Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 21


    సోర్భాన్ ఒక ఆసుపత్రి. వెయ్యి మంది ప్రతిఘటన వీరులకి ఊచకోత ప్రమాదం. అయినా పోగవుతూనే ఉన్నారు- వందలలో , పదులలో!
    రేయంతా ప్రేలుళ్ళూ, మంటలూ!
    విదేశశాఖా మంత్రి ఒక రేడియోలోంచి అరుస్తాడు : "తిరగబడ్డయీ గుంపుల్ని పారిస్ వాంతి చేసుకుతీరాలి. "కమాండో వీరులింకా పోతాడుతూనే ఉన్నారు.
    రాత్రి నగ్నమైన మనుష్యమాంసం.
    ఆఖరి ప్రతిఘటన వీరులు డెన్ఫర్ వద్ద ఉషస్సును చూస్తారు. అక్కడ ప్రదర్శనలు ప్రారంభమైనాయి.
    మాంపర్నాస్ శ్మశానంలోని సమాధుల చాటున వాళ్ళు తల దాచుకుంటారు.
    పారిస్ కమ్యూన్ ఒంటరిగా పోరాడలేదు.
    పోలీసులు పారిస్లోనూ, లయన్ లోనూ మాత్రమే దాడిచేశారు. అక్కడ వారికి బలం వుంది. కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాలలో పట్టణాలలో , గ్రామాలలో వాళ్ళు వీదులలోకే రాలేదు. పోలీసు స్టేషన్లలో బారికేడ్లు నిర్మించుకుని దాగున్నారు.
    నాన్ టేస్ వద్ద, తమ ప్రధాన కార్యాలయం మీద దీర్ఘ యుద్ధం జరిగిన పిమ్మట, ఒక సి.జి.టి లీడరు గుడిలోంచి బైటికి వచ్చేశాడు. రాయబారులు ప్రసంగం ప్రారంభించాయి.
    పోలీసులు శత్రువుతో ప్రసంగం ప్రారంభించారు.
    లాటిన్ కార్టర్: ఉదయం.

                                              17

    బేరమాడడం అంటే లొంగిపోవడమన్నమాట
    లాటిన్ కార్టర్: ఉదయం.
    సెయింట్ జేర్మేస్ వద్ద యువకులు బారి కేడ్లను తొలగిస్తున్నారు. కొందరు ఏడుస్తున్నారు.
    యుద్దరంగం మీద భాష్పవాయు మేఘాలు యింకా దట్టంగా వేలాడుతూనే ఉన్నాయి.
    యువక కాన్ స్ర్కిప్టులు (నిర్భంద సైనికులు) సెయింట్ మైఖేల్ దారిని చక్కబరుస్తున్నారు - పోలీసులు అజమాయిషీ కింద.
    మనం వాళ్ళను చూస్తూ చిరునవు నవుతాం. జవాబుగా వాళ్ళూ చిరునవులు నవుతారు.
    విషాదమయమైన ఉషః కాలపు వెలుగులో , శిధిలాల నడుమ, పోలీసు విజయాల తరువాత విధిగా గడిచే భీభత్స ఘడియల అనంతరం, కమ్యూన్ కి తెలుస్తుంది. తన ఇద్దరు శత్రువులూ చేతులు కలిపి తరతరగా వలయాన్ని బిగిస్తారని.
    మూడు గంటలకి బూడిదరంగు సిట్రోయస్ కారులు, గ్రెనేల్ విధికి తీసుకొస్తాయి. మంత్రులను, మధ్యవర్తులను , కామందులను, యూనియన్ మనుష్యులను, గుంపులో కలిసిపోయి, దిగులుతో పాలిపోయి, ఏదో ఒకటి వేగంగా తే,మిల్చేద్దాం అనికుంటున్నారు. యూనియన్ మనుష్యులు రొట్టె ముక్కలు బేరంలో ఆరితేరిన ఘటికలు - బాధ్యత గల  మనుష్యులు . ఆర్ధిక సూత్రాలూ, మార్కెట్టు ధరవరలూ, విదేశీపోటీలూ అన్నీ క్షుణ్ణంగా అర్ధమవుతాయి.
    మొదటిది ; కనీస వేతనం - అసంతృప్తి కారణాన్ని తొలగించడానికి.
    ఓండోరులను అర్ధం చేసుకున్నారు. అప్పుడప్పుడు గొంతుకల హెచ్చింపు. పాత అలవాట్లు ఒకంతట వదలవు. సంప్రదాయాలను నిలబెట్టాలి. నాగరికుల మధ్య.
    3 గంటల 45 నిమిషాలకి కనీస వేతనం 384 ఫ్రాంకుల నుండి 520 ఫ్రాంకుల కు పెరుగుతుంది.
    ఆత్మరక్షణ సమస్య వచ్చినపుడు కామందులు కార్మికుల డబ్బుతో చాలా ఉదారంగా ఉంటారు.
    గొప్ప పునర్మీర్మాణ దీక్షతో వీరిప్పుడు ఇరవై నాలుగ్గంటలూ " పని చేస్తున్నారు"
    ఆదివారం వస్తుంది. దేవుడి రోజున కూడా రాయబారులు ఓపికపట్టి పని చేస్తున్నారు. ఎడుశాతం ఇప్పుడూ, 3 శాతం అక్టోబరులో లేక ఇప్పుడు 6 శాతం , నవంబరులో 4 శాతమూనా?
    వారానికి 40 గంటలా? అదంతా ఫాక్టరీల వెలుపల, నినాదాల కోసం, అరవయ్యో ఏట ఫించన్లా? నినాదంగా ఇది బాగానే ఉపయోగించింది. యూనియన్లకు ముందు చూపున్నదని సూచిస్తుంది. ప్రభుతం తన మంచి రోజుల్లో సాంఘిక భద్రతను సంక్లిప్త పరిచింది.
    ఆ విషయంలో కూడా నాలుగు మెతుకులు విసిరేద్దామా? వీల్లేదు. ఇచ్చిన మట్టుకు చాలు.
    బెరమాడడం కష్టంతో కూడిన వ్యాపారం. కాని తప్పకుండా వ్యాపారమే.
    ఉభయులూ వ్యాపారంలో ఉన్నంతకాలం, గంటలు గడిచిపోతున్నాయి.
    ఒక ఎంచక్కటి ముసిలయన, కామందులకి కామందు, ఎవరికీ తెలియకుండా కాగితం మీద జోరుగా లెక్కలు కడతాడు. లంచాలు ఎప్పుడూ కారు చవకే.
    అకస్మాత్తుగా ఆదివారం వెళ్ళిపోయింది. ఒడంబడిక కుదిరింది.

                             18

    బిలాంకూ, సోమవారం ఉదయం 7.45.
    15 వేల మంది కార్మికులు వేచి వున్నారు. దేనికైనా తెగించి.
    కామందులు కొత్తగా నియమించిన సి.జి.టి. . సార్జెంట్లు', "రాయబారాల " వార్త తీసుకొస్తారు.
    వాళ్ళు తమ దళాలని అదుపులో ఉంచుకోడానికి దశాబ్దాల నాటి కవచాన్ని ఉపయోగిస్తారు. ఇంకా అమలు చెయ్యని 1936 వ ఏటి డిమాండ్లవి.
    వారానికి 40 గంటలు, అరవయ్యో ఏట పించను, యూనియన్లకు ఆచరణ స్వేచ్చ, సముచిత వేతనం' (ప్రస్తుతం బిలాంకులో , వెయ్యి ప్రాంకులు).
    సి.జి,టి. జనరల్ సెక్రటరీ జార్జి సేగీ (కమ్యునిస్ట్ కార్మిక నాయకుడు) వస్తున్నారు.
    అతనితో బెనా ఫ్రషోస్ సి.జి.టి అధ్యక్షుడు. వయస్సు 73. 1936 నాటి మటి న్యాన్ ఒడంబడికలో సంతకం చేసినవాడు.
    యోదులిద్దరూ భయపడుతున్నారు. డబ్బు తప్ప మరేదీ తీసుకురాలేదని. సేనలలో అలజడి వాళ్ళకి తెలుసు.
    వేదికనలంకరించి వైభవంగా ప్రారంభిస్తాడు : 'అతి కష్టం మీద, అతి క్లిష్టమైన బేరాల తర్వాత ఇదీ మనం వాళ్ళ నుంచి లాక్కున్నది -----"
    కార్మికులు కళ్ళూ, చెవులూ అప్పగించి వింటారు . "వీళ్ళు"" "వాళ్ళు" దగ్గర నించి లాక్కొన్నదెంత ఘనమైనదో సేగీ వివరిస్తుంటే, తరంగాలు అతని కంటధనిని ఇతర ఫాక్టరీలకు మోసుకుపోతాయి. బిలాంకూ , ఫ్యాక్టరీలన్నింటిలోకి పెద్దదైన రెనో కర్మాగారానికి మాతృగృహం. ఇక్కడే మొట్టమొదటి నిర్ణయాలు జరుగుతాయి. ఇది సి.జి.టి. కంచుకోట. ఇదే కార్మిక భాగ్యవిధాత. ఇక్కడ పంజరాల కమ్ములు పగల గొట్టదలచుకున్న వాళ్ళ ముందు పంచరంగులు చిత్రిస్తు'న్నాడు సెగీ.

 Previous Page Next Page