Home » Dr c. ananda ramam » రేపటి మహిళ

   
    "నేను తీసుకున్న నిర్ణయం మంచిదనే ఇప్పటికీ నా నమ్మకం. మిగిలినవన్నీ ఏవి ఎలా వున్న మా యిద్దరికీ ఒకరిమీద ఒకరికున్న ప్రేమానురాగాలు, నమ్మకము చాలు నాకు."
    మరోసారి గుటక మింగాడు భాగవతార్. మృదుల తండ్రి కల్పించుకుని, "నువ్వు సుఖంగా వుండటంకంటే మాకేం కావాలి మృదూ! నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఇంటికి పోన్ చెయ్యి. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ నికదా! నన్ను చాలామంది గౌరవిస్తారు."
    "థాంక్స్ డాడీ! కాని ఇన్ ప్లుయెన్స్ ఉపయోగించుకోవడం కంటె ప్రజాశక్తి నిరూపించుకోవడమే నాకిష్టం. అందుకే ప్రయత్నిస్తాను ఎప్పుడూ."
    మృదుల తండ్రి భాగవతార్ వైపు తిరిగి, "చూసారుగా ఎలా మాట్లాడుతోందో?" అన్నాడు నిస్సహాయంగా మాట్లాడాలని అతని ప్రయత్నం. కాని అతని కంఠంలో గర్వమే కనిపించింది.
    మృదుల తల్లిదండ్రుల ధోరణి చూసి తల పట్టుకున్నాడు. భాగవతార్ భరించలేక "ఆధునికత పేరుతో ఇంత విచ్చలవిడిగా తిరగడం ఎవరికీ మంచిదిగాదు" అన్నాడు నిరసనగా.
    మృదుల తండ్రికి కోపం వచ్చింది.
    "మనం చేస్తున్నదేమిటండీ? ఆధునికత పేరుతో క్లబ్స్ కి వెళ్ళడంలేదూ. మన సంస్కృతికి ఏమాత్రం సరిపడని హాట్ డ్రింక్స్ తీసుకోవడం లేదూ- ఒక్కొక్కసారి తప్పతాగి నలుగురులోనూ నోటికొచ్చినట్లు మాట్లాడటం లేదూ అర్ధనగ్నంగా- త్రీ పోర్స్ నగ్నంగా నాట్యాలు చేసే కాబరే డాన్స్ ర్ ల ఒంపుసొంపులు, సిగ్గు- బిడియం వొదిలేసి తనివితీరా చూసి ఆనందిస్తాము. ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలన్నీ పనికిరాగాలేంది స్త్రీలు కూడా పురుషులతో సమానంగా, ఆ మాటకొస్తే వాళ్ళకంటె ఎక్కువగా ముందడుగు వేసి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడడం పనికిరానిదవుతుందా?"
    మాట్లాడలేకపోయాడు భాగవతార్. సమాజంలో ప్రముఖు లనేకమంది అతనిని పార్టీల కాహ్వానిస్తుంటారు. సగటున వారానికొక పార్టీ అటెండ్ అవుతూంటాడు. ప్రతి పార్టీలోనూ కేబరేడాన్స్ లు వున్నా, లేకపోయినా హాట్ డ్రింక్స్ మాత్రం వుంటాయి. మృదుల, ఆమె స్నేహితులు తీవ్రంగా నిరసిస్తూన్న రాజభూషణమే ఎన్నో పార్టీలిచ్చాడు భాగవతార్ కి.
    "వెళ్ళొస్తాము" అని లేచాడు మృదుల తండ్రి. మృదుల తల్లికి మాత్రం అప్పుడే లేవాలని లేదు. బంగారు బొమ్మలాంటి తన కూతురు పోయి పోయి ఈ నడి వయసు పాటలు పాడే వాడిని పెళ్ళిచేసుకోవడం ఆమెకేమాత్రం ఇష్టం లేదు. తనక్కాబోయే అల్లుడు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయితే బాగుండునని ఆమె చాలా కలలు కంది. కర్నాటక సంగీతంలో ప్రవేశం- అభిరుచి రెండూ లేని ఆవిడ భాగవతార్ ని ఏమాత్రం గౌరవించలేకపోయింది. ఇప్పుడు భాగవతార్ లోలోపల ఉడుక్కుంటూంటే ఆవిడకి లోలోపల చాల సంబరంగా వుంది. భర్త లేవడంవల్ల విధిలేక లేచి, మృదూ! వాళ్ళ మాటలకి- వీళ్ళ మాటలకి భయపడి ఇరవై కూడా రాకుండా అరవై నిండిన ముసలమ్మలాగ అయిపోకు. మన తప్పొప్పులు నిర్ణయించే అధికారం మన అతఃకరణకి తప్ప ఎవరికీ రాలేదు. నువ్వెవరినీ లక్ష్యపెట్టక్కరలేదు. అన్నిటికీ నేనున్నాను" అని మృదులని కౌగిలించుకొని బుగ్గమీద ముద్దు పెట్టుకుని, భాగవతార్ వైపు తిరిగి చేతులు జోడించి, భర్త వెనకాల బయటికి నడిచింది. మృదుల కూడా వాళ్ళవెంట కాంపౌండ్ గేట్ వరకూ వెళ్ళింది. కూర్చున్నచోటు నుంచి కదల్లేదు భాగవతార్!" వీళ్ళూ- వీళ్ళ ప్రేమలు" పళ్ళు నూరుకున్నాడు. "ఇప్పుడే లండన్ విమానం దిగొచ్చినట్లు కౌగలించుకోవడాలు- బుగ్గలమీద ముద్దు పెట్టుకోవడాలు. భర్తకి అణుకువగా వుండి చెప్పినట్టు వినమని బోధించడానికి మారుగా, ఎవర్నీ లక్ష్యపెట్టొద్దు- దేనికీ భయపడొద్దు" అని దుర్భోధలు.

    ఆ వీడియోలో సొట్టకాలు వాడెవడో కనిపెట్టి ఎలాగైనా ఇద్దరికీ సంబంధం వున్నట్టు లోకంముందు ఋజువుచేసి అప్పుడు చూడాలి ఆ అమ్మగారి మొహం."
                              *    *    *
    టేబిల్ మీది ఉత్తరాల కట్టలోంచి ఒక్కొక్క ఉత్తరమే చదివి చింపి చెత్తబుట్టలో పారేస్తున్నాడు భాగవతార్. ఉత్తరాల్లో చాలావరకు ఫాన్ మెయిలే. ముఖ్యమైనవాటికి ఎప్పటికప్పుడు సమాధానాలు వ్రాసి ప్రక్కన పెడుతున్నాడు. తరువాత ఉత్తరం చదివి ఆశ్చర్యంతో మరోసారి చదివాడు. అది రాజభూషణం దగ్గిర్నుంచి. హైదరాబాద్ లో ఉన్న తన బంగళాలో రాబోయే సోమవారం నాడు ఏర్పాటు చేస్తూన్న పార్టీకి రమ్మని ఆహ్వానం ఆ ఉత్తరం. మృదుల అతడ్ని ఎలా ఎటాక్ చేసిందో తెలిసిన తరువాత అతని దగ్గిర్నుంచి ఇలాంటి స్నేహపూర్వకమైన ఆహ్వానాన్ని ఆశించలేదు భాగవతార్. జరిగింది ఇంత త్వరలో మర్చిపోయాడా రాజభూషణం? అది అతని స్వభావం కాదు. బహుశా జరిగిందాన్లో మృదుల తప్పేమీ కాదని అంతా ఆ ట్రైబల్ చేసిందేనని గ్రహించి వుంటాడు. అతనిది కూడా మృదుల తల్లికున్నలాంటి మోడ్రన్ కల్చరేమో?
    ఈ సంజాయిషీ బాగా నచ్చింది భాగవతార్ కి. అతడికి రాజభూషణం స్నేహాన్ని - అతడి పార్టీలనీ వదులుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే అతడిచ్చే పార్టీలకి ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు I.P.S ఆఫీసర్లు, డాక్టర్లు- ఇంజనీర్లు- బిజినెస్ మేగ్నెట్స్ అందరూ వస్తారు. ఇదివరలో చాలాసార్లు ఇలాంటి పార్టీలలోనే ప్రముఖులు కొందరు అతడి ప్రోగ్రామ్స్ రెండు మూడు బుక్ చెయ్యడం జరిగింది. అందుచేత వెంటనే అతడి ఆహ్వానాన్ని అంగీకరిస్తూన్నట్లు సమాధానం రాసేసాడు. రాజభూషణం పార్టీలకి అలా ఏక్ స్స్ టెన్స్ లెటర్స్ వెళ్ళాలి. ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతాయి కాబట్టి అతిధులని ముందుగా అంచనా వేసుకోవడం చాలా అవసరం.
    భాగవతార్ ఎక్కడికి వెళుతున్నా మృదుల వివరాలు అడగదు. అతడు చెపితే వింటుంది. కాని ఆరా తీస్తూన్నట్టు ప్రశ్నల వర్షం కురిపించదు. "ఎక్కడికి వెళుతున్నారు?" "ఎప్పుడెళుతున్నారు", "ఎప్పుడొస్తున్నారు" అని మాత్రం అడుగుతుంది. అయితే మృదుల అడగకపోయినా భాగవతార్ తన ప్రయాణ వివరాలన్నీ చెప్తాడు. ఎందుకంటె సాధారణంగా అవన్నీ సన్మానాలకి సంబంధించినవే అయివుంటాయి. ఈసారి మాత్రం అతడు మృదులకి ఏమీ చెప్పదల్చుకోలేదు.
    ఆ రోజు సోమవారం. "సాయంత్రం నేనో పార్టీకి వెళుతున్నాను" అన్నాడు మృదులతో. సర్టిఫైడ్ గర్ల్స్ స్కూలులో బాలికా నేరస్థుల ఏక్టివిటీస్ కి సంబంధించి తీసిన వీడియో కేసెట్ టి.వి. స్క్రీన్ మీద ప్రాజెక్టు చేసుకుంటోంది మృదుల. టి.వి. స్క్రీన్ మీంచి దృష్టి మరల్చకుండానే "ఎప్పుడొస్తున్నారు?" అంది.
    "రాత్రి బాగా పొద్దుపోవచ్చు. నాకోసం ఎదురు చూడకుండా భోజనం చేసేసి పడుకో" అన్నాడు.
    "ఓ.కే."
    మృదులకి ఏమీ చెప్పకూడదనుకున్న భాగవతార్ కి ఆమె వివరాలేమీ అడగకపోవడం చాలా నిరుత్సాహం కలిగించింది. తెచ్చి పెట్టుకుందామన్నా ఉత్సాహం రావడంలేదతనికి. డ్రైవర్ కి రాజభూషణం ఇల్లు, ఎడ్రస్ చెప్పి కారులో బయలుదేరాడు. రాజభూషణం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వుంది. నగరానికి దూరంగా విసిరేసినట్లున్న ఆ ప్రాంతం పోష్ డ్ లోకేలటీగా ప్రసిద్ధి కెక్కింది. పెద్ద పెద్ద కొండలమధ్య అక్కడి బంగళాలు రకరకాలుగా ఫ్రంట్ ఎలివేషన్స్ తో చూసినకొద్దీ చూడాలనిపించేట్టుగా ముచ్చటగా వుంటాయి.
    రాజభూషణం బంగళా ఏదో జమీందారీ దివాణం అంత పెద్దదిగా ఉంటుంది. విశాలమైన కాంపౌండు. కుడివైపున కాంపౌండ్ లోపలికి మూడు కారు గేరేజిలు, ఎడమవైపున ప్రత్యేకించి నాటిన ఇంపోర్టెడ్ గ్రాస్ తో పెరిగిన ఆకుపచ్చని కార్పెట్ లా తోచే మెత్తని లాన్స్ - లాన్స్ పక్కనుంచి కొంచెం ఎత్తుగా ఉన్న కొండమీదికి అందంగా కట్టిన మెట్లు- మెట్లకి రెండువైపులా కోన్ షేప్స్ లో లైట్ బ్లూకలర్ ఎలక్ ట్రిక్ బల్బ్సు, మెట్లెక్కగానే సిమెంట్ కుదురు. లోపల చిరుపూల జల్లుల్లా నీళ్ళు విరజిమ్మే వాటర్ పౌంటెన్. తరువాత ఒక క్రమంలో పెంచుతోన్న అత్యంత అపురూపమైన గులాబీ రకాలు. "ఇది మనుష్యులు నివసించే ఇల్లా లేక ఏదైనా ఇంద్రలోకమా"- అని భ్రమ కల్గిస్తూంటూంది ఆ వాతావరణం. పూల మొక్కలు దాటి వెళ్ళాక పెద్ద బాల్కనీ. బాల్కనీలో రెండు సోఫాసెట్లు- అది దాటాక చాలా విశాలమైన డ్రాయింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ లో అటూ మొత్తం పదిసోఫాసెట్లు అమర్చి ఉన్నాయి. సైడ్ టేబిల్స్ మీద మూడు జతల చక్కని బ్రాండ్ పవర్ వేజ్ లు. వాటిల్లో టేబిల్స్ మీద మూడు జతల చక్కని బ్రాంజ్ పవర్ వేజ్ లు. వాటిల్లో అప్పుడే తోటలో వికసించి కళకళలాడుతున్న తాజా పువ్వులు అందంగా అమర్చి వున్నాయి.  పైన జంటగా వెళ్లాడుతున్న నాలుగు జతల షాండిలియార్స్ గదిని వెండి కాంతులతో నింపుతున్నాయి. గదిలో ఒక వైపున పికాసో పెయింటింగ్ - మరొకవైపు అజంతా తైలవర్ణ చిత్రానికి డూప్లికేట్ తైలవర్ణ చిత్రం- ఇంకోవైపు మోనాలిసా ప్రతికృతి కళ - వైభవము- దర్జా- వీటన్నిటితోపాటు అధికార దర్పమూ కూడా ఉట్టిపడుతూంటుంది ఆ హాల్లో. ఎర్రటి బేడ్జస్ ధరించిన తెల్లని యూనిఫారమ్ లలో వున్న నౌకర్లు- అతి నెమ్మదిగా మాట్లాడుతూ ఎవరికేం కావాలో కనుక్కుంటున్నారు.
     కాంపౌండ్ గేటు దగ్గరవున్న గుర్కావాడు ఒక్కొక్కర్నీ విజిటింగ్ కార్డ్ చూసికాని లోపలికి పోనీయడం లేదు.
    భాగవతార్ హాల్లో కొచ్చేసరికి అప్పటికే జనం నిండివున్నారు. హాల్లో, అతన్ని చూడగానే రాజభూషణం మాట్లాడుతున్నది. మధ్యలో ఆపేసి అతని దగ్గరకొచ్చి షేక్ హాండ్ ఇచ్చి, "మీరొచ్చినందుకు నాకు చాలా సంతోషం" అన్నాడు కూర్చోడానికి సోఫా చూపిస్తూ. వచ్చిన వాళ్ళందర్నీ పరీక్షగా చూడసాగాడు భాగవతార్. ఏండెటో వున్నాడు. సాధారణంగా భాగవతార్ వెళ్లే పార్టీలన్నిటికీ ఏండెటోకి కూడా ఆహ్వానం వస్తుంది. మరోవైపు చూసి ఉలిక్కిపడి కళ్ళు నులుముకుని మరోసారి చూసాడు. అక్కడ ప్లాస్టిక్ ముఖాలు తొడుక్కున్న మగవాళ్ళు- ఆడవాళ్ళు ప్రేక్షకుల్లో కలిసిపోయి నవ్వుతూ తిరుగుతున్నారు. అలా ప్లాస్టిక్ ముఖాలు తొడుక్కున్న వాళ్ళల్లో ఆధునికంగా అలరించుకున్నవాళ్ళు- సాదాసీదాగా వున్నవాళ్ళు కూడా ఉన్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra