Home » Kommuri venugopala rao » Aalochana Oka Yagnam


    
    పెళ్ళి చూసేవారికి, అంత సుదీర్ఘమైన తతంగం విసుగ్గా వుండవచ్చు. వాళ్ళు అటెండెన్స్ వేసుకుని, కొంతసేపు చూసి వెళ్ళిపోవచ్చు. భోజనాలు చేసి (ఇప్పటిరోజుల్లో పెళ్ళంటే భోజనాలే కాబట్టి, భోజనం చేసి వెడితే పెళ్ళికి వచ్చినట్టే లెక్క) కాని దంపతులకు అది అత్యంత ముఖ్యప్రకరణం ఆ కలాపం అలా కొనసాగుతూ వుంటుంది.
    
    ఒక పాఠాన్ని బోధించేటప్పుడు, అందులోని విశేషాన్ని విద్యార్ధుల బుర్రల్లోకి ఎక్కించటానికి గురువు ఎన్నివిధాల ప్రయత్నించాలో అన్ని విధాల ప్రయత్నిస్తాడు. చాలాసార్లు పునరుద్ఘాటిస్తాడు. ఎందుకని? ఒకసారి మెదడులోకి ఎక్కించుకోలేక పోయినా, రెండవసారో, మూడవసారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది. నెరవేరాలి. అలాగే ఒక సాధకుడికి ఉపదేశం చేసి ఆ ప్రక్రియను అతనిలోకి జొప్పించటానికి గురువు కేవలం చెప్పి వదిలెయ్యకుండా ఎంతో సాధన చేయిస్తాడు. అక్కడ సాధన అత్యంతావశ్యకం.
    
    అలాగే పెళ్ళి... జీవితంలో అతి ప్రధానఘట్టం కాబట్టి ఆ ప్రాధాన్యం వాళ్ళ మనసుల్లోకి ప్రకాశవంతంగా పవిత్రశక్తిల జొప్పించటానికి ఆ తతంగమంతా ఓ సాధన.
        
    ఇక్కడో విశేషం గమనించాలి. కొన్నివేల సంవత్సరాల క్రితం.... ఒక దేశానికీ, మరో దేశానికీ రాకపోకలు లేకముందు, అసలెన్ని దేశాలో, ఎన్ని మతాలో, ఎన్ని తెగలో, ఒకరికీ మరొకరికీ ఏవిధంగా కూడా సంబంధ బాంధవ్యాలు లేకుండా అసలు ఒకరిగురించి ఒకరికి తెలేని దశలో వున్నప్పుడు, ఆఖరికి ఏ నాగరికతా లేని ఆటవిక జాతుల్లో కూడా ఈ వివాహమనే సంస్కృతి ఎవరి పద్దతుల్లో వారికి పరిఢవిల్లి వుండేది. కాబట్టి... ఓ క్రమశిక్షణ కోసం, కట్టుబాటుకోసం, నీతినియమాల కోసం, సాంఘిక వ్యవస్థ సడలిపోకుండా ఉండటంకోసం... మనిషి ఏ మతానికి, దేశానికి సంబంధించిన వాడైనా అనాదినుంచీ ప్రాముఖ్యాన్నిస్తూనే వున్నాడు.
    
    వివాహం అనేది విశ్వజనీన మానవుని మనసునుంచి మేధతో సంబంధం లేకుండా, ఆలోచనామథనం నుంచి ఆవిర్భవించింది.
    
    అంతటి ప్రాధాన్యంగల పెళ్ళికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తున్నట్లు భ్రమిస్తూనే మనిషి ఎప్పటికప్పుడు తప్పటడుగు వేస్తూనే వున్నాడు.
    
    ఎందుకని?
    
    ఇక్కడో విషయం చెప్పాలి. మీ అందరికీ తెలిసిందే. మీరంతా అనుభవిస్తున్నదే.
    
    'పెళ్ళి' అనేది కేవలం ఒక స్త్రీనీ, ఒక పురుషుణ్నీ నిరంతర కలయికగా దగ్గరకు చేర్చే ఓ ప్రక్రియ కాదు. రెండు కుటుంబాల మధ్య వారధి. ఈ సంఘంతో పెనవేసుకుని వున్న వారధి. ఆ వారధి అనేక గురుతర బాధ్యతల సమ్మేళనంతో నిర్మితమై వుండాలి.
    
    అంతటి బలీయమైన సంస్కృతీ నిర్మాణంలో అతను తప్పటడుగులు వేస్తూనే వున్నాడు.
    
    ఎందుకని?
    
    నాకు తోచిన ముఖ్య కారణాలు.
    
    అవతలివారి సంప్రదాయాన్ని కానీ, మనస్తత్వాలను గానీ సరిగ్గా అంచనా వేయలేక పోవడం.
    
    తమ పిల్లలకు పెళ్ళికావటంలేదే అన్న ఆదుర్దాతో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు.
    
    తమ నిర్ణయం సబబైనదే అన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం.
    
    పెళ్ళికొడుకు విద్యార్హతలు, ఉద్యోగం- ఇదే కాని అతని కేరక్టర్, అలవాట్లు ఏమిటని పట్టించుకోకపోవటం.
    
    వాళ్ళు ఆలోచించుకుంటున్నా, శ్రేయోభిలాషులమని జోక్యం చేసుకునేవారు వాళ్ళ అతి తెలివితేటలతో ఆలోచనా సరళిని మార్చెయ్యటం.
    
    ఆడపిల్లలు- తమకు పెళ్ళి ఆలస్యమైపోతుందేమోనన్న బెంగతో 'ఏదో ఒకటి లే' అని ఒప్పేసుకోవటం.
    
    పెళ్ళిమీద వున్న విపరీతమైన ఆసక్తి.
    
    పెళ్ళయిన కొద్దిరోజులకే ఒక్కొక్కరి నిజరూపం బయటపడుతుంది. వాళ్ళు నిర్మించుకున్న ఊహాసౌధాలు కూలిపోవటం మొదలవుతాయి.
    
    అశాంతి, ఆవేదన, సెల్ఫ్ పిటీ.
    
    తాము పెళ్ళెందుకు చేసుకున్నామా అన్న దుఃఖంలోకి ప్రయాణం ఆరంభమవుతుంది.
    
    అటువంటి మహోన్నత సంస్కృతి చిహ్నమైన వివాహం భార్యాభర్తలకు రూపకల్పన చేసింది. ఈ వివాహ సంస్కృతిని గురించి చర్చించేటప్పుడు ఓ విషయం ప్రస్తావించాలి.
    
    ఎన్నో సందర్భాలలో ఇది వక్రించింది. కాబట్టే, ఎన్నో అశాంతులకూ, అపశ్రుతులకూ దారితీసింది. కాబట్టి, అప్పుడప్పుడు కొందరు మేధావులు వాళ్ళకు ఆ సమయాల్లో ఆవహించిన poetic thought తో దాన్ని విమర్శన దృష్టితో చూశారు. అస్త్రాలు సంధించారు. అవహేళన చేశారు. వారి విమర్శలు చదివినప్పుడు నిజమేనని పిస్తుంది. మనం ఇలాంటి బందిఖానాలో ఇరుక్కున్నామా అనిపిస్తుంది. ఆయా నిజాల్లో మనకు మనం identity చేసుకుంటూ అలాంటి స్వేచ్చలేని బ్రతుకు బ్రతుకు తున్నందుకూ మనమీద మనమే జాలి పడతాం మనల్ని మనం విసుక్కుంటాం.
    
    కాని...
    
    జీనియస్ అనేది చాలా సందర్భాల్లో పర్ వర్షన్ తో కూడి వుంటుంది. వాళ్ళు చెప్పిన నిజాలు అప్పుడున్న మానసికోద్రేకాలలోంచి రాలిపడిన ఓ thought మాత్రమే.
    
    అది మధించగా thought కాదు. అసంతృప్తులోంచీ, ఆవేశాల్లోంచి ఆవిర్భవించిన thought.
    
    అవి చదవటానికి బావుంటాయి. కాని జీవితం ఎంతో విలువైన బాధ్యతలతో కూడుకున్నట్టిది.
    
    బాధ్యత - విలువైన బాధ్యత.
    
    దానినుంచి ఎప్పుడూ దూరంగా పారిపోకూడదు. జీవితంలో అన్నిరంగాలలో ప్రకాశించాలంటే మనం సాధించవలసిన ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ సమతౌల్యంతో ప్రవర్తించాలి.
    
    అందుకని.... వళ్ళు దగ్గర పెట్టుకుని ఆవేశాలూ, క్షణికోద్రేకాలు గురించి ఉద్భవించిన పర్ వర్షన్ థాట్సు పక్కనపెట్టి, చాలా బాధ్యతతో, తపనతో ఈ అధ్యాయాలూ రాస్తున్నాను.
    
    ప్రపంచంలో ఎన్నికోట్ల రూపాలతో మనుషులున్నారో, మనస్తత్వాలూ అంత విభిన్నంగా వుంటాయి.
    
    ఎవరి ఆలోచనాధోరణి వారిది చిన్న చిన్న తేడాలు కాని అవే వైపరీత్యాన్ని సృష్టిస్తూ వుంటాయి.
    
    మనిషి ఎప్పుడూ వున్నదానికంటే లేనిదాన్ని గురించి దుఃఖపడుతూ వుంటాడు. ఫలానాది సాధించాలని ఆశపడటం, ఆరాటపడటం, వాటిని పొందాలని ప్రయత్నం చెయ్యటం, అది జరుగుతుందని నమ్మకంతో వుండటం వేరు. అది పాజిటివ్ థింకింగ్ అలా కాకుండా... మన అర్హతలను గురించి ఎక్కువగా ఊహించుకుని. ఆ అర్హతకు తగిన జీవితం లభించలేదనీ, అందుకు తగ్గ వ్యక్తి తోడుగా దొరకలేదనీ, అందువల్ల తన జీవితం నాశనమై పోయిందనే భావనలతో బ్రతుకు దుర్భరం చేసుకోవటం వేరు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra