"భవిష్యత్ ని చూస్తుంటే భయానకంగా వుంది. అటు ఇంట్లో ప్రతికూల పరిస్థితులు. మావూరి వ్యవహారాల్లో నా బాధ్యత, ఇటు సత్యవతి హృదయాన్ని పంచమని అడుగుతోంది. నిగ్రహంగా, బింకంగా మాట్లాడితే అందులో ఏమయినా ఆకర్షణ వుందేమోగాని అర్థంమాత్రం లేదు."

 

    "అబ్బ! ఎంత పెద్ద ఉత్తరంరాశానో. టైము రాత్రి రెండయింది. అయినా ఇంతకాలం గడిచినట్లు తెలియలేదు. ఇప్పుడు పడుకుంటే నిద్రపట్టదు. మెట్లమీద నుంచి గాజులు గలగలమని చప్పుడు చేసుకుంటూ సుందరరూపం వస్తూన్నట్లు భ్రమ. భ్రమలే. ఒకవేళ వచ్చి తలుపు తట్టినా ఇప్పుడు తియ్యను. ఇటునుంచి క్రిందికి దూకేసి పారిపోతాను."  

 

    సౌదామిని నిన్న కాలేజీలో కనిపించి "రేపు నాకు దేముడ్ని గురించి చెప్పు అన్నయ్యా" అని అంది. నాకు చాలా విషయాలు తెలుసునని ఆమె ఉద్దేశ్యం. తెలియని విషయాల్ని గురించి తెలిసినట్లు చెప్పేటప్పుడుండే సొగసు, తెలిసిన విషయాలు చెప్పినప్పుడుండదు. ఏమయినా సౌదామినికోసం కొంత చదివి తీరాలి. ఏకాగ్రత కుదరుతుందా అంటే చెప్పలేను. మొన్న సౌదామిన్ని నీకిష్టమైన వేమిటని అడిగాను. "సైగల్ పాటలు, నీ మాటలు, వచ్చీరాని ఆటలు" అని సమాధానం చెప్పింది. నాచేత "దుఖీకే" అనే పాట చాలాతడవలు పాడించుకుంది ఆమె. పాడేటప్పుడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ పాడాలట. అలా నా చూపుల్లో చూపులు కలిపి నేను ఏదో మాట్లాడుతుంటే అనాలోచితంగా నా చేతివ్రేళ్ళను తన సుకుమారమైన చేతిలోకి తీసుకుని, వాటిని మెల్లగా రాస్తూ వుంటుంది సౌదామిని. పాణీ! మనసు చూరగొనే చెల్లెళ్ళు లభ్యంకావటం అంతకష్టమయిన విషయంకాదుగాని ఈ ఆనందం. గర్వం ఇంకా ఎక్కువైనా దుర్లభం సుమా!'

 

    "అనుకోకుండానే కలం కదిలిపోతోంది. నేను కథలు రాయటం మొదలుపెడితే మంచి కథకుడ్ని కావచ్చు. కాని అవి కథలుగాకుండా జీవిత చరిత్రలయితే సాహిత్యానికి సరిగ్గా న్యాయంగా అలంకరించనివాళ్ళమవుతాం."

 

    "పాణీ! నీ గురించి విపులంగా రాయవేం? నువ్వు కొంచెం బలహీనుడివి. నీ ఆరోగ్యం సరిగ్గావుంటుందా? కొత్తస్నేహితులు ఏర్పడ్డారా? నువ్వు ఇక్కడికి ఎప్పుడువస్తావు? దసరాకి సెలవులు ఇస్తారా? మా ఊరు పోదాం దా ఈసారి. నువుంటే నాకు రిలీఫ్. చాలా కొత్త కొత్త కబుర్లు చెబుతాను ఈసారి. బాగా చదువుతున్నావా?"

 

    "ఇంక ఆపాలి. శుభాకాంక్షలు.

 

                                                                                                   నీ
                                                                                                 "రాజా."

 

    చక్రపాణి రాజా ఉత్తరాన్ని గురించి ఆలోచించాడు. తనకు లేని ఏదో స్పష్టత వుంది అందులో. తాను కలకాలం ప్రేక్షకుడుగా నిల్చిపోతే బాగుండును. అసలు భగవంతుడు కొంతమందిని ద్రష్టలుగా, కొంతమందిని స్రష్టలుగా, కొంతమందిని పఠితలుగా, కొంతమందిని కార్యశూరులుగా సృష్టిస్తే బాగుండేది. అందరూ అన్నీ కావాలనుకోవటం అవివేకం. కాని అవివేకులు చేసే పనులే ఎక్కువభాగం ఇతరుల ఆమోదం పొందుతుంటాయి. చిత్రం! రాజా తన జీవనపథాన్ని ఎంత నిర్దుష్టంగా నిర్దేశించుకున్నాడు! అతని మానసిక ఉద్రేకానికి కల్తీలేదు. అయోమయంలేదు. అతను హిమాలయమంత ఎత్తున పెరగగలడు. వెంటనే దెబ్బతగలకుండా మారిపోనూగలడు.

 

    తాను ఏమని జవాబు రాయాలి? తనకిక దాక్కునే పరిస్థితి ఏర్పడిందా? తన నీడలో తానే దాక్కోవాలి. అదిగో బ్రహ్మానందం ఇప్పుడే నిద్రలేచాడు. బద్ధకంగా తన్మయంగా నవ్వుతున్నాడు. "అలా నవ్వకోయి పుణ్యముంటుంది. నువ్వెప్పుడైనా మా రాజాను చూశావా? అతను నీలా కోతలు కొయ్యడు."

 

    ముకుందం ఏమనుకున్నాడో తనను గురించి? మళ్ళీ వస్తాడా గదికి? అతనికి రాజారావు తెలుసు. తన రహస్యం చెప్పేస్తాడేమో?

 

    ఏముంది మహా రహస్యం!

 

    తను తాగాడు.

 

    రూపాయల్ని కరగేసి ఆ రసాయనం పుచ్చుకున్నాడు. అతనికి తమ ఊళ్ళోని కొన్ని సంగతులు గుర్తుకొచ్చాయి. ఎంతమందినో చూశాడు తాగినవాళ్ళను. వాళ్ళను లోకం వేలెత్తి చూపిస్తూండేది. తాగుడుకోసం స్వతంత్రుడై వుండికూడా తమ ఇంట్లోని వస్తువులను యెత్తుకుపోయి అమ్ముకుంటూ పెళ్ళాం, బిడ్డల దృష్టిలో పలుచనైపోయిన సూర్యనారాయణగారు, తాగివచ్చి పెళ్ళాన్ని తన్నే జట్కాబండి సోముడూ, రోజూ తాగనని ఒట్టేసుకుంటూ తాగేసే ప్రక్కఇంటి వరదరాజూ...! వీళ్ళకూ తనకూ ఏదో బేధంవుంది. తాను అతీతుడో, అప్రయోజకుడో ఏదో ఒకటి.  

 

    "రాత్రి బాగా నిద్రపట్టిందా?" అంటున్నాడు బ్రహ్మానందం.

 

    "ఆఁ! కల వచ్చింది."

 

    "ఏమా కల? ఏ అదృష్టశాలిని అందులో దర్శనం ఇచ్చింది?"

 

    "అది ఓ విచిత్రమైన కల. అందులో మనుషులు లేరు. నిరామయమైన దృశ్యం. ప్రకృతి ఊపిరి బిగపట్టింది. చీకటి వుందిగాని అంతా కనపడుతూనే వుంది. ఓ నది ప్రవహిస్తున్న భంగిమలో ఆగిపోయింది. చంద్రుడు ప్రకాశమిస్తున్న ఆకృతిలో ఏమీ వెన్నెల కిరణాలే లేవు. గాలివీస్తోందిగాని స్పర్శలేదు. చెట్లు ఊగుతున్నాయిగాని వాటి అడుగు నేలమీద లేదు. వర్షం కురుస్తుందిగాని నీళ్ళు కారటంలేదు. మెరుపులు మెరుస్తున్నాయి గాని కళ్ళు జిగేలుమనటంలేదు. ఇవన్నీ చూస్తూనే నేనెక్కడో నిల్చుని వున్నాను. కాని నాకు ఆకారంలేదు."

 

    అప్పుడు వున్నట్లుండి ఓ సన్నని వెలుగు హఠాత్తుగా కనిపించింది. సన్నని వెలుగు. ఏమిటది? ఎక్కడనుంచి వస్తుంది ? అసలు ఏమిటది? అది జగత్తులోని తమ నిజస్వరూపంతో మిలమిల మెరిసే తారలను అందుకో ప్రయత్నిస్తోన్న ఓ అడవి పూలత అలసీ, సొలసిన ఆక్రందనా? పిశాచంగా మారిన పతితుని వికృతహాసంలోని అంతిమ అపశృతా? అనాదినుంచీ అనుశృతంగా వస్తూన్న పురుషుడి దౌర్జన్యానికి గురి అవబోయే ఒకానొక రాక్షసఘట్టంలో అబల చేసిన ఆక్రందనలో తొలివణుకా? ఆకాశమంత ఎత్తయిన చెట్టునుండి కిరాతకుడు స్పృశించబోయిన ఓ నిర్మల పుష్పం మానంపోయిన అసహ్యంతో అవమానంతో నేలమీదికి తెగిపడిచేసిన సున్నితమైన రోదనా? ఏమో? కాదు. ఏదీకాదు. అది ఓ ప్రేమపూర్వకమైన పిలుపు. అమృతకంఠం. వాత్సల్య పూరితమైన హెచ్చరిక ఓదార్పు. నా గుండె తెగిపడి తన చిన్ననోటితో ఏడ్చింది. నా నెత్తురు క్రిందకారి ఆకుపచ్చగా మారింది. ఇంతలో చీకటి ఎర్రగా మారింది. ఎటు చూచినా భయంకర శోణిమము. ఆ చీకటీ, గాలీ రెండూ వీచటం మొదలుపెట్టాయి. నా కంట్లోంచి నీరు కారుతోంది కాని తడిలేదు. ఇంతలో..."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra