Home » Kommanapalli ganapathi rao » బ్లాక్ మాంబా


    కరతాళ ధ్వనులతో హాలు దద్ధరిల్లిపోయింది.

    "ఏమిటో శివానంద్ గారూ...నిజానికి మాకిలాంటి ఫంక్షన్లంటే అసలు గిట్టదు కాని ఎంతైనా ఆడపడుచు కదా అని అడగ్గానే కాదనలేకపోయాను." పక్కనున్న ఖాళీ సీటులో కూర్చోబెడుతూ మృదు మందహాసంతో తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.

    తెర తొలగింది.

    ఇప్పుడు ఆడపడుచు వేదికపై ఉత్సాహంగా నడిచి మైక్ ని సమీపించి సభా సదులకి నమస్కరించేసి ముఖ్యమంత్రిగార్ని చూసి ముసిముసిగా నవ్వింది.

    ఆ మధ్యకాలంలో ప్రముఖ నవలా రచయిత్రి కావాలనుకున్న ఆమె అవకాశాలు సన్నగిల్లడంతో ఆ ప్రక్రియని పక్కనపెట్టేసి మధ్యనే ఓ కవితాసంపుటి రాసి సొంతంగా అచ్చువేయించింది.

    ఆ పుస్తకం ఆవిష్కరణతో పాప్యులారిటీ సంపాదించుకోవాలనే మిషతో దాన్ని ముఖ్యమంత్రిగారికి అంకితంచేస్తూ ఇంత సందడికీ కారణమైపోయింది.

    "మంత్రులెందరో వుంటారు...కాని మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేయగల తాంత్రికులవంటి జగజ్జంత్రీలు కొందరేవుంటారు. ఆడపడుచుల హృదయతంత్రుల్ని మీటే కంఠంతో ఘంటంపెట్టి గట్టిగా రాసినట్టు మాటాడే ముఖ్యమంత్రిగారికివే మా శ్రద్ధాంజలులు..." తనకున్న భాషా పరిజ్ఞానాన్ని ఇలా ప్రకటించిన సదరు కవయిత్రి 'శ్రద్దాంజలి' పదాన్ని ఇక్కడ వాడొచ్చా లేదా అన్న ఔచిత్యం గురించి ఆలోచించలేదుకాని చప్పట్లతో హాలు దద్దరిల్లేసరికి తనుకూడా గొప్ప వక్తనే అయినందుకు ఉబ్బి తబ్బిబైంది.

    కొద్దిగా నిట్టూర్చింది. "నేను రాసిన 'తెడ్డు' కవితాసంపుటికి కృతి భర్తయిన గౌరవనీయులు ముఖ్యమంత్రిగార్ని, సదరు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సి శివానంద్ గారు వేదికని 'ఎక్కవలసింది'గా కోరుతున్నాను" అంది. అర్జెంటుగా అలంకరించవలసింది అన్న పదం గుర్తుకురాక...

    రాష్ట్రం బరువంతా తన భుజస్కంధాలపైనే వున్నట్టు భారంగా నడుస్తూ చేతులు జోడించిన ముఖ్యమంత్రి వేదికని అలంకరించగానే మొత్తం ఆడిటోరియంని ఏ మూలనుంచైనా అపోజిషన్ వ్యక్తమవుతుందేమో తెలుసుకుందామని.

    అలాంటిదేమీ కనిపించకపోవడంతో ఖర్చులు అయినా మంచి కార్యకర్తల్ని కూడదీసి అక్కడికి రప్పించినందుకు పియ్యేని మనసులోనే అభినందించాడు.

    కవయిత్రి హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రి పాదాలకి నమస్కరించింది ఫ్యూచర్ లో పనిపడే అవకాశమున్నట్టు...

    మళ్ళీ చప్పట్లు...

    ఈ సన్నివేశానికి చలించిన ముఖ్యమంత్రిగారు అమాంతం ఆమెను పైకిలేవదీసి రవ్వంత ఆప్యాయతని ధ్వనింపచేసే ఉద్దేశ్యంతో ఆమెను క్షణంపాటు అక్కున చేర్చుకున్నారు ఓ పసికందులా.

    ఆ కొద్దిపాటి పరిష్వంగానికే ఆమె ఎముకలు విరిగినట్టయింది.

    ఇప్పుడు ఆమె ఆసీనులై వున్న ముఖ్యమంత్రి కీట ప్రిసైడ్ చేసే శివానంద్ కి చెరో పూలదండని వేయగా ముఖ్యమంత్రిగారు సైడ్ వింగ్ లో నిలబడ్డ పియ్యేకి ప్రారంభించు అన్నట్టు సైగచేసారు.

    అప్పటికే చేతుల్లో పూలదండలతో నిలబడ్డ కార్యకర్తలు ఒక్కొక్కరూ వచ్చి ముఖ్యమంత్రిగారికి పీకలదాకా దండలు వేస్తుంటే ఇంత రాష్ట్రపు భారాన్ని వహిస్తున్న తనకీ బరువెంత అన్న ధోరణిలో వాటిని తీయకుండా అలాగే ఫోజుపెట్టారు పత్రికా విలేకర్లు ఫోటోలు తీయడానికి కన్వీనియంట్ గా...

    కవయిత్రికిదంతా చికాగ్గా అనిపించినా ఆడిటోరియంతోబాటు తనూ చప్పట్లు చరిచింది.

    మరో అయిదు నిముషాలలో పుస్తకావిష్కరణ జరిగిపోయింది. "ఇప్పుడు 'తెడ్డు' సంపుటికి శృతి భర్తయిన ముఖ్యమంత్రిగారు మాట్లాడుతారు." అంటూ శివానంద్ క్లుప్తంగా ముగించారు.

    కవితలగురించి ఒక్కమాటా చెప్పకుండా కనీసం తనను అరక్షణంపాటయినా అభినందించకుండా ఇంత క్లుప్తంగా ఉపన్యాసం ముగించిన శివానంద్ పై చచ్చేంత కోపమొచ్చింది.

    కాని ఆ పుస్తకం ప్రచురణకి భూరి విరాళం యిచ్చిన పెద్దమనిషాయె...

    అప్పటికే మైక్ ని సమీపించిన ముఖ్యమంత్రిగారు తన దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ చుట్టూచూసారు.

    మళ్ళీ కరతాళధ్వనులు...

    ఉక్కిరి బిక్కిరౌతూ 'మెడనిండా పూలదండలు దాల్చిన దేవతామూర్తిలా అభినయిస్తూ చిదానందంగా గొంతు సవరించుకుంటుంటే గుండెలపై ఏదో కదిలినట్టనిపించింది.

    ఒక్కక్షణం పరికించి చూస్తే తెలిసేది ఆ కదలిక భ్రాంతికాదని కార్యకర్తలు ఒక వ్యక్తిచేసిన దండలో తాడుకి కట్లపాము దారంతో కట్టబడి వుందనీను...అది ఒంటిచుట్టూ చుట్టబడిన దారాన్ని తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంది.

    మళ్ళీ ఏదో ప్రాకిన అనుభూతి.

    "హు...రజ్జు సర్పభ్రాంతి ఇది" అని తనను తాను మభ్యపెట్టుకుని చివరగా తన ఉపన్యాసానికి ఉపక్రమించాడు. "సభకి నమస్కారం...ఉద్వేగంగా వుంది. ఈ సన్నివేశాన్ని చవిచూచుతున్నకొద్దీ ఆనందం ఆర్ణవమై నా ఒడలు పులకరించిపోతూంది. అప్పుడు మొల్ల రాసింది రామాయణం. మళ్ళీ ఇన్నాళ్ళకి మా చెల్లిరాసింది తెడ్డు సంపుటం..." పెదవుల్ని బిగపట్టి గొంతులోనుంచి నవ్వు వినిపించారు.

    ఆ నవ్వు చేతిలోనుంచి జారిన ఇత్తడిచెంబు మెట్లపైనుంచి దొర్లినట్టుగా వుంది.

    "ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమిభారతిని" మళ్ళీ మెట్లచెంబు నవ్వు...

    చప్పట్లు...క్రమంగా మత్తులోకి జారిపోతున్నాడు.

    వచ్చింది ఒకందుకైనా చెప్పేది స్వోత్కర్షే కావాలన్న సూత్రానికి కట్టుబడి ఇక 'తెడ్డు' ప్రసక్తిని ఆపి తన ఒరిజినల్ మూడ్ లోకి వెళ్ళిపోయారు.

    అప్పటికి కట్లపాము సగం దారాల్ని తెంచుకుంది. ఇప్పుడు సందుచూసుకుని ఖద్దరు చొక్కాలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూంది.

    "ఎక్కడి చరిత్ర మనది. ఎంత ఉత్కృష్టమైన సంస్కృతి నాది...అటు శాతవాహనులు...ఇటు త్రిలింగ దేశప్రజలు... నా ప్రజలారా నా పరిపాలనా దక్షతకి పరవశించే నా దళిత సోదరులారా... నేనున్నాను... ఇంకా ఉంటాను... నా బ్రతుకంతా మీ సేవకే అంకితం చేస్తాను."

    చప్పట్లు ఆగకుండా...

    దర్పంగా తలని కదిలించారాయన "కలలోగాని మెలకువగాని జాగ్రదావస్థలోగాని గాఢ సుషుప్తిలో కాని నేను ఆలోచించేది నా ప్రజల్ని...వారి శ్రేయస్సు...వారికోసం అంకితమవుతాను. పునరంకితమైన నా జన్మని సార్ధకం చేసుకుంటాను... నా ధ్యేయం పేదప్రజల ఉద్దరణం. నా రక్తం వారికే తర్పణం..." ఊపులో ఉపన్యసిస్తున్నారు.

    సరిగ్గా అప్పుడు చూసాడు సెక్రెట్రీ గురువుగారి గుండెలపై ఏదో కదులుతూంది...

    ఆ కదలిక మామూలుగాలేదు.

    కంగారుగా వుంది. పూలదండలో ఏదో ప్రమాదం పొంచివున్న వైనాన్ని స్పష్టంగా తెలియచెబుతూంది.

    పోలీసులు కిందనెక్కడో వున్నారు. ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో మునిగిన పోలీసు ఉన్నతాధికారులు ముందే అనుమతి తీసుకుని వుండటంతో సమీపంలో లేరు.

    కదలిక మరింత ఎక్కువగా కాగా "ఏదో కదుల్తూందిసర్" అన్నాడు సైడ్ వింగులోంచి నెమ్మదిగా.

    ఉద్విగ్నంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగారు ఒక్కక్షణం ఆగేరు. ప్రామ్టింగ్ విన్ పాత్రధారిలా "అవును...కదలిక అవసరం. ఆ మాటకొస్తే కదలిక లేకపోతే అంతా జడత్వమే...కదలి కదలి సాగిననాడుగాని గమ్యాన్ని చేరలేమని మన సంస్కర్తలు చెప్పిన సత్యాన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే..."

    "అయ్యా! ఈసారి కదలిక ఎక్కువైంది"

    "అవును... చాలా ఎక్కువ కదలిక రావాలి. బలవంతుడి పాదాలక్రింద నిర్ధాక్షిణ్యంగా నలిగిపోతున్న పీడితులూ తాడితులూ కదలనివాడు వారి బాధలకి విముక్తిలేదు. అందుచేత..." అప్పటికే పూర్తిగా బంధవిముక్తి కావించుకున్న కట్లపాము పూలదండపై తలపెట్టి అతడివేపే చూస్తూంది.

    ముందు తను మాట్లాడుతున్న మైక్ అనుకున్నాడు.

    ఈసారి అది నోరు తెరవడంతో అర్ధమైంది. అది రజ్జువు కాదు సర్పమని...ఇంకో అరంగుళం ముందుకు జరిగింది.

    ముఖ్యమంత్రిగారు మాట్లాడడంమాని కంపించిపోవడంలో లీనమయ్యారు...తోకేమో గుండెలపై తాకుతూ తన గుండె నిబ్బరాన్ని చెక్ చేస్తూంది.

    ఇది ఉపన్యాసంలో రొటీన్ 'పాస్' అనుకున్న కార్యకర్తలు అంతదాకా ఆగి చప్పట్లు కొడుతుంటే కట్లపాము నోరు మరింతగా తెరిచింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra