లకొన్ని ప్లేస్ లు చూడటమే గానీ - అదర్ వైజ్ - చాలాతక్కువ టూర్ చేశాను"    
    ఆ తరువాత చాలాసేపు తను ఇండియాలో చూసిన అనేక ప్రదేశాలగురించి మాట్లాడసాగాడతను. అతను మాట్లాడుతూంటే గంటల తరబడివినాలనిపిస్తోంది తనకు. రాత్రిభోజనాలు చేయబోతూండగా ఆమెకు అజయ్ గుర్తుకొచ్చాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra