Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 20

                                 

    15. మీరు అధ్బుతమైన ప్రేమికులని చెప్పక తప్పదు.

    16. మిమ్మల్ని ఆరాధించేవాళ్లని విడిచిపెట్టడం కన్నా ఆత్మహత్యే మంచిదని భావిస్తారు.

    17. మీ భార్య/భర్త మీ ద్వారా గుర్తింపబడాలి కానీ, మీ భార్య/భర్తకు ప్రత్యేక గుర్తింపు లభించటంమీకు ఇష్టం వుండదు. మీరు ఒప్పుకోక పోయినా ఇది సత్యం.

    18. మీ భార్య/ భర్తకు మీరే భవిష్యత్తు. ఆమె/ అతడు మీ భవిష్యత్తు గురించి బాధపడాలే తప్ప తన భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అని నమ్ముతారు. ఇందులో అహంకారం వున్నా, అవతల వ్యక్తికి భద్రతా భావాన్ని ఇస్తున్నారనేది మాత్రం  నిర్వివాదాంశం.

    19.నాటకాలన్నా, సినిమాలన్నా ఎంతో మక్కువ చూపించే మీరు లలిత కళల పట్ల కూడా అంతే భావావేశంలో వుంటారు.

    20. జూదం, థ్రిల్ ఇలాంటివి మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. అవసరం కానిచోట కూడా మిమ్మల్ని మీరు గుర్తింపజేసుకోవటానికి ఎక్కువ ఖర్చు పెడతారు.

    21. సరిగా పనిచేయని ఏ వస్తువునైనా, మనిషినైనా (తిరగని ఫేన్, పలకని రేడియో) మీ దారికి తెచ్చుకోవటమంటే మీకెంతో ఇష్టం. మీరు సాధారణంగా మెకానిక్ గానో, డాక్టర్ గానో, కంప్యూటర్ ఇంజనీర్ గానో రాణిస్తారు.

    22. అందమైన ఆడవారిని/ మగవారిని ఓరకంట మ చూడటం మీకు ఇష్టం వుండదు.వారిని కావాలనుకుంటే  బాగా పరికించి చూసి 'ఆహా ఏమి సౌందర్యం' అన్న వాక్యాలని రాచరికపు ఠీవితో ఉచ్చరిస్తారు.పక్కనే వున్న మీ భార్య/ భర్త ఇందుకు తట్టుకోలేక  ఉదాసీనంగా వుంటే గుండెనొప్పో లేదా తలనొప్పో అని నాటకం ఆడి మళ్లీ వాళ్లని మీ దగ్గరకు రప్పించుకోగలరు.

    23. మీరు మంచి తండ్రి/ తల్లి గా ప్రవర్తించినా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం మీది కాబట్టి, మీపిల్లలు అలాగే గౌరవించినట్టు నటించి మోసగించే అవకాశం వుంది.

    24. హాస్యాన్ని మనసారా ఎంజాయ్ చేసే మీరు మిమ్మల్ని ఎవరైనా కాస్త విమర్శించినా ఇట్టే కన్నీరు పెట్టుకోగలరు.

    25. తొందరపాటు తనంతో తల్లిదండ్రులకి ఎదురు చెప్పినా వృద్దాప్యంలో వారికి తోడునీడై నిలవగలరు.

    26. మొత్తానికి మీరు విభిన్న మనస్తత్వాల కలయికగా పేరుపొందుతారు.

    27. మీలో చెలరేగే బాధనీ, కోపాన్నీ అణచుకోడానికి మీరే ఒకజోకర్ లా నటించగలరు.హృదయం కార్చే కన్నీటిని ముఖం మీదు ఆనందభాష్పాలుగా మార్చగలిగే సమర్దులు మీరు.

    28. మిమ్మల్ని మీరు అర్దం చేసుకునే కంటే ఇతరులి సులభంగా అర్దం చేసుకోగలరు. నిజానికి మీ చుట్టుపక్కల వాళ్ల గురించి మీరెక్కువ ఆలోచిస్తారు.

    29. ఇతరుల సమస్యల గురించి మీకు తెలియకుండానే బాధపడటం వల్ల మీ సమస్యల గురించి ఆలోచించటానికి మీరు అంతగా ఇష్టపడరు.

    30. ఈ పోటీ ప్రపంచంలో అందరితోపాటు మీరు కూడా సమానంగా దేనికోసమో ఆరాటపడుతూ జీవితాన్ని కొనసాగిస్తారు.

    31.మీరు మీ కోర్కెలని ఎక్కువగా బైటకి తెలపకపోవటం వల్ల అవతల వాళ్లు మిమ్మల్ని యోగులు గాను, నిరాశావాదులుగానూ అనుకొనే వీలుంది.

    32. ముఖ్యమైన విషయాల్లో కాకపోయినా చిన్న చిన్న విషయాల్లో అబద్దాలు చెప్పి అవతలవాళ్లు మోసపోయినందుకు ఆనందించగలరు. అయితే ఇలా మోసం చెయ్యటం ఎవ్వరికీ నష్టపరచని విషయమై వుంటుంది.

    33. సలహాలకి మీరు బాగా స్పందిస్తారు. ఏరంగంలోనైనా మీకు నచ్చిన మీరు మెచ్చిన వ్యక్తిని మీ నాయకుడుగా ఒకసారి స్వీకరిస్తే, 'రాముడు మంచి బాలుడు' నేను ఏకలవ్యుడిని అన్నట్లు ఒక అతని  అడుగు జాడలలో బుద్దిగా నడవటానికి మీరు ఏ మాత్రం సంకోచించరు. ఇది మీ అహానికి దెబ్బ అని కూడా భావించరు.

    34. మీ జీవిత భాగస్వామి - మీకు బ్రేక్ ఫాస్ట్ గా ఓ అందమైన కల, లంఛ్ కి ఒక తెలివైన జోక్, డిన్నర్ కి మెదడుకి మేత పెట్టగల సమస్య ఇవ్వగలిగితే ఆ భాగస్వామిని మీరు మీ కన్నా ఎక్కువ ప్రేమిస్తారు.

    వాక్యాలని క్రిందకి జార్చే వారు:

       

    మొదటిలైను పేజీకి చాలా కరక్ట్ వ్రాసి తర్వాత వ్రాసే కొద్దీ వాక్యాలని క్రిందకి జార్చే వారు సాధారణంగా, జీవితంలో ఎంతకష్టపడ్డా   పైకి రాలేకపోయామే అన్నఅభద్రతతో వుంటారు. ఆఖరి వాక్యం ఎడమవైపు ఎక్కువ చోటుండి  వాక్యపు ముగింపు పేజీ క్రిందకు జారితే అది నిరాశా వాదాన్ని సూచిస్తుంది.

 Previous Page Next Page