Home » Kommuri venugopala rao » Samkellu and Pilla Donga


    
    కాని నా మనసు కకావికలమైంది. బ్రతుకు దుర్భరంగా పరిణమించింది. నిముషమొక విషాదంగా గడుస్తోంది. ఎవర్ని తలుచుకోకూడదనుకున్నానో, ఎవరంటే అసహ్యమని భావించానో వారు స్మృతిపథంలో మెరవడమూ మానలేదు కళ్ళలో నీరు గిర్రున తిరగటమూ మానలేదు.
    
    మరో మూడురోజులు గడిచాక, ఉదయం నేను నిద్రలేచి ఇవతలకు వస్తుండగా, వెనకవచ్చిన కుర్రాడు ఎదురుగా కనబడి మిమ్మల్ని అనసూయ అక్క పిల్చుకురమ్మన్నది సార్" అన్నాడు.
    
    "ఇంకా వెళ్ళిపోలేదా?" అనడిగాను ఆశ్చర్యంగా.
    
    "ఏమో సార్ ఎక్కడికీ వెళ్ళలేదు."
    
    "రానని చెప్పు" అని అందామనుకున్నాను కాని మనసు ఒప్పలేదు. ఆమె తిరిగి యిక్కడికి కబురు చేయటానికి కారణం వుండకపోదని అనిపించింది. గర్వప్రకర్ష చేయటానికో, నాకు యిదివరలో చెప్పక మరిచిపోయిన అంశాన్నే దయినా చెప్పి మరీ ప్రయాణం కావటానికో, ఒకవేళ అతను ఢిల్లీలో లేడని తెలిసిందేమో!
    
    నేను వెళ్ళేసరికి వీధిగుమ్మం తలుపులు తెరిచివున్నాయి. ఎక్కడా చడీ చప్పుడూ లేదు. సంశయిస్తూ లోపలకు అడుగుపెట్టాను. ఎదుటిగది తలుపులు వేసివున్నాయి. ఒకప్పుడు ఆ గది తలుపులు తెరచుకొనే అనసూయ యువతలకు వచ్చి తన విపరీత అలంకారాన్ని ప్రదర్శించింది.
    
    నేను వచ్చిన అలికిడి అయిందిగావును, లోపలినుండి అనసూయ "వచ్చారా డాక్టర్! ఒక్క నిముషంలో వచ్చేస్తున్నాను" అని అనటం వినిపించింది. ఆ రాత్రి చేసినట్లుగానే కవ్వించటానికి తిరిగి అదే వేషధారణలో ప్రత్యక్షమౌతుందనుకుంటాను ఇప్పుడు వెళ్ళిపోనా తిరిగి...? కాని ఇంతలోనే తలుపులు తెరిచి నెమ్మదిగా అనసూయ ఇవతలకు వచ్చింది. ఒక్కసారిగా నా రక్తం ఘనీభవించి నట్టయింది. ఎవరీమె? ఆమె తెల్లచీరె కట్టుకొంది. ముఖాన కుంకుమ చెరుపుకుంది. జుట్టు చిందరవందరగా రేగివుంది. కళ్ళలో వెనుకటి కాంతిలేదు, పదునూ లేదు. ఆమె చేతులకి గాజులు లేవు.
    
    నేను తెల్లబోవటం చాలించి "సంకెళ్ళు విడివడినాయిగా. ఇంకా యిలా వున్నారేం?" అన్నాను కటువుగా.
    
    ఆమె నాకు బాగా దగ్గరగా వచ్చి నిలబడింది. తల యెత్తి నా కళ్ళల్లోకి నిర్లిప్తంగా చూసింది. "ఇంతకంటే మరోవిధంగా వుండలేకపోయాను డాక్టర్" అంది విషణ్ణంగా.
    
    "అదేం? మీ ఆశయం, ఆచరణా..."
    
    "అదేమో నేనెప్పుడూ కానీ విని యెరుగని భీకరమైన సంఘటన సంభవించింది డాక్టర్! ఆ రోజు నేను ఏడుస్తూంటే మీరు నా ప్రక్కన చేరి పరిహసించారు. అబ్బ! అన్ని కన్నీళ్ళు నాకు యెలా వచ్చాయి? నేను ఎందుకు నిజంగా ఏడ్చాను? నా గుండె ఎందుకంత వేగంగా కొట్టుకొంది?
    
    "అబ్బ, అది ఎంత భయానకమైన సమయం! ఆయన గుండెపై తలవాల్చి ముఖంలోకి చూస్తూ కూర్చున్నాను. ఒక్కసారి ఆయన ముఖం నల్లబడింది. అప్పుడు భూకంపం వచ్చినట్లయింది. నెత్తిమీద పిడుగు పడినట్లయింది. మీదకు సముద్రం పొంగినట్లయింది. అసలైన అగోచరమైన సంకెళ్ళు నా హృదయం చుట్టూ పెనవేసుకొని పిండిచేసినట్లయింది. కెవ్వున కేకవేశాను.
    
    "డాక్టర్! నా మాటలతో చాలాసార్లు మీ మనసును తూట్లు పరిచాను. నన్ను క్షమించండి. నేనెటువంటి అజ్ఞాతమైన అజ్ఞానావస్థలో వున్నానో తెలుసుకొన్నాను. కనువిప్పు కలిగింది. ఆడదాని అసమర్ధత ఆకళింపు చేసుకున్నాను.  ఈ లోకంలో నేనేం చెయ్యలేను డాక్టర్! నేనేం చెయ్యలేను. నా పాపానికి ప్రాయశ్చిత్తం యిలా అనుభవిస్తూ చావాలిసిందే. పదిమందిలో నేనొకదాన్ని, నా నిజమైన కర్తవ్యం ఇప్పుడు బోధపడింది. నేనేం చెయ్యలేనో ఇప్పుడు తెలిసింది. నేను దేనిని గురించి ఆలోచించకూడదో యిప్పుడు గ్రహించాను. నేను అశక్తురాలిని. అశక్తురాలిని కాదు- అశక్తత నా జీవిత పరమావధి. అందులోనే ఆనందం నా జాతి ప్రతిష్ట.
    
    "మీరు పంపిన డబ్బుకు కృతజ్ఞురాలిని డాక్టర్. నేను కొంతకాలం తీర్ధయాత్రలు సేవించదలచుకొన్నాను. ఆ తర్వాత ఎక్కడో ఒకమూల భర్తపోయిన ఆడవాళ్ళందరు ఎలా గడుపుతారో అలా గడుపుతాను. నాకు సెలవిప్పించండి."
    
    ఆమె చేతులు జోడించింది. యిదివరకటి యీమె మాటలు యెంత దారుణంగా వున్నాయో ఇవీ అంతే దారుణంగా  వున్నాయే! ఇదివరకటి ఈమె పలుకులు యెంత బాధను కలిగించాయో, ఇవీ అంతే బాధను కలిగించాయే!
    
    నేను నీరసంగా కనులు మూసుకున్నాను. నా జ్ఞాననేత్రం తెరవబడి నట్లయింది. నాకు జ్ఞానోదయం కలిగింది.
    
    మగవాడి అహంకారమూ, మగవాడి మూర్ఖత్వమూ, ఆడదాని అహంకారమూ, ఆడదాని అజ్ఞానమూ ఎట్టఎదుట గోచరించినై తరతరాల నుంచీ, యుగయుగాలనుంచీ ఆమెను పెనవేసుకుని వున్న మత్తు, స్తబ్దత, అందులో నుంచి బయటపడలేని ఆమె అశక్తత, మితిమీరిన నా మూర్ఖత్వం, మితిమీరిన ఆమె విప్లవభావం దృగ్గోచరమైనాయి. హద్దుమీరిన ఉభయుల అజ్ఞానం అపశృతులు పలికి పలికి పతనానికి దారితీసింది. పర్యవసానంగా ఆమె సహజస్థితికన్న అధమస్థితికి దిగజారి కుమిలి కుమిలిపోతోంది. ఫలితంగా నన్ను కన్నీటి సముద్రంలో ముంచివేసే యిటువంటి దారుణమైన మాటలు వినవచ్చాయి.
    
    నేను కళ్ళు తుడుచుకున్నాను. "పిన్నీ! నన్ను క్షమించు. నేను అపరాధిని. మనమిద్దరం జీవితాన్ని గురించి అపోహపడ్డాం. సంకెళ్ళు తొడిగించుకొని మీ బ్రతుకు యెలా బండలయిందో, సంకెళ్ళు లేక మా పశుత్వం విజ్రుంభించింది. పరిచయమైన పరిష్కార మార్గం కానరావటంలేదు. నిన్ను విడిచి వుండలేను పిన్నీ మా యింటికి వచ్చి వుండవా?"
    
    "వద్దు చిరంజీవీ నన్ను వెళ్ళిపోనీ మనశ్శాంతిని వెతుక్కుంటూ పోతాను."
    
    "అది అడియాస పిన్నీ! యీ స్వార్ధపూరితమైన ప్రపంచంలో మనశ్శాంతి యెక్కడకు పోయినా దొరకదు."
    
    ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. "నాది విచిత్రజీవితం చిరంజీవీ అశక్తతను తెలుసుకొని ఏమీ చేయలేకపోవటం కన్నా మందకొడిగా వుండి ఆ అశక్తతను, తెలుసుకోలేక గర్వంగా జీవితం గడపటమే ప్రమాదరహితం నాకు ఓ నాన్న వున్నాడు. నా యీ కష్టస్థితిని తెలిసికూడా ఆయన యెందుచేతనో పట్టించు కోలేదు. ఈ రకం ప్రపంచంలో కాలు నిలిపి ఒకచోట నివసించటం కన్నా, అనుభవాలు సేకరించుకుంటూ నిరంతరం యాత్రికలుగా వుండటం శ్రేయోదాయకమైంది. ఈ రాత్రికే బయలుదేరుతున్నాను. నాకు సెలవిప్పించు చిరంజీవీ!"
    
    "క్రొత్త పిన్నీ! ఇది యెంత పాత జీవితం!" అన్నమాటలు నా నోటివెంట గద్గగస్వరాన వినబడినవి.
    
    
                                                       సమాప్తం
                                                         * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra