మూడో రేసు....సాలార్ జంగ్ మ్యూజియమ్ ప్లేట్. 3.24 అయింది. మూడో రేసులో పాల్గొనే 8 గుర్రాలు వచ్చి రడీగా ఉన్నాయి.
భరత్ ఎక్కినా శశాంక గుర్రానికి ఈసారి నెంబర్ ఒన్ కేటాయించారు.
ఈసారి రేసులో యజ్ఞభూపతి హార్స్ కూడా వుంది. కాని చాలామంది శశాంక గుర్రమే గెలుస్తుందనే ముందే ఊహించారు.
అనుకున్నట్లుగానే భరత్ ఎక్కినా గుర్రమే గెల్చింది.
అప్పుడు చూసాడు యజ్ఞభూపతి భరత్ వేపు తొలిసారి.
శశాంక మీద జెలసీకూడా పెరిగింది భూపతికీ, చాకులాంటి జాకీని ఎలా తయారు చేసుకోగలిగాడు.... చాలా తక్కువ టైమ్ లో.... అదీ మనకు తెలియకుండా....!!
భూపతి పక్కనే వున్న వశిష్ఠ అన్నాడు "మనం ఈమధ్య జాకీల సెలక్షన్ లో అజాగ్రత్తగా వుంటున్నామేమో సార్."
తలతిప్పి ఓసారి ఒంటిచేయి వశిష్ఠ వేపు చూసాడు భూపతి.
"పోనీండి ఏం చేస్తాం....ఒకటి ఫస్టు వస్తే మరొకరి సెకండ్ రావల్సిందేగదా....స్పోర్టిడేగా తీసుకుందాం....ఇదీ ఒక క్రీడేగదా...."
వశిష్ఠ మాటలకు ఒక అర్ధం....మాడ్యులేషన్. డిక్షన్ కి ఒక అర్ధం స్పురిస్తాయి జాగ్రత్తగా పరిశీలిస్తే.
యజ్ఞభూపతి కోపంగా మీసాలు సవరించాడు.
"నేను స్పోర్టివ్ గా తీసుకోను....ప్రిసేజ్ గా తీసుకుంటాను.... భరత్ ఎవరు....? ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు....? అతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించు. నెస్ట్ సీజన్ కి అతను మన జాకీ కావాలి.... అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు...."
"పెద్ద పని పెట్టుకుంటున్నామేమో సార్...."
భూపతి కళ్ళు ఎర్రబడ్డాయి.
మనకు కూడా కాని ఓ పెద్దపని.... ఈ ప్రపంచంలో...."
"మరే...."
"నాన్సెన్స్....ఈ అవమానాన్ని నేను భరించలేను. నాకళ్ళముందు మరొకళ్ళు ఫస్టు రావటం నాకు అసూయగా వుంది. అవతలవాడు ఎలాంటి వాడన్నది నాకనవసరం__ఏ క్లబ్ కి వెళ్ళినా మనమే ముందుండాలి...."
"మీ క్షేమం కోరి చెబుతున్నాను. రిస్కులో పడతామేమో...."
"నీ వలన కాదా....?"
"ఎంత మాట....! మీ క్షేమం కోరేవాడ్ని గనుక...."
"అవుతుందా లేదా?"
"అయితీరుతుంది. మీరంత పట్టుదలగా ఉంటే చాలు...." వశిష్ట కళ్ళు వంకరగా కదిలాయి ఓ క్షణం.
ఇన్నాళ్ళ తన ఆశయానికి మొదటి పునాదిరాయి. మౌనంగా నవ్వుకున్నాడు వశిష్ట.
నాల్గవ రేస్__ఆంద్రప్రదేశ్ కమ్మె మొరేషన్ కప్,
ఐదవ రేస్__బిగినర్స్ ప్లేట్
ఆరవ రేస్__రేణిగుంట ప్లేట్ అయిపోయాయి.
ఆఖరిది__ఏడవది__అత్యంత ప్రాముఖ్యత కలది మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది.
గేలరీల్లో గాలి స్తంభించినట్లు....
పంటర్స్ ప్రాణాలు ఆగిపోయినట్లు....
అన్నిటా ఉద్రిక్తత....అందరిలో టెన్షన్....
ఏం కానుంది ఈ రేసు....?
అనుకున్నట్లుగానే 1,3,4,5 రేసుల్లో అనుకున్న గుర్రాలే వస్టొచ్చాయి. ఇక ఆఖరిది....ఏడవ రేసు.... ఇందులోను కొన్ని వేల మంది పంటర్స్ ఊహిస్తున్న గుర్రం చాలా గొప్పది. లక్షల్లో జాక్ పాత పూల్ రడీగా ఉంది.
ప్రతి ఒకరి కళ్ళు రిజల్ట్స్ బోర్డ్ మీదే ఉన్నాయి. ముఖ్యంగా జాక్ పాత పూల్ ఎమౌంట్ మీద.
లీగల్ గా లక్షల్లో ఉంటే....
ఇల్లాగల్ గా గవర్నమెంట్ నుండి టేక్స్ తప్పించుకొనేందుకు ఇన్ కమ్ టాక్స్ వారి దృష్టి తప్పించుకొనేందుకు చాటుగా రహస్యంగా హార్స్ ఓనర్స్, బుక్ మేకర్స్, రిచ్ పంటర్స్ కాసుకున్నా పందాలు లక్షల్లో ఉన్నాయి.
దాదాపు 50,00,000!!!
అండర్ గ్రౌండ్ బెట్టింగ్స్__ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, ఆశాజీవుల జీవితాన్ని నిలువునా సమాధి చేసే ఇల్లీగల్ బెట్టింగ్స్ ....
శశాంక గేలరీలోకి వచ్చాడు. నలువేపులా చూసాడు. అప్పుడే వచ్చాయి తొమ్మిది గుర్రాలు గ్రౌండ్ లోకి.
గేలరీల్లో వున్న వేలాది పంటర్స్ వేపు మవునంగా, హేళనగా చూసి నవ్వుకున్నాడు శశాంక.
కావాలనే దూరంగా కూర్చున్న దిల్ జిత్ అరోరా వేపు చూశాడు శశాంక మర్మగర్భంగా.
కళ్ళతోనే సైగ చేసాడు అరోరా.
ఏడవ రేసులో అరోరా గుర్రం స్కాండ్రల్ అన్నిటిలోకి గొప్పది.
స్కాండ్రల్ సెడిగ్రే.
స్కాండ్రల్ ట్రైనర్.
స్కాండ్రల్ జాకీ.
స్కాండ్రల్ గతంలో పాల్గొన్న రేసేస్ వేగం....ఏది చూసుకున్నా దీనికే ఛాన్సెస్ ఎక్కువ.
ఆ ఐడియాలోనే కొన్ని లక్షలు స్కాండ్రల్ మీద కాసారు పంటర్స్.
కరక్టుగా 5.30 అయింది.
పంటర్స్ భరించలేని టెన్షన్ తో కూర్చోలేక గేలరీల్లో నిల్చొని ఊపిర్లు బిగబట్టారు.
ఆనందరావుకి మాత్రం దిగులుగా వుంది. నాలుగు రేసుల్లో తనూహించిన గుర్రాలే ఫస్టొచ్చాయి, ఆఖరి రేసులో మాత్రం పొరపాటున స్కాండ్రల్ మీద కాయలేదు.
ప్రస్తుత వాతావరణాన్ని బట్టి స్కాండ్రల్ గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం వున్నాయి?
తను మాత్రం విసుగుతో, చికాకుతో ఆఖరి రేసులో కూడా శశాంక గుర్రం కాసాడు....
జాక్ పాయింట్ పోయిందన్న దిగులు రేసుకు ముందే మొదలైంది.
యజ్ఞభూపతికి ఆనందంగా వుంది. తను పెద్ద మొత్తాల్లో కాసిన స్కాండ్రర్ గెలిచి తీరుతుందని ఉషారుగా ఉన్నాడు.
5.30 నిమిషాల ఒక సెకెండ్ కి రేస్ బిగిన్ అయింది. అనుకున్నట్లుగానే స్కాండ్రల్ అన్నిటికన్నా ముందుంది. రెండో స్థానంలో మరో గుర్రం....మూడో స్థానంలో భరత్ ఎక్కిన శశాంక గుర్రం.
మెరుపు వేగంతో పరిగెడుతోంది స్కాండ్రరు....క్షణాలు గడుస్తున్నాయి....పంటర్స్ ఆనందంతో వెర్రికేకలు పెడుతున్నారు.
అందరూ కళ్ళు ఆర్పడం మర్చిపోయి చూస్తుండగా నేస్కాండ్రర్ స్పీడు తగ్గిపోసాగింది. విన్ పోస్టు మరో 110 మీటర్సు వుంది....అందరు అయోమయంగా చూడసాగారు. ఏం జరిగింది? స్కాండ్రరుకి. ఏమయింది కేవలం విన్ పోస్టు 150 గజాలుండగా, అప్పటి వరకు మెరుపు వేగంతో పరిగెత్తిన స్కాండ్రరు కాళ్ళలో వేగం తగ్గిపోసాగింది.
దానిమీదున్న జాకీ మూమెంట్స్ మారిపోయాయి. ఆ మార్పును పసిగట్ట గలిగింది భరత్ ఒక్కడే....ఎంతో సునిశితంగా చూస్తే తప్ప స్కాండ్రరు జాకీ మూమెంట్స్ పసిగట్టలేరు.
గేలరీలో వున్న శశాంక, శుక్రాచార్య, అశ్వని మాత్రమే భరత్ లాగా పసిగట్టగలిగారు.
హఠాత్తుగా స్కాండ్రరు వేగం గణణీయంగా పడిపోయింది. అప్పుడు అందుకుంది భరత్ చేతిలోని గుర్రం మెరుపువేగం_
క్షణాల్లో విన్ పోస్టుని సమీపించింది భరత్ గుర్రం. అనుకోకుండ అప్పుడే చిన్న ప్రమాదం జరిగింది భరత్ కి?
అప్పటివరకు మూడో స్థానంలో వున్న గుర్రం ఇరిటేట్ అయి అడ్డంగా వచ్చి విన్ పోస్టుని దాటుతున్న భరత్ ని ఢీ కొట్టింది. భరత్ విన్ పోస్టు దాటడం, పంటర్సు హాహాకారాలు చెలరేగటం.... భరత్ దబీలు మని క్రిందపడటం క్షణాల్లో జరిగిపోయింది.
"అన్యాయం....అక్రమం....మోసం ఇందులో ఏదో గోల్ మాల్ జరిగింది. కావాలనే చేసారు...." పంటర్సు గొంతులు చించుకుంటున్నారు.
పంటర్సుకి జరిగింది మోసం అని తెల్సిపోయింది. ఏమిటి అని తెల్సుకునే ఆలోచనకన్నా ఏదో ఒకటి చేయాలన్న ఆవేశం పెరిగిపోయింది.
పరిస్థితి విషమించేట్లు కనిపించటంతో అక్కడే మఫ్టీలో వున్న డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు వైర్ లెస్ లో దగ్గర్లో వున్న పోలీసు స్టేషన్ కి మెసేజ్ అందించాడు.
భూపతికి అంత కోపం రావటం ఎప్పుడూ చూడలేదు వశిష్ట.
ఒకటి తను ఎంతో నమ్మకంతో కాసిన పందెం పోవటం.... రెండు శశాంక గుర్రం గెలవటం__
దశాబ్దాలుగా బెట్టింగ్స్ కాస్తూ వస్తూన్న భూపతికి మోసం జరిగిందని స్పష్టంగా అర్ధమయిపోయింది చాలా తేలిగ్గా.
"ఇది పక్కా మోసం. మనన్ని పూల్స్ చేస్తారు__" అన్నాడు వశిష్ట.
"వాళ్ళు వాళ్ళు కూడబలుక్కొని ఈ పని చేసుంటారు.
"చాలా ప్లాన్డ్ గా చేసారు"
"చూస్తాను....ఇంతకీ ఇంత దెబ్బ తీయకపోను.
వీరి పరిస్థితి ఇలా ఉండగా శశాంక, శుక్రాచార్య, అశ్వనికి కంగారుగా వుంది.
విన్ పోస్ట్ దగ్గరవుతుండగా మరో గుర్రం వచ్చి కావాలనే గుర్రాన్ని ఢీ కొట్టడం భరత్ ఆ విసురుకి కిందపడడం చూస్తుండగానే జరిగింది.
ఓ పక్క పంటర్స్ కేకలు, మరోపక్క రేసు క్లబ్ సిబ్బంది అయోమయ స్థితి. అంతలోనే క్లబ్ సెక్యూరిటీ హడావుడిగా రావటం కిందపడున్న భరత్ ని తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించటం నిమిషాల్లో జరిగిపోయింది.
ఈ గందరగోళంలో కొందరు ఆవేశపరులైన పంటర్స్ క్లబ్ సిబ్బందిని వెంటాడి పట్టుకున్నారు.
"మా కన్యాయం చేస్తారా....? మీ అంతు చూస్తాం....? అంటూ పోట్లాటకి దిగిపోయారు.
శుక్రాచార్య అటుగా వచ్చాడు.