రజని కళ్ళు తుడుచుకుంది.
    "శుభలేఖలు కూడా అచ్చయ్యాయి. బంధువులకూ అందరికీ తెలిసిపోయింది. కుటుంబం పరువు గంగలో కలుపుతావా? నేను తలెత్తుకు తిరగ్గల్నా? జగన్నాధానికి మాట ఇచ్చాను. ఏది యేమైనా నా మాట నిలబెట్టుకుని తీరతాను" ఖచ్చితంగా అన్నాడు మూర్తి.
    గేటు తెరుచుకుని లోపలకు వస్తున్న రవిని చూసి మూర్తి గాబరాగా బయటకు వచ్చాడు.
    "హలో రవీ! ఎప్పుడొచ్చావు?" లేని ఉత్సాహాన్ని తెచ్చి పెట్టుకుంటూ ప్రశ్నించాడు.
    "పదకొండు గంటల బండికి వచ్చాను."
    "ఆ కూర్చో! ట్రైనింగ్ ఎలా వుంది? డ్యూటీలో ఎప్పుడు చేరాలి?"
    "రేపే డ్యూటీలో చేరాలి" అంటూ వాకిలి వైపు చూపులు తిప్పాడు రవి.
    "రజని లేదా" కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రవి.
    "వుంది కూర్చో! ఇప్పుడే వస్తుంది" మూర్తి లోపలకు వచ్చాడు.
    రజని తన గది మంచంమీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. కొద్ది నిముషాలు మూర్తి అలా ఏడుస్తున్న కూతుర్ని రెప్పలు వాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు.
    "లే! లే! ఏమిటా ఏడ్పు? ఇంట్లో ఎవరో చచ్చినట్టు! మీ అమ్మా, నేనూ ఇంకా బతికే వున్నాం!"
    రజని కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది.
    "రవి వచ్చాడు! నిన్ను పిలుస్తున్నాడు. ముఖం కడుక్కుని వెళ్ళు! జాగ్రత్త! రవి ముందు నీకు ఈ వివాహం ఇష్టం లేనట్టు ప్రవర్తించకు. అలా చేస్తే మళ్ళీ నన్ను ప్రాణాలతో చూడవు" అన్నాడు మూర్తి.
    వీపుమీద ఎవరో చెళ్ళున చరిచినట్టు దిగ్గున తండ్రి ముఖంలోకి చూసింది రజని.
    "నీకు నా శవాన్ని చూడాలని వుంటే నీ ఇష్టప్రకారమే చెయ్యి" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు మూర్తి.
    మూర్తి డ్రాయింగ్ రూంలోకి వచ్చి రవితో ఏమీ జరగనట్టే బాతాఖానీ వేశాడు.
    పది నిమిషాల్లో రజని ముస్తాబయి బయటికి వచ్చింది.
    "బాగున్నావా రవీ" చిరునవ్వుతో ప్రశ్నించింది.
    రజని ముఖం చూసి మూర్తి మనస్సులోనే 'అమ్మయ్య' అనుకున్నాడు. మనసు తేలిక పడింది.
    "బాగానే వున్నాను. అలా బయటికి వెళదాం వస్తావా?" అడిగాడు రవి.
    "వెళ్ళమ్మా!" అన్నాడు మూర్తి.
    ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న రజని వెంటనే అంగీకరించింది. ఇద్దరూ బయలుదేరారు. కారు దాటి పోయిందాక వాకిట్లో నిలబడి చూశాడు. సంతృప్తిగా నవ్వుకుంటూ లోపలకు వచ్చాడు.
    "రజని అంత త్వరగా త్రోవలోకి వస్తుందని తను భావించలేదు. రజని ఎంతయినా తన బిడ్డ. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. తన మాట కాదనలేదు. తనంటే ఎంత అభిమానమో! రవి లాంటి భర్త దొరకడం రజని అదృష్టం! ప్రకాశ్! రౌడీ వెధవ! వట్టి జులాయిలా తిరుగుతాడు! చదువుండీ సంస్కారం లేనివాడు! జగన్నాధానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోనని తను ఎంత భయపడ్డాడు!
    కార్లో రవి ప్రక్కన కూర్చున్న రజని తండ్రి ఆలోచనలకు భిన్నంగా ఆలోచిస్తోంది.
    రవి మౌనంగా కారు నడుపుతున్నాడు. అతనూ ఆలోచిస్తూనే వున్నాడు. రజనీకి తన నిర్ణయాన్ని ఎలా చెప్పడం? తనను చూడగానే ఎంతో సంతోషంగా నవ్వుతూ పలకరించింది? తనకు కాబోయే భర్తగా ఊహించుకుంటూ ఎన్ని కలలు కన్నదో? తను ఇందిరను ప్రేమిస్తున్నట్టు విని రజని భరించగలదా? ఎంత దారుణ వేదనకు గురౌతుందో? ఎలా? ఎలా? ఏమని చెప్పడం! రవి మనస్సు మధనపడసాగింది.
    రవి తనను బయటికి రమ్మని తీసుకొచ్చాడు! కాని అంత మౌనంగా వున్నాడేం? అంత గంభీరంగా ఏమిటి ఆలోచిస్తున్నాడు? తన మనస్సుని అర్థం చేసుకోలేదు గదా? అబ్బే తను నవ్వుతూనే పలకరించిందిగా? కాని తన నవ్వు తనకే ఎంతో పేలవంగా వున్నట్టు తోచింది. రవి తెలివైనవాడు! ఆ మాత్రం ముఖం చూసి గ్రహించలేడా? తన మనసు గ్రహించి బాధపడుతున్నాడా? ఎలా తను ప్రకాశ్ ను ప్రేమిస్తున్నట్టు చెప్పడం? అంత చెప్పినా రవి తన అభిప్రాయాలను గౌరవిస్తాడా? ఏమైనా సరే ఈ వివాహం జరగాల్సిందేనని రవి పట్టుపడితే? రవికి పట్టుదల ఎక్కువ! తనతో చిన్నతనంలో రాజకుమారుడి ఆటలు ఆడేవాడు. తనను రాజకుమారిగా ఊహించేవాడు. ఆ ఊహలే బలపడలేదు కదా? ఆలోచిస్తూనే రవి ముఖంలోకి చూసింది.
    రవి కారు వేగం హెచ్చించాడు. నుదుటిమీద ముడతలు అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. రజని నిట్టూర్చింది.
    ఊరి బయట చెరువు దగ్గరకు రాగానే "రవీ! కారు ఆపు! ఇక్కడ కాసేపు కూర్చుందాం" అన్నది రజని.
    రవి కారు ఆపాడు. ఇద్దరూ కారు దిగి చెరువు గట్టుకు వచ్చారు. రజని ఒడ్డున వున్న బోటు దగ్గిరకు నడిచింది. రవి మౌనంగా అనుసరించాడు.
    "బోటు షికారు వెళ్దామా?" అడిగింది రజని.
    యదాలాపంగానే రవి "సరే" అన్నాడు. రజని తెడ్డుతో నీళ్ళు తోస్తూ వుంది. చుక్కాని పట్టుకొని రజని ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు రవి.
    ఇద్దరికీ ఒకే విషయం గురించి మాట్లాడాలని వుంది. సంభాషణ ఎలా ప్రారంభించాలో ఇద్దరికీ సమస్యగానే వుంది.
    సంధ్య వెలుగులో చెరువు నీరు వింత శోభతో మెరుస్తోంది. రజనీగానీ, రవిగానీ ఆ సౌందర్యాన్ని ఆస్వాదించగల మానసిక స్థితిలో లేరు.
    ఇద్దరి గుండెలూ మండుతున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra