Home » Yerramsetti sai » 8 down

    "ఎందుకు సార్?"    
    "అదంతా తర్వాత చెప్తాను- పద, కమాన్"    
    ఇద్దరూ కాబిన్ వేపు పరుగెత్తసాగారు. ఆయాసంతో ఒగరుస్తూ కాబిన్ చేరుకునేసరికే గూడ్స్ ట్రెయిన్ లూప్ లైన్ లో కొచ్చేసింది.    
    "సత్యన్నారాయణా! నాకు లూప్ లైన్ ట్రాక్ రిలీజ్ కావాలి!"    
    "ఎందుకు సార్?"    
    "గూడ్స్ ట్రెయిన్ ట్రాక్ క్లియర్ చేయకముందే మెయిన్ లైన్ కి ట్రాక్ మార్చాలి"    
    సత్యన్నారాయణ ఉలిక్కిపడ్డాడు.        
    "అసలే యాక్సిడెంట్ అవుతోంది, ఈ టైమ్ లో ఇలా రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటం. "గొణిగాడతను.    
    "సత్యం! మనం యాక్సిడెంట్ అవకుండా చూడ్డానికి ప్రయత్నిస్తున్నాం! ఈ సమయంలో మనక్కావలసింది ప్రయాణీకులకు ప్రమాదం ఎలా తప్పించటమా అనే గానీ రూల్స్ పాటించటం కాదు! అవునా, కాదా?"    
    సత్యన్నారాయణ ఇంక మాట్లాడలేకపోయాడు.    
    "సరే" అంటూ కాబిన్ కిందరిలే రూమ్ లోకి కెళ్ళాడు. పాయింట్స్ దగ్గర ట్రాక్ వెంటనే రిలీజ్ అయిపోయింది.   
    తను కాబిన్ బయటబాల్కనీలో నిలబడ్డాడు దాస్.    
    "రాములూ! నువ్ లాక్ బార్ లివర్ దగ్గరే నిలబడు. గూడ్స్ ట్రెయిన్ బ్రేక్ పాయింట్స్ దాటగానే నేనుకేక వేస్తాను. నువ్ పాయింట్స్ వెంటనే మెయిన్ లైన్ కి సెట్ చేసేయ్, ఫౌలింగ్ క్లియరవకపోయినా సరే!"    
    "అలాగే సార్!"    
    గూడ్స్ బ్రేక్ పాయింట్స్ దగ్గరకొచ్చేసింది.    
    వెనుకే తరుముకొస్తున్నట్లు 8 డౌన్!    
    తన ప్లాన్ సక్సెస్ అవుతుందా? దాస్ కి సందేహం వచ్చింది. బ్రేక్ పాయింట్స్ మీదకొచ్చింది. నాలుగు వీల్సూ టంగ్ రైల్ మీద కొచ్చేసినయ్. 8 డౌన్ ఇంజన్ బ్రేక్ కి కేవలం ఇరవైగజాలదూరంలో వుంది.    
    "రాములూ! మార్చేయ్!" అరిచాడు దాస్.    
    రాములు ఠక్కున లాక్ బార్ నార్మల్ చేసేశాడు. ఆ తర్వాత లూప్ లైన్ పాయింట్ నార్మల్ చేసేశాడు. అంతే! లాక్ బార్ తీసుకునేలోపలే 8 డౌన్  మీద కొచ్చేసింది.    
    గూడ్స్ బ్రేక్ ఇంకా ఫౌలింగ్ క్లియర్ చేయనేలేదు. బ్రేక్ లోని గార్డ్ అతివేగంగా సమీపిస్తోన్న 8 డౌన్ ని చూసి వెర్రికేకవేస్తూ బ్రేక్ అవతలివేపుకి దూకేశాడు. 8 డౌన్ ఇంజన్ బ్రేక్ వాన్ అంచుకి తగిలింది ఆ వేగంలో. బ్రేక్ వాన్ ఎగిరి ట్రాక్ కి అవతలివేపు పట్టాలు దిగిపోయింది. పెద్ద జెర్క్ తో 8 డౌన్ మళ్ళీ పరుగెత్తసాగింది మెయిన్ లైన్ మీద.    
    "హమ్మయ్య" అనుకున్నాడు దాస్. వెంటనే కాబిన్ దిగి స్టేషన్ వేపు పరుగెత్తసాగాడతను. ఇప్పుడు రాయనపాడు స్టేషన్ మాస్టర్ కీ విషయం చెప్పాలి!    
                                                                * * *    
    గాఢ నిద్రలో వున్న మృదులకు ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది అర్దరాత్రి. ఆ తర్వాత మళ్ళీ నిద్రపట్టలేదు.    
    ఉదయం కంట్రోల్ ఆఫీస్ లో గ్లాస్ ఛాంబర్ లో కూర్చుని ఆ రాత్రి ఇంటర్ చేంజ్ కి హాండోవర్ చేయబోయే ట్రైన్ పొజిషన్ చూస్తూండగా వచ్చాడాయువకుడు. తన కెదురుగ్గా ఎంతసేపునుంచి నిలబడి వున్నాడో తెలీదు. తను తలెత్తిచూసేసరికి విష్ చేశాడు.    
    "గుడ్ మాణింగ్ మేడమ్! నా పేరు అజయ్. వైజాగ్ నుంచి వచ్చాను. సూర్యనారాయణ గారు మీకీ లెటర్ ఇచ్చాడు. 'అంటూ ఓ లెటర్ తీసి ఆమె కందించాడు. సూర్యనారాయణ మృదుల ఎంతగానో అభిమానించేమావయ్య.   
    ఆమె కవరు చింపి కాగితం తీసి చదవసాగింది.    
    "డియర్ మృదులా! ఈ లెటర్ తెచ్చినతను నాకు బాగా ఆప్తుడయిన ఓ మిత్రుని కొడుకు! ఇతనికి విజయవాడలోని సిమెంట్ కంపెనీలో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఈ రోజుల్లో రికమండేషన్ లేని ఉద్యోగాలు రావటం కష్టం కదా! ఆ సిమెంట్ కంపెనీకి వాగన్స్ సప్లయ్ చేసే లావాదేవీలు మీకుంటాయిగనుక నువ్ రికమెండ్ చేస్తే అతనికా వుద్యోగం తప్పక దొరుకుతుందని నా నమ్మకం. అతనిది చాలా బీద కుటుంబం! కనుక నువ్ చేయబోయే సహాయం అతనికుంటుంబానికే విలువైనదవుతుంది. నిన్ను చూసి చాలారోజులయింది. సీనియర్ డివిజినల్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్ గా నీకు క్షణం తీరిక వుండదని నాకు తెలుసు- అయినా ఒకసారి వీలు చూసుకుని వైజాగ్ రాకూడదూ! రైళ్లన్నీ నీవేగా!"
    
    నవ్వుకుంటూ ఉత్తరం మడిచి తన బాగ్ లో ఉంచుకుంది.
    
    "మీకేదో ఇంటర్ వ్యూ వచ్చిందని రాశారు మావయ్య" అందామె.
    
    "అవునండీ! సిమెంట్ కంపెనీలో మీకు ఆ కంపెనీలో ఎవరోకరు తెలిసి వుండే అవకాశం వుందని అన్నారు మీ మావయ్యగారు. ఈ అవకాశం పోగొట్టుకోకూడదని, ఆయన్నీ సహాయంకోరాను. ఎలాగూ నాకు గవర్నమెంట్ సర్వీస్ దొరికే ఛాన్స్ లేదు. అందుకని మీకీ ఇబ్బందికలిగించక తప్పటంలేదు-"    
    "గవర్నమెంట్ సర్వీస్ ఎందుకని దొరకదు?"    
    "పాతికేళ్ళు మొన్నేదాటాయి కదండీ?"    
    "ఓ! అయితే చాలా రోజుల్నుంచీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట!"    
    "అవునండీ! నాలుగేళ్ళనుంచి ఇంటర్వ్యూ వరకూ వస్తున్నానుగానీ అక్కడే పోతోంది. అక్కడే రికమండేషన్ లు దెబ్బకొట్టేస్తున్నాయ్"    
    ఆమె ఓ క్షణం ఆలోచించింది "ఆల్ రైట్! మీరెక్కడున్నారు ఇప్పుడు?"    
    "ఇంకా ఎక్కడా దిగలేదండీ! ముందు మిమ్మల్ని కలుసుకుని తర్వాత ఏదయినా లాడ్జి వెతుక్కుందామని..."   
    "సరే! మీ జాబ్ గురించి నేను రికమెండ్ చేస్తాను. కానీ ఇంటర్ వ్యూలో మీరు ఎలా ఫేస్ చేయగలరు అనే దాని మీద కూడా ఆధారపడివుంటుంది".    
    "అఫ్ కోర్స్! ఆ విషయం నిజమేనండీ! నా మీద నాకు నమ్మకంవుంది".  
    "సరే! మీరింక వెళ్ళిరండి!"    
    "థాంక్యూ వెరీమచ్ మేడమ్"    
    అతను వెళ్ళిపోతూంటే ఆమెకు గుర్తుకొచ్చింది, అంకుల్ రాసిన వుత్తరంలో విషయం- అతను చాలాబీదకుటుంబానికి చెందిన వ్యక్తి. తన బంగళాలోనే ఒకరోజు వుండనిస్తేనేం? ఎలాగూ     గెస్ట్ రూమ్ ఒకటుంది.    
    "మిస్టర్ - మిస్టర్ అజయ్- "వెళ్ళిపోతున్న అతన్ని పిలిచిందామె.    
    అతను త్వరత్వరగా వెనక్కు తిరిగి వచ్చాడు.    
    "ఎస్ మేడమ్-"    
    "పోనీ మీరు ఓ పని చేయండి! మా ఇంట్లో ఎలాగూ గెస్ట్ రూం వుంది! అందులో వుండవచ్చు మీరు"    
    "మీకేమీ ఇబ్బంది కలగదనుకుంటే వుంటాను"    
    "ఫర్లేదు- అలాంటిదేమీలేదు"    
    "ఓ.కె!"    
    మృదుల ఆఫీస్ ఫ్యూన్ ని పిలిచింది.    
    "ఇతనిని జీప్ లో తీసుకెళ్ళి నా బంగళా దగ్గర డ్రాప్ చేసిరా! నా గెస్ట్ రూమ్ ఇమ్మని బంగళా ఫ్యూన్ కి చెప్పు" ఆజ్ఞాపించి అజయ్ వేపు చూసింది. "మీరు వెళ్ళండి! మీకేం కావాలన్నా ఫ్యూన్ నడగండి! అన్ని ఏర్పాట్లు చేస్తాడు-"    
    వెళ్ళిపోయాక తనకు గుర్తుకొచ్చింది.    
    ఆ రోజు సాయంత్రం బాంబేనుంచి వినోద్ వస్తున్నాడు. తనను చూడటంకోసం! అతను ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అతనికి తనూ, తను అతనికీ నచ్చితే తన పెళ్ళి సెటిలయిపోతుంది. ఎప్పటి నుంచి ఈ గొడవ! తను ఎమ్.ఎస్.సి. పాసయిన రోజునుంచీ తనకోసం సంబంధాలు వెతుకుతూనే వున్నారు.    
    కానీ తన హోదాకు, తన చదువుకి కనీసం సరితూగగల సంబంధందొరకనేలేదు. తనతల్లిదండ్రులు, తన మావయ్య- అందరూ ప్రయత్నించి విసిగిపోయారు. ఇంతకాలానికి ఇప్పుడు ఐ.ఏ.యస్ ఆఫీసర్ సంబంధం చూశారు తల్లిదండ్రులు. వినోద్ తనతో ఫోన్ లో మాట్లాడాడు రెండురోజులక్రితం. ఫోటోలు చూడటంకంటే పర్సనల్ గా కలుసుకుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావటానికి అవకాశం వుంటుందని అన్నాడతను. అదేమంచిదని చెప్పింది తను.    
    ఆ ప్రోగ్రాం ప్రకారం తనతల్లిదండ్రులతో ఆ రోజు వస్తున్నట్లు చెప్పాడతను. ఇప్పుడు తన గెస్ట్ రూమ్ విజయ్ కిస్తే వినోద్ కి ఎలా? మధ్యాహ్నం తను భోజనాలకి వెళ్ళినప్పుడు అజయ్ ని ఇంకో గదిలోకి మార్చేస్తే సరిపోతుంది.    
    మధ్యాహ్నం తను భోజనానికి వెళ్ళేసరికి బాగా ఆలస్యం అయిపోయింది.    
    లోడింగ్ టార్గెట్స్, సైడింగ్ క్లియరెన్స్ లు చూసుకుని బయల్దేరే సరికే మధ్యాహ్నం రెండయిపోయింది.    
    భోజనం వడ్డించాడువంటవాడు. తినబోతూండగా గుర్తుకొచ్చింది.    
    "ఆ గెస్ట్ భోజనం చేశాడా?"    
    "లేదమ్మా! మీరువచ్చి వెళ్ళాకతనకు వడ్డించమన్నాడు."    
    "అరె! అలాగా! అయితే అతనికికూడా వడ్డించి త్వరగా పిలుచుకురా!"   
    తను భోజనం చేస్తూండగా వచ్చాడు అజయ్. అతనిని చూసి ఆశ్చర్యపోయింది మృదుల. ఉధయానికీ ఇప్పటికీ చాలా తేడా వుంది అతనిలో! ఉదయం మరీ స్టూడెంట్ లా కనిపించాడు గానీ ఇప్పుడు డిగ్ని ఫైడ్ గా, గంభీరంగా కనబడుతున్నాడు.    
    "గుడాఫ్టర్ నూయన్ మేడమ్!" అన్నాడు చిరునవ్వుతో.    
    "రండి! జాయినవండి! ఇంతలేట్ ఎందుకుచేశారు భోజనానికి?"    
    "ఉదయం ఇక్కడికొచ్చాకఫలహారం బలవంతంగా తినిపించాడు మీ వంటతను- దాంతో..."    
    ఇద్దరూ భోజనంచేయసాగారు.    
    "మీ క్వాలిఫికేషన్ ఏమిటి?" అడిగిందామె.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra