Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 20

    ఆ కొటేషన్ గమ్మత్తుగా అనిపించింది. చార్లీ చాప్లేన్ విషాదంలో నుంచి హాస్యాన్ని సృష్టించగలడు.డెప్త్ లోకి ఆలోచిస్తే ఆ కొటేషన్ లో ఏదో మహత్తు ఉన్నట్టు అనిపించింది. ఓ అందమైన అమ్మాయి తన శరీరాన్ని స్వేట్టర్ లా చేసి తాని ప్రేమించిన అబ్బాయికి ప్రజంట్ చేస్తే...
    ఆమె బుగ్గల్లో ఎరుపు మెరిసింది ఒక్కక్షణం. మరికొన్ని కొటేషన్లు వరుసుగా రాసింది.
    వాటిని భస్మకు ఇవ్వడంకోసం.
    తనకు నచ్చిన కొన్ని కొటేషన్స్ కాగితం మేడ కడులుతున్నాయి.
    నిన్ను ప్రేమించమనివారిని నువ్వు ప్రేమిచడం అంటే, మామిడి పళ్ళు లేని చెట్లని, ఆ పళ్లకోసం వూపడం లాంటిది_ అప్రికన్ సామెత.
    ప్రేమించబడటంకన్నా, ప్రేమించడం గొప్ప_ ఎనాక్
    ప్రేమించడం మంచిదే... కోరవకుండానే ప్రేమను సమర్పించుకోవడం మరే ఉత్తమం_ షేక్స్ పియర్.
    ప్రేమ ఆల్జీబ్రా లెక్క వంటిది. ఎన్ని అడుగులు వేసినా, ఈ క్వేషణ్ లా రెండు వైపులా విలువ సమానంగా వుంటుంది_ ఎమర్సన్.
    ప్రేమలాంటి పవిత్రమైన వస్తువు ఈ లోకంలో మరైకటి లేదు_ గాంధీజీ.
    అన్ని ప్రేమలకన్నా, బాల్కానీలో వెనక సీట్లో ప్రేమ గొప్పది.
    చాలా సందర్బాల్లో తొలి ప్రేమ జీవితకాలం బాదాగా మారుతుంది_జార్జి బెర్నాడ్ షా.
    ఒకర్ని పెళ్ళి చేసుకుని అనేకమందిని ప్రేమించగలగడం కవిత్వమంత మధురం_ ఆస్కార్ వైల్ద్.
    ప్రేమంటే ఎన్నటికి సారీ చెప్పకపోవడమే_ ఎరిక్ సీగల్.
    రాస్తొన్న కొటేషన్స్ ఆపి ఓసారి తను రాసిన అనిపించాయి. కాకపోతే, అంతకన్నా బాగా అనిపించింది 'భస్మ గురించిన ఆలోచనలే.
    ఓ మనిషిని ప్రేమిస్తే ఇంత గమ్మత్తయిన భావోద్వేగం కలుగుతుందా? అన్నా ఆలోచనతో ఆ రాత్రి అంతా గడిపింది మౌన.
    ప్రేమకున్న జబ్బే అది.   
                                              ***
    మర్నాడు_
    ఎర్లిగానే తయారైంది మౌన.
    ఆ రోజుతో సెలవు అయిపోతుంది. రేపట్నుంచి డ్యూటీ లో జాయినవ్వాలి. ఈ మూడ్రోజుల్లో తను సాదించిన ప్రావుగ్రాస్ ఏమీలేదు. ఒక్కా అతని ఆడ్రస్, పేరు తెలుసుకోవడం తప్ప.
    'ఈరోజు ఎలాగైనా అతడ్ని పలకరిచాలి' అనుకుంది మౌన.
    భస్మ ప్లాట్ దగ్గరకి వచ్చి  డోర్ బెల్ నొక్కింది. లోపల్నుంచి రిప్లయ్ లేదు.
    'అబ్బబ్బ... డోర్ బెల్ నొక్కి నొక్కి చేతులు నోప్పేడుతున్నాయికానీ, ఈ మహానబావుడు రాడెంటి?' కోపంగా అనుకుంది మౌన.
    మళ్ళీ మళ్ళీ డోర్ బెల్ ప్రెస్ చేసిది. తలుపులు బద్దలు కొట్టిం లోపలికి వెళ్ళి ప్రభత్వం గుర్తించిన, గుర్తించని భాషలన్నింటిలోనూ భస్మ ను తిట్టిపోయాలనే బలమైన కోరిక కూడా కలిగింది.
    నాలుగు ప్లాట్లు.
    ఓ కారిడార్.... వుజుతర్స్ కూచోడానికి ఓ సోఫా వున్నాయి.
    పది  నిముషాల పాటు డోర్ బెల్ ప్రెస్ చేసి, అలసి పోయాక, ఓ డౌట్ వచ్చింది.
    భస్మ లోపల లేడేమోనన్న డౌట్ అది.
    ఆటోమేటిక్ లాక్ కాబట్టి తాళం ఉండదు.
    తనకీ ఆలోచన వచ్చాక, కోపం కూడా తన మీదే వచ్చింది మౌనకు.
    ఛ... నాకు బుద్దిలేకుండా పోయింది అనుకుంది. వెంటనే వెనక్కి తిరిగి ఏదో అనుమానం వచ్చి ఆగిపోయింది. అక్కడ... కారిడార్ లో సోఫాలో కూచుని తన వైపు చూస్తోన్న భస్మ కనిపించాడు.
    వెంటనే పక్కనే ఏదైనా బరివైన వస్తువు కనబడుతుందేమోనని చూసింది.
    అతనక్కడ చాలా సేపట్నుంఛీ కూచొని ఉన్నాడని, తమ చేతులు నొప్పెట్టేలా డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నా కనీసం, 'హలో... మిస్... నేనిక్కడే ఉన్నానని' కూడా అనలేదని అర్ధమైన మరుక్షణం ఆమె కోసం తరస్తాయికి చేరింది.
    కనీసం ప్లవర్ వాజ్ అయినా చేతికి అందితే బావుండుననుకుంది.
    భస్మ దగ్గరకి వెళ్ళి "ఏయ్ న్యూస్... ఆలు నీ ఉద్దేశ్యంమెంటి? నాచేతులు నొప్పెట్టేలా నేను బెల్ ప్రెస్ చేస్తుంటే, మిడ్ నైట్ మసాలా చూస్తూన్నావా?" అని గయ్  మంది.
    ఆవేశంతో మాట్లాడుతూంటే, ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.
     భస్మ మాట్లాడలేదు.అలాగే చూస్తుండిపోయాడు.
    "ఏంటీ... నేను గొంతు చించుకుని మాట్లాడుకున్నా, ఒక్క మాటయినా 'సారీ' అని చెప్పొచ్చుగా, నీ సొమ్మేం పోయింది. అలా మిడిగుడ్లెసుకునిచూస్తావేంటి ?" అంది.
    అయినా భస్మ మాట్లాడలేదు. అప్పుడు గమనించింది. తను కోపంలో పైట జారిన సంగతి గుర్తుంచలేదని.
    వెంటనే పైట సర్దుకుంది.
    అయినా అలానే చూస్తుండడంతో అనుమానం వచ్చింది.
    భస్మ తన గుండెల వంక చూడడంలేదని, తన వెనగ్గా గోడకు తగిలించి వున్న పెయింటింగ్ చూస్తున్నాడని...
    'ఛ.. ఉన్న ఒక్క హొప్ కూడా పోయింది' అనుకుంది కసిగా.
    ఆమెకు ఎంత కసిగా వుందంటే చీర విప్పి అతని మొహం మీద గిరీటేయలన్నంత...
    భస్మ లేచాడు.
    "ఏంటీ... మళ్ళీ కిందికి వెల్లీ బైక్ మీద తుర్రుమంతావా? నేనూ వస్తాను. నన్ను తీస్కేల్లారాడూ..." అడిగింది ఆశగా.
    భస్మ చకచక మెట్లు దిగుతున్నాడు.
    అతన్తో పోటీపడి వేగంగా నడవలేకపోయింది.
    "అసలు నువ్వు నడుస్తున్నావా? పరుగేడుతున్నావా మహానుభావా..." అడిగింది అతనితో వేగంగా నడవడానికి ప్రయత్నిస్తూ.
    రెండేసి మెట్లు ఒక్కో అంగంలో దాటుతూ కిందికి వచ్చేశాడు. గ్రౌండ్ ప్లోర్లో లోకి రాగానే... వాచ్ మెన్ సెల్యూట్ చేశాడు.

 Previous Page Next Page