Home » Yerramsetti sai » 8 down

    ఎలా ఇప్పుడు? ఆమెను ఎలాగయినా మళ్ళీ పై బెర్త్ మీదకు పంపించాలి. రఘునాథ్ ఆమెవేపు చూశాడు.    
    "ఎక్స్ క్యూజ్ మీ డాక్టర్!"    
    ఆమె ఛటుక్కున కళ్ళు తెరచి అతని వేపు చూసింది.    
    "నాకు నిద్ర వస్తుంది. దయచేసి మీరు మీ బెర్త్ మీద కెళ్ళిపోగలరా? విజయవాడ రావటానికి ఇంకా చాలా టైముంది! అంతవరకూ మీరు ఇంకో నిద్రతీయవచ్చు."    
    "ఓ.కే! నో ప్రాబ్లమ్" అంటూ సుష్మతో సహాపై బెర్తుమీద కెళ్ళిపడుకుంది.   
    రఘునాథ్ గుండెలమీద బరువు దించినట్లయింది. ఇప్పుడిక ఎలాంటి అడ్డూ లేదు. విజయ్ కుమార్ మృత్యువు ఖాయం. కర్టెన్ తొలగించి సైడ్ లో వున్న బెర్తు వేపు చూశాడతను. ఇన్ స్పెక్టర్  రత్నాకర్ తననుచూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో క్రూరత్వం వుంది. అధికారం చాటున జరిపిన ఎన్నో దారుణ హత్యాకాండల అనుభవం వుంది. లాకప్ డెత్ ల పేరుతో ఎన్నో రాజకీయహత్యలు చేశాడతను.    
    అతను సివిల్ డ్రస్ లో రివాల్వర్ పట్టుకుని సిద్దంగా కూర్చుని వున్నాడు. ఆకానిస్టేబుల్స్ ఇద్దరూ అతని నమ్మిన బంట్లు. అతను చేసే పాపాలలోవారికీ భాగస్వామ్యం వుంటుంది.    
    సైగ చేశాడు రఘునాథ్ అతనికి. ఇన్ స్పెక్టర్ రత్నాకర్ పై బెర్తుమీదనుంచి కిందకు దిగాడు. కోచ్ లో అందరూ గాఢ నిద్రలో వున్నారు. ఎక్కడా ఎలాంటి సంచలనం లేదు. రివాల్వర్ ఓ సారి చూసుకుని కర్టెన్ నెమ్మదిగా తొలగించి లోపలికొచ్చాడు. సరిగ్గా అప్పుడే విమల్ నిద్రలేచివిజయ్ కుమార్ ని పిలవటంతో రత్నాకర్ చటుక్కున కర్టెన్ వెనుకకు తగ్గక తప్పలేదు. క్షణంలో విమల్ ని నిద్రపుచ్చి తను మళ్ళీ వెనుకకు జారగిలబడి కళ్ళు మూసుకున్నాడతను.    
    రఘునాథ్ మళ్ళీ లేచి కూర్చుని రత్నాకర్ కి మళ్ళీ సైగ చేశాడు.    
    రత్నాకర్ మళ్ళీ కర్టెన్ తొలగించుకుని లోపలికొచ్చాడు. సరిగ్గా అప్పుడే చంద్రిక సైడ్ బెర్తుమీద కూర్చున్నకానిస్టేబుల్స్ దగ్గరకొచ్చింది. కానిస్టేబుల్స్ ఇద్దరి దృష్టీ కర్టెన్ వేపేవుంది. వారి గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్! ఇన్ స్పెక్టర్ రత్నాకర్ విజయ్ కుమార్ ని కాల్చి చంపగలడాలేదా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.    
    "మీ ఇద్దరి తుపాకులూ ఎలాంటి ప్రతిఘటనాలేకుండా అందించండి! లేకపోతే ఇద్దరూ ఒకేసారి ఛస్తారు" చాలానెమ్మదిగా, గుసగుసలాడుతున్నట్లువాళ్ళతో అందామె.    
    ఇద్దరూ అదిరిపడ్డాడు. కొద్దిక్షణాలు మతిపోయినట్లయింది.    
    ఎదురుగా ఓ యువతి గన్ పట్టుకుని తమకుగురిపెట్టి నిలబడటంకలో నిజమో అర్ధంకావటంలేదు. అసలా యువతి ఎక్కడినుంచి వచ్చిందో, తమ దగ్గరకెప్పుడు చేరుకుందో అంతా అయోమయంగా వుంది.    
    వాళ్ళు నిశ్చేష్టులైనోటమాట లేకుండా చూస్తుంటే జమదగ్ని వచ్చి ఇద్దరి చేతుల్లోని ఆటోమేటిక్ తుపాకులు తీసుకుని బయటకెళ్ళిడోర్ తెరచి వాటిని విరిసిపారేశాడు. అతను డోర్ దగ్గరే గన్ పట్టుకుని నిలబడ్డాడు.    
    అప్పుడు అర్ధమయింది ఆ కానిస్టేబుల్స్ కి- తాము నగ్జలైట్స్ చేతిలో చిక్కామని.    
                                                                        * * *
    ఇన్ స్పెక్టర్ రత్నాకర్ తనచేతిలోకి రివాల్వర్ ని హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్ కి గురిపెట్టాడు.    
    రఘునాథ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కొద్దిక్షనాలు ఎవ్వరూ చూడకుండాఉంటే చాలు. అంతా అనుకున్నట్లే జరిగిపోతోంది. రత్నాకర్ ట్రిగ్గర్ మీద వేలుంచి నొక్కబోయాడు. కానీసరిగ్గా అప్పుడే తన వీపుకి ఏదో గట్టిగా గుచ్చుకున్నట్లయి అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు.     
    తన వీపుకి గుచ్చుకుంటోంది ఎ.కె-47 గన్ తాలూకు బారెల్!    
    ఒక్కసారిగా చెమటలుపట్టేసినాయ్ అతనికి ట్రిగ్గర్ లో నుంచి వేలు అతనికి తెలీకుండా బయటికొచ్చేసింది.    
    "రివాల్వర్ ఇటివ్వు" అన్నాడు ఫణి తనుకర్టెన్ లో కొస్తూ.    
    రత్నాకర్ కి వెంటనే అర్ధమయిపోయింది. అతను నక్సలైట్! అంతఖరీదయిన గన్స్ వాళ్ళ దగ్గరే వుంటాయ్. ఇంకో విషయం కూడా అతనికి బాగాతెలుసు. చెప్పినమాట వినకపోతే వాళ్ళు ఖచ్చితంగా దయాదక్షిణ్యాలు లేకుండా కాల్చిపారేస్తారు. రివాల్వర్ ఫణి చేతికి అందించాడతను.    
    హోమ్ మినిస్టర్ రఘునాథ్ నోటమాట రావటంలేదు. ఇదేమిటిలా జరుగుతోంది? మధ్యలో వీడెవడు? బయటకూర్చున్న ఆ కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నట్లు?        
    చటుక్కున లేచికూర్చోబోయాడతను.    
    రివాల్వర్ అతనికి గురిపెట్టాడు ఫణి "అక్కడే కూర్చో! అంతే! లేచి నిలబడ్డావంటే ఛస్తావ్" హెచ్చరించాడు అతను.    
    అప్పుడు కళ్ళు తెరిచాడు విజయ్ కుమార్. ఎదుటిదృశ్యం చూడగానే అతని నిద్ర మత్తంతా చిటికెలో ఎగిరిపోయింది. భయం నరాల్లోంచి పాకసాగింది నెమ్మదిగా ఒక గన్ ఇన్ స్పెక్టర్ రత్నాకర్ కి, రివాల్వర్ రఘునాథ్ కి గురిపెట్టబడి వున్నాయ్. ఎవరా పని చేస్తున్న వ్యక్తీ అనేది అర్ధంకావటంలేదతనికి.    
    నక్సలైట్స్ ఇంచుమించుగా పారెలల్ గవర్నమెంట్ నడుపుతున్నారన్న విషయం తనకు    తెలుసుగా నీ పరిస్థితి మరీ ఇంతదారుణంగా వుందనుకోలేదు తను. సరిగ్గా అదే సమయంలో సంగీత కు నిద్ర మెలకువవచ్చింది. కళ్ళెదురుగ్గా కనిపించిన దృశ్యం చూసేసరికి వణుకు పుట్టుకొచ్చిందామెకి. భయంతో బెర్తుమీద లేచి కూర్చుంది.    
    "మీరు కిందకి దిగి కూర్చోండి" ఆజ్ఞాపించాడు ఫణి.    
    ఆమె కంగారుగా కిందకు దిగి, సుష్మను కూడా దింపి రఘునాథ్ బెర్తుమీదే కిటికీమూలకు కూర్చుంది.    
    "చంద్రికా! వీడిని కూడా సైడ్ బెర్తులోనే వాళ్ళ కానిస్టేబుల్స్ తోపాటు కూర్చోబెట్టు!" అంటూ రత్నాకర్ ని ఆమె వేపునెట్టాడు ఫణి.
    రత్నాకర్ వెళ్ళి సైడ్ బెర్తులో కూర్చున్నాడు.    
    "నువ్వు నాతో రా!" రఘునాథ్ ని ఆజ్ఞాపించాడు ఫణి.    
    "ఎక్కడికి?" లేచి నిలబడుతూ అడిగాడు అతను.    
    "షటప్? నోర్మూసుకుని పదముందు-"    
    అతను ఇంక మాట్లాడలేదు లేచి కర్టెన్ తీసుకుని బయటకు నడిచాడు. బయటవణుకుతూ ఓ మూలకూర్చున్న కానిస్టేబుల్స్ - శవంలా కూర్చుని వున్న ఇన్ స్పెక్టరూ కనిపించారతనికి. అతని పై ప్రాణం పైనే పోయింది.    
    కానిస్టేబుల్స్ తన సహాయానికి వస్తారేమోనన్న ఆశతో వున్నాడు అంతవరకూ. అతని మొఖంలో రక్తం చుక్కలేదిప్పుడు నడుస్తూంటే కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయ్. ఇంతకాలం నక్సలైట్స్ ఎవర్ని కిడ్నాప్ చేసినాతను అవన్నీ చాలామామూలు విషయాలుగా భావించేవాడు.    
    కిడ్నాప్ చేయబడినవారి భార్యా, తల్లిదండ్రులు వచ్చి తమవారిని క్షేమంగా వదిలేందుకు అవసరమయిన చర్యలు తీసుకోమని కోరినప్పుడు "మేము నక్సలైట్స్ కోరినవన్నీ చేయటంకుదరదు. వాళ్ళు రిలీజ్ చేయమనికోరుతున్నా వారెవరూ పోలీస్ కస్టడీలో లేరు" అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు.    
    కానీ ఇప్పుడు మాత్రం అతనికి ప్రాణంలో ప్రాణంలేదు. తను అనేకమంది నక్సలైట్స్ ని అక్రమంగా ఎన్ కౌంటర్స్ పేరుతో చంపించాడు. ఇప్పుడు తననూవాళ్ళు చంపేస్తారేమో! అతన్ని బయటిడోర్ దగ్గరకు తీసుకొచ్చాడు ఫణి. జమదగ్ని కోచ్ లోని అలారం చైన్ పట్టుకుని బలంగాలాగాడు.    
    చైన్ బాగా లూజ్ అయి వేలాడసాగింది గానీ చక్రాలకు బ్రేక్స్ పడుతున్న సూచనలేమీ కనిపించలేదు. జమదగ్ని కి ఆశ్చర్యంకలిగింది. ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. చైన్ లాగగానే బ్రేకులు పడిపోయేవి. ఒక కిలో మీటర్ దూరం వరకూ నడిచి ఆగిపోయేది బండి.    
    ఆ చైన్ వదలి పక్క కంపార్టుమెంట్ లో కెళ్ళి ఇంకో చైన్ లాగాడు. అది అలాగే లూజ్ అయి వేలాడసాగింది గానీ బండి ఆగటం లేదు. వేగం ఏమాత్రం తగ్గటం లేదు. జమదగ్ని పరుగుతో డాక్టర్ ఫణిదగ్గర కొచ్చాడు.    
    "వాక్యూమ బ్రేక్స్ పడటం లేదు" అన్నాడు గా    
    ఫణి మొఖంలో ఎలాంటి ఆత్రుతగానీ కలవరం గానీ కనిపించలేదు "ఎందుకని?" అడిగాడు తాపీగా.    
    "బహుశా వాక్యూమ్ సిస్టమ్ డిస్కనెక్ట్ చేసి వుంటారు"    
    "మరిప్పుడెలా?" ఆలోచనలో పడ్డాడతను.    
    రఘునాథ్ కి కొంచెం ధైర్యం వచ్చింది.    
    బండి ఆగితే తనను అడవిలో దింపి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు.    
    8 డౌన్ కొద్ది క్షణాల్లో చెరువు మాధవరం కూడా దాటేసింది. "ఆల్ రైట్! కోచ్ లోపలి కెళదాం పదండి" అన్నాడు ఫణి.   
    రఘునాథ్ ని మళ్ళీ అతని సీట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి తనూ పక్కనే కూర్చున్నాడు.    
    "కానిస్టేబుల్స్ నీ, ఇన్ స్పెక్టర్ ని ఇటు తీసుకొచ్చి ఎదుటిబెర్తుమీద కూర్చోబెట్టండి" చంద్రికతో చెప్పాడతను.    
    "మిస్టర్! నువ్వూ ఆ చిన్నపిల్లాడితోవెళ్ళి ఆ బెర్తుమీద కూర్చో" విజయ్ కుమార్ ని ఆజ్ఞాపించాడు జమదగ్ని.    
    విజయ్ కుమార్ విమల్ తో పాటు వెళ్ళి సంగీత పక్కన కూర్చోక తప్పలేదు. ఖాళీ అయిన ఆ బెర్తులో యిద్దరు కానిస్టేబుల్స్ నీ, ఇన్ స్పెక్టర్ నీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు జమదగ్ని, చంద్రికలు. తర్వాత ఇద్దరూ చెరోవేపు గన్స్ తో కూర్చున్నారు.    
    "ఇదిగో మిస్టర్! అందరికీ వార్నింగిస్తున్నాను- మేము ఎవ్వరికీ ఎలాంటి హానీ చేయము. మాక్కావలసిందల్లా అక్రమంగా అరెస్ట్ చేసిన మా వర్కర్స్ కొందరిని విడుదల చేయటం! అంతే! ఆ తర్వాత ఎవరిదారినవారు వెళ్ళిపోదాం! ఈ లోగా ఎవరయినా అతి తెలివితేటలు చూపారంటే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాం. ఒకవేళ ఎవరయినా ఈ కంపార్టుమెంట్ లోకొచ్చి మీతో ఎవరితోనయినా మాట్లాడినాగానీ మీరు మాకు హోస్టేజెస్ గా వున్నట్లు ఎవరికీ చెప్పకూడదు - అర్ధమయిందా?"    
    అందరూ మౌనంగా తలూపారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra