Home » Yandamuri veerendranath » అష్టావక్ర


    సరీగ్గా అటువంటి సమయంలో అవతార్ బాబా ఆ గ్రామంలో ప్రవేశించాడు. దేశంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నా, ఆ గ్రామానికి సంబంధించినంతవరకూ పల్లె జనానికి అతడు తెలీదు.

    కానీ చాలా కొద్దిరోజుల్లోనే బాబా పేరు ఆ ఊళ్ళో మార్మోగింది.

    ఒక చిన్న సంఘటన ద్వారా.


                    *    *    *    *


    మంగమ్మ చేతికి తాయెత్తు కట్టి తనకు తాను నమస్కారం చేసుకున్నాడు అవతార్ బాబా! చుట్టూ వున్న జనం మంగమ్మ మొగుడితోసహా, అతడివైపు భక్తితో చూశారు.

    "ఈమెని నేను రక్షిస్తాను" అన్నాడు అవతార్ బాబా. "దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడమని నాకు దేవుని నుంచి ఆజ్ఞ వచ్చింది. మీ ఊరివారు పోలేరమ్మకి ఏదో అపచారం చేశారు. అందువల్లే ఈ అనర్ధం జరుగుతూంది".

    పల్లె ప్రజలు అతడివైపు మరింత భయంతో చూశారు.

    "అయినా ఫర్వాలేదు. ఈమెకు ఎన్నో నెల?"

    "తొమ్మిది నిండాయి బాబూ. ఈయాలో..రేపో"

    "మంగమ్మా నువ్వో పువ్వు పేరు చెప్పు".

    "గులాబిపువ్వు అండీ అయ్యగారూ!"

    "భేష్. నీకు మగశిశువు జననం జరుగుతూంది" అని శిష్యులవైపు తిరిగి "ఏర్పాట్లు చెయ్యండి" అన్నాడు.

    "మంగమ్మకి మన ఆశ్రమంలోనే నెలవు కల్పించండి. ప్రసవం ఇక్కడే జరుగుతూంది. ఆశ్రమం చుట్టూ పవిత్రజలం చల్లుతాను. ఏ క్షుద్రదేవతయినా ఎలా ప్రవేశిస్తుందో నేను చూస్తాను" అంటూ లేచాడు. జనం అతడిని భక్తిగా చూశారు.   

    మంగమ్మకి ఆశ్రమ ప్రాంగణంలోనే ఒక పాకలో పక్క ఏర్పాటు చేయబడింది. ఇది జరిగిన రెండో రోజుకి ఒక అర్ధరాత్రికి ఆమెకి నొప్పులు ప్రారంభమయ్యాయి. అవతార్ బాబా హోమం ఆరంభించాడు. తెల్లవారుతూండగా ప్రసవం జరిగింది. పదిపౌండ్ల ఆరోగ్యమైన శిశువు జన్మించింది.

    ఔటు పేలినట్టు ఈ వార్త కృష్ణాపురమూ, ఆ ఒక్క ఊళ్ళు క్షణాల మీద వ్యాపించింది. జనం బండ్లు కట్టించుకునీ, కాలినడకనా తండోపతండాలుగా అక్కడికి రాసాగారు.

    ఆశ్రమానికి కిలోమీటరు దూరంవరకూ కొబ్బరికాయలు కొట్లనుంచి అవతార్ బాబా ఫోటోలు అమ్మే దుకాణాల వరకూ అన్నీ వెలసినయ్.

    అవతార్ బాబా గురించి పట్టించుకోవద్దనీ, వీలైతే (తాము బయటపడకుండా) సాయం చేయమనీ ఉస్సోక్ సభ్యులకి సూచన్లు వచ్చాయి. కానీ రాకేష్ దీనికి అభ్యంతరం తెలిపాడు.

    "అయితే ఏం చేస్తావు?"

    "బాబాకి ఉస్సోక్ రుచి చూపిస్తాను".

    "సరే చూపించు".

    మహాదష్ట అంత సులభంగా వప్పుకోవటం రాకేష్ కి ఆశ్చర్యం కలిగింది! అతడు బాబా ఆశ్రమానికి వెళ్లాడు. అతడి జేబులో ఒక విచిత్రమైన ఆయుధం వుంది. దూరం నుంచే అది సైనేడ్ వున్న సూదిని శరీరంలో గుచ్చుతుంది. ఎవరు చంపేరో, సూది ఎటువైపు నుంచి వచ్చి గుచ్చుకుందో తెలీదు.

    అతడు వెళ్ళేసరికి బాబా ఒక జాతీయబ్యాంకు చైర్మన్ తో మాట్లాడుతున్నాడు. ఆ చైర్మన్ కి తన బ్యాంకు, తనదేశం- వీటికన్నా - కోయవాళ్ళు, గుళ్ళూ, గోపురాలు ముఖ్యం. తన పదవి మరికొంతకాలం కొనసాగేలా చూడమని సాష్టాంగపడి వేడుకుంటున్నాడు ఆయన. ఆయన్ని ఆశీర్వదిస్తూ బాబా తలెత్తి చూశాడు.

    అతడి దృష్టి రాకేష్ మీద పడింది. రాకేష్ బాబావైపే చూస్తున్నాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. బాబా లేచి నిలబడ్డాడు. నవ్వేడు. రాకేష్ మొహంలో రక్తం ఇంకిపోయింది. చివ్వున వెనుదిరిగి అక్కణ్ణుంచి వచ్చేసి మహాదష్టని కలుసుకున్నాడు.

    "అవతార్ బాబా బ్లూ స్కెలిటన్ అని నాకెందుకు చెప్పలేదు?"

    "నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూస్తే మంచిదని".

    "ఇదంతా నాకు అర్ధం కావటంలేదు. అసలు ఇదంతా ఎందుకు?"

    "అష్టావక్రుడు భూమ్మీద అవతరించేందుకు ముందు ఇక్కడ రంగాన్ని సిద్ధం చేయవలసిన బాధ్యత మనమీదే వుందని, నీకు ఇంతకు ముందే చెప్పాను రాకేష్! మన ఆశయం నెరవేరటానికీ, కేదారగౌరి ప్రసవించటానికి యింకా కొన్ని నెలల వ్యవధి వుంది. ఈ కొద్ది నెలల్లోనూ చాలా మంది శిశువులు ఈ పల్లెల్లో జన్మిచవచ్చు. వాళ్ళకీ, అష్టావక్రుడి ముందు జన్మించే ఏడుగురు అష్ట-వక్ర మృత శిశువులకీ సంబంధం లేదు. దాన్ని అవతార్ బాబా "కేష్" చేసుకుంటున్నాడు. చేసుకోనీ! అతడూ మనవాడే. అతడివల్ల లాభం కూడా వుంది".

    "ఏం లాభం?"

    "అష్టావక్రుడు పుట్టే సమయానికి ముందే ప్రజల్ని అతడికి విధేయులుగా చేయాలని నేనిప్పుడే చెప్పాను. అష్టావక్రుడే నిజమైన దేముడు అన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలి. అలా నమ్మకాన్ని కుదుర్చుకున్న వాళ్లు మాత్రం అతడి రాజ్యంలో బ్రతుకుతారు".

    "కృష్ణాపురంలాంటి ఊళ్ళో ఒక చిన్న బాబా- ఎంతమంది ప్రజల్ని మార్చగలడు మనవైపుకి?"

    చాలాకాలం తరువాత మహాదష్ట నవ్వేడు. అతడి నవ్వులో అదోరకమైన విజయం వుంది. తలతిప్పి పక్కనున్న గ్రీన్ స్కెలిటన్ వైపు చూసేడు. అతడి మనసు తెలుసుకున్నట్టు జి.యస్. లోపలికి వెళ్ళి నాలుగైదు పేపర్లు తెచ్చి అక్కడ పెట్టాడు. రాకేష్ దృష్టి వాటిమీద పడింది.

    న్యూయార్క్ టైమ్స్, లండన్ ఎక్స్ ప్రెస్, వరల్డ్ టు డే, స్టేట్స్ మెన్.

    ప్రపంచంలో అత్యధికంగా చదవబడే పత్రికలవి.

    మొదటి పేజీలోనే బోర్డరు కట్టివున్న వార్త- దాని హెడ్డింగులు అతడిని ఆకర్షించాయి.

                          "THE MIRACLE TOUCH"

                THE FAITH-HEALER FROM INDIA   


    రాకేష్ నమ్మశక్యం కానట్టు మహాదష్టవైపు చూశాడు.

    మహాదష్టని చూస్తుంటే మొట్టమొదటిసారి అతడికి భయం వేసింది. మహాదష్టని తను గెలవలేనని అనుమానం కలిగింది. తన మనసులో కోర్కె నెరవేరదేమో అన్న అపనమ్మకం కలిగింది.

    అతడి ఆలోచన్లని గ్రహించినట్టు మహాదష్ట అన్నాడు- "మన అనుచరులు అన్నిచోట్లా పకడ్బందీగా, ఒక ప్లాన్ ప్రకారం తమకిచ్చిన పన్లని నిర్వర్తించుకుంటూ వస్తున్నారు రాకేష్. మనమే కాస్త వెనుకబడ్డామేమో అనిపిస్తూంది".

    "లేదు లేదు" అన్నాడు రాకేష్. "క్షుదక్ష యజ్ఞం గురించేగా! అది నాకు వదిలిపెట్టండి-"

    "రేపు రాత్రేగా పూర్ణిమ".

    "రేపు రాత్రినుంచే యజ్ఞం ప్రారంభమవుతుంది" ఎటువంటి పరిస్థితిలోనూ అది తప్పదన్నట్టు రాకేష్ చెప్పాడు. "ఉస్సోక్ లో అందరూ తమ తమ పనులు తాము నిర్వర్తిస్తున్నప్పుడు- నేను ఒకణ్ణీ వెనుకంజవేయను!"

    "ఉస్సోక్ లో అందరూ ఒకెత్తు. నువ్వొకడవీ ఒక ఎత్తు రాకేష్. అందరికన్నా పెద్ద బాధ్యత నీ మీద వున్నది. అష్టావక్రుడి ఆగమనానికి మూలపురుషుడివి-"

    అనుకున్న సమయం ఆసన్నమైన సంతోషంలో రాకేష్ మనసు అదోవిధమైన ఆనందంతో నిండిపోయింది.

    పీట మీద కూర్చున్నాడు. పీటచుట్టూ నాలుగు పుర్రెలున్నాయి. ముందు హోమం వుంది. అందులోంచి రక్తవర్ణంతో మంటలు లేస్తున్నాయి. సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం అక్కడ ఆవరించుకుని వుంది. హోమంలో కాలుతున్న ఎముకల చప్పుడు ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినపడుతూంది.

    మంటలోంచి ఎముకని బయటకు తీశాడు మహాదష్ట.  

    "కురులు-కీరములు, గ్రహములు- నక్షత్రములు, చరములు-అదరములు- అందరూ వినండి అష్టావక్రుడి ఆగమనం కోసం రేపు చేయబోయే ఈ క్షుదక్ష యజ్ఞానికి పురుషుడిగా కర్తగా ఈ రాకేష్ అనే యువకుడిని స్తాపిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం వుందా?"

    అంతా నిశ్శబ్దంగా వుంది. రాకేష్ చుట్టూ వున్నవారివైపు చూసేడు. అందరి కనుగుడ్లూ వెనక్కి వెళ్లిపోయి వున్నాయి. పెదవులు అస్పష్టంగా కదుల్తున్నాయి. అందరూ తమలో తామే కాష్మోరాని ప్రార్ధిస్తున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు.

    ప్రార్ధన పూర్తయింది.

    మహాదష్ట అతడి చేతికి ఒక తాయెత్తు కడుతూ అన్నాడు. "రాకేష్! రేపు చంద్రోదయ సమయాన క్రతువు ప్రారంభమవుతుంది. అప్పటివరకూ నువ్వు పురుషుడివి! క్రతువుతో యజ్ఞపురుషుడివి అవుతావు!! ఇప్పటినుంచీ రేపు రాత్రి వరకూ ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నంత వరకూ ఈ తాయెత్తు నీ చేతికి వుండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు గంటలపాటు దీన్ని నీ చేతికీ వీడనీకు సుమా!"

    రాకేష్ తలూపాడు. హోమం ముందు కూర్చోవటం వల్ల అతని కళ్ళు మండుతున్నాయి.

    "నేను మామూలు ప్రపంచంలోకి వెళ్ళవచ్చా?"

    "తప్పక వెళ్ళొచ్చు".

    ఆ రోజే అతడు కేదారగౌరిని కలుసుకుని డబ్బు తీసుకోవాలనుకున్నాడు. అతడు వెళ్లేసరికి ఆమె చేటలో బియ్యం ఏరుతూంది. ఒక కోటీశ్వరుడి కుమార్తె, లక్షలకు వారసురాలు. అలా అంత చిన్న యింట్లో అలా కూర్చుని బియ్యం ఏరటం చాలా ముగ్ధంగా వుంది. మనిషి ప్రిన్స్ పుల్స్ కిచ్చే విలువకు అది పరాకాష్ట. అయినా రాకేష్ అవన్నీ గుర్తించే స్థితిలో లేడు.

    "గౌరీ" అన్నాడు పక్కనే కూర్చుంటూ. "మావయ్య పోయిన దుఃఖంలో ఇంతకాలం అడగ లేకపోయాను. నా భాగస్వాములు వత్తిడి తెస్తున్నారు".

    "దేనికి బావా?"

    "అదే...డబ్బు" నసిగాడు.

    "అరె. దీనికి ఇంత మొహమాటం ఏమిటి?" అంటూ ఆమె పెట్టెలోంచి చెక్కు బుక్కు తీసింది.

    ఆమె అతడికి చెక్కు అందిస్తూ వుండగా బయట అలికిడి వినిపించి ఆమె గుమ్మంలోంచి తొంగిచూసింది.

    ఒక ఆకారం. ఎక్కడో చూసినట్టు వుంది. దూరంనుంచి నడిచి వస్తున్నది. చేతిలో చిన్న పెట్టె వుంది. ఆ ఆకారం దగ్గిరవుతూంది. తెలిసిన నడక... అచ్చుగుద్దినట్టున్న తన ముఖకవళికలు-

    ఆమె స్మృతుల పొరల్లో ఎక్కడో ఏవో చిన్నప్పటి జ్ఞాపకాలు కదిలి- ఒక ఆకృతి దాల్చాయి. మొహం ఆనందంతో పద్మంలా విచ్చుకుంది. గొంతు తడబడింది. అతడు అచ్చు తన తండ్రిలాగే వున్నాడు.

    "నువ్వు...ను....నువ్వు?"

    అతడు ఔనన్నట్టు తలూపాడు. సుడిగాలిలా ఆమె అతడి దగ్గిరకి వెళ్తూ "ర...ర...రవి.... రవన్నయ్యా" అంటూ అతడిని అల్లుకు పోయింది.

    వైట్ షాడో సూట్ కేస్ క్రింద పెడుతూ నవ్వేడు. చిన్నప్పుడెప్పుడో ఇంటినుంచి వెళ్ళిపోయిన అన్నయ్య- రక్తం పంచుకు పుట్టిన వాడు- ఇన్నాళ్ళ తర్వాత ఇలా అకస్మాత్తుగా రావటం- అంతకాలం తరువాత కూడా ఆమె అతడిని గుర్తుపట్టటం- ఆ ఆప్యాయత... మొదట కొద్దిసేపు మాటలు రాలేదు. తరువాత ప్రవాహంలా వచ్చాయి. చిన్నప్పటి నుంచీ, వేరైనప్పటినుంచీ ఇప్పటివరకూ జరిగిన సంఘటనలు- తండ్రి తాలూకు జ్ఞాపకాలు... వాళ్ళు మాట్లాడుకోసాగారు. మధ్య మధ్యలో... చచ్చిపోయిన తండ్రిని తల్చుకుని గౌరీ ఏడుస్తూంది. రవి ఓదారుస్తున్నాడు. అన్నని చూసిన ఆనందంతో తండ్రి లేడన్న విచారం కళ్ళవెంట నీరు తెప్పిస్తూంది. ఆ విషాదానందాల మధ్య వాళ్ళు రాకేష్ ని మర్చిపోయారు. రాకేష్ అసహనంగా అక్కడనుంచి కదలబోయాడు. గౌరి తేరుకుని, అన్నయ్యకి అతడికి పరిచయం చేసింది. రవి ఇంటినుంచి వెళ్ళిపోయిన సంవత్సరానికి రాకేష్ ఆ ఇంటిలోకి చేరాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra