మరో రెండు నెలలకు శ్రీలేఖతో అతని పెళ్ళి జరిగింది.

 

    ఆమెకు ఇరవై ఏళ్ళుంటాయి. యవ్వనం శరీరం లోపల ఏ దీపంలా వెలుగుతూ వెలుగులు విరజిమ్ముతోంది. కలలుగనే కళ్ళు అనుభవాలకై ఎదురు చూస్తున్నాయి. మరో పెదవుల కోసం ఆమె పెదవులు ఎదురు చూసి చూసి పండిపోయినట్టు ఎర్రగా తేలాయి. ఆమె బుగ్గలు సిగ్గును తమలో ఇముడ్చుకోవాలని ఎత్తుగా పెరిగాయి. ఆమె కంఠం వెచ్చని వూపిర్లు తగలడం కోసం నున్నగా వుంది. ఆమె గుండెలు బలమైన వత్తిడికోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆమె నడుము మరొకరి చేతుల్లో చిక్కుకుపోవాలనే ఆరాటంతో అప్పటికే చిక్కిపోయి వుంది.

 

    ఆమె శతకోటి ఆశలతో రాఘవులు ఇంట కాలు పెట్టింది.

 

    మంగళ సూత్రధారణ సమయంలో ఆమె నడుమును రాఘవులు కళ్ళుచూపులతో కాల్చాయి. తాళి కడుతూ పూజారికి కనపడకుండా రాఘవులు ఆమె కంఠాన్ని తడిమినప్పుడు ఆమెలో మధుర సంచలనం కలిగింది. పెళ్లి అయిపోయాక పక్కన కూర్చుని భోజనం చేస్తున్న ఆమె విస్తట్లో నుంచి లడ్డు తీసుకుని అతను తింటున్నప్పుడు మొగుడి చిలిపితనానికి, చొరవకి మురిసిపోయింది.

 

    ఆ ఆనందం ఆమెకు ఇరవైనాలుగు గంటలు కూడా లేకపోయింది. మొదటి రాత్రి గదిలో అతను మాట్లాడిన మొదటివాక్యం వినే ఆమెకు మతిపోయింది.

 

    "నగలు మీవూర్లో కంసాలి దగ్గర చేయించినట్లున్నారు. వాడు ఎక్కువగా రాగి కలిపేశాడు. నా అనుమానం నిజమో కాదోనని తెలుసుకోవడానికి నీ తాళి కట్టేప్పుడు నగలను తడిమిచూశాను."

 

    ఆ మాటలకు మూర్ఛపోయినంత పనైంది ఆమెకు.

 

    "పెళ్ళికి వచ్చిన మా బంధువొకడు బంతిలో రెండు లడ్లు పెట్టించుకున్నాడు. ఎవరో పరాయివాడే అంత తింటుంటే పెళ్ళి జరిపించిన నేను ఒక్క లడ్డు తినడం ఏమిటని నీ విస్తట్లోని లడ్డు తీసుకున్నాను."

 

    ఆమెకు తల తిరిగిపోయింది.

 

    "పెళ్ళి చీరలు కొనేప్పుడు మీరేం మోసపోలేదు. మంచి జరీ వున్న పట్టుచీరే కొన్నారు. అప్పుడే కనిపెట్టాను."

 

    చప్పున తను మాయమైపోతే బావుండుననిపించింది శ్రీలేఖకు.

 

    "మాటల్తో వేస్ట్ చేయకూడదు. ఇప్పటికే చాలా ఖర్చయింది. వడ్డీ వండగ" అని కుతితో లైట్ ఆర్పివేస్తున్న రాఘవుల్ని పురుగుకంటే హీనంగా చూసింది.

 

    మరో పదినిముషాలకు అలసిపోయాడు రాఘవులు.

 

    "ఈ అయిదు నిముషాల తంతుకి బయట ఏ ఆడపిల్లయినా వంద రూపాయలు తీసుకుంటుందనుకుంటా. ఆ లెక్కన అయితే పెళ్ళి గిట్టుబాటే" పక్కన తననే వింతగా చూస్తూ పడుకుని వున్న శ్రీలేఖతో అన్నాడు.

 

    ఆమె తల కిందకు దించేసింది. ఆమె నోట్లో చాలా లాలాజలమే వూరింది. అతని మీద వుమ్మకుండా ఆమె కంట్రోల్ చేసుకోగలిగిందంటే అది దేవుడు స్త్రీలకిచ్చిన క్షమాగుణం వల్లే.

 

    మిగిలిన రాత్రంతా సంసారాన్ని ఎలా పొదువుగా చేయాలో, జీవితంలో వడ్డీ నిర్వహించే పాత్ర, తన గొప్పతనం తదితర విషయాలన్నీ వివరించాడు.

 

    ఆ ముచ్చట్లతోనే భళ్ళున తెల్లవారింది.

 

    పడక మీద నుంచి లేచి వస్తున్న శ్రీలేఖను స్నేహితురాళ్ళు ఆపారు. ఆమె వైపు వింతగా చూస్తూ "అదేమిటే? కొత్త పెళ్ళి కూతురివి. తొలి రాత్రి గడిపి వస్తున్నావ్. చీరైనా నలగలేదు. పూలైనా వాడలేదు. జుట్టు ముడి అయినా విడలేదు" అని ప్రశ్నించారు.

 

    "అవన్నీ చేస్తే వడ్డీ రాదుగా" అనేసి విసవిసా వెళ్ళిపోతున్న శ్రీలేఖను చూసి ఒక్కరాత్రికే చాలా మారిపోయిందని భయపడ్డారు.

 

    శ్రీలేఖ తల్లిదండ్రులు వడమాలపేటకు వచ్చి కూతుర్ని దిగబెట్టి వెళ్ళారు. భర్త ఎలాంటివాడైనా ఆడదే సర్దుకుపోవాలని బుద్ధిమాటలు చెప్పారు.

 

    ఇంట్లో మిగిలింది శ్రీలేఖ, రాఘవులే.

 

    ఆ ఇల్లు చాలా పెద్దది. చెడిపోయిన ఆ వూరి పెద్ద ముప్పైవేలకు అమ్మేస్తుంటే రాఘవులు కొనుక్కున్నాడు.

 

    కొట్టు మాత్రం బజార్లో వుంది. అదీ అతని స్వంతమే. కొట్టు నుంచి ఇంటికి రెండు ఫర్లాంగుల దూరముంటుంది.

 

    ఉదయం నిద్రలేచి, కాఫీతాగి కొట్టుకెళ్ళేవాడు రాఘవులు. పన్నెండు గంటల ప్రాంతాన హడావుడిగా వచ్చి భోంచేసి తిరిగి కొట్టుకెళ్ళితే రాత్రి ఏ పదింటికో, పదకొండింటికో ఇల్లు చేరుకునేవ్వాడు.

 

    కడుపుకు కూడా తినేవాడు కాదు. పచ్చడి తప్ప మరోకూర చేయనిచ్చేవాడు కాదు. ఉదయం టిఫిన్ తింటే బద్ధకం పెరుగుతుందని టిఫిన్ చేసేవాడు కాడు. పచ్చడి తరువాత కాస్తంత మజ్జిగ వేసుకుని తిని లేచిపోయేవాడు.

 

    అందుకే అతను గొడుగు పుల్లలా సన్నగా, అసహ్యంగా వుండేవాడు. కళ్ళు లోపలకు లాక్కుపోయి గుంతల్లా కనపడేవి. బుగ్గలు లోపలికెళ్ళి ముడిచిన గొడుగులా వుండేవి. పెదవులు నల్లగా కంబలి పురుగులను చంపి, అతికించుకున్నట్లు వుండేవి.

 

    ఉప్పు, పప్పు వున్న పెట్టెను కూడా తాళం వేసేవాడు.

 

    ఉదయం లేస్తూనే పెట్టె తాళం తెరిచి ఆ రోజుకు కావలసిన సామాను ఇచ్చేవాడు. తిరిగి తాళంవేసి తనతోపాటు తీసుకెళ్ళేవాడు.

 

    "ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఏమైనా బదులడిగితే తాళాలు లేవని చెప్పొచ్చు. అందువల్ల ఇదే మంచి పద్ధతి" అని తాళాలు వేయడం వల్ల వున్న వుపయోగం గురించి చెప్పాడు.

 

    అది విన్న శ్రీలేఖకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

 

    క్రమక్రమంగా అతన్ని చూడడం కూడా మహా పాపమనే స్థితికి వచ్చింది ఆమె.

 

    పెద్ద తాళం గుత్తిని మొలలో దోపుకున్న అతనే పెద్ద తాళం చేవిలా కనిపించేవాడు.

 

    కొట్టునుంచి వచ్చి, ఆవురావురుమని తిని గురకపెడుతూ నిద్రపోయే అతనితో కలిసి బ్రతకాల్సి రావడం దేవుడు తనకు వేసిన శిక్ష అని సరిపెట్టుకుంది.

 

    ఎప్పుడో వడ్డీ దండుగ అనిపించినప్పుడు ఆమెతో గడిపేవాడు. అదీ ఆ అయిదు నిముషాలే. తరువాత లేచి హాల్ లోని ఊయలలో పడుకుని నిద్రపోయేవాడు.

 

    ఆమెకు చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. తన తమ్ముళ్ళతో కలసి సినిమా కెళ్ళేది. పుట్టింట్లో ఇప్పుడు కూడా సినిమా అంటే తమ్ముళ్ళు గుర్తొచ్చేవారు. అందుకే సినిమాకు వెళ్ళడమంటే తన పుట్టింటికి వెళుతున్నట్టు వుండేది. దారి అంతా తమ్ముళ్ళతో సరదాగా సినిమాలు చూడడం, ఆ సమయంలో తను చేసిన అల్లరి అంతా గుర్తొచ్చేది.

 

    అయితే రాఘవులతో సంసారం ప్రారంభించాక పెళ్ళయిన కొత్తలో భక్తప్రహ్లాద చూసింది. తరువాత మరెప్పుడో శ్రీకృష్ణతులాభారానికి భర్త పిలుచుకు వెళ్ళాడు. తన పుట్టింటి వాళ్ళు పదే పదే గుర్తు కొచ్చినట్టు, సినిమా చూడాలన్నతపన కూడా అంత ఎక్కువగానే వుండేది.

 

    ఓసారి ఆ వూరికి ప్రేమనగర్ సినిమా వచ్చింది. అంతకు ముందు తన వూర్లో ఆ సినిమా చూసింది. ఆ సినిమాను తమ్ముళ్ళతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. ఇంటి దగ్గరకూడా తమ్ముళ్ళు నాగేశ్వరరావు డైలాగులను చెబుతుంటే ఎంతో ఆనందించేది. ఆ సందర్భాల్లో తన సంతోషంతో త్రుళ్ళిపడడం, అమ్మ ప్రేమతో కసురుకోవడం అవన్నీ గుర్తొచ్చాయి. ఆ సినిమాను చూస్తే తన వాళ్ళను చూసినట్టు వుంటుందని అనిపించింది. అంతేగాక ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra