Home » D kameshwari » Madhupam


    అంటే నేను బయటికి ఎక్కడికీ వెళ్ళకూడదా- ఫ్రెండ్స్ తో తిరగాకూడదనా మీ ఉద్దేశం. మీరు చాడువుకోమన్నంత వరకు చదివి , ఉద్యోగం చేయమంటే తలవంచుకు ఉద్యోగానికి వెళ్ళి, బుద్దిగా ఇంట్లో కూర్చోవాలని మీ ఉద్దేశం. ఆడపిల్లలు సంపాదించాలి గాని ఏ సరదాలూ ఉండకూడదు. అబ్బాయిలతో మాట్లాడకూడదు. చదువు, ఉద్యోగం ఉన్నా మీరు నచ్చి తెచ్చిన వాడిని కట్టుకోవాలి. అలా కాదంటే మిమ్మల్ని ఎదరించినట్టు, ఆడపిల్ల పాడయిపోయినట్టు , బరితెగించినట్టు...' ఆవేశంగా అంది భావన.
    "చూడు భావనా, ఈ మాటలన్నీ మన మధ్య చాలాసార్లు జరిగాయి. ఇల్లు అన్నాక కొన్ని కట్టుబాట్లకి లోబడి అందరూ నడచుకోవాలి. ఎవరిష్టం వచ్చినట్లు వారు నడుచుకుంటామంటే....' తండ్రి మాటకి అడ్డువస్తూ. "ఆడపిల్లలకేనా ఈ కట్టుబాట్లు, రేపొద్దున్న మీ కొడుకు ఇలాగే ఏ స్నేహితులతోనో బయటికి వెళితే ఇలాగే కట్టడి చేస్తారా?' జవాబు చెప్పమన్నట్లు కోపంగా చూసింది.
    "తప్పకుండా అడుగుతాం. మగపిల్లాడయినా అర్ధరాత్రి వరకు పబ్బులో తాగి తందనాలు అడి ఇంటికి వస్తే ఊరుకోం. ప్రతి డానికి ఓ హద్దు ఉంటుంది. స్నేహితులతో వెళ్ళవద్దని ఎవరూ ఆనరు. సినిమాకి వెళ్ళచ్చు. సరదాగా ఏ వీక్ ఎండ్ కొ హోటల్ కి వెళ్ళవచ్చు. రాత్రి ఎనిమిది కల్లా ఇంటికి తిరిగి రావాలి పిల్లలు. అదీ కుటుంబ కట్టుబాటు. అర్ధరాత్రి అయినా పిల్లలు ఇల్లు చేరకపోతే ఆ తల్లిదండ్రుల ఆరాటం నీకెలా అర్ధం అవుతుంది. అందులో ఆడపిల్ల."
    "అదిగో మళ్ళీ ఆడపిల్ల" అంటున్నారు.
    "తప్పకుండా అంటాను. ఆడపిల్ల ఏనాటికీ ఆడపిల్లే. హద్దుల్లో ఉండాల్సింది అమ్మాయిలేనని ఈనాటికీ అనాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది. అన్నట్టు ఇదిగో అసలు విషయం మర్చిపోయాను. రాత్రి తమరు చేసిన ఘనకార్యం ఫోటోలు వచ్చాయి పేపరులో. వార్త చదువుకో. ఇది చూశాక కూడా మేం నిన్ను ఏం అనకుండా, తిరుగుతల్లీ నీ ఇష్టం వచ్చినట్టు అని ఊరుకోమంటావా- అలా ఊరుకుంటే మేం అసలు తల్లిదండ్రులం కాదు. అలా ఊరుకుంటే బాధ్యతా రాహిత్యం అవుతుంది. పిల్లల్ని కన్నందుకు సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మామీద ఉంది."
    భావన ఏదో చెప్పబోతే ప్రసాద్ చేత్తో వారించి-
    "చూడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. నీతో మాట్లాడి బ్లడ్ ప్రెషర్ పెంచుకుని ఆరోగ్యం పాడుచేసుకోలేను. నీ ఈ ప్రవర్తన వల్ల మీ అమ్మ పడే బాధ నేను చూడలేకపోతున్నాను. నీవు వచ్చేవరకు నిద్రపోదు. నీతో వాదన పెట్టుకున్న రోజు ఆవిడ బ్లడ్ ప్రెషర్ పెరిగి, నిన్నెలా కంట్రోలు చెయ్యాలో అర్ధం కాక , నీ భవిష్యత్తు ఏమవుతుందనని మధనపడుతూ నలిగిపోతూ , నాకు చెపితే ఇంట్లో మరింత గొడవలు వస్తాయని, నాకు చెప్పకుండా కొన్ని, చెప్పీ చెప్పనట్లుగా కొన్ని చెప్తూ , ఏం చెయ్యాలో అర్ధం కాక సతమతమవుతోంది."
    "అదే ఎందుకు.... నా గురించి నేను జాగ్రత్త పడగలను, నా గురించి ఎవరూ వర్రీ కానవసరం లేదు. నేనేం చిన్నపిల్లని కాదు సంరక్షించడానికి."
    "అవును, చిన్నపిల్లవి కావు. అందుకే మరింత చింత. ఎంత పెద్దదానివైనా పెళ్ళయ్యేవరకు ఏం జరిగినా తల్లిదండ్రులే చూడాలి అన్నది ఈరోజు సంఘటన వల్ల అయినా అర్ధం కాలేదా - పోలీసులు కేసు బుక్ చేసేముందు తల్లిదండ్రులని ఎందుకు పిలిచారు ? ఈరోజు చదివిన అందరూ ఫలానా భావన, ఫలానా వారి అమ్మాయి అని చెప్పుకుంటారు. అంటే పరోక్షంగా , నీ ప్రతిచర్యకి మమ్మల్ని బాధ్యులను చేస్తారు. ఇదీ మన సమాజంలోని కుటుంబ వ్యవస్థ."
    "అయితే , ఈ ఇంట్లో వుంటే నా వల్ల మీకు జవాబు చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతోందన్న మాట. అందుకేనా నన్ను వేరే వెళ్ళమంటున్నారు. సరే అయితే అలాగే వెళ్ళిపోతా ...." ఉక్రోషంగా అంటూ వెళ్ళబోయింది.
    "అగు, నా మాట ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడికి వెళ్ళినా నీవు మా కూతురివి అనే అంటారు. మా కూతురుగా కాక ఇంకొకరి భార్యగా చెప్పుకునే రోజు వస్తే మా బాధ్యత తీరుతుంది. అప్పుడు నీవేం చేసినా మేం పట్టించుకోం. అంచేత ఆరోజు త్వరగా వస్తే సంతోషిస్తాం."
    "అంటే, ముందింట్లోంచి వెళ్ళు. ఆ తర్వాత మా జీవితాల్లోంచి తప్పుకో అని చెప్పడమూ ఇది. థాంక్స్ డాడీ. చాలా బాగా చెప్పారు. కూతురిని ఇలా ఇంట్లోంచి వెళ్ళమని బహుశా ఏ తండ్రీ ఇలా చెప్పి ఉండడు" ఉక్రోషంగా , కసిగా అంది.
    "అలా అనే పరిస్థితి నీవు కల్పించావని నీకు తట్టి ఉంటే బాగుంటుంది."
    "ఏమిటండీ ఇదంతా, దాంతో పాటు మీరు ఆవేశపడి, తొందర పడ్తున్నారు. ఇంట్లోంచి పొమ్మంటే ఎలా" రమ కలవరపడ్తూ అంది.  
    'ఆడపిల్ల ఉంటే పుట్టింట ఉండాలి, లేకపోతే మెట్టినింట ఉండాలి. మనం ఉండగా ఎక్కడో ఇంకో ఇంట్లో ఉండడం , అదీ ఉన్న ఊళ్ళో."
    "హూ, నీవో పిచ్చిదానివి. అవి పాతరోజుల మాటలు. ఇప్పటి అమ్మాయిలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే ఆర్ధిక స్వాతంత్ర్యం , ధైర్యం అన్నీ వచ్చాయి. ఎవరినీ లెక్క చెయ్యక్కరలేదని గదా.... ఏం నీ కూతురు పాతికవేలు సంపాదించుకుంటోంది. వేరే ఇల్లు తీసుకుని తనిష్టం వచ్చినట్టు స్వేచ్చగా ఉండనీ , తనకీ మనకీ మనశ్శాంతి దొరుకుతుంది" స్థిరంగా అన్నాడు ప్రసాద్.
    తండ్రి ఇదంతా ఆవేశంలో, కోపంలో ఏదో అనడం కాదని చాలా సీరియస్ గానే అంటున్నాడన్నది అర్ధం కాగానే భావన కలవరపడింది. ఒక్క క్షణంలోనే కళ్ళేదుటే ఇల్లు, వంట, ఇంటద్దె, ఖర్చులు, చాకిరీ , ఇవన్నీ కదలాడాయి. హాయిగా, నిష్ఫుచీగా అమ్మ ఇంట్లో తన బట్టలు వుతికించి, ఇస్త్రీ చేయించి, తన పక్క అలమార్లు సర్ది, టిఫిన్లు, భోజనాలు పెడ్తుంటే .... బాబోయ్ ఇవన్నీ తను చూసుకోవాలా? ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ, ఇంటద్దె ఓ పదివేలు పొతే తనకీ డబ్బులు సరిపోతాయా..... అరక్షణంలో మనసు నిండా సందేహాలు, భయం చుట్టుముట్టాయి. ఆమె మొహంలో కలవరం స్పష్టంగా గమనించినా చూడనట్టు అయన చేతిలో పేపరక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోయాడు. కూతురి మొహం ఓసారి చూసి రమ కూడా లోపలికి వెళ్ళిపోయింది.

                                         *    *    *    *
    మరో ఆదివారం వచ్చింది. ఆ వీక్ అంతా కూతురు ఇల్లు కదలలేదన్నది ప్రసాదరావు గమనించి, "భావన ఇంట్లోనే ఉన్నట్టుంది ఈరోజు" అన్నాడు భార్యతో.
    "ఊ.... అసలు ఈ వారం నుంచి అది అసలు మాట్లాడడం లేదు. మీ మాటలు పనిచేసి కాస్త భయపడినట్లుంది. లేకపోతే పోలీసుల భయమో."
    ఆదివారం ఉదయం ఫలహారం చేస్తుండగా , "ఎంత వరకు వచ్చింది నీ ఇంటి వ్యవహారం, ఏదన్నా ప్లాట్ చూసావా .... నీ ఆఫీసుకి దగ్గరలో చాలా అపార్ట్ మెంట్లు కొత్తగా వచ్చాయి . అక్కడ చూడకపోయావా."
    భావన గతుక్కుమంది. తండ్రి ఆ విషయం మర్చిపోయి ఉంటాడని , కోపంలో ఏదో అన్నారని సర్దుకుంది.
    'అపార్టుమెంటు చూశాక నీకు ఏదన్నా ఫర్నిచర్ కావలిస్తే తీసుకెళ్ళు. నీ మంచం , బీరువా, యింకో రెండు , మూడు ఏక్ స్ట్రా సోఫాలున్నాయి. తీసుకెళ్ళు. వంటగిన్నెలు అవి చాలా ఉన్నాయి. పాట గ్యాస్ స్టవ్ కూడా వుంది. ఇంట్లో సామానేం కొనక్కరలేదు. వెంటనే, తరువాత నెమ్మదిగా నీకు కావలసినవి కొనుక్కో పెళ్ళయితే అమ్మాయింటికి సామానిస్తాం, ఎలాగో, నీకు ఇప్పుడే ఇస్తాం కావలిస్తే " చాలా కూల్ గా అన్నాడు. తండ్రి వంక చుర చుర చూసింది. తగ్గిపోవడం ఇష్టం లేక.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra