Home » Dr c. ananda ramam » Agnatha Bandhaalu

 

    సేవాసదనంలో స్నేహితులు ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరినీ కలుసుకోవాలనిలేదు, లలితనే చూడాలనిపిస్తోంది. లలితకి ఫోన్ చేసింది.
    "నేను లలితా! రాగిణిని ఒకసారి మా ఇంటికి రావూ!"
    అటు వైపు నుండి నిశ్శబ్దం.
    "రావూ?" మళ్ళీ అడిగింది రాగిణి.
    "వస్తాను."


                                            17

    తను స్వయంగా ఫోన్ చేసినా రాగిణి వస్తానని రాకపోవటం మాధవరావుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. మళ్ళీ ఫోన్ చేసాడు.
    "మాధవరావుగారేనా? ఆయామ్ సారీ! నేను రాలేకపోయానండీ? ఇంకెప్పుడు రాలేను బహుశా."
    రాగిణి కంఠం ఎలానో ఉంది.
    "అదేం? ఎందుకు రాలేరు?"
    "ఇప్పుడు నేను మిస్. రాగిణిని కాదుగా! మిసెస్ బాపినీడుని! ఎక్కడికైనా ఆయనతో కలిసి వెళ్ళటమే బాగుంటుంది. ఒంటరిగా వెళితే మర్యాదగా ఉండదు!"
    "ఐసి! మరి, నిన్న వస్తానన్నారు....."
    "అప్పుడు అప్పుడంత ఆలోచించలేదు........"
    "ఈ ఆలోచనలన్నీ తర్వాత వచ్చినావన్నమాట! మీకే వచ్చాయా? ఎవరైనా చెప్పి పెట్టారా?"
    "భలేవారే! నాకామాత్రం తెలియదనుకున్నారా?"
    "అల్ రైట్! ఎప్పుడైనా నేనే మీ ఇంటికి వస్తాను.'
    అటువైపు నుండి ఏ సమాధానమూ రాలేదు. న్యాయంగా ఉత్సాహంతో "రండి!" అనవలసింది. ఫోన్ పెట్టేసి అ;లోచనలో పడ్డాడు మాధవరావు.
    అప్పుడే వచ్చిన లలిత చనువుగా "ఏమిటాలోచిస్తున్నారు?' అంది.
    లలితకు మణిమాలా మాధవురావులతో బాగా చనువు ఏర్పడి పోయింది- ఇద్దరితోనూ కొంచెం స్వతంత్రించి మాట్లాడగలుగుతోంది.
    "రాగిణి గురించి......"
    "తను చాలా సుఖపడుతున్నట్లు మనలందరిని నమ్మించడానికి ఎంతో తాపత్రయపడుతుంది. ఆ ఆరాటంలోనే పాపం . ఆ మనసులో వెలితి అర్ధమవుతుంది. నిన్న వెళ్ళాను. ఎందుకో రాగిణినీ చూస్తే నాకు కలిగేది జాలిమాత్రమే!"
    "నిన్న వెళ్ళారా మీరు?" "అవును!"
    "మీరు వెళ్ళాక బాపీనీడు గారు రావటం జరిగిందా?" "లేదు"
    "మీరు రాగిణితో ఫ్రీగా మాట్లాడగలిగారా?"
    "ఆ. ఎందుకలా అడుగుతున్నారు?"
    "ఏం లేదు. బాపినీడు ఇంట్లో ఉండని సమయం చూసుకుని రాగిణి నన్ను రమ్మంది. కానీ నేను వెళ్ళిన కొంచెం సేపట్లోనే బాపినీడు వచ్చాడు. రాగిణి ఇక్కడకు రావటానికి కూడా ఏవో ఆటంకాలున్నట్లే అనిపిస్తోంది. ఇదంతా చూస్తోంటే నా అనుమానం మరింత ఎక్కువవుతోంది. లలితా! నువ్వే నాకు సహాయం చెయ్యాలి! రాగిణి ద్వారా బాపీనీడుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలి!"
    "రాగిణి ఇప్పుడు బాపినీడు భార్య!"
    "అందుకే మన పని సులువవుతుంది."
    "రాగిణి ఈ సహాయం చేస్తుందా?"
    "చెయ్యదలచుకుంటే చెయ్యగలదు"
    "బాపినీదుకు ఎందుకు ద్రోహం చేస్తుంది?"
    "ఎందుకు చెయ్యదు? రాగిణికి బాపినీడు ఎవరు?" చిత్రంగా నవ్వాడు మాధవరావు. ఆ నవ్వు చూస్తూ నిలబడిపోయింది లలిత.
    "ఏమైనా , ఇలాంటి సహాయం చెయ్యమని రాగిణిని నేనెలా అడగగలను?"
    "ప్లీజ్ లలితా! ఇదంతా నీకోసమే......."
    "నా కోసమా?"
    మాధవరావు అల్లరిగా నవ్వాడు.
    "అవును, నీ కోసమే! ఈ రకంగా రాజు నిర్దోషి అని రుజువు చెయ్యటానికి వీలవుతుందేమోనని......"
    లలిత ముఖం పాలిపోయింది. మాధవరావు వంక దీనంగా చూసింది. కలవరపడ్డాడు మాధవరావు. "ఏమిటి లలితా!"
    లలిత ఏం మాట్లాడలేదు.
    "నీకు అపాయం జరుగుతుందని భయపడకు, నేనుండగా నీకు......."
    "అది కాదు, ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను......"
    "చెప్పు! నాతొ నువ్వేది ఎలా చెప్పినా ఫరవాలేదు."
    "ఆ మాత్రం అభయమిచ్చారు గనుక చెప్తున్నాను. రాజు కోసమని నేనేదీ చెయ్యలేను. మీకోసం ఏం చేయ్యమంటారో చెప్పండి. ప్రపంచంలో దీన్నీ లక్ష్య పెట్టకుండా చేస్తాను."
    ఈ మాటలు వింటూ బొమ్మలా నిలబడిపోయాడు మాధవరావు.
    లలిత వెళ్ళేసరికి రాగిణి మంచం మీద బోర్లా పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది! రాగిణి అలా ఏడవటం లలిత ఎన్నడూ చూడలేదు. చిన్నతనంలో పినతల్లి చేతిలో అష్టకష్టాలు పడే రోజుల్లో కూడా అలా ఏడవలేదు. చూడలేకపోయింది లలిత. రాగిణి దగ్గిరగా కూచుని తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది.
    దిగ్గున తలెత్తింది రాగిణి. "నువ్వా?" అంది.
    "దుఃఖంలో ఉన్న నన్ను ఇంత ఆత్మీయంగా ఓదార్చే వారేవరున్నారా, అని ఆశ్చర్యపోతున్నాను. నువ్వింకా నాకున్నావని ఆశ మిగల్లేదు." కళ్ళు తుడుచుకుంటూ అంది రాగిణి.
    "ఎందు కేడుస్తున్నావ్, ఇంతగా......."
    "ఇంక నాకు మిగిలింది ఆ ఏడుపే! నేను ఈ ఇల్లు కదిలి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు. స్నేహితులను కలుసుకోవటానికి వీల్లేదు. ఎవరిళ్లకు వెళ్ళడానికీ వీల్లేదు. చివరికి సినిమాలకూ, షికార్లకూ , వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఇది నాకొక ఖైదులాగానే ఉంది."
    "ఇందుకేనా, ఏడుపు?"
    "అంటే, ఇది నీకు మాములుగానే అనిపిస్తోందా?"
    "మొదటినుంచీ నువ్వేం కావాలని కోరుకున్నావ్? ఏం కావాలనుకుని శ్యామలాంబగారి దగ్గిర చేరావ్? చీరలూ, నగలూ, ఐశ్వర్యమే గా! అవన్నీ ఇప్పుడూ నీకున్నాయిగా! మరెందుకు ఏడుపు?"
    రాగిణి లలితను విస్తుబోయి చూసింది.
    "లలితా! నన్ను వెక్కిరిస్తున్నావా?"
    "లేదు! లేదు! ఒకప్పుడు నేననుకున్న మాటలే నీతో అంటున్నాను. నిజంగా మనకేం కావాలో మనకు తెలుసా? ఏ దేవతో మనకు వరాలియ్యటానికి సిద్దపడితే నిజంగా మనకు సౌఖ్యకలిగించేవి కోరుకోవటం మనకు చేతనవుతుందా? మనం కోరినవి మనకు దక్కినంత మాత్రాన సుఖపడగలమా? నీ సంగతే చూడు. నువ్వు కోరిన చీరలూ, నగలూ దక్కాయి కాని -"
    "నేను చీరలూ, నగలూ, కావాలనుకున్నాను. కానీ , ఇలాగా?"
    "ఆత్మ వంచన చేసుకోకు లలితా! అప్పుడైనా నువ్వు వీటికోసం కొంత వదులుకున్నావు. ఇప్పుడు మరికొంత మరొక విధంగా వదులుకుంటున్నావు."
    "ఆ మాట కొస్తే లోకంలో మిగిలిన అందరూ మాత్రం కొన్ని కొన్ని వదులుకోవటం లేదా?"
    "అవును. ఒకటి పొందాలంటే మరొకటి వదులుకోవాలి. ఏది  పొందాలో, ఏది వదులుకోవాలో , నిర్ణయించుకోవతంలోనే జీవితపు విలువలు ఆధారపడిఉన్నాయి."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra