Home » Mainanpati bhaskar » రౌడీరాజ్యం


    అతను ఉపయోగించిన మోటు సమాసం విని తల కాస్త ప్రక్కకు తిప్పుకుంది డాక్టర్ సుధ.

    అతను తన పేషెంట్! ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు. అతడిని మాట్లాడనివ్వాలి. మోటుగా మాట్లాడటం అతని తీరు అని తెలిసిపోతూనే వుంది. కానీ తను పట్టించుకోకూడదు. నిగ్రహం చూపించాలి.

    అయినా ఈ మోటు మాటలు తనకు కొత్తకాదు.

    తన తండ్రీ, తమ్ముడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు కూడా నిస్సంకోచంగా మాటలలో బూతుపదాలు దొర్లించేస్తూ వుంటారు.

    ఇంగ్లీషులో అశ్లీల పదాలను ఫోర్ లెటర్ వర్డ్స్ అంటారు. అన్నీ నాలుగక్షరాల పదాలు.

    అలాగే తెలుగులో ఉండే రెండక్షరాల అసభ్యకరమైన పదాలన్నీ కూడా తనకు నట్టింట రోజూ వినబడుతూనే వుంటాయి.

    వాళ్ళు వాటిని అలవాటుగా అనేస్తూనే ఉంటారు. తనకే ఎప్పటికప్పుడు ప్రతి పదం ప్రతిసారీ షాకింగానే వినబడుతూ వుంటుంది.

    ఘోరమయిన ఆ పదాలు వినటం ఒక ఎత్తయితే, ఆ బూతుల అర్ధం, అవి ఎవరిని ఉద్దేశించి అంటున్నా కూడా....అవన్నీ ఆ వ్యక్తి తాలూకు ఆడవాళ్ళ మీదికే అల్టిమేట్ గా ప్రయోగించబడటం మరీ దారుణం అనిపించేది తనకు.

    ఒక వ్యక్తి మహాపరాధమే చేసి ఉండొచ్చు. కానీ అతన్ని తిట్టాలంటే, అతని అమ్మనో, అక్కనో, ఆలినో యింకెవర్నో కూడా ఆ రచ్చలోకి యిడ్చాలా?

    ఇక్కడా ఆడవాళ్ళపట్ల అన్యాయమేనా?

    ఆ సంస్కార హీనత్వాన్ని భరించలేకేగా తను ఇల్లొదిలి ఢిల్లీ వచ్చేసింది.

    మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు పాండు.

    "తొడ సంబంధం తొంభైయ్యేళ్ళంటారు. అందుకే 'పేరు చెప్పకూడని వ్యక్తి' పైకి పెద్దమనిషిగా చలామణి అవుతున్నా, పాత ఖాతాలు వదల్లేక తన లావాదేవీలన్నిటికీ రాజ్ కుమార్ అనే ఒక కుర్రాడ్ని వారసుడిగా చేశాడు. తనేమో తెరవెనుక వుండి భాగోతం ఆడిస్తుంటాడు."

    "మా గ్యాంగు గుర్తు పెద్దపులి....మరిడేశ్వరరావు గ్యాంగులో వుండే ప్రతివాళ్ళూ చేతి మీద పెద్దపులి పచ్చబొట్టు పొడిపించుకోవలసిందే! ఇప్పుడా గ్యాంగు అంటే విరక్తి పుట్టింది నాకు. కాల్చేదేదో చేతిని కాల్చేస్తే యీ పచ్చబొట్టు పీడా పోయేది" అన్నాడు పాండు.

    దీర్ఘంగా శ్వాస తీసుకుంది సుధ.

    ఢిల్లీ వచ్చినా తనకి ఈ రౌడీ గ్యాంగుల విషయాలు వినడం తప్పదా?

    నిట్టూర్చింది సుధ. తర్వాత మెల్లగా అంది_

    "ఎందుకు కాల్చారు వాళ్ళు?"

    కాస్త సంకోచించి అన్నాడు పాండు_

    "ఒక ముండ దగ్గరికి వెళ్ళాను"

    సుధ మనసు బాధగా మూలిగింది. ఏమిటా పదం....ముండట....! బ్రతకటానికి దారిలేక ఒళ్ళమ్ముకునే ఒక అభాగ్యురాలికి వీళ్ళు పెట్టిన ముద్దు పేరు....

    "ముండ"ట....

    సుధ పెదిమలు బిగుసుకున్నాయి. నొసలు ముడిపడ్డాయి. అది గమనించలేదు పాండు. చెబుతూనే వున్నాడు.

    అతను డెలిరియమ్ లో ఉన్నాడేమో అని అనుమానం వచ్చింది సుధకి. అప్రయత్నంగానే అతన్ని చెక్ చేసింది.

    పాండు చెప్పాడు-

    "మరిడేశ్వరరావు కొడుకు ఉన్నాడు. వారి పేరు అఖిల్! వాడొక లంగా, లఫంగా గాడు...."

    అఖిల్ తనని కత్తితో బెదిరించడం గుర్తొస్తోంది పాండుకి. ఉద్రేకంగా చెబుతున్నాడతను.

    "వాడు నా బాస్ కొడుకే అనుకో! అయినా నాయల్ని నరికి పోగులు పెట్టినా తప్పు లేదు."

    "అఖిల్" నిదానంగా అంది సుధ. "ఈ అఖిల్....చాలా వరస్ట్ ఫెలో అని విన్నాను."

    "అట్లాంటి బద్మాష్ ఇంతవరకూ పుట్టలేదు" అన్నాడు పాండు చాలా తేలిగ్గా. అఖిల్ కత్తి గొంతుకి యింకా గుచ్చుకుంటున్నట్లే వుంది అతనికి.

    చెవులప్పగించి వింటోంది సుధ.

    చెబుతున్నాడు పాండు.

    "అఖిల్ కి, వాళ్ళ నాన్నకీ ఏదో పంపకాల విషయంలో పోట్లాట వచ్చిందని విన్నా. అఖిల్ దేశం మీద పడ్డాడు. వాడెక్కడున్నా వెదికి, వెనక్కి తీసుకురమ్మని నన్ను పంపాడు మరిడేశ్వరరావు. ఆర్నెల్లపాటు వెతికా! వీడు కనపడలేదు! ఊళ్ళో పెళ్ళాం పిల్లలు వున్నారు నాకు. ఓసారి వాళ్ళని చూసొచ్చి మళ్ళీ వెదకడం మొదలెడదాం అని యింటికెళ్ళా!

    'ఇంటికెళ్ళేసరికి ఏం కనబడింది?' అని తనకు తానే ప్రశ్న వేసుకుని, తనే జవాబు చెప్పాడు పాండు.

    "ఇంటి మొగాడు ఆర్నెల్లపాటు ఇల్లు పట్టకుండా తిరిగితే ఏం జరగాలో అదే జరిగింది. ఇంట్లోకెళ్ళేసరికి ఏం కనబడింది నాకు? మంచం మీద నా పెళ్ళాం! దాని మీద నా పక్కింటివాడు...."

    పాండు గొంతు కోపంతో, దుఃఖంతో వణకడం మొదలెట్టింది.

    "నా పెళ్ళాన్ని ప్రాణాలతో సమానంగా చూసుకున్న....అలాంటిది ఆర్నెల్లు నేను లేకపోయేసరికి అది పక్కింటి వాడితో...." తర్వాత వడగళ్ళ వర్షంలా బూతులు!

    తర్వాత అన్నాడు అతను-

    "పక్కింటివాణ్ణి పొడిచేశా! ఒక తట్టు నేను అంత పరేషాన్ లో వుంటే నా కొడుకేమైపోయాడు? అని మరిడేశ్వరరావు మళ్ళీ తరిమాడు నన్ను. తప్పనిసరై మళ్ళీ వెదుకుతూ ఢిల్లీ వచ్చా. ఇక్కడ కనబడ్డాడు ఆ అఖిల్."

    వింటోంది సుధ.

    "ఆడికి మెసేజ్ అందించా!" అన్నాడు పాండు క్లుప్తంగా.

    "అఖిల్ ని కలిసే పని పూర్తయ్యాక, ఓ ముండ దగ్గరికెళ్ళా! అది మహా కిలాడీ! ప్రతి సర్వీసుకి ఎక్స్ ట్రా అడిగింది. నేనేం పల్లెటూరి వాడినా? ఎర్రబస్సు ఎక్కి వచ్చానా? దాన్ని బెదిరించి సరిగ్గా సర్వీసు చెయ్యమన్న! అది కేకలు పెట్టింది. నేను దానిది .... కొరికేశా!" అన్నాడు పాండు. వింటున్న సుధ గుండె నీరై పోయింది. ఎంత క్రౌర్యం ఈ లోకంలో!
   
    అయితే ఫిమేల్ వార్డులో రైట్ బ్రెస్టుకి ఇంజురీతో వచ్చి చేరిన అమ్మాయే ఆ ప్రాసిట్యూట్ అయి వుంటుందా?

    ఆ అమ్మాయికి రైట్ నిపిల్ కంప్లీట్ లీ మిస్సింగ్!! పాపం! పాపం! రెప్పలు మూతబడని పాండు కళ్ళలో కూడా నీళ్ళు చేరాయి.

    "నేను దాన్ని అట్లా చేసి వుండాల్సింది కాదు! నా పెళ్ళాం మీద వున్న కోపం అంతా దానిమీద చూపించా! పైగా ఫుల్ బాటిల్ తాగి వున్నా కదా! వళ్ళు తెలీలేదు!"

    బిగుసుకుపోయి కూర్చుని వింటోంది సుధ. ఇంకా చెప్పాడు పాండు.

    తాగిన మైకంలో గట్టిగా కేకలేశా! నేను హైదరాబాద్ గ్యాంగ్ స్టర్ ని అన్నా! అట్లా అనడం తప్పయిపోయింది. ఏ వీధి కుక్క ఆ వీధిలోనే అరవాలి! హైదరాబాద్ కుక్క ఢిల్లీలో అరిస్తే ఊరుకుంటాయా అక్కడి కుక్కలు! నలుగురు ఉస్తాద్ లు వచ్చి నన్నెత్తుకెళ్ళి రాజ్ కుమార్ ముందు పడేశారు.

    రాజ్ కుమార్ అంటే....బ్లూరాక్ ఫైవ్ స్టార్ హోటలుందే.... దాని ఓనరు నీర్జాకి తమ్ముడట! ఆ హోటల్లోనే అఖిల్ గాడు పనిచేస్తున్నాడు"

    ఆశ్చర్యార్ధకంగా కుడి కనుబొమ్మ ఎత్తి చూసింది సుధ.

    "హోటల్లో పని చేస్తున్నాడా యెందుకు?" అంది.

    అదంతా పెద్ద కుట్ర! అన్నట్లు చప్పరించాడు పాండు.

    "ఈ రాజ్ కుమార్ టీనేజ్ లో వున్నప్పుడే నెంబర్ వన్ గూండా! ఢిల్లీకి రాగానే ఈ సమాచారం అంతా పట్టేశా నేను!"

    "గూండా గిరీలో సంపాదించిన డబ్బుతో ఫైవ్ స్టార్ హోటలు కట్టాడు. అది తన అక్క నీర్జా పేరుమీద పెట్టాడు. అక్కా తమ్ముడు ఇద్దరూ కలిసి ఇంకో నాలుగు హోటల్స్ పెట్టారు.

    నేను హైదరాబాద్ గూండానని తెలియగానే రాజ్ కుమార్ కి అనుమానం వచ్చింది. ఎన్నో రాష్ట్రాల నుంచి గూండాలు వచ్చి ఢిల్లీని డామినేట్ చెయ్యడానికి చూస్తూ వుంటారు. నేనూ అలాంటి వాడినేమో అనుకున్నాడు వాడు. నేను మరిడేశ్వరరావు గ్యాంగు మనిషనని కక్కించారు. కక్కించటానికి మామూలు పద్ధతులు వుంటాయి కదా!"

    తెల్లకాయితంలా పాలిపోయిన మొహంతో పాండు వైపే చూస్తోంది సుధ.

    తనచేత ఆ విషయం ఎలా కక్కించారో గుర్తొచ్చింది పాండుకి. రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళేసరికి తనకి మత్తుదిగిపోయింది.

    తనని అక్కడ మంచుదిమ్మల మీద నిలబెట్టారు. అయిదు నిమిషాల్లో తన కాళ్ళు చచ్చుబడినట్లు అయిపోయాయి.

    తను మరిడేశ్వరరావు గ్యాంగు తాలూకు మనిషన్న విషయం పెద్ద రహస్యమేమీ కాదు.

    అందుకని చెప్పేశాడు తొందరగానే.

    కానీ అంతటితో వదల్లేదు రాజ్ కుమార్.

    మరిడేశ్వరరావు మనుషులు ఇక్కడి కెందుకొచ్చారన్నాడు. తమ వ్యాపారాల లావాదేవీల గురించి అడిగాడు. డ్రగ్, స్మగ్లర్, బిర్యానీతో పరిచయం వుందా అన్నాడు. దావూద్ ఇబ్రహీంతో కనెక్షన్స్ వున్నాయా అన్నాడు. పప్పూయాదవ్ తెలుసా?" అన్నాడు.

    వ్యాపారాల గురించి తనకు ఎక్కువ తెలియదనీ, తను "ఎక్స్ పర్ట్ హిట్ మాన్" అని మాత్రమే అని నమ్మకం కలిగించాక కొంచెం శాంతించాడు.

    శాంతించినా కూడా వార్నింగ్ ఇవ్వకుండా ఊర్కోలేదు రాజ్ కుమార్. సగం హిందీ, సగం తెలుగూ కలిసిన యాసతో.

    "చూడండి బెజవాడ బండీ" అన్నాడు వెక్కిరింపుగా.

    "తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చి కిరికిరీ మొదలెట్టావు. దయదలిచి నిన్ను వదిలేస్తున్నా! ఢిల్లీ వచ్చి వెళ్ళినందుకు నీకు కాస్త మార్కు చెయ్యడం తప్పదు. మీ మరిడేశ్వరరావుకి ఇది నా వార్నింగని చెప్పు! మళ్ళీ కనబడకు! ఢిల్లీదోవ మర్చిపో!" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra