Home » Suryadevara rammohan rao » రివర్స్ గేర్

    ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదివరకు మిస్ మాయాదేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాన్ని, సేల్స్, ప్రొడక్షన్ అవుట్ ఫుట్, టర్నోవర్ మొదలగు వ్యవహారాల్ని కంప్యూటర్ లో చూసిన మాయాదేవి ఆయాశాఖల అధిపతులకు సూచనలిస్తూనే మనోహర్ కు కబురుచేసింది.
   
    స్తాఫంతా ధైర్యంలేక విచిత్రంగా చూడకపోయినా, చిత్రంగా ఆలోచిస్తుండగా మనోహర్ ఫైల్ తీసుకుని, చైర్ పర్సన్ చాంబర్ లోకి ఎంటరయ్యాడు.
   
    "పిలిచారా మేడమ్" వినయంగా అడిగాడు.
   
    "అవును....ముందు కూర్చో" అని అతనికేసి ఒకసారి పరిశీలనగా చూసి-"కాఫీ....టీ...ఎనీథింగ్..." అడిగింది మిస్ మాయాదేవి.
   
    "నో ప్లీజ్....నన్నెందుకు పిలిచారో చెబుతారా?" ముభావంగా అన్నాడు మనోహర్.
   
    అతని మూడ్ ని పసిగట్టిన మాయాదేవి లోలోనే నవ్వుకుని.....సీట్లోంచి లేచి అదే చాంబర్ లో ఒక మూలగా ఫిక్స్ చేసివున్న కాఫీ మేకింగ్ మిషన్ దగ్గరకెళ్ళి, బటన్ ఆన్ చేసి రెండు మగ్గుల్లో కాఫీ నింపుకుని వెనుకకు వచ్చి, ఒకటి మనోహర్ ముందుపెట్టి, రెండో మగ్గులోని కాఫీ తీసుకుంటూ, మనోహర్ పక్కనే వున్న గెస్ట్ చైర్ లో కూర్చుంది మాయాదేవి.
   
    "నేనిచ్చిన బాండ్ పేపర్స్ వెనక్కిచ్చి, నన్ను రిలీఫ్ చేయకూడదూ?" అడిగాడు మనోహర్ నెమ్మదిగా.
   
    చిన్నగా నవ్వింది మాయాదేవి.
   
    "ముందు కాఫీ తీసుకో" తరువాత తీరిగ్గా నువ్వు చెప్పినవన్నీ వింటాను" అతనికేసి ప్రేమగా చూస్తూ అంది మాయాదేవి.
   
    మనోహర్ నెమ్మదిగా కాఫీ వున్న మగ్ అందుకుని సిప్ చేయటం ప్రారంభించాడు.
   
    "నీ దృష్టిలో నేనిప్పుడు ఓ పోకిరీ పిల్లని.....రౌడీ పిల్లని....నీతి నియమాలు, సాంఘికాచారాలను ఏమాత్రం పాటించని దుష్టురాలిని....ఇంకా చెప్పాలంటే బరితెగించిన ఆడదాన్ని....అవునా?" తలవంచుకుని నెమ్మదిగా కాఫీ తీసుకుంటున్న మనోహర్ ముఖాన్ని చూసేందుకు, తనూ తలవంచి నాటకీయంగా చూస్తూ అంది మిస్ మాయాదేవి.
   
    మనోహర్ ఒకసారి తలెత్తి ఆమెకేసి చూశాడు ఇబ్బందిగా.....అతని ముఖం ఆమెకప్పుడు మనోహరంగా తోచింది. మగతనం అంతర్లీనంగా దాగి, ఆడతనం సంతరించుకున్న అతని ముఖంలోని సున్నితత్వాన్ని చూస్తూ చలించిపోయిన మాయాదేవి కనీసం అతని ఊహకు కూడా అందని రీతిలో, మెరుపువేగంతో అతని ముఖం మీదకు వంగి, అతని నుదుటి మీద చటుక్కున ముద్దు పెట్టుకుంది.
   
    ఆమె చర్యకి నిర్ఘాంతపోయాడు మనోహర్.
   
    "ఇలా నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే, ఎంత అద్భుతంగా వుందో తెలుసా?" తన్మయంగా అంది మాయాదేవి.
   
    ఆమె ప్రతి చర్యలో దుడుకు స్వభావంగల ఒక పురుషుడే కనిపిస్తున్నాడు మనోహర్ కి.
   
    "మీ పద్దతేం బాగాలేదు.....తలుపులేసి మీదపడి ముద్దు పెట్టుకోవడము నా ఊహకు సైతం అందటంలేదు...." నుదుటిని తుడుచుకుంటూ కంగారుపడిపోతూ అన్నాడు మనోహర్. ఆ క్షణంలో, మనోహర్ లో, అమాయకంగా చందమామ చదువుకునే పసివాడు కనిపించాడు.
   
    అందుకే మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మనోహరంగా నవ్వింది మిస్ మాయాదేవి. ఆమె ఎందుకలా నవ్వుతోందో అర్ధంకాని మనోహర్ అంతంత కళ్ళు చేసుకుని విస్మయంగా ఆమెకేసి చూస్తుండిపోయాడు.
   
    "నేను ముద్దు పెట్టుకాగానే, నీ నుదురు ఎంగిలి పడిందని తుడుచుకున్నావా....? చిలక కొట్టిన జాంపండులో పాజిటివ్ గా ఆలోచించేవాడు ఎంగిలని, అమృతాన్ని దూరం చేసుకుంటాడు. నేను నీ కర్ధంకావటంకాదు-నువ్వె నాకర్ధం కావటంలేదు. ఇక్ష్వాకుల కాలంలో పుట్టవలసినవాడిని.....ఈ శతాబ్దంలో ఎలాపుట్టావయ్యా బాబూ....."చిన్న జంప్ చేసి తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగాపెట్టి కనుబొమలని అలవోకగా ఎగరేస్తూ, కాళ్ళని విలాసంగా వూపుతూ అంది.
   
    వాదనలో ఎంతటి వారినైనా సునాయాసంగా పడగొట్టగలిగే వాదనా పటిమ ఈమె సొంతమేమో? ఎంత కఠినమయినదీమె మనో ప్రపంచం.....?ఎప్పుడూ ఏదో లక్ష్యాన్ని సాధించేందుకే బతుకుతున్నానని తెలియపరిచే చురుకైన చూపులు....తనకు కావాల్సిన దానిని శాసించి, సాధించుకునేందుకు పుట్టినట్లుగా కనిపిస్తుంది-ఎప్పుడూ ఎవరేమనుకున్నా, ఎలా విమర్శించినా, తనకేమీ పట్టనట్లుగా వుంటుంది. ఎందరో అసాధ్యమని వదిలేసిన పనుల్ని టేకప్ చేయటం మాయాదేవికి ఛాలెంజ్ తో కూడుకున్న సరదా.
   
    కోర్టులో ఒకరకంగా, ఆఫీసు వర్కింగ్ అవర్స్ లో మరో రకంగా' సందర్భాన్ని బట్టి, తనని తాను మేకప్ చేసుకుంటూ కంపార్టమెంటలిజాన్ని ఎంతో ఒడుపుగా ఉపయోగించుకుంటున్న ఈమె తనకెప్పటికీ అర్ధం కాదేమో.....
   
    "తలుపులేసి ముద్దు పెట్టుకోవడం నీ ఊహకే అందడంలేదంటున్నావు కదా....తలుపులు బార్లా తెరిచి పదిమంది ముందు నిర్భయంగా, నిస్సంకోచంగా నీ నుదుటి మీదే కాదు.....నీ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటా....ప్రేమికులకు మొదట వుండాల్సింది ధైర్యం-ఆ ధైర్యం నాలో హిమాలయాలంత వుంది. నీ ఊహలకి నేను ముద్దు పెట్టుకోవడమే కాదు మరెన్నో చిన్న విషయాలు కూడా అందవు....నీ ఊహా లోకపు పరిది చాలా చిన్నది. నీదేమిట్లే....మీ మొత్తం మగజాతి ఊహా లోకపు పరిదే అతి సూక్ష్మమయినది. ఆ పరిధిని పెంచాలనే నా తాపత్రయం....మగాళ్ళు మంచీ, చెడు, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వస్తే, వాళ్ళని స్టడీచేసే మా ఆడవాళ్ళు ఇంట్లో వుండే ప్రపంచాన్ని తెలుసుకునేది ఎక్కువ-చూసేది తక్కువైనా....ఆడవాళ్ళు తిరిగేది తక్కువ- మీ మగవాళ్ళ ద్వారా తెలుసుకునేది ఎక్కువ. ఎంత ప్రపంచాన్ని చుట్టి వచ్చామన్నది ప్రశ్న కాదు__ఎంత అర్ధం చేసుకున్నామన్నదే ప్రధానం- మనిషంటే కేవలం చదువు, సంధ్య ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, డబ్బు సంపాదన- ఇవే కావు. శరీరం బుద్ది, మనస్సు, ఈ మూడు నిండుగా, ఆరోగ్యంగా వున్న వ్యక్తే పరిపూర్ణమైన వ్యక్తిగా పరిగణింప బడతాడు. ఇవి నీకు లేవని కాదు- ఉన్నా వాటిని వినియోగించుకోవడం లేదు.....అదే నా బాధ...." నాటకీయంగా నిట్టూర్పు విడుస్తూ అంది మాయాదేవి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra