Home » Chalam » Musings 2


    స్త్రీ అందమనీ, సృష్టి అందమనీ ఒకటి వర్జనీయమనీ , ఒకటి అంగీకారమనీ , యీ భేదాలన్నీ అల్పత్వాలు, భీరుత్వాలు, నీచ బుద్దుల నీతి భేదాలు, శాస్త్రాలు భోదించి భయపెట్టిన దౌర్భాగ్యాలు.
    సృష్టి సౌందర్యంలో మాత్రం వాంఛ లేదా? మబ్బుల మీద పడుకోవాలని నీళ్ళ మీద తేలాలని పువ్వుల్ని కోసుకోవాలని, గడ్డిలో కూచోవాలని, కొండల్ని కావిలించుకోవాలని కోర్కె కలగలేదా? జడుడా? ఐతే, స్త్రీ రొమ్ము మీద కళ్ళలోతుల్లో , తొడల నవనవల్లో నడుము పొదుగులో, పొట్ట కింద గచ్చులో ఏం అందాలు చూశావు? నీ మొహం!
    కోర్కేలో లేదు భేదం. స్త్రీ సౌందర్యాన్ని ఉపయోగించుకోగలవు. సృష్టి సౌందర్యాన్ని ఉపయోగించుకోలేవు. అప్పటికీ పువ్వుల్ని, తలలోనూ, కోట్లకి బిగించుకుంటోనే వున్నారు. కాని అవి అందక నవ్వుతాయి. అయినా స్త్రీని మాత్రం ఏం ఉపయోగించుకొని ఏం సౌఖ్యపడుతున్నారు? ఈ తృప్తి నిచ్చేది కామం గాని సౌందర్య భావం కాదు. కోటులో పువ్వు అందం వలెనె, యింటో స్త్రీ అందం నీకు అందక, నీ గోడలకి , తలుపులకి , పరజాలకి, చేతులకి, చూపులకి, సంభోగాలకి, పేరంటాలకి, వియ్యలకి అతీతమై దేవత్వాన్ని పొంది, నిన్ను శుద్ధ మూర్ఖుణ్ణి చేసి నవ్వుతోంది. నువ్వు అనుభవించేది చర్మం; స్పౌందర్యం  కాదు.
    స్త్రీని పూర్తిగా తన మురికి అనుభవంలోకి యిడ్వడం చాతగాక, చివాట్లు, దెబ్బలూ, నీచాత్వాలు, అవమానాలూ, ఏమీ ఆమె హృదయధీరత్వాన్ని వొంపలేకపోతే నిరాశ చెంది, కసి పూని పురుషుడు శాస్త్రాలలో కధలలో తిట్టి పోశాడు.
    ఎందుకంటె , లోకాన్ని సంతాపంతో నింపే స్త్రీ స్వభావానికి జీవరాసుల్ని పోషించే భూస్వభావానికి చాలా సన్నిహితం. తొక్కి , దున్ని, ,మలినం చేసి భూమిని ఎంత సాధించామో . నీచపరిచి ఉపయోగించుకుని స్త్రీని అంతే సాధించగలరు.
    ఎందుకంటె ఈ సౌందర్యనికంతా వెనక వుండే శక్తి అంతా వొక్కటే. అది మన పెదిమలకీ అందదు. అధికారలకీ లోబడదు! వూరికే హృదయాన్ని పిలిచి పిలిచి, అందుకోవాలని నడిచిన కొద్ది , ప్రతిధ్వనివలె దూరంగా పోయి నవ్వుతుంది. అదే ఎండమావులు అదే ఆకాశం. అదే వెన్నెల. చుట్టూ వుంది. చిక్కదు. అదే స్త్రీ ముఖం మీది చిరునవ్వు. పిల్లల వొంటి మీద కొత్త మెరుగు.
    శరత్కాలపు ఆకాశం నీలం, జేష్ఠమాసపు వానల తరవాత గాలిలో నిర్మలత్వం, ఏదో అర్ధం కాని నూతనత్వం -- అదీ సౌందర్యం- ఏ కవివర్ననలకూ, యే చిత్రకారుడి కుంచె కీ అందని అందం.
    అదే స్త్రీ నల్లగుడ్డు చుట్టూ కనపడే శాంతి, అదే చిరునవ్వులో పెదిమ వొంపులోని కొంటెతనం. అదే తల్లి ముఖంలో మనం చూసే తేజస్సు.
    "Eyes can see only dust and earth
    But feel it with your heart; it is pure joy.
    The flowers of delight blossom on all sides, in every form.
    But where is your heart's theread to weave them in a garland?
    ఈ అందవికారం, దౌర్భాగ్యం, బాధ , అసహ్యం యివి కూడా ఆ శక్తేనేమోనని నా అనుమానం. ఎందుకంటె యీ అందమంతా మనసు నేర్చుకున్న అలవాట్లుగా యీ అలవాట్ల నించి మనసు తప్పించుకున్నప్పుడు , యే సాధన వల్లనో యీ చిక్కులోంచి బైట పడ్డప్పుడు యీ లోకమంతా , మనుషులు, రాళ్ళు, ముళ్ళు పాములు, అన్నీ ఒక్కటే సౌందర్య సముద్రంగా కనబడతాయేమో! ఆ దృష్టితో ప్రపంచాన్ని ఒక్క నిమిషం -- ఆ Vision (దీనికి తెలుగు చేత కాలేదు, రమణయ్య గారూ) చూడాలని ప్రయత్నిస్తాను, ఒక్కడే పరమేశ్వరుడు యిన్ని రూపాలు తన లీల కోసం ధరించాడన్న ఉపనిషత్తుల ఉద్దేశ్యం జ్ఞాపకం వొస్తుంది.
    అది కూడా సరికాదు. అసలు ధరించనే లేదు. ధరించినట్టు తోపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటె -- వొద్దు మరీ వేదాంతంలోకి పోయి మీకు విసుగెత్తిస్తాను. వెర్రి! అట! కాని అదో తమాషా? జీర్రినీ, అచారినీ తలుచుకుంటాను -- ఈశ్వరా! నీకేం తమాషా యిట్లాంటి రూపాల్ని దరించడం కూడా నీ లీలయేనా? ఇట్లాంటి వికృతాల్నీ, వికారాల్నీ పొందటం నీకెట్లా యిష్టమయింది? అనుకుని చప్పున నాలిక కొరుక్కుని, 'ఇవి వికారాలు కావుగా నా మనసు కల్పిస్తున్న వికారమే గాని, అసలు యివి విశ్వసౌందర్యం లోని కిరణాలే కదా!' అని అనుకోగానే sense of humour అంత లావు పొట్ట మనిషి, ఆ గుందటి bullet head .
    పొట్టివాడే _ పెద్ద పొట్టవాడే |
    వొట్టి డబ్బాలతో _ వొచ్చినాడే ||
             (కవి|| కూ|| సూ||)
    అదేం కిరణం? అని పకపక నవ్వు వస్తుంది. అంతేకాదు. ఈశ్వరుడే యీ రూపాలన్నిటిని ధరిస్తే _ యీ వ్యక్తుల ద్వారా యీ బాధలన్నిటిని ఎందుకు పడుతున్నాడా అని సందేహం కలుగుతుంది. కాని యీ ఆకారంలో అందవికారాలన్ని యీ కుష్టు, యీ బొర్ర, యివన్నీ లేనట్టే యీ దుర్గుణాలు, యీ యీర్ష్య, యీ మోసం, యివన్నీ లేనట్టే యివన్నీ మనసు కల్పిస్తున్న వికారాలైనట్టే, యీ బాధలూ, రోగాలూ, చావులూ, యివన్నీ కూడా వాస్తవం కావేమో! అసలు లేవేమో. మనసు కల్పించుకుంటున్న మాయలేనేమో అనుకోవాలని చూస్తాను. కాని నాకు తలనొప్పి రాగానే, డొక్క వీపుకంటుకు పోయిన ముష్టిది, నాలిక వేళ్లాడేసుకుని చస్తున్న కుక్క, చచ్చిన కొడుక్కోసం ఏడ్చే ముసలిది, నీరు లేక తల వేళ్ళాడేసిన తోటకూర మొక్క, సగం దేహం తెగి యింకా మూలకి పాలే వానపాము నాకంట పడగానే - యిదంతా కూడా మాయా? అని నన్నూ, నావంటి మాయావాదుల్నీ చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది.
    పాలికాపు నుదుటి చెమట.
    కూలిదాని గుండె చెరువు.
    బిచ్చగాడి కడుపు కరువు.    
    మాయంటావూ? అంతా
    మిధ్యంటావూ?
    నా ముద్దుల వేదాంతీ
    ఏమంటావు?
                                                       (శ్రీ. శ్రీ)
    మన సౌఖ్యాలు, అందాలూ, అన్నీ మనసు కల్పించిన మాయలే కానీ, వస్తువులూ ప్రపంచం మాయే కానీ, అనుభవం - మాయ కాదు కదా? సుఖపడడం మాయ అయినా, బాధపడమనేది మాయ కాదు.
    "జమీందారు ఫోర్డుకారు    
    మహారాజు మనీ పర్సు"
        మాయ ఐనా,
    "తుఫానులు భూకంపం"
        మాయ కావు.
    చావు మాయ కాదు. శాశ్వత జీవనం అనేది వున్నా, చావు తరవాత యెక్కడో మిగిలినా, చావు మాయే ఐనా, మన మిత్రుడు కనపడకుండా పోవడం, మన మాటకి జవాబు చెప్పకపోవడం, ప్రతి సాయిత్రం 'టీ' దగ్గిర జ్ఞాపకం వచ్చి దిగుళ్ళలోకి నెట్టడం, కొత్త కథ విని సంతోషించడానికి లేకపోవడం మాయ కాదు కదా!
    అనుభవం క్షణికమే, fleeting, inpermanent, అశాశ్వతం. కాని బతుకే క్షణాల అనుభవాల మీద ఆధారపడ్డప్పుడు - అవి తప్ప గతిలేనప్పుడు, శాశ్వతమనేది వేదాంతుల వాదనల్లో, కవుల కలలలో తప్ప ఎక్కడా కనపడనప్పుడు -ఇంకేం గతి?
    డబ్బు అంటే దమ్మిడీలే కదా - ఏం గొప్ప! అన్నట్టుంది. ముష్టి అతనికి ఆ దమ్మిడీలే గొప్ప!
    క్షణాలనే నమ్మి, పరిగెత్తి పోయే స్వల్ప ఆనందాలతోనే సుఖపడదాము. ఏదో ఒరుగుతుందని నమ్మి మాడిచావనీ వేదాంతుల్ని - నేనూ ఆచారి, ఒకటే శక్తిలోని భాగాలా? ఒప్పుకోను. అదే నిజమైతే__ నేను అబద్ధంలోనే బతుకుతాను. ఈ ఆచారే ఈశ్వరుడైతే, నేను సైతానుగానే వుంటాను.

                             * * * *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra