Home » Attuluri vijaya lakshmi » మహావృక్షం

శారద శ్యామల మొహం చూసింది.
శ్యామల ఏం మాట్లాడలేదు.
అనూష, వీణ మొహమొహాలు చూసుకున్నారు. "ఏం జరిగింది?" అడిగింది అనూష.
"మృదుల పెళ్ళి చేసుకుంది."
"అవునా? ఎప్పుడు? ఎవరిని?"
శ్యామల చేయి కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చింది. "భ్యాంకులో పరిచయం అయాడట. చాలాకాలం అయిందట. మద్య మద్య స్నేహితురాలింటికి అని చెప్పి, అతని రూమ్ కి వెళ్ళి గడిపివస్తోంది. ఈ విషయం ఎవరికీ తెలీదు ఈమద్య రాత్రిళ్ళు కూడా అస్తమానం అక్కడే వుండిపోతుంది. నాకు అనుమానం వచ్చి అడిగాను. అప్పుడేం చెప్పలేదు. నిన్న అతడిని గుళ్ళో పెళ్ళిచేసుకుని వచ్చి తన సామాను తీసుకుని వెళ్ళిపోయింది. మీరు వస్తే చెప్పమంది. అతడికి గుంటూరు ట్రాన్స్ ఫర్ అయిందట. అక్కడికి వెళ్ళిపోయింది. ఇంతకాలం నుంచీ ఆ ట్రాన్స్ ఫర్ కోసమే  ఆగారుట."
"ఈ విషయం ముందే చెబితే మనమే కొంచెం ఘనంగా పెళ్ళిచేసేవాళ్ళం కదా! అతను మంచివాడై, ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్ట పడితే కాదని ఎందుకంటాం?" ఆశ్చర్యంగా చూస్తూ అంది వీణ.
అనూష సన్నగా నిట్టూర్చి అంది. "ఆల్ రెడీ జీవితంలో ఒకసారి ప్రేమించి, మోసపోయేగా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ పరమ అనే ప్రలోభంలో ఎందుకు పడుతున్నావు అని అడ్డపడతాం అనుకుందేమో. ఈ ప్రేమ, ఆకర్షణ, బదాలు, వీటికి స్రీ బానిస అయిపోతుంది. సరేలే తను సుఖంగా వుండాలని ఆశిద్దాం."
కాస్సేపు కూర్చుని టీలు తాగి, బయలుదేరారిద్దరూ.
కారులో కూర్చున్నాక అంది అనూష "వచ్చేవారం ఒకసారి మినిష్టరుగారిని కలవాలి వీణా."
"ఈ జిల్లా కలెక్టరు కొత్తాయన వచ్చాడు....కరకట్టు."
"ఎవరాయన? పేరేంటి?" అడిగింది అనూష.
"ప్రశాంత్ కుమారా?"
"అవును ఏం అంత ఆశ్చర్యబోతున్నావేం?"
"ఏం లేదు" అనూష మొహం తిప్పేసుకుంది.
కారు ఇంటి ముందు ఆగింది. "లోపలికి రాకూడదూ" అడిగింది కారు దిగుతూ వీణ.
"లేదులే, నాకిప్పుడు మూడ్ లేదు. తరువాత వస్తాను.గుడ్ నైట్" చెప్పి కారు రివర్స్ చేసుకుని, బేగంపేట వైపు పోనిచ్చింది.
ప్రశాంతకుమార్ పేరు విని ఇరవై సంవత్సరాలు. పెద్దవాడైపోయుంటాడు. పెళ్ళి, పిల్లలు, బహుశా సగం ముసలివాడై పోయుంటాడు. అనూష పెదవుల పై చిరునవ్వు మెరిసింది. ఎన్ని లక్షలు కట్నం తీసుకొచ్చిందో భార్య. ఇంకా దాహం తీరలేదేమో లంచాలు తీసుకుంటున్నాడని చెప్పింది వీణ.
ప్రశాంత్ కుమార్!
ఎంతకాలమైంది ఈ పేరు విని....కనీసం తల్చుకుని....
ఒకప్పుడు ఆ పేరంటే ఎంతో ఇష్టం....ప్రశాంత్.....ఎంత ప్రశాంతంగా వుండేది ఆ పేరు తల్చుకుంటే....ఎంత హాయిగా ఉండేది ఆ పేరు గల వ్యక్తి సమక్షంలో వుంటే....ఎంత నిశ్చితంగా వుండేది అతనితో గడపబోయే భవిష్యజ్జీవితం తల్చుకున్నాప్పుడు....కానీ, ఇప్పుడో.... ఆ పెరువింటేనే ఎలర్జీ...ఆ పేరు ఉచ్చరించడానిక్కూడా మనసంగీకరించదు.
మనసనే డైరీలో దాదాపు ఆరు సంవత్సరాలపాటు ప్రతిలైనూ అతని పేరే..... అతనితో పంచుకున్న క్షణాల అనుభూతులను అక్షరాలుగా మార్చి ఎన్ని అందమైనా కావ్యాలు రాసుకుంది.... అప్పుడు జీవితంలో తను చేసినవి రెండే పనులు....యం బి బి యస్ పుస్తకాలు చదువుకోడం,ప్రశాంత్ తో గడిపిన క్షణాలన్నీ మరుపురాని మధురస్మృతులు గా మిగిలిపోవాలని డైరీలో  అక్షరాల రూపంలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేసుకోడం.... అలాంటి ప్రశాంత్....రసరమ్యమైనా ప్రేమకావ్యం సుఖాంతం అవుతుందని ముగిసిపోయిన ఆమె మనసులో ఒకే ఒక్క మాటతో కుండెడు విషంపోశాడు....అతనితో గడిపిన రోజుల్లో అతని మాటలు, ప్రవర్తనా ఎంతో హయిగా అనిపించేవి.... అతని సంస్కారం, నాగరికత తన వ్యక్తిత్వానికి మెరుగులు పెడతాయనుకుంది....తన ఆశయానికి అతను ఊపిరిపోస్తాడని ఆశించింది....తన ఆదర్శాలను గౌరవించి, జీవితాంతం తనతో సహాకరిస్తాడని ఎన్నో కలలు కన్నది....కానీ,కానీ, ఏం జరిగింది?
అనూష మనసునిండా చేదుమాత్రాలు పొడిచేసి, లేపనం చేసినట్టు అనిపించింది....ఛ....ఏమిటిలా ఆలోచిస్తుంది తను...ఏనాటి ప్రశాంత్...ఇరవై ఏళ్ళు దాటుతోంది కూడా విడిపోయి....ఆ జ్ఞాపకాలన్నీ ఆ డైరీతోటే భస్మం చేసింది....
ఆనాడు అతనితో గొడవపడ్డాక. భవిష్యత్తుపట్ల అతని అభిప్రాయాలు తెలుసుకున్నాక, డబ్బుకోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ఓ లక్ష్యం అంటూ లేకుండా సాగిపోయిన ఆ మెటీరియలిస్టుని ఆ క్షణంలోనే మర్చిపోనాలని తీవ్రంగా నిశ్చయించుకుని, నాలుగు సంవత్సరాలపాటు ఎంతో శ్రద్దగా, మెడికల్ నోట్స్ అంత నీటుగా రాసుకున్న డైరీలన్నీ చింపి పోగులు పెట్టి, కిరోసిన్ పోసి కాల్చేసింది.
ప్రేమానురాగాలు, మమతానుబంధాల విలువ తెలియని ఆ వ్యకిని నాలుగేళ్లపాటు ప్రేమించినందుకు, తన అమూల్యమైనా కాలంలో ఎన్నో గంటలు అతనికోసం కేటాయించినందుకు, తనని తనే అసహ్యించుకుంది- జీవితం విలువ తెలియని ఓ మూర్ఖుడితో భవిష్యత్తు గురించి అందమైనా కలలు కన్నందుకు. ఆ కలలన్నీ అతనితో పంచుకున్నందుకు... ఓ గాడ్...అనూషకి మరోసారి ఇన్నేళ్ళ తరువాత తనమీద తనకి అసహ్యం కలగసాగింది.
భ్రమరాంబ, ఫణిభూషణరావుల ఒక్కగానొక్క కూతురు అనూష....చిన్నప్పటినుంఛీ బిజినెస్ మీద తప్ప ఎక్కాడా, ఎవరి ద్గ్గారా ఉద్యోగం చేయడం ఇష్టంలేని ఫణిభూషణరావు, చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి, సిమెంటు వ్యాపారం ప్రారంబించిన తొలిరోజుల్లో అనూషకి జన్మనిచ్చింది. అయన భార్య భ్రమరాం...అప్పుడప్పుడే మొలకలేస్తున్న ఆయన వ్యాపారం అనూష పుట్టిన క్షణంనుంచీ అంచెలంచెలుగా అబివృద్ది చెందింది.

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra