Home » Yandamuri veerendranath » ఆఖరి పోరాటం


    అతడి నవ్వు మళ్లీ ఆ ప్రాంతమంతా అలలు అలలుగా విస్తరించింది.

    "సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ ని కూడా తన పాదాల దగ్గర మోకరిల్లేలా చేసుకోగలడీ అనంతానంతస్వామి. ఇప్పుడు చెప్పు బాలికా! ఈ స్వామికి ఈ దేశపు నిర్దేశకుడు అయ్యే అవకాశమూ, అర్హతా వున్నాయంటావా లేదా?"

    ఆమె కళ్ళు తెరవటానికి ప్రయత్నించింది. కంటిక్రింద దెబ్బ తగలటంవల్ల చూపు సరీగ్గా కనపడటం లేదు. ఒక వెలుతురు కిరణం కళ్ళలోకి సూటిగా పడుతూంది. పైకి లేవటానికి ఓపిక కూడా లేదు. మొహం దగ్గిరగా నిలబడ్డ స్వామి మరింత ఎత్తుగా విగ్రహంలా కనబడుతున్నాడు.

    "ఇప్పుడు చెపుతాను విను ప్రవల్లికా! నా నాలుగో స్తంభం ఏదో తెలుసుకోవటానికి ఇన్నాళ్ళూ కష్టపడ్డావు కదా. అదేదో చెపుతాను విను. నా నాలుగో స్తంభం- ప్రజల అజ్ఞానం!! యస్. ఇన్నోసెన్స్ ఆఫ్ పీపుల్!!! బలం- రాజకీయం- తెలివి- ప్రజల అజ్ఞానం. ఆ చివరి దాన్నే ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. చూశావుగా నా విశ్వరూపం. ఇక నన్నేది ఆపగలదు? వచ్చే విజయదశమినాడు విజయశంఖం పూరిస్తాను. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తాను. సెక్యూరిజం నుంచి మతతత్వంవేపు నడిపిస్తాను. భద్రతాభావం పోయిన ప్రజలు- ప్రభుత్వాన్ని నమ్మలేరు. తోటి మతస్థుల్ని నమ్మరు. అదే నాకు కావల్సింది. ప్రభుత్వం మిగతా మతస్థుల్ని కాపాడటంలో నిమగ్నమై వుండగా, నా వారికి మరింత మతతత్వం నూరిపోస్తాను. అయామ్ ది గాడ్, అయామ్ ది సుప్రీమ్. కేవలం నా ప్రజల్ని రక్షించటానికి అవతరించిన భగవత్స్వరూపుణ్ని! హహ... హహ..."

    శాడిజం, తెలివితేటలు కలిస్తే కష్టం.

    అటువంటి నరరూప రాక్షసుడి ముందు నిస్సహాయంగా పడివుంది ఆమె.

    అతడన్నట్టు ప్రజలముందు ఏదైనా తలవంచవలసిందే, సి.బి.ఐ., సి.ఐ.డి., పోలీస్., రా, ఆర్మీ- ఏదీ తనముందు నిలువలేదన్నంత ధీమాగా అతడు అక్కడనుంచి నడుస్తూ వెళ్ళిపోయాడు.


                       *    *    *


    రామోన్ హర్సాసేని అనుసరిస్తూ వెళ్ళిన విహారి. అతడు ఒక కార్లు బాగుచేసే కార్ఖానానికి వెళ్ళటం చూశాడు.

    అక్కడ బయట అంతా మామూలుగానే వుంది. లోపల కొందరు- మామూలు వ్యాన్లకి మిలటరీ కలర్ వేస్తున్నారు. స్వామికి- హర్సాసేకి మధ్య కాంట్రాక్టు ప్రకారం ఆయుధాల్ని హార్బర్ వరకూ తీసుకువెళ్ళి అప్పగించే బాధ్యత స్వామిదే. ఆ పనే అక్కడ జరుగుతూంది. ఆశ్రమంలో ప్రవల్లికకి ఎక్కువ ఆయుధాలు దొరక్కపోవటానికి కారణం కూడా అదే. అవనీ అప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. సి.బి.ఐ. రెయిడ్ జరిగిందని తెలిసినా స్వామి బెదరనిది కూడా అందుకే.

    దాదాపు యాభై లక్షల విలువచేసే లాండ్ మైన్స్, గ్రెనేడ్స్, స్టెన్ గన్స్ వ్యాన్ లలోకి ఎక్కించి వుంచారు. మొత్తం రెండు వ్యాన్లు, మిలటరీ కలర్ వేస్తే సాధారణంగా అనుమానం రాదు. ఆ పనే జరుగుతోంది.

    విహారి అక్కడో విషయాన్ని గమనించాడు.

    అనవసరమయిన హంగామా, హడావుడీ ఏవీలేవు. సెక్యూరిటీగార్డ్స్ కూడా ఎవరూ లేరు. ఎవరయినా చూసినా- ఏదో వ్యాను రిపేరుకోసం మార్గ మధ్యంలో ఆగింది అనుకుంటారు. కమాండర్ డ్రెస్ వేసుకున్న ఇద్దరు మాత్రం అటూ ఇటూ తిరుగుతున్నారు.

    "ఇంకా పని పూర్తి కాలేదా" రామోన్ హర్సాసే అడుగుతున్నాడు.

    "ఇంకో అయిదు నిమిషాలు."

    విహారి చీకట్లో నిలబడి వున్నాడు. అతడి మనసంతా అదోలా అయిపోయింది. అతడి కళ్ళముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తే శరణార్ధులయిన తమిళులు, ఇరానియన్ లు, పాలస్తీనియన్లు, టిబెటియన్లు, ఫిజీయన్లు, సౌత్ ఆఫ్రికన్స్ - అందరూ కనబడ్డారు. ప్రపంచంలో ప్రతి జాతి చరిత్ర అంతే! కొందరు స్వార్ధపరుల ఆశ తీర్చటం కోసం మరొక స్వార్ధపరుడు తయారుచేసిన ఆయుధాలు, కొన్ని వేల మంది అమాయక ప్రజల్ని నాశనం చేస్తాయి! కొంపా, గోడూ అంతవరకూ సంపాదించుకున్న ఆస్తీ- అన్నీ పోగొడతాయి.

    "ఎవరదీ?"

    విహారి ఉలిక్కిపడ్డాడు. ఆలోచన్లలో చూసుకోలేదు. ఒక ఆకారం వాన్ వేపు వస్తోంది.

    "రామ్ లాల్" అన్నాడు అప్రయత్నంగా. అదొక్కటే తెలిసిన పేరు.

    చీకట్లో ఎదురుగా వస్తున్నవాడు ఆగి "సర్" అన్నాడు. విహారి ఇంకేమీ ఆలోచించలేదు. పిడికిలి బిగించి ఎదుటి మనిషి కణతమీద బలంగా గుద్దాడు. అతడే మాత్రం అరచినా తన ప్రాణం పోతుందని తెలుసు. అయితే, అదృష్టం బావుండి అనుకున్నచోటే తగిలింది. అనుకున్నదానికన్నా బలంగా తగిలింది.

    ఏదో అనుమానం వచ్చి వంగి చూశాడు.

    క్రిందపడిన మనిషి ప్రాణం పోయింది.

    విహారికి ఏం చెయ్యాలో తోచలేదు. కానీ క్షణంసేపే. తరువాత సర్దుకున్నాడు. ఈ టెర్రరిజం చట్టపరిధి నుంచి ఎపుడూ బయటే వుంది. "ప్రాణాలు తియ్యి. తీయకపోతే నీ ప్రాణం పోతుంది" అనేది ఆటవిక న్యాయం.

    అదే ప్రస్తుతం సమాజాన్ని కూడా శాసిస్తోంది.

    ఆ భావం రాగానే అతడిలో ఏదో కొత్త శక్తి నిండినట్టు అయింది. తానొక మనిషిని చంపడం కొన్ని వందలమంది ప్రాణాల్ని రక్షిస్తుంది. అటువంటప్పుడు చంపితే మాత్రం తప్పేముంది? అదేగా యుద్ధమంటే.

    అతడు వ్యాను పక్కనుంచి వరండా దగ్గరగా వచ్చాడు. రంగులు వేస్తున్నవాళ్ళు అటువైపు వున్నారు. పెట్టెల్లో నల్లటి బంతుల్లాటి వస్తువులున్నాయి. హాండ్ గ్రెనేడ్స్. వాటి గురించి విహారికి తెలియదు. ఇంగ్లీషు సినిమాల్లో చూశాడంతే. ఒక చివర చిన్న రింగ్ వుంటుంది. దాన్ని లాగిన నిముషానికి పేలుతుంది.

    పక్కనుంచి స్వరాలు వినిపించేసరికి చటుక్కున చీకట్లోకి తప్పుకున్నాడు. రామోన్ హర్సాసే వచ్చి వ్యానులో కూర్చున్నాడు. డ్రైవర్లు స్టార్ట్ చేశారు. పెయింట్ వేసినవాళ్ళు కూడా వచ్చి వెనుకవైపు ఎక్కారు. వ్యాన్లు కదిలాయి.

    విహారికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్కసారి అవి వెళ్ళిపోతే- ఇక పట్టుకోవడం కష్టం కావచ్చు. ప్రవల్లిక ఏమైందో తెలీదు. అతడు అప్రయత్నంగా చేతిలో గ్రెనేడ్ తాలూకు రింగులాగి, గాలిలో విసిరాడు. వెళుతూన్న రెండో వ్యాను లోపల వెళ్ళి పడింది. లోపలున్నవాళ్ళు 'ఏమిటది' అని అనుకుంటున్నారు. రెండు వ్యాన్లూ మరో వంద గజాలు వెళ్ళాయి.

    అంతే!

    ముందు ఆ గ్రెనేడ్ ప్రేలింది. క్షణంకూడా గడవకముందే ఆ రెండు వ్యాన్లలో వున్న ముందుగుండు సామాగ్రి ఒక్కసారిగా అంటుకుని ఎలా పేలిందంటే- అందులో వున్న రామోన్ హర్సాసే, మిగతా వ్యక్తులు, వ్యాన్ విడిభాగాలు- ఒక్కటికూడా కనిపించకుండా మాయమయ్యాయి. యాభై లక్షల పైగా విలువున్న మైన్స్, బాంబ్స్ అవి. మనుష్యుల రక్తం కూడా కనిపించలేదు. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు భూమి దద్ధరిల్లిపోయింది. దూరంగా వున్న భవనాలు బీటలు వారాయి. మెకానిక్ షెడ్ కూలిపోయింది. విహారి పక్కనుంచి మూడు నాలుగు ఇనుప ముక్కలు బుల్లెట్స్ లాగా దూసుకెళ్ళాయి.

    చిన్న చిన్న ముక్కలు మండుతున్నాయి.

    ఏం జరిగిందో తెలియక ప్రజలు భయభ్రాంతులై యిళ్ళల్లోంచి బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఇంకా వస్తున్నారు.

    విహారి అక్కడినుంచి తప్పుకున్నాడు.


                       *    *    *


    "నిజమా" అంది ప్రవల్లిక నమ్మలేనట్లు.

    విహారి తలూపాడు. "దాదాపు కోటి రూపాయ లుంటాయనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అసలా బాంబు పేలుతుందని కూడా నేనూ అనుకోలేదు. ఆ దృశ్యం చూడవలసిందే. వర్ణించడానికి వీలులేదు."

    ఆమె వినడంలేదు, ఆమె మనసిక్కడ లేదు. స్వామికీ వార్త తెలిసివుంటుంది ఈపాటికి. అతడి మొహాన్ని ఊహించుకుంటుంటే ఆనందం తెరలు తెరలుగా వస్తోంది. అందులోనూ గంటక్రితమే ఆమెకి ఘోరమైన అవమానం జరిగింది. మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి టైమ్ లో విహారి చేసిన ఈ పని ఆమెని సంతోషంతో కుదిపేసింది. తేలుకుట్టిన దొంగలా స్వామి ఏమీ చెప్పుకోలేడు. అది చాలు. ఆ సంతోషంతో అతడి చేతులు రెండూ పట్టుకు వూపేసింది.

    ఆమెకి మానసిక స్థితిని అర్ధం చేసుకున్నట్టు అతడు సుతారంగా చేతుల్ని విడిపించుకుని "మీరు మరీ ఎగ్జయిట్ అయిపోతున్నారు. కల్నల్ గారు చూస్తే బావోదు" అన్నాడు నవ్వుతూ.

    ఆమెకి అర్ధంకాలేదు. "కల్నల్ ఎవరు?" అంది.

    "మీక్కాబోయే ఆయన- కల్నల్ ప్రశాంత్" అని గుడ్ నైట్ చెప్పేసి అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు - ఆమె చేయి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది.

    అప్పుడే లోపల్నుంచి వచ్చిన ప్రతాపరావు "ఏమిటమ్మా" అని అడిగాడు.

    "ఏం లేదు నాన్నా" అని లోపలికి పరిగెత్తింది.

    రోబ్ లో రకరకాల బట్టలున్నాయి. అందులో వున్న మిలటరీ డ్రెస్ ని స్పృశించింది. ఇంకా నవ్వు వస్తూనే వుంది. క్యాప్ నెత్తిమీద పెట్టుకుని అద్దంలో చూస్తూ ప్రతిబింబానికి సెల్యూట్ చేసి "హౌ ఆర్యూ కల్నల్" అంది. ఆ స్వరం ఇరవై అయిదేళ్ళ యువకుడిలా వుంది.

    వాయిస్ థెరపీ.


                       *    *    *


    "హల్లో..."

    అట్నుంచి అమ్మాయి స్వరం వినపడగానే విహారి చిటికవేసి పద్మాకర్ ని పిలిచాడు.

    పద్మాకర్ పరుగెత్తుకు వచ్చి ఫోన్ అందుకుని అన్నాడు- "హల్లో నేను పద్మాకర్ ని, ఆగండి, విహారికి నిన్న రాత్రినుంచీ చాలా సీరియస్ గా వుంది" అన్నాడు కంగారుగా.

    "మైగాడ్! ఎక్కడ వున్నాడు?"

    "హాస్పిటల్..."

    "ఏ హాస్పిటల్..."

    "చెప్పొద్దన్నాడు." పద్మాకర్ కంఠం విషాదంగా పలికింది, "....మీకో ఉత్తరం ఇమ్మన్నాడు. అది నా దగ్గిరే వుంది. మీకు యెలా అందించాలో చెప్తే- వచ్చి ఇస్తాను."

    అట్నుంచి కొంచెంసేపు నిశ్శబ్దం. పద్మాకర్, విహారి ఇటువైపు నుంచి ఎగ్జయిటెడ్ గా అట్నుంచి రాబోయే జవాబు కోసం చూస్తున్నారు.

    "మెయిన్ రోడ్డులో సాయిబాబా మెడికల్ స్టోర్సు తెలుసు కదా. అక్కడ ఇవ్వండి. నేను తీసుకుంటాను" ఫోన్ కట్ అయింది.

    విహారి ఎగిరి గంతేశాడు.

    "పద గురూ! ఇక దొరికినట్టే."

    "ఆ అమ్మాయి ఇప్పుడే వస్తుందని నమ్మకం ఏమిటి? రేపటివరకూ ఆగి, రేపు వచ్చి తీసుకోవచ్చుగా."

    "ప్రేమలో పడితే తెలుస్తుంది నీకు. అంతవరకూ ఏ అమ్మాయీ ఆగదు- పద."

    ఇద్దరూ కలిసి మెడికల్ షాపుకి బయల్దేరారు. ఈ లోపులో - కవరులో- ఒక తెల్లకాగితం పెట్టి సీల్ చేశాడు. "ఆ అమ్మాయి బహుశా దూరంనుంచి గమనిస్తూ వుండి వుంటుంది. మనం యిది యిచ్చేసి, వెళ్ళిపోయినట్టు నటించి, దాక్కొని చూద్దాం..." అన్నాడు విహారి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra