తనవేపే రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ వ్యక్తుల్ని చూసి భయంతో రెండడుగులు వెనక్కి వేశాడు నాని.

 

    కానీ ఆలస్యమైంది!

 

    ఇప్పుడు నానీ మెడ చంద్రంచేతిలో చిక్కుకుపోయింది. ఊపిరందక నిస్సహాయంగా నానీ రాలుస్తున్న కన్నీళ్లు మొన్న కాలిన అమ్మకోసం రాల్చగా మిగిలిన నీటిబొట్లలా జలజలా చెంపలపైనుంచి జారిపోతున్నాయి.

 

    "చెప్పు" బలంగా నేలపైకి విసిరేశాడు చంద్రం. "ఇన్ స్పెక్టర్ కేం చెప్పావు?" ఏడుపు లంకించుకున్న నానీకి ఆ క్షణంలో యశస్వి మాటలు గుర్తుకొచ్చాయి. చెప్పకపోతే నాన్న కొడతాడన్నభయం, చెబితే అమ్మక్కోపమొస్తుందన్న బాధ.

 

    చివరికి చెప్పకూడదనే నిర్ణయించుకున్నాడు.

 

    చంద్రం ఒళ్ళుమరిచి ఎడా పెడా చెంపలు వాచేట్టు కొడుతున్నా పెదవి విప్పలేదు.

 

    "దొంగనా కొడకా... మాట్లాడవేంరా" మళ్ళీ గద్దించాడు.

 

    "నన్ను కొట్టకునాన్నా" ఏడుస్తూ కాళ్ళను చుట్టేశాడు.

 

    చంద్రం ఏమనుకున్నాడో విసురుగా నెట్టి బయటకు నడుస్తుంటే సరళ అడ్డంపడింది. "ఇప్పుడే మవుతుందన్నయ్యా" భయంగా అడిగింది.

 

    "వాడసలు విషయం కక్కితే మనందరికీ ఉరిశిక్ష పడుతుంది" అసహనంగా అని బయటకు వెళ్ళిపోయాడు.

 

    సరళ నిలువునా ప్రకంపించిపోయింది.

 

    భర్త పెద్దకర్మకి రావచ్చని నచ్చచెప్పినప్పుడు వెళ్ళిపోయినా బాగుండేది. అనవసరంగా వుండిపోయింది. యిప్పుడు కోర్టులచుట్టూ తిరగాలి.

 

    అసలు రాజారావుతో వుండగా నానీకి పట్టుబడడంతో ఇంత రభస జరిగిపోయింది.

 

    ఇప్పుడేం చేయాలి?"

 

    చాటుమాటుగానైనా రాజారావుతో నూరేళ్ళు సుఖంగా బ్రతికేయాలనుకున్న సరళకి ఏం చేయాలో పాలుపోక తల్లిని చుట్టేసి బావురుమంది.

 

    ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయిన నానీ తాతయ్యని చేరుకుని బాధనంతా చెప్పుకుని ఏడ్చేయాలనుకున్నాడు కాని భయంతో కాళ్ళాడలేదు.

 

    అమ్మ గుర్తుకొచ్చింది.

 

    అమ్ముంటే అసలు కొట్టనిచ్చేదికాదు.

 

    ఇంక రోజూ కొడతారేమో అన్న భయంతోపాటు భయం వేస్తే అమ్మ పాడుకోమన్న దేవుడిపాటా జ్ఞప్తికొచ్చింది.

 

    ఆ గదిలో ఓ మూల ముడుచుకుపోయి ఆ పాటని మననం చేసుకున్నాడు.

 

    "నాకు భయ్యమంటే అస్సలు భయ్యంలేదు.

 

    అమ్మ అస్తమానం నాకు అండగా వుంటుంది కాబట్టి.

 

    ఎవరన్నా కొట్టినా నాకస్సలు కోపంరాదు.

 

    కోపం తెచ్చుకుంటే అది పాపం కాబట్టి.

 

    చీకటంటే నాకెప్పుడూ భయంలేదు.

 

    ఆకాశంలో చంద్రుడు నాకు తోడుంటాడు కాబట్టి.

 

    భూతాలంటే నేనెందుకు భయపడాలి.

 

    దేవుడు నాకు తోడుంటాడుగా మరి"

 

    ఒక తారకమంత్రంలా జపించుకునేసరికి ఒంటినొప్పి చాలావరకు తగ్గిపోయింది. చీకటిపడేదాకా అమ్మపాటనే గుర్తు చేసుకునేసరికి బోలెడంత ధైర్యంకూడా వచ్చేసింది.

 

    బుజ్జగించడానికి ఎవరన్నా వస్తారేమో అని చూశాడు కాని ఎవరూ పట్టించుకోకపోయేసరికి తనే తాతయ్య దగ్గరకి నడిచాడు.

 

    గదంతా చీకటిగా వుంది "లైటెయ్యనా తాతయ్యా" అన్నాడు నెమ్మదిగా.

 

    ఉండుండి నానీనుంచి వినిపించే వెక్కిళ్ళను వింటూ "నువ్వింకా బ్రతికేవున్నావట్రా" అనబోయి గుండె గొంతుకడ్డం పడినట్టు ఆగి "వద్దయ్యా... నాలాంటివాడికి చీకటన్నా, వెలుగన్నా ఒకటేగా. ఇట్రా" అన్నాడు గాద్గదికంగా.

 

    నానీ కమిలిపోయిన ఒంటినిచూసి భరించేశక్తి లేదు. తన కళ్ళనీళ్ళను నానీకి చూపించే స్థయిర్యమూ లేదు.

 

    అందుకే చీకటినే ఇష్టపడ్డాడాయన.

 

    ఆ వయోవృద్ధుడి పెదవులు ఎప్పటిలా మంత్రపుష్పాలు వల్లించడంలేదు. ఇంకా ఏం చూడాలని నేను మిగిలాను తండ్రీ అంటూ వేదనతో భగవంతుడ్ని నిలదీస్తూ అదిరిపడుతున్నాయి.   

 

    వేదాలకు భాష్యం చెప్పగల ఆ తాత్వికుని గుండెలు సముపార్జించిన జ్ఞానంగురించి స్పందించడంలేదు. మృత్యువు తరుముతున్న మర్కండేయుడిలా తనను చుట్టేసిన ఆ పసికందునెలా కాపాడగలనా అన్న ఆవేదనలో నలిగిపోతున్నాయి.

 

    "ఎందుకు చెప్పావురా పిచ్చినాన్నా... చెప్పి నువ్వెందుకు ఆపదలో చిక్కుకుపోయావు" గొణిగాడు నెమ్మదిగా.

 

    "పోలీసంకుల్ అడిగాడు తాతయ్యా... అబద్ధం చెప్పలేదు. ఉన్నదున్నట్టే చెప్పేశాను..." తను ఏ తప్పూ చేయలేదని స్థిరంగా చెబుతుంటే లాలనగా తల నిమిరాడు.

 

    ఇప్పుడేం జరగబోతూంది?

 

    ఇంతమందిని ప్రమాదంలోకి నెట్టే సత్యం చెప్పిన నానీని బ్రతకనిస్తారా?

 

    మధనపడిపోతున్నాడాయన.

 

    అప్పుడు వెలిగింది గదిలో లైటు.

 

    నానీ భయంతో తలెత్తి చూశాడు. ఒకవేళ నాన్న మళ్ళీ వచ్చాడేమో అని.

 

    సరళత్తయ్యా నిలబడివుంది. "రా... భోంచేద్దువుగాని" అని వెళ్లిపోయింది.

 

    కదలబోయిన నానీ చెయ్యి పట్టుకున్నాడు విశ్వేశ్వరశాస్త్రి. "ఒరేయ్..." అనుమానాన్ని మనసులో దాచేసుకుంటూ "మీ అమ్మ ఉన్నంతకాలం నాకు తనే అన్నం పెట్టేది అవునా..." అన్నాడు.

 

    తలూపాడు నానీ.

 

    "మరి ఇప్పుడా బాధ్యత నువ్వు తీసుకోవాల్రా భడవా... అందుకే ఇంట్లో నీకు నానమ్మగాని అత్తయ్యగాని అన్నం పెట్టగానే ముందు మొదటిముద్ద నాకు తినిపించాలి... అప్పుడుగాని నువ్వు తినకూడదు."

 

    ఏ ప్రమాదాన్ని వూహించి తాతయ్య అలా అడిగాడో గ్రహించేశక్తిలేదు నానీకి. కాని అమ్మలాంటి బాధ్యత తనే తీసుకోవాలన్న ఆలోచన ఎంతో సంతోషాన్నిచ్చింది.

 

    అందుకే ఆనందంగా ఒప్పుకున్నాడు.

 

    "ఒట్టెయ్."

 

    కదలనని మొరాయిస్తున్న తాతయ్య చేతిలో ఒట్టుకూడా వేసేశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra