Home » Kurumaddali vijayalakshmi » Paduchudanam Railubandi


    రూమ్ బాయ్ ని తెమ్మంటే రూమ్ లోకే కాఫీ, టిఫిన్ తెచ్చి సర్వ్ చేస్తాడు. కాని పదిమంది మధ్య...పదిమందిని చూస్తూ తింటే అదోరుచి...అదో థ్రిల్.


    నలుగురు క్రిందకు రాగానే...అందరు కాఫీ, టిఫిన్ సేవిస్తున్న చోట తాము కూర్చొని... వేడివేడిగ బోండాలు...పూరీకూర...మసాల అట్టు... ఎవరికి కావాల్సినవి వారు తెప్పించుకుని తిని కాఫీ తాగి అక్కడ్నించి లేచి కౌంటర్ దగ్గరకొచ్చారు.


    "రాత్రిగాని...పగలు గాని మళ్ళీ మీ రూమ్ లోకి కిటికీలోంచి ఎవరూ తొంగి చూడలేదా!" హోటల్ ఓనరు పళ్ళికిలిస్తూ అడిగాడు.


    "చూశారేమో మాకు తెలీదు" సుందర సుకుమారి చెప్పింది.


    "అదేంటి?" అయోమయంగా అడిగాడు హోటల్ ఓనరు.


    "మా...మాన ప్రాణాల పూచి మీరు తీసుకొన్నారు కదా! మా ఒంటిమీద ఈగ కూడ వాలనివ్వనని అన్నారు కదా! కాబట్టి ఎవరు... ఏ కిటికీలోంచి మమ్మల్ని చూడడు. చూస్తే గీస్తే మిమ్మల్నే, కాస్త జాగ్రత్తగా ఉండండే! రోజులసలేం బాగాలేవ్!" ఓనరుతో చెప్పి, ఆయన తెల్లబోయి నోరు తెరిచి చూస్తుండగా అతగాడిని అలానే వదిలేసి "పదండే పోదాం! ఇప్పటికే ఆలశ్యమైంది." అంటూ సుందర సుకుమారి ముందుకు దారి తీసింది. వెనకనే ముగ్గురు బయటికి వచ్చారు.


    "మన సుందరికి ఒళ్ళుతోపాటు బుర్రకూడ పెద్దదేనేవ్! సరీగా వాడు గంట ఆలోచించేలా మాట్లాడింది. దీని మొహంలో ఎటువంటి భావాలు చూపించకుండ అతి మామూలుగా మాట్లాడింది కదా! వాడికి అర్థమై చావలేదు" అంది వందన.


    "మనలాంటి శాల్తీలని వాడెప్పుడు చూసుండడులే!" ప్రమద అంది.


    "మనలాంటి కాదు... సుందర సుకుమారి లాంటి..." మాట దిద్దింది రాణి.


    "పోనీ...అలాగే అనుకోండి. నాకేం దిగుల్లేదు." చిరునవ్వుతో అంది సుందర సుకుమారి.


    వాళ్ళలా నవ్వుతూ...తుళ్ళుతూ...సరదాగా...నెమ్మదిగా మాట్లాడుకుంటూ వీధులు చూస్తూ మధ్య మధ్య ఏదో ఒక షాపులో దూరి ఒక వస్తువుని పట్టుకొని శల్య పరీక్షలు చేసి దాని ధర అడిగి "అబ్బా! చాలా ఖరీదు. ఇదే మా ఊళ్ళో అయితే సగం రేటుకు వస్తుంది." అని చెప్పి వాటిని మళ్ళీ చల్లగ అక్కడే పెట్టి షాపులోంచి బయటికి వచ్చేస్తున్నారు.


    సరదాగ షాపింగ్ చేయడం తప్ప వాళ్ళకి ఏ వస్తువు కొనే ఉద్దేశం లేదు. "తమ ఊళ్ళో దొరకని... మరీ బాగున్న ఏ వస్తువన్నా కంటబడితే కొనచ్చు." అనుకొన్నారు వాళ్ళు. వాళ్ళు కొనదగ్గ వస్తువు ఒక్కటి ప్రస్తుతానికి కనిపించలేదు.


    ఓ షాపులోంచి బయటికి వస్తూండగ "ఆగండి" అంటూ అక్కడే ఆపేసింది రాణి.


    "ఎందుకు?" ప్రమద అడిగింది.


    "అవతల పేవ్ మెంట్ మీద నుంచొని అతను ఎప్పట్నించో మనవైపే చూస్తున్నాడు. మనం బైటికి రావడం చూసి గబగబా అటు తిరిగి వెళుతున్నాడు చూశారా!" అంది రాణి.


    "ఎప్పట్నించో మన్ని చూస్తుంటే ఇప్పుడా చెప్పడం?" వందన కోప్పడింది.


    "ఎప్పట్నించో చూడటం...అనే మాట నేను ఊహించుకొని చెప్పాను. అంతేగాని నేనూ చూడలేదు. నేను అటు చూసేసరికి అతను ఇటు చూస్తున్నాడు. వెంటనే వేగంగా మొహం తిప్పేసుకొని వెళుతుంటే మీకు చెప్పాను." రాణి బిక్క మొహం వేసుకొని చెప్పింది.


    "చాల్లే తెలివి! అసలు నువ్వెందుకు పూర్తిగా అతన్ని చూడాలి. చూసి చూడనట్టు చూడాలి. అతనికి అనుమానం వచ్చేది కాదు - అక్కడే ఉండేవాడు...


    ప్రమద అంటుండగా సుందరి సుకుమారి అంది. "ఈ తఫా అతను నా కంట పడనీ! చర చరా వెళ్ళి బరబరా లాక్కొస్తాను."


    "నీకేం తల్లీ! నువ్వంత పనీ చేస్తావ్! ఆ తర్వాత అతను నువ్వు లాక్కొంచ్చినందుకు నానా రభసా చేస్తాడు. ఎందుకొచ్చిన గోల అతను మనకేదైనా అపాయం కలగజేస్తే అప్పుడు మనం ఎదిరించి బాగుంటుంది అంతేనా రాణి!" వందన అడిగింది.


    "అంతే...అంతే" అయినా లాక్కొస్తే ఏం బావుంటుందే! ఏం బావుండదు. మంచివాడేనేమో! "వందన మొహంలోకి చూస్తూ మాట్లాడుతున్న రాణీ టక్కున మాటలాపు చేసింది. ఎందుకంటే రాణి మొహంలో ఏవో భావాలూ వెదుకుతూ వందన గుచ్చి గుచ్చి చూస్తోంది అని కనిపెట్టిన రాణి జాగ్రత్తపడింది.


    "అతను మంచివాడో! చెడ్డవాడో! నాకెందుకు?" అనుకుంది రాణి.


    "ఏంటీ విషయం?" కనుబొమలెగరేస్తు అడిగింది ప్రమద.


    "ఏమీలేదు ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే ఈ షాపువాడు మన్ని మెడబెట్టుకొని బైటికి గెంటుతాడు పదండి...పదండి..." అంది వందన బైటికి రావడంతో ముగ్గురు అనుసరించి వచ్చారు.


    ఆ అందగాడు మాత్రం దరిదాపుల్లో కానరాకుండా మాయమయ్యాడు.


    అతను వీళ్ళతోపాటే రైల్లో ప్రయాణం చేస్తూ ఇక్కడదాకా వచ్చాడు. షాడో బుద్ధి ప్రదర్శిస్తున్న అతని నిజస్వరూపమేమిటో ఎవరికీ తెలీదు. అపకారం చేసేవాళ్ళు వికృతంగా ఉంటారని... అపకారం చెయ్యనివాళ్ళు అందంగా ఉంటారని... ఎక్కడా లేదు. అందమైన విలన్సు ఉంటారు... అందవిహీనమైన విలన్సు ఉంటారు. ఇతను ఏ రకమైనవాడో తెలీదు. మొత్తానికి అనుమానించదగ్గ విషయమే.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra