Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    "అమ్మ బాబోయ్" అని పరుగు లంకించుకున్నాడు ప్రొఫెసర్, మెడమీద కోతితో సహా.

    ఈ మనిషి సవారి బాగా నచ్చింది ఉరాంగ్ ఉటాన్ కి. ఈ సౌఖ్యాన్ని వదులుకుని ఇంక జీవితంలో వచ్చినా నడవకూడదని నిశ్చయించుకుంది.

    అందుకని ముందు జాగ్రత్తగా, అతని మెడచుట్టూ, తన కాళ్ళని మరింత గట్టిగా బిగించింది.

       
                           *    *    *

    తడి బట్టతో వణుకుతూ, చెట్ల దగ్గరికి వచ్చింది స్వరూపరాణి.

    చలితో, దుఃఖంతో, భయంతో వణికిపోతోంది ఆమె.

    రక్తం గడ్డ కట్టేలా తోడేళ్ళ అరుపులు వినబడ్డాయి.

    తోడేళ్ళు అతి భయంకరమైన జంతువులని విని వున్నది స్వరూప. వేటాడిన ప్రాణులని పూర్తిగా చంపకుండానే, అవి ఇంకా ప్రాణంతో వుండి ఊపిరి పీలుస్తూ వుండగానే  పీక్కుతినే కౄర జంతువులు తోడేళ్ళని  విన్నది.

    నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.

    ఎండు ఆకులు గలగల శబ్దం చేశాయి.

    చిన్న పొదలు పక్కకు కదిలాయి.

    అప్పుడు కనబడిన దృశ్యాన్ని చూసి, కళ్ళను తనే నమ్మలేక పోయింది స్వరూపరాణి.

    పధ్నాలుగు, పదిహేను సంవత్సరాల వయసులో నగ్నంగా వున్న ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ తోడేళ్ళలా పళ్ళు బయటపెట్టి, తోడేళ్ళ లాగే అరుస్తూ, రెండు చేతులూ నేలకు ఆనించి, నాలుగుకాళ్ళ జంతువుల్లా పరిగెడుతూ ఆమె మీదుకు వస్తున్నారు!

   
                                                                      12


    ఉప్పెన ద్వారా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఫకర్, ఇబూకా తడిబట్టలతో వణుకుతూ అడవిలో నడవడం మొదలెట్టారు.


    "చిత్రంగా ఉంది! చాలా చిత్రంగా ఉంది! ఇది బహు విచిత్రంగా వుంది!" అన్నాడు ఇబూకా జరిగినవన్నీ తలుచుకుని తలుచుకుని ఆశ్చర్యపోతూ. "చూడు ఫకర్! దేవుడనే ఓ శాల్తీ ఉందంటే నమ్మని జగమొండి ఘటం కూడా ఇదంతా చూస్తే దేవుడికి దణ్ణం పెట్టి తీరవలసిందే! గండం గడిచి పిండం బయటపడ్డట్లు పడ్డాం! అవునా?"

    "అవునవును!" అన్నాడు ఫకర్.

    "ఫకర్ భాయ్! ఇంతకీ మన కేప్టెన్ సాబ్, మేడమ్ సాబ్ ఏమయి ఉంటారంటావ్?"

    "ఏమీ అయిఉండరు! నువ్వు దేముడు, దేముడు అంటున్నావు చూడు, ఆయనే ఉంటే, వాళ్ళు కూడా ఒడ్డుకి కొట్టుకొచ్చి ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటారు ఇంకోగంట లోపల వాళ్ళు మనకి తగుల్తారు చూడు!" అన్నాడు ఉత్సాహంగా. అతను నిరంతర ఆకాజీవి.

    "చూడు ఇబూకా! కడుపులో ఆత్మారాముడు రంకెలెయ్యడంలేదూ?" అన్నాడు పొట్ట నిమురుకుంటూ.

    ఇబూకా సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు. ఎదురుగా పెద్ద బండ ఒకటి కనబడింది. దాని మధ్య పెద్ద పగులులాంటి చీలిక ఉంది ఆ చీలికలో అర డజను పక్షి గూళ్ళు వున్నాయి. తమాషాగా, కాఫీ కప్పు ఆకారంలో కనబడుతున్నాయి అవి.

    ఇబూకా మొహం వికసించింది. "కేప్ స్విప్టు లెట్" అనే పిచ్చుకను పోలిన పిట్ట గూళ్ళు అవి. పిల్లలని పెట్టే సమయంలో దాని లాలాజల గ్రంధులు పెద్దవయి, ధారాళంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. అది గాలి తగలగానే వైరులా గట్టిపడి పోతుంది. దానితో గూడు అల్లుతుంది అది. ఆ  గూడు రాతికి అతుక్కు పోతుంది. తూర్పు దేశాల వాళ్ళు దానితో అతి రుచుకరమైన సూప్ చేసుకుని ఇష్టంగా తింటారు. ఒక విధంగా, అవి ప్రపంచంలోని అతి ఖరీదైన గూళ్ళు అని చెప్పొచ్చు.

    ఒక కర్రతో నాలుగు గూళ్ళు కింద పడేసి, ఎండుపుల్లలతో నిమిషాల్లో అగ్గి రగిల్చి, సూప్ ని గుర్తు తెచ్చే వంటకం ఒకటి తయారుచేశాడు ఇబూకా.

    ఇద్దరూ ఆవురావురుమని తినడం మొదలెట్టారు.


                                                             *    *    *

    దిగ్ర్భమ చెందిన స్వరూప, మనుషులో, జంతువులో అర్ధంకాకుండా వున్న ఆ పిల్లలవైపు చూస్తూ ఉండిపోయింది.

    వాళ్ళు శరవేగంతో ఉరుకుతూ వచ్చి, స్వరూపకి అతి సమీపంలో ఆగి సందేహంగా ఆమె వంటిని వాసన చూశారు. ఆ తర్వాత పెద్దగా అరవడం మొదలెట్టారు.

    అచ్చం తోడేళ్ళలాగే.

    ఊపిరాగిపోయినట్లయింది స్వరూపరాణికి.

    వీళ్ళు మనిషి పిల్లలే అయితే, తోడేళ్ళలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.

    చటుక్కున ఆమెకు తను చూసిన "జంగిల్ బుక్" సినిమా గుర్తొచ్చింది. రుడ్ మార్డ్ కిప్లింగ్ రాసిన నవల ఆధారంగా తీశారు ఆ సినిమా అందులో మౌగ్లీ అనే కుర్రాడ్ని అకేలా అనే తోడేలు పెంచి పెద్ద చేస్తుంది.

    అది కేవలం ఫాంటసీ అనుకుంది తను. అలా నిజజీవితంలో జరగడం సాధ్యమేనా అసలు?

    కానీ ప్రత్యక్షంగా తన కళ్ళతో చూస్తున్న దానిని నమ్మకపోవడం ఎలా?

    ఆ పిల్లలు ఇద్దరూ కూడా సంకోచిస్తూ ఆగి, ఆసక్తిగా ఆమెని చూడడం మొదలెట్టారు.

    వాళ్ళవల్ల తనకి తక్షణ ప్రమాదం లేదని గ్రహించిన తర్వాత కొంచెం దైర్యం తిరిగి వచ్చింది స్వరూపకి. వాళ్ళని పరిశీలనగా చూసింది.

    చాలా అందమైన మొహాలు వాళ్ళిద్దరివీ. నీలిరంగు కళ్ళు, బంగారపు రంగు జుట్టు. ప్రకృతిమాత ఒడిలో పెరగడంవల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో మిసమిసలాడుతూ పుష్టిగా ఉన్నారు. నగ్నంగా ఉన్న వాళ్ళ  శరీరాలలో యవ్వనం అప్పుడే తొంగిచూస్తోంది.

    చిత్రమైన, విపరీతమైన మనస్తత్వం కల స్వరూపరాణికి వాళ్ళని చూస్తే వింత అనుభూతి కలిగి ఒళ్ళు గగుర్పొడిచింది.

    దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు ఆ అమ్మాయీ, ఆ అబ్బాయీ కూడా. అక్కా తమ్ముళ్ళు అయి ఉండవచ్చు. లేదా అన్నా చెల్లెళ్ళు అయిఉండవచ్చు.

    వీళ్ళిద్దరిని పెంపుడు జంతువులులాగా తనుమచ్చిక చేసుకోగలిగితే...

    ఆ ఊహల్లో ఉండిపోయి, తను వున్న ప్రమాదకరమైన పరిస్థితిని తాత్కాలికంగా మర్చిపోయింది స్వరూప.

    మళ్ళీ తోడేళ్ళ అరుపులు వినబడేదాకా!

    ఈసారి నిజంగా తోడేళ్ళే ఉరికి వస్తున్నాయి.

    అవి ఆ పిల్లల సహచరులు!


                                                                *    *    *


    అర్ధ నిమిలిత నేత్రాలతో ప్రొఫెసర్ ఆనందరావు భుజాల మీద కూర్చుని, సౌఖ్యంగా స్వారీ  చేసున్నా ఒరాంగ్ ఉటాన్ కోతి ఒక కొమ్మని విరిచి, దాన్ని పేము బెత్తంలా ఉపయోగిస్తూ ప్రొఫెసర్ ని త్వరగా నడవమని అదిలిస్తోంది.

    తన విధిని నానా విధాలుగా తిట్టుకుంటూ అతి ప్రయాసమీద అడుగులు వేస్తున్నాడు ప్రొఫెసర్.

    పళ్ళున్న ప్రతి చెట్టు దగ్గరా అతన్ని ఆపి, ఒక పండు తెంపి, కొరికి చూసి అతన్ని మళ్ళీ ముందుకు తోలుతోంది అది.

    "ఈ కోతి మహా సూకిరాలు పోతోందే! ఓ పట్టాన ఏ పండూ వచ్చేటట్టులేదు దీనికి!" అనుకున్నాడు ప్రొఫెసర్ మంటగా.

    మెల్లిగా ఒక చెట్టు కిందకి వచ్చాడు ప్రొఫెసర్. బాగా కిందికి వున్నాయి దాని కొమ్మలు. అసంఖ్యాకంగా పళ్ళు వేలాడుతున్నాయి. బాగా మగ్గిన వాసన వస్తోంది వాటిలోనుంచీ.

    అతని జుట్టు గట్టిగా గుంజి ఆపింది కోతి. ఒకటి తర్వాత ఒకటి రెండు డజన్ల పళ్ళు తెంపి, భోంచేసింది.

    మళ్ళీ అదిలించింది ప్రొఫెసర్.

    మెల్లిగా తేలకళ్ళు పడ్డాయి దానికి.

    ప్రొఫెసర్ నడుస్తుంటే ఉయ్యాలలో ఊగుతున్నాట్లనిపించి మగతకమ్మింది. ప్రొఫెసర్ భుజం చుట్టూ బిగంచిన కాళ్ళు పట్టు తప్పాయి.

    దభేలుమని వెనక్కి విరుచుకు పడింది అది.

    తన అదృష్టాన్ని తనే నమ్మలేనట్లు కళ్ళప్పగించి కాసేపు చూశాడు ప్రొఫెసర్.

    తర్వాత తక్షణం కర్తవ్యం గుర్తొచ్చి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళకు బుద్ది చెప్పాడు.


                              *    *    *

    ఆలోచిస్తూ, పరిసరాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ముందుకి సాగుతున్నాడు సాగర్.

    అంత పవర్ పుల్ సబ్ మెరైన్ ఈ ప్రాంతాలలో ఎందుకు తిరుగుతోంది? అది ఏ దేశం తాలూకుది?

    వాళ్ళంతట వాళ్ళే దాన్ని ఎందుకు నాశనం చేసేసుకున్నారు?

    వాళ్ళ రహస్యాలు బయటపడతాయని ధయమా?

    అంత దారుణమైన రహస్యాలు ఏమిటి? అవి సాగర గర్భంలోనే ఇంకిపోయాయా? తను వాటిని కనుక్కునే అవకాశం లేదా?

    తక్కిన వాళ్ళందరూ ఏమయిపోయారు? ముఖ్యంగా అనూహ్య?

    ఎక్కడుంది ఆమె? క్షేమంగా ఉందా? లేక.....

    అంతకంటే ముందుకి ఆలోచించడానికి అతనికి సాహనం చాలలేదు.

    కాలికి ఏదో మెత్తగా తగలగానే ఆగాడు అతను.

    తోకలేని పెద్దజాతి కోతి ఉరాంగ్ ఉటాన్. విరుచుకు పడిపోయినట్లు పడివుంది.

    అసహజమైన భంగిమలో ఎందుకిలా పది ఉంది ఇది? ఏమయింది దీనికి?

    సహజంగానే భూతదయ ఎక్కువ అతనికి. నిస్సహాయంగా పడి ఉన్న ఆ కోతిని అలా వదిలేసి వెళ్ళిపోవడానికి మనస్కరించలేదు.

    వంగి, పరీక్షగా చూశాడు. చెట్టుమీద మాగిన పళ్ళు కనబడ్డాయి.

    పరిస్ధితి అర్ధమై, నవ్వు వచ్చిందతనికి.

    బాగా మగ్గి, పులిసిన పళ్ళు తినగానే మత్తెక్కిందన్నమాట దీనికి!

    అతని నవ్వు వినబడి, కళ్ళు సగం తెరిచి చూసింది ఒరాంగ్ ఉటాన్ - అప్పటిదాకా తన సవారీగా  ఉండిన ప్రొఫెసర్ కనబడలేదు డానికి. స్నేహంగా, దయగా చూస్తున్న సాగర్ మొహం కనబడింది.

    భావతరంగాలూ, సిక్స్ త్ సెన్సూ, ఇన్ స్టింక్టూ - వీటిలో దేనివల్లో గానీ, ఆ క్షణంలోనే అర్ధమైపోయింది డానికి. ఈ మనిషి తనకు అపకారం చేసే రకం కాడనీ, ఉపకారం చేసే ఉద్దేశ్యంతోనే తనను సమీపించాడనీ.

    సందేహంగా చెయ్యి ముందుకి జాపాడు సాగర్. దాని ఒళ్ళు నిమిరాడు.

    ఆ స్నేహ హస్తాన్ని అందుకుంది ఒరాంగ్ ఉటాన్.

    మెల్లిగా దాన్ని లేవదీశాడు సాగర్.

    తడబడుతూ లేచి నిలుచుంది కోతి.

    చెయ్యి నెమ్మదిగా విదిలించుకొబోయాడు అతను.

    అది గ్రహించి వదలకుండా చేతిని గట్టిగా పట్టేసుకుంది ఒరాంగ్ ఉంటాన్.

    నవ్వుతూ భుజాలు ఎగరేసి మెల్లిగా నడవడం మొదలెట్టాడు సాగర్. కిచకిచలాడుతూ మధ్య మధ్యతో అతని చేతిని పట్టుకు వేలాడుతూ, అతనితో బాటే నడుస్తోంది కోతి.

    అతని ఆలోచనలు మళ్ళీ అనూహ్య మీదికి పోయాయి.

    ఎక్కడుంది అనూహ్య?

    క్షేమంగానే వుందా?

   
                                                               *    *    *

    మెరుపులా ఉరికి తన ముందుకి వచ్చిన పెద్దపులిని చూసి ఆగిపోయింది అనూహ్య.

    కానీ భయం వెయ్యలేదు అనూహ్యకి. జరగబోయేది ఏమిటో గ్రహించింది తను ఈ పులి ఇంకో క్షణంలో తన మీదకు దూకుతుంది. తను ఆ ఫోర్సుకి నేలమీద పడుతుంది. ఒక పంజాతో తన తలని పిన్నుతో గుచ్చేసినట్లు కదలకుండా పట్టుకుంటుంది పులి. తర్వాత దాని కోరలు తన మెడలో ఖస్సున దిగాబడతాయి. వెన్నుముక విరిచేస్తుంది. ఒకేసారిగా రక్తనాళాలనూ, ఈ  సోఫాగస్ నీ మరికొన్ని అవయవాలనీ తెంచి పారేస్తుంది.

    పులి తన ఎరను చంపే పద్దతి అది!

    చావుకి భయపడటంలేదు తను! బాధకి కూడా వెరవడంలేదు!

    ప్రాణానికి ప్రాణమైన సాగర్ కి దూరమైపోయాక ఇంక బ్రతుకంటే ఇష్టం ఎందుకుంటుంది తనకి?

    చావంటే భయం ఎందుకుంటుంది?

    గుండెలు ముక్కలయిపోయేలా వున్న ఈ బాధ కంటే ఈ పులి కలిగించబోయే బాధ ఎక్కువగా ఏమీ వుండదు  ష్యూర్!

    నిర్నిమేషంగా ఆ పులిచే చూస్తోంది అనూహ్య.

    నోరు తెరచి కోరలు బయటపెట్టి గాండ్రించింది పులి.

    ఆ గాండ్రింపుకి ప్రతిధ్వనిలా మరో గాండ్రింపు వినబడింది సర్కసు రింగులోకి దూకినట్లు ఇంకో పులి దూకి వచ్చింది.

    వెంటనే____

    భూకంపం, తుఫానూ, ఒకేసారి వచ్చి దానికి తోడు అగ్నిపర్వతం ఒకటి బద్దలయి, దావానలం వ్యాపిస్తే ఎంత అల్లకల్లోలమయిపోతుందో, అంత అల్లకల్లోలమయిపోయింది ఆ ప్రదేశం. అంతా ఆ పులుల ఆగడంతో.

    విలయతాండవం చెయ్యడం మొదలెట్టాయి ఆ రెండు పులులూ, ఒకదాన్ని ఒకటి కవ్వించుకుంటూ, ఒకదాని మీద ఒకటి పడ్డాయి. దొర్లాయి. నోటితో ఒకదాన్ని ఒకటి అందుకోవాలని ఆరాటపడుతున్నాయి.

    ఎర్రటి దుమ్ము లేచింది. ఎండుటాకులు ఆకాశంలోకి లేచాయి. చిన్న చిన్న చెట్లు కూలిపోయాయి.

    అవి దొర్లుతూ అనూహ్యకి రెండు అడుగుల దూరంలోకి వచ్చాయి.

    ఆ పులులు తనని పట్టించుకోవడం లేదని అర్ధం అయింది ఆమెకి.

    అప్పుడు చెవిలో గుసగుసగా  వినబడింది ఒక గొంతు.

    "చెట్టెక్కెయ్ త్వరగా."

    ఉలిక్కిపడి తిరిగి చూసింది.

    సాగర్ తన సాగర్!

    "సాగర్!" అని కేక వెయబోయింది పట్టరాని సంతోషంతో. ఆమె కళ్ళలో ఆనందబాష్పాలు.

    చటుక్కున ఆమె నోరు మూసేసి, చిన్నపిల్లను ఎత్తుకున్నట్లు ఎత్తేసి, పక్కనే ఉన్న చిన్న చెట్టు తాలూకు కొమ్మమీద కూర్చోబెట్టేశాడు సాగర్.

    కోతిని చేతితో చరిచి, చెట్టేక్కమని సైగ చేశాడు. అది చెంగున చిటారు కొమ్మకు ఎక్కేసింది.

    "మీరు కూడా రండి" అంది అనూహ్య కంగారుగా. ఆమెకు హఠాత్తుగా బ్రతుకుమీద ఆశ తిరిగివచ్చింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra